![Love Story Movie To Release On 24th September - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/12/love-story.jpg.webp?itok=6WYt8cNy)
రేవంత్, మౌనికల ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు రావడానికి తేదీ కుదిరింది. నిజానికి వీరి ప్రేమకథ ఎప్పుడో తెరకు రావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. రేవంత్ పాత్రలో నాగచైతన్య, మౌనిక పాత్రలో సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కె. నారాయణ్‌దాస్ నారంగ్, పి. రామ్మోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ– ‘‘తప్పనిసరి పరిస్థితుల వల్ల ఇన్నాళ్లూ మా ‘లవ్ స్టోరీ’ని వాయిదా వేస్తూ వచ్చాం. సినిమాని చూపించడానికి మంచి సమయం కోసం ఎదురు చూశాం. ఆ టైమ్ వచ్చింది’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: భాస్కర్ కటకంశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఐర్ల నాగేశ్వరరావు.
Comments
Please login to add a commentAdd a comment