Love Story Movie Success: Naga Chaitanya Thanks To Love Story Movie Team For Making More Memories - Sakshi
Sakshi News home page

Love Story Movie Success: జీవితాంతం గుర్తుండే మధుర జ్ఞాపకాలను అందించినా..

Published Thu, Sep 30 2021 2:51 PM | Last Updated on Thu, Sep 30 2021 4:46 PM

Naga Chaitanya Thanks To Love Story Movie Team For Making More Memories - Sakshi

Naga Chaitanya Love Story Movie: అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం ‘లవ్‌స్టోరీ’ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. సెప్టెంబర్‌ 24న(శుక్రవారం) విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. భారత్‌లోనే కాకుండా అమెరికా థియేటర్లలో కూడా ‘లవ్‌స్టోరీ’ సత్తా చాటుతోంది. ఈ క్రమంలో మూవీ టీం లవ్‌స్టోరీ సక్సెస్‌ మీట్‌లతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో నాగ చైతన్య ఆనందం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్‌ చేశాడు. హీరోయిన్‌ సాయి పల్లవి, డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ములతో పాటు మిగతా సినిమా క్రూడ్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘జీవితాంతం గుర్తుండిపోయే ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించిన ‘లవ్‌స్టోరీ’ టీంకు కృతజ్ఞతలు’ అంటూ రాసుకొచ్చాడు.

చదవండి: ‘లవ్‌స్టోరీ’: ముద్దు సీన్‌పై సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు

కాగా ఈ సినిమాలో నాగ చైతన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన దళిత యువకుడి పాత్రలో కనిపించాడు. తన స్వయం శక్తితో ఎదిగి జుంబా మాస్టర్‌గా చై నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక అగ్ర వర్గానికి చెందిన యువతిగా సాయి పల్లవి నటించింది. ఇందులో ఆమె ఇంజనీరింగ్‌ చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న అమ్మాయిగా కనిపించింది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి డ్యాన్స్‌ ఏ రేంజ్‌ రెస్పాన్స్‌ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో ఆమె డ్యాన్స్‌కు మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబులు సైతం ఫిదా అయి సాయి పల్లవిని ప్రశంసించారు. 

చదవండి: బూతులు తిడుతూ పెద్దపెద్ద రాళ్లతో దాడి చేశారు: పోసాని వాచ్‌మెన్‌ భార్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement