లవ్‌ స్టోరీ | Sekhar Kammula film title to suit both Naga Chaitanya and Sai Pallavi | Sakshi
Sakshi News home page

లవ్‌ స్టోరీ

Published Fri, Nov 1 2019 6:11 AM | Last Updated on Fri, Nov 1 2019 6:11 AM

Sekhar Kammula film title to suit both Naga Chaitanya and Sai Pallavi - Sakshi

నాగచైతన్య

ప్రేమకథా చిత్రాలను ప్రేక్షకులకు నచ్చేలా తనదైన శైలిలో తెరకెక్కించగలరు దర్శకులు శేఖర్‌ కమ్ముల. ‘ఆనంద్, గోదావరి, ఫిదా’ చిత్రాలే అందుకు నిదర్శనం. తాజాగా ఆయన దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నారాయణ్‌దాస్‌ కె. నారంగ్, పి. రామ్మోహన్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా తొలి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇందులో తెలంగాణ యువకుడి పాత్రలో నటిస్తున్నారు నాగచైతన్య. ఆల్రెడీ అందుకు తగ్గ శిక్షణ కూడా తీసుకున్నారు. తాజాగా ఈ సినిమాకు ‘లవ్‌స్టోరీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement