Chiranjeevi and Other Tollywood Stars Attends Producer Sunil Narang Daughter Wedding - Sakshi
Sakshi News home page

Producer Daughter Marriage: నిర్మాత ఇంట మోగిన పెళ్లి బాజాలు, సినీ తారల సందడి

Published Fri, Jun 24 2022 1:37 PM | Last Updated on Fri, Jun 24 2022 2:59 PM

Chiranjeevi And Other Tollywood Stars Attends Producer Sunil Narang Daughter Wedding - Sakshi

ప్రముఖ తెలుగు నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కూమార్తె జాన్వి వివాహ వేడుక గురువారం రాత్రి హైదబాద్‌లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధమిత్రుల సమక్షంలో ఆదిత్యతో జాన్వి ఏడడుగులు వేసింది. ఈ వివాహ మహోత్సవంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, స్టార్‌ హీరోలు సందడి చేశారు. మెగా బ్రదర్స్‌ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు టాలీవుడ్‌ మన్మథుడు నాగార్జున, దర్శకుడు శేఖర్‌ కమ్ముల, బోయపాటి శ్రీను, హరీశ్‌ శంకర్‌, ప్రశాంత్‌ వర్మ, అనుదీప్‌, తమిళ హీరో శివకార్తికేయన్‌తో పాటు నిర్మాతలు సురేశ్‌ బాబు, సి. కల్యాణ్‌, నాగవంశీ, మిర్యాల రవీందర్‌రెడ్డి తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

చదవండి: 10వ తరగతిలో సత్తాచాటిన సూర్య కూతురు, మార్కుల జాబితా వైరల్‌

అలాగే సినిమాటోగ్రాఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌ సైతం ఈ వేడుకకు హజరయ్యారు. ఇందుకు సంబంధించి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా సునీల్‌ నారంగ్‌కు చెందిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు తెరకెక్కాయి. ఇటీవల ఈ బ్యానర్లో వచ్చిన లవ్‌స్టోరీ భారీ విజయం సాధించింది. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో పలు ప్రాజెక్ట్స్‌ తెరకెక్కుతున్నాయి. వాటిలో ఒకటి శేఖర్‌ కమ్ముల-ధనుశ్‌ కాంబినేషన్లోని ఓ చిత్రం కాగా.. అనుదీప్‌-శివ కార్తికేయ కాంబోలో రూపొందుతున్న ప్రిన్స్‌ మూవీ. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement