Daughter marriage
-
కూతురి పెళ్లి తరువాత... నాన్న నాన్ స్టాప్‌గా పది రోజులు ఏడ్చాడు!
ఎంత గంభీరంగా ఉండే తండ్రి అయినా సరే, పెళ్లి తరువాత కూతురు అత్తారింటికి వెళుతుంటే భావోద్వేగానికి గురై ఏడుస్తాడు. ‘నేను చాలా ప్రాక్టికల్‌గా ఉంటాను. నాకు ఎలాంటి భావోద్వేగాలు లేవు’ అని చెప్పేవాళ్లు కూడా ఇందుకు మినహాయింపు కాదు. దీనికి తాజా ఉదాహరణ అనురాగ్ కశ్యప్.ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మాటలు విన్నవారికి... ‘ఇతడు చాలా ప్రాక్టికల్ సుమీ. భావోద్వేగాలు మచ్చుకైనా కనిపించవు’ అనిపిస్తుంది.అయితే అనురాగ్ తన కూతురు పెళ్లి తరువాత నాన్‌స్టాప్‌గా ఏడ్చాడు. ఒకటి కాదు రెండు కాదు నిర్విరామంగా పదిరోజులు ఏడ్చాడు.అనురాగ్ కూతురు ఆలియా కశ్యప్ పెళ్లి జరిగింది. ఆ తరువాత అనురాగ్ ఏడుపు పర్వం మొదలైంది. పరిచయం లేని వ్యక్తుల ముందు కూడా ఏడ్చేవాడు.‘నా కూతురు పుట్టుక, పెళ్లికి సంబంధించి ఒకేరకమైన భావోద్వేగానికి గురయ్యాను. ఎందుకు ఏడుస్తున్నానో నాకే తెలియదు. కాని ఏడ్చేవాడిని. ఒకసారి ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు మా అమ్మాయి ప్రస్తావన రాగానే ఏడ్చేశాను’ అన్నాడు అనురాగ్ కశ్యప్.ఈ పదిరోజుల ఏడుపు ఎపిసోడ్ పుణ్యమా అని తనకు తాను ‘బిగ్గర్ క్రయర్’ అని పేరు పెట్టేసుకున్నాడు! -
డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురి పెళ్లిలో ఒర్రీ సందడి.. సెలబ్రిటీలందరితో పోజులు
-
కూతురు పెళ్లికి ముందు జవాను మృతి..దేవుడిలా వచ్చిన స్నేహితులు
లక్నో:తాము అందరికీ ఆదర్శమని ఆర్మీ జవాన్లు మరోసారి నిరూపించుకున్నారు. దేశాన్ని కంటికిరెప్పలా కాపాడడమే కాదు..అవసరమైతే పక్కవాడి కష్టాన్ని తమ కష్టంగా భావించి ఆదుకుంటామని చాటారు. ఉత్తరప్రదేశ్‌లోని మథురలో 48 ఏళ్ల దేవేంద్రసింగ్ నెలరోజుల క్రితమే ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు. మరో రెండు రోజుల్లో జరగాల్సిన కూతురు పెళ్లికి అన్ని ఏర్పాట్లు ఒక్కడే చకచకా చేసుకుంటున్నారు. ఇంతలో విధి వెక్కిరించింది. గురువారం(డిసెంబర్5) జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగ్ దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటనతో సింగ్ ఇంట్లో అంతులేని విషాదం అలుముకుంది. పెళ్లి ఆగిపోయిందని అంతా భావించారు. కానీ ఇక్కడే సీన్ పూర్తిగా మారిపోయింది. సింగ్‌తో పాటు ఆర్మీలో పనిచేసిన జవాన్లు, అధికారులు అతడి మరణం విషయం తెలుసుకున్నారు. వెంటనే మథురకు వచ్చారు. సింగ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అన్నీ దగ్గరుండి చూసుకుని సింగ్ కూతురి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించారు. చివరకు దగ్గరుండి కన్యాదానం కూడా చేశారు. సింగ్ స్నేహితుల మానవతా సాయంపై అతడి వియ్యంకుడు నరేంద్రసింగ్ స్పందించారు. అంతా అయిపోయిందనుకున్న తరుణంలో సింగ్ స్నేహితులంతా వచ్చి మాకు ధైర్యం చెప్పి పెళ్లి జరిపించారు’అని వారిపై ప్రశంసలు కురిపించారు. -
మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డీ కుమార్తె వివాహనికి హాజరైన వైఎస్ జగన్ దంపతులు
-
పెళ్లికిచ్చిన రిటర్న్ గిఫ్ట్ చూసి అతిథులు ఫిదా : ఫాదర్ ఐడియా అదిరింది!
#HelmetsReturn Gifts:ఇటీవలి కాలంలోపెళ్ళిళ్లకు రిటన్ గిఫ్ట్‌లు ఇవ్వడం చాలా కామన్‌గా మారింది. అలా ఓ పెళ్లిలో పెళ్లి కుమార్తె తండ్రి ఇచ్చిన రిటన్ గిఫ్ట్ వైరల్‌గా మారింది. రిటన్ గిఫ్ట్ ఏంటి? వైరల్ కావడం ఏంటి? అనుకుంటున్నారా? అయితే మీరీ స్టోరీ తెలుసుకోవాల్సిందే. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కోర్బా జిల్లా, ముదాపూర్ ప్రాంతానికి చెందిన సెద్ యాదవ్ తన కుమార్తె వివాహం ఘనంగా జరిపించాడు. తన కుమార్తె, స్పోర్ట్స్ టీచర్ నీలిమతో, సరన్‌గఢ్-బిలైగఢ్ జిల్లాలోని లంకాహుడా గ్రామానికి చెందిన ఖమ్‌హాన్ యాదవ్‌తో మూడు ముళ్ల వేడుకను ముచ్చటగా జరిపించాడు. విందు భోజనాలు కూడా ఘనంగా ఏర్పాటు చేశాడు. అయితే ఆ పెళ్లికి వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్‌లుగా హెల్మెట్లు ఇవ్వడం వార్తల్లో నిలిచింది. అంతేకాదు ఇది చూసిన అతిథులు ఆశ్చర్యపోయారు. ఇదీ చదవండి: అపుడు సల్మాన్ మూవీ రిజెక్ట్.. ఒక్క సినిమాతో కలలరాణిగా..ఈ స్టార్ కిడ్ ఎవరు? అయితే రోడ్డు భద్రతపై జనంలో అవగాహన కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు వధువు తండ్రి. రోడ్డుపై ప్రయాణిస్తున్నపుడు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినపుడు తామిచ్చిన హెల్మెట్లు ఉపయోగడాలని భావించామన్నాడు. పెళ్లికి వచ్చిన వారిలో 60 మంది అతిథులకు స్వీట్లతోపాటు హెల్మెట్లను రిటర్న్ గిఫ్ట్‌లుగా ఇచ్చినట్లు సెద్ యాదవ్ తెలిపాడు. అంతేకాదు ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కుటుంబ సభ్యులంతా కలిసి హెల్మెట్లు ధరించి మరీ డ్యాన్సులు చేసినట్టు సంబరంగా చెప్పుకొచ్చాడు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమైన మద్యం తాగి వాహనాలు నడపడం మానుకోవాలని అతిథులను కోరారు. అందరూ జీవితం విలువను గుర్తించాలని పిలుపునిచ్చాడు. రోడ్డు భద్రత, హెల్మెట్ల వాడకంపై అవగాహన కల్పించేందుకు తన కుమార్తె పెళ్లి వేడుక తనకొక వేదికను అందించిందంటూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అటు గిఫ్ట్స్ అందుకున్న బంధువులు, సన్నిహితులు చాలామంచి ఆలోచన అంటూ సెద్ను అభినందించారు. ఆనదంతో వారు స్టెప్పులు వేశారు. గతంలో బెంగళూరులో కూడా గతంలో బెంగళూరులో కూడా ఇలాంటి సంఘటన ఒకటి నమోదైంది. తమ పెళ్లికి వచ్చిన అతిథులకు హెల్మెట్లు, మొక్కలు గిఫ్ట్‌గా ఇచ్చారు నూతన జంట శివరాజ్, సవిత. ఇలా అయినా కొంతమంది ప్రాణాలైనా రక్షించగలిగితే తమకదే చాలని, అలాగే తామిచ్చిన మొక్కల్లో 500 మొక్కలు బతికినా తమకు ఆనందమేనని వెల్లడించారు. పెళ్లిళ్లలకు మందు, విందు, మ్యూజిక్ అంటూ చేసే వృధా ఖర్చులకు బదులుగా, ఇలా చేయడం ద్వారా, అటు పర్యావరణానికి, ఇటు భవిష్యత్తరాలకు మేలు చేసిన వారమవుతాంటూ వెల్లడించాడు శివరాజ్. -
ఆలయంలో ప్రముఖ నటుడి కూతురి పెళ్లి..
-
అంబానీ,అదానీ కాదు: తొలి 100 కోట్ల ఎయిర్‌బస్ హెలికాప్టర్, ఇంకా విశేషాలు
బిలియనీర్లు అనగానే సాధారణంగా టాటాలు, అంబానీ, అదానీలే గుర్తువస్తారు. వీరితోపాటు ప్రముఖ పారిశ్రామికవేత్త,భారతదేశపు అత్యంత సంపన్నుల ఫోర్బ్స్ జాబితాలో నిలిచిన, దుబాయ్‌లోని నివసిస్తున్న రవి పిళ్లై కూడా ఒకరు. ఈ ఎన్నారై వ్యాపారవేత్త రవి పిళ్లై(68) కు సంబంధించి మరో విశేషం కూడా ఉంది. 100 కోట్ల రూపాయల విలువైన ఎయిర్‌బస్ హెలికాప్టర్‌ను కొనుగోలు చేసిన రికార్డు మాత్రం రవి పిళ్లై సొంతం. (ఐటీ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే మీకో శుభవార్త!) కేరళలోని కొల్లంకు చెందిన రవి పిళ్లై చాలా కష్టపడి బిలియనీర్‌గా ఎదిగిన వ్యక్తి. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన రవి పట్టుదలగా తన వ్యాపార సామ్రాజ్యాన్నిబిల్డ్ చేసుకున్నారు. లోప్రొఫైల్ మెంటైన్ చేసే ఆయన స్వచ్ఛంద కార్యక్రమాలకు కూడా పాపులర్. ప్రస్తుతం ఆఫ్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈవోగా రవి పిళ్లై 2.8 బిలియన్ డాలర్ల (18,200 కోట్లు) సంపదతో అత్యంత సంపన్న కేరళీయులలో ఒకరు. 2022, జూన్‌లో అత్యాధునిక ఎయిర్‌బస్ H145 హెలికాప్టర్‌ను అప్పట్లోనే దీనివిలువ. రూ. 100 కోట్లు. ఈ హెలికాప్టర్లో ఇద్దరు పైలట్లు,మరో ఏడుగురు ప్రయాణించ వచ్చు. ఇది సముద్ర మట్టానికి 20వేల అడుగుల ఎత్తు నుంచి లాంచింగ్, ల్యాండింగ్ చేయగల సామర్థ్యం దీని సొంతం. (టాప్ పెయిడ్ హీరోయిన్ల లిస్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చిందెవరో తెలిస్తే..షాక్‌వుతారు) రైతు కుటుంబ నేపథ్యం: లక్ష అప్పుతో మొదలై వ్యాపార సామ్రాజ్యం సెప్టెంబర్ 2, 1953లో జన్మించిన రవి పిళ్లై కొచ్చి విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. న్యూయార్క్‌లోని ఎక్సెల్సియర్ కళాశాల నుంచి తత్వశాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందాడు. లక్ష రూపాయల అప్పుతో తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించించారు. 1978లో, రవి పిళ్లై సౌదీ అరేబియా వెళ్లి చమురు సంపన్న గల్ఫ్ దేశంలో తన నిర్మాణ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ నిర్మాణ సంస్థ పేరే నాసర్ ఎస్. అల్ హజ్రీ కార్పొరేషన్ (NSH). కుమార్తె పెళ్లి ఒక విశేషం రవి పిళ్లైకి సంబంధించిన మరోవిషయం ఏమిటంటే నవంబర్ 26, 2015లో తన కుమార్తె వివాహానికి 42 దేశాల నుండి 30వేల గెస్ట్‌లను ఆహ్వానించారు. అనేక కంపెనీలు, సీఈవీలో,పలు రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు, మిడిల్ ఈస్టర్న్ రాజకుటుంబ సభ్యులు ఈ పెళ్లికి అతిథులు హాజరుకావడంతో అపుడు విశేషంగా నిలిచింది. కొచ్చికి చెందిన డాక్టర్ ఆదిత్య విష్ణుతో తన కుమార్తె డాక్టర్ ఆరతి రవి పిళ్లై వివాహానికి రూ.55 కోట్లు ఖర్చు చేశారు. చిత్ర కళా దర్శకుడు సాబు సిరిల్ నేతృత్వంలోని 200 మంది నిపుణుల బృందం పెళ్లి మండపాన్ని రూపొందించారు. బాహుబలి సినిమా సెట్ కంటే వెడ్డింగ్ సెట్ చాలా గొప్పగా ఉందనే ప్రశంసలు వెల్లువెత్తాయి. రవి పిళ్లై కుమారుడు గణేష్ పిళ్లై వివాహం కూడా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. పద్మశ్రీ 2010లో భారత ప్రభుత్వం విశిష్ట పురస్కారం పద్మశ్రీ ని అందుకున్నారు. 2008లో ప్రవాసీ భారతీయ సమ్మాన్ సత్కరాన్నిపొందారు. -
బెంగళూరులో నిర్మలా సీతారామన్ కుమార్తె వివాహం
దొడ్డబళ్లాపురం: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ కుమార్తె వాఙ్మయి వివాహం బెంగళూరులో గురువారం నిరాడంబరంగా జరిగింది. ఉడుపి అదమారు మఠం బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం వాఙ్మయి– ప్రతీక్ల వివాహం బెంగళూరులోని టమరిండ్ ట్రీ అనే ఓ హోటల్లో జరిగింది. ఉడుపి మఠానికి చెందిన పలువురు స్వామీజీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల నుంచి అతి కొద్దిమంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్న వాఙ్మయి ఒక ప్రముఖ పత్రికలో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. -
పెళ్లింట విషాదం.. అప్పుడు వరుడి తండ్రి.. ఇప్పుడు వధువు తండ్రి..
సాక్షి, జగిత్యాల: మల్లాపూర్ మండలం కొత్తందారాజుపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. దుబాయ్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నఈ గ్రామ వాసి రాజిరెడ్డి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో వీరి కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. 20 రోజుల క్రితమే రాజిరెడ్డి కూతురి వివాహం జరగాల్సింది. పెళ్లికి గంట ముందు పెళ్లి కొడుకు తండ్రి గుండెపోటుతో మరణించాడు. దీంతో విహవాం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ ఘటనతో తీవ్ర మానసిక వేదనకు గురై రాజిరెడ్డికి గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. ఆస్పత్రికి తరలించే లోపే అతను ప్రాణాలు కోల్పోయాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చదవండి: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం -
టాలీవుడ్ నటుడి ఇంట పెళ్లిసందడి.. హాజరైన సినీ ప్రముఖులు
టాలీవుడ్ నటుడు కాదంబరి కిరణ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇవాళ ఆయన కుమార్తె కల్యాణం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. తారామతి బారాదరిలో జరిగిన ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాదంబరి కిరణ్ చిన్న కుమార్తె పూర్ణ సాయిశ్రీకి సాయి భార్గవతో వివాహం జరిగింది. ఈ వేడుకకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హీరో శ్రీకాంత్, మురళి మోహన్, కోట శ్రీనివాసరావు, రామజోగయ్య శాస్త్రి, తనికెళ్ల భరణి, అలీ, భాస్కరభట్ల, సాయికుమార్, బండ్ల గణేష్ హాజరయ్యారు. సీనియర్ నటుడైన కాదంబరి కిరణ్ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. భరత్ అనే నేను, రంగస్థలం, శ్రీమంతుడు చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు. -
ప్రముఖ నిర్మాత ఇంట పెళ్లి బాజాలు, సినీ తారల సందడి
ప్రముఖ తెలుగు నిర్మాత సునీల్ నారంగ్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కూమార్తె జాన్వి వివాహ వేడుక గురువారం రాత్రి హైదబాద్‌లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధమిత్రుల సమక్షంలో ఆదిత్యతో జాన్వి ఏడడుగులు వేసింది. ఈ వివాహ మహోత్సవంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, స్టార్ హీరోలు సందడి చేశారు. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌లు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, దర్శకుడు శేఖర్ కమ్ముల, బోయపాటి శ్రీను, హరీశ్ శంకర్, ప్రశాంత్ వర్మ, అనుదీప్, తమిళ హీరో శివకార్తికేయన్‌తో పాటు నిర్మాతలు సురేశ్ బాబు, సి. కల్యాణ్, నాగవంశీ, మిర్యాల రవీందర్‌రెడ్డి తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: 10వ తరగతిలో సత్తాచాటిన సూర్య కూతురు, మార్కుల జాబితా వైరల్ అలాగే సినిమాటోగ్రాఫి మంత్రి తలసాని శ్రీనివాస్ సైతం ఈ వేడుకకు హజరయ్యారు. ఇందుకు సంబంధించి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా సునీల్ నారంగ్‌కు చెందిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. ఇటీవల ఈ బ్యానర్లో వచ్చిన లవ్‌స్టోరీ భారీ విజయం సాధించింది. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో పలు ప్రాజెక్ట్స్ తెరకెక్కుతున్నాయి. వాటిలో ఒకటి శేఖర్ కమ్ముల-ధనుశ్ కాంబినేషన్లోని ఓ చిత్రం కాగా.. అనుదీప్-శివ కార్తికేయ కాంబోలో రూపొందుతున్న ప్రిన్స్ మూవీ. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
-
హృదయ విదారకం: ఓ వైపు వివాహ తంతు, మరో వైపు అంత్యక్రియలు
పుల్కల్(సంగారెడ్డి): మరో గంటలో కూతురు పెళ్లి. బంధువులు, కుటుంబ సభ్యులు ముస్తాబవుతున్నారు. కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలనుకున్న ఆ నాన్న కల నెరవేరకుండానే కన్నుమూసాడు. ఫాదర్స్ డే రోజు తండ్రిని పోగొట్టుకుని ఆ కూతురు శోకసంద్రంలో మునిగిపోయింది. బంధువులు ఓవైపు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తునే నిఖా తంతు ముగించారు. ఈ హృదయ విదారకర సంఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ముద్దాయిపేటలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ముద్దాయిపేటకు చెందిన మక్బుల్ అహ్మద్(గూడు పటేల్)కూతురికి సంగారెడ్డికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయించారు. మూడు నెలల క్రితం ఎంగేజ్మెంట్ ఘనంగా చేశారు. ఆదివారం సంగారెడ్డిలో వివాహ ఏర్పాట్లు చేశారు. బంధువులందరు పెళ్లి మండపానికి చేరుకున్నారు. మహ్మద్ మక్బుల్ అహ్మద్ అస్వస్థతకు గురవడంతో ఇంట్లోనే ఉంచారు. పెళ్లి మరో గంట ఉందనగా పెళ్లి పెద్ద మృతిచెందాడు. బంధువులు కొందరు కూతురు పెళ్లి తంతు ముగించగా,మరికొందరు తండ్రి అంత్యక్రియలు పూర్తిచేశారు. చదవండి👉🏻 మరణించి ఉంటారులే.. బతికి ఉన్న మహిళ పోస్టుమార్టానికి.. -
కుమార్తె వివాహం.. సీఎంకు పెళ్లి పత్రిక అందించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తన కుమార్తె శ్రీహర్షిత వివాహానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు సీఎంను బుధవారం ఆయన ప్రగతిభవన్‌లో కలిశారు. ఈనెల 26న హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో రాత్రి 9 గంటలకు జరగనున్న వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ సీఎంకు పెళ్లిపత్రిక అందజేశారు. Called on Hon’ble CM Sri KCR Garu at Pragathi Bhavan & invited to attend the wedding of my younger daughter Sri Harshitha on 26th May. pic.twitter.com/MQPbLJfGZY — V Srinivas Goud (@VSrinivasGoud) May 18, 2022 -
డిప్యూటీ సీఎం అంజాద్బాష కూతురు వివాహ వేడుకలకు హాజరైన సీఎం జగన్
-
గతేడాదే కూతురు పెళ్లి.. అప్పు తీర్చలేక
సాక్షి, బల్మూర్(మహబూబ్‌నగర్): వ్యవసాయంతో పాటు కూతురు పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేక ఓ కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్‌కు చెందిన ఏడుపుల లక్ష్మయ్య (45) శివారులో పదెకరాలు కౌలుకు తీసుకుని వివిధ పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్య లక్ష్మమ్మతో పాటు కూతురు, కుమారుడు ఉన్నారు. రెండేళ్లుగా సరైన దిగుబడి లేదు. గతేడాదే కూతురు పెళ్లి చేశాడు. సుమారు రూ.5 లక్షల వరకు అప్పులు చేయగా ఎలా తీర్చాలోనని మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని వీడియో కాల్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు వెంటనే అచ్చంపేట ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి అక్కడే మృతి చెందాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ రాజు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: అర్జంటుగా దుస్తులు మార్చుకుంటానని స్నేహితురాలి గదికి వెళ్లి -
ఘనంగా సీనియర్ నటి కూతురి పెళ్లి..హాజరైన సీఎం
చెన్నై: నటుడు పొనవన్నన్, శరణ్య దంపతుల ఇంట పెళ్లి సందడి నెలకొంది. వీరి కుమార్తె ప్రియదర్శిని, విఘ్నేశ్‌ల వివాహ రిసెప్షన్ సోమవారం సాయంత్రం చెన్నైలోని ఓ హోటల్లో ఘనంగా జరిగింది.పలువురు సినీ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరైన నూతన దంపతులకు శుభాకాంక్షలు అందించారు. అదే విధంగా ముఖ్యమంత్రి స్టాలిన్, నటుడు, శాసనసభ్యుడు ఉదయనిధి స్టాలిన్, పలువురు రాజకీయ ప్రముఖులు వధూదరులను ఆశీర్వదించారు. -
క్రికెటర్‌తో డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లి
ప్రముఖ దర్శకుడు శంకర్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె ఐశ్యర్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. క్రికెటర్ రోహిత్ దామోదరన్‌తో ఆమె వివాహం నిశ్చయమైంది. కరోనా కారణంగా వీరి వివాహ వేడుకను నిరాడంబరం నిర్వహించాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు సమచారం. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధువులు, సన్నిహితుల మధ్య వీరి వివాహ వేడుక మహాబలిపురంలో జరగునుంది. పెళ్లి డేట్‌పై స్పష్టత లేదు. వృతిరీత్యా శంకర్ కూతురు ఐశ్యర్య డాక్టర్ కాగా రోహిత్ టీఎన్‌పీఎల్(తమిళనాడు ప్రీమియర్ లీగ్)లో క్రికెటర్ కావడం విశేషం. ఇక రోహిత్ తండ్రి రామోదరన్ తమిళనాడులో ప్రముఖ పారిశ్రామిక వేత్త. అంతేకాదు ఆయన మధురై పాంథర్స్ టీంకు స్పాన్సర్ కూడా. అయితే గత మేలో శంకర్ తల్లి ముత్తు లక్ష్మీ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా శంకర్‌కు ముగ్గురు సంతానం. కుమారుడు అర్జిత్, కుమార్తెలు ఐశ్వర్య శంకర్, అదితి శంకర్. ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 మూవీని తెరకెక్కించే పనిలో బిజీగా ఉండగా, ఆ తర్వాత రామ్ చరణ్‌తో ఓ పాన్ ఇండియా మూవీకి సిద్దంగా ఉన్నాడు. దీనితో పాటు హిందీలో రణ్వీర్ సింగ్‌తో అపరిచితుడు రీమేక్ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. చదవండి: శవం ముందు నటి డ్యాన్స్, అవాక్కైన నెటిజన్లు Monal Gajjar: హైదరాబాదీని అయిపోయా.. మోనాల్ ఆసక్తికర పోస్ట్ గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలీవుడ్ హీరోయిన్! -
మా అమ్మకు పెళ్లి... నాక్కూడా..
ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్‌లో మొన్నటి ఆదివారం (డిసెంబర్ 13) ‘ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ్’ కార్యక్రమం జరిగింది. 63 జంటలు ఈ సందర్భంగా వివాహం చేసుకున్నాయి. అయితే వింత ఏముంది అనుకుంటున్నారా? ఈ జంటల్లో ఒక 27 ఏళ్ల కుమార్తె పెళ్లి చేసుకుంది. అలాగే ఆమె 53 ఏళ్ల తల్లి కూడా పెళ్లి చేసుకుంది. గతంలో ఏదో సినిమాలో తల్లి పెళ్లి కూతురు చేస్తుంది. అయితే ఇక్కడ కూతురు తాను చేసుకుంటూ తల్లికి కూడా చేసింది. అందుకే ఇది వైరల్ వార్త అయ్యింది. గోరఖ్‌పూర్ పీప్రోలికి చెందిన బేలి దేవి భర్త పాతికేళ్ల క్రితమే మరణించాడు. ఆమె ఒక్కతే తన ఇద్దరు కొడుకులను, కుమార్తెలను పెంచి పెద్ద చేసింది. కొడుకుల పెళ్లిళ్లు అయ్యాయి. ఒక కూతురు పెళ్లి కూడా అయ్యింది. చివరి కూతురు ఇందు పెళ్లి సందర్భంగా తల్లి భవిష్యత్తు గురించి చర్చ జరిగింది. ‘పిల్లలందరూ నేను పెళ్లి చేసుకోవడమే మంచిదన్నారు’ అంది బేలి దేవి. భర్త తమ్ముడు జగదీశ్ అన్న కుటుంబాన్ని చూసుకోవడానికి అవివాహితుడిగా మిగిలిపోయాడు. అతడే ఇన్నాళ్లు ఆ కుటుంబానికి అండా దండా. ‘అతణ్ణే పెళ్లి చేసుకోవడం మంచిది’ అని నేనూ, పిల్లలూ భావించాం అంది బేలి దేవి. ఇంకేముంది ఒకే వేదికలో కూతురి పెళ్లి, తల్లి పెళ్లి జరిగిపోయాయి. -
కూతురి పెళ్లిపై బెంగతో..
కామారెడ్డి క్రైం: ఆర్థిక స్థోమత లేకపోవడం, కూతురి పెళ్లి చేయలేక పోతున్నాననే బెంగతో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్సై తావూనాయక్ కథనం ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన తిరునగరి శ్రీనివాస్ (47)కు భార్య అరుణ, ఓ కుమార్తె ఉన్నారు. కుమార్తె డిగ్రీ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసింది. ఆర్థిక ఇబ్బందులతో శ్రీనివాస్ కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతున్నాడు. అదే సమయంలో తన కూతురికి వివాహం చేయలేక పోతున్నాని బెంగ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం కా మారెడ్డిలోని రైల్వే బ్రిడ్జికి సమీపంలో గూడ్స్ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రక్షిత వివాహానికి ప్రధానికి ఆహ్వానం
సాక్షి, బళ్లారి: రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి శ్రీరాములు తన కుమార్తె పెళ్లికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు. దీంతో స్వయాన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వధూవరులకు ఆశీస్సులు, అభినందన లేఖను పంపారు. మార్చి 5న బెంగళూరు ప్యాలెస్ మైదానంలో శ్రీరాములు కుమార్తె రక్షితకు హైదరాబాద్‌కు చెందిన సంజీవ్‌రెడ్డితో జరగనున్న పెళ్లికి ఆహ్వానించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రధాని లేఖలో కొత్త జీవితంలో అన్ని రకాలుగా మంచి జరగాలని ఆకాంక్షిస్తూ నూతన వధూవరులతో పాటు మంత్రి శ్రీరాములుకు అభినందనలు తెలిపారు. వధూవరులకు ప్రధాని ఆశీస్సులు, అభినందన లేఖ నిశ్చితార్థ వేడుకకు హాజరైన కర్ణాటక ముఖ్యమంత్రి (ఫైల్ ఫోటో) -
కుమార్తెలకు పెళ్లికావడం లేదని..
రసూల్‌పురా:కుమార్తెలకు వివాహం జరగడం లేదని మనస్తాపానికిలోనైన ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బోయిన్పల్లి పీఎస్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై సాయికిరణ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పాతబోయిన్‌పల్లి కోయబస్తీకి చెందిన నర్సమ్మ (35) మల్కాజిగిరి సబ్రిజిష్ట్రర్ కార్యాలయంలో అటెండర్‌గా పని చేసేది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. పెళ్లీడు వచ్చినా తన కుమార్తెలకు సంబంధాలు కుదరడం లేదని గత కొన్ని రోజులుగా బాధపడుతోంది. ఈ విషయమై ఈనెల 23న బంధువులతో గొడవపడగా, వారు ఆమెను మందలించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే గదిలోకి వెళ్లిన నర్సమ్మ చీరతో ప్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గుర్తించిన కుటుంబసభ్యులు ఆమెను బాలనగర్ లోని బీబీఆర్ ఆసుపత్రిలో తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వైభవంగా ఎమ్మెల్యే కాకాణి కుమార్తె వివాహం
నెల్లూరు(సెంట్రల్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె సుచిత్ర, గోపాల కృష్ణారెడ్డి వివాహం నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం వైభవంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, నెల్లూరు, తిరుపతి మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్‌రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి, వైఎస్ అనీల్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమి రెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి గౌతమ్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలి వేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు, జేసీ వెట్రిసెల్వి, మంత్రి పొంగూరు నారాయణ, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మేరిగ మురళీద ర్, ఎమ్మెల్సీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, విఠపు బాలసుబ్రమణ్యం, పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, పి. రూప్‌కుమార్, బిరవోలు శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
పెళ్లికి తెచ్చిన సొమ్ము బుగ్గిపాలు
గుడ్లవల్లేరు (గుడివాడ) : ఒక రైతు కూలీ ఇంటో జరిగిన అగ్ని ప్రమాదంలో తన కుమార్తె వివాహం కోసమని అప్పు తెచ్చిన సొమ్ము కాలి బూడిదైంది. వడ్లమన్నాడు దళితవాడలో బుధవారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో జంగం భిక్షంకు చెందిన పూరిల్లు దగ్ధమైంది. ఈ నెలాఖరుకు జరగబోయే తమ కుమార్తె వివాహం కోసమని రూ.70 వేలను అప్పుగా తెచ్చి ఇంట్లో ఉంచామని బాధితులు భిక్షం, కస్తూరీబాయి దంపతులు వాపోయారు. అవి మంటల్లో కాలిపోయాయని కన్నీరు మున్నీరయ్యారు. పెళ్లి ఎలా చేయాలని? ఆ అప్పు ఎలా తీర్చాలని ఆవేదనకు గురవయ్యారు. తాము పొలానికి వెళ్లినపుడు ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం జరిగిందన్నారు. అగ్ని మాపక సిబ్బంది వచ్చేసరికే పూరిల్లు పూర్తిగా కాలిపోయింది. స్థానికులు మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మంటల్లో వంట సామాన్లు, దుస్తులు కాలిపోయి బాధిత కుటుంబం కట్టుబట్టలతో రోడ్డు మిగిలింది. -
వైభవంగా కోటంరెడ్డి కుమార్తె వివాహం
నెల్లూరు(సెంట్రల్): నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ద్వితీయ కుమార్తె వైష్ణవి, నవీన్‌ల వివాహం ఆదివారంలోని నగరంలోని అనిల్ గార్డెన్స్‌లో వైభవంగా జరిగింది.దీనికి పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్, ఫ్లోర్‌లీడర్ పి.రూప్‌కుమార్‌యాదవ్, విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకుడు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, టీడీపీ నాయకులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మేయర్ అబ్దుల్ అజీజ్, ఇంకా వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. -
పెళ్లింట్లో విషాదం
ములుగురూరల్: పెళ్లి ఇంట్లో విషాదం చోటు చేసుకున్న సంఘటన మండలంలోని పత్తిపల్లి పంచాయతీ పరిధి చింతలపల్లిలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి... చింతలపల్లి గ్రామానికి చెందిన నాంపెల్లి సాంబయ్య(55), రాజమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఇందులో ముగ్గురు కుమార్తెలకు గతంలో వివాహం జరిగింది. నాల్గో కుమార్తె జ్యోతికి శనివారం వివాహం జరిగింది. శుభాకార్యం ముగిసిన అనంతరం వధూవరులను అత్తారింటికి సాగనంపారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో సాంబయ్యకు సుమారు 2 గంటల ప్రాంతంలో గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులు ఆస్పత్రి ఆవరణలో చేసిన రోదనలు మిన్నంటాయి. ఆదివారం అబ్బాయి ఇంట్లో రిసెప్షన్‌కు ఏర్పాట్లు కావడంతో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో చింతలపల్లితో పాటు అబ్బాయి గ్రామంలో విషాదఛాయలు అమలుకున్నాయి. -
సర్వం బుగ్గిపాలు
అలంపూర్ : అగ్ని ప్రమాదం ఒక పెళ్లింటిలో తీవ్రనష్టాన్ని మిగిల్చింది. ఇంట్లో జరిగిన షార్ట్‌సర్క్యూట్‌తో కూతురికి ఇవ్వాల్సిన కట్నకానుకలు అగ్నిలో బూడిదయ్యాయి. అగ్ని ప్రమాదం బారినపడిన ఆ కుటుంబానికి చివరికి కట్టుబట్టలే మిగిలాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.15 లక్షల వరకు నష్టం వాటిల్లింది. షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైన సంఘటన ఉండవల్లి మండలం పుల్లూరులో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి బాధితుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా నన్నూరు గ్రామానికి చెందిన సలాంఖాన్ కలుకోట్ల పీఏసీఎస్‌లో కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన గత 9 నెలలుగా పుల్లూరులో నాగరాజు అనే వ్యక్తికి చెందిన ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. శనివారం రాత్రి రోజు మాదిరిగానే నిద్రిస్తుండగా రాత్రి సుమారు 12 గంటల సమయంలో షార్ట్‌సర్క్యూట్ అయ్యి ఇంట్లో మంటలు చెలరేగాయి. గమనించిన చుట్టుపక్కల వారు సలాంఖాన్ కుటుంబ సభ్యులను తలుపుతట్టి లేపారు. వారు తేరుకుని ఇంట్లో నుంచి బయటికి వచ్చారు. తర్వాత చుట్టు పక్కల వారు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూ.. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. కానీ సకాలంలో అగ్నిమాపక కేంద్రం సహాయం అందకపోవడంతో కాలనీవాసుల ఇళ్లలోని నీటిని తీసుకువచ్చి మంటలను ఆర్పారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో కూతురి పెళ్లి కోసం తెచ్చుకున్న దాదాపు రూ.5 లక్షల నగదు, రూ.3 లక్షల కానుకలు, దుస్తులు, 18 తులాల బంగారం, జీతం తాలుకు నగదు, వంట సామగ్రి, తిండి గింజలు, రోజువారి దుస్తులు, ఫర్నీచర్ అన్నీ అగ్నిప్రమాదంలో కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ఇన్సురెన్స్ బాండ్లు సైతం అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న ఉండవల్లి ఆర్ఐ సర్దార్భాషా అక్కడికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ఈ ప్రమాదంలో రూ.15 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. బాధితుడిని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కాలనీవాసులు కోరారు. కూతురి వివాహం కోసం.. సలాంఖాన్ కుమార్తెకు ఇటీవలే పెళ్లి కుదిరింది. ఇందులో భాగంగా ఇరు కుటుంబాలు ఆదివారం కలిసి పెళ్లి ముమూర్తం ఖరారు చేసుకోవాల్సి ఉంది. ఏప్రిల్‌లో వివాహం పెట్టుకోనుండటంతో పెళ్లికి కావాల్సిన వస్తు వులు, దుస్తులు, బంగారం, నగదు సర్దుబాటు చేసుకున్నారు. కానీ షార్ట్‌సర్క్యూట్ ప్రమాదంలో పెళ్లి కోసం తె చ్చిన వస్తువులు, బంగారం, నగదు, కానుకలు కాలిపోయాయి. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. ఆదుకోని అగ్నిమాపక వాహనం.. స్థానికంగా అగ్నిమాపక కేంద్రం లేక పోవడంతో ప్రమాద నష్టం భారీ స్థాయికి చేరుకుంది. అగ్నిప్రమాదం సంభవించిన తక్షణమే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అం దించారు. గద్వాల, కర్నూలు రెండు ప్రాంతాలకు సమాచారం అందిం చినా ఫలితం లేకుండాపోయింది. అ దే సమీపంలో ఉండి ఉంటే ఇంత న ష్టం జరిగి ఉండేది కాదని బాధితులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. -
వైభవంగా హీరో కూతురి వివాహం
సాక్షి, పేరంబూరు: నటుడు, దర్శకుడు పార్థిబన్, సీత కూతురు కీర్తన వివాహ వేడుక అక్షయ్‌తో గురువారం ఉదయం స్థానిక రాజా అన్నామలైపురంలోని ఒక నక్షత్ర హోటల్లో ఘనంగా జరిగింది. కీర్తన మణిరత్నం దర్శకత్వం వహించిన కన్నత్తిల్ ముత్తమిట్లాల్ చిత్రంలో బాల నటిగా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మణిరత్నం వద్ద సహాయ దర్శకురాలిగా పని చేస్తున్న కీర్తన త్వరలో మెగాఫోన్ పట్టనున్నారు. అక్షయ్, కీర్తన ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు పచ్చజెండా ఊపడంతో ఇటీవలే వివాహ నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. గురువారం అక్షయ్, కీర్తనల పెళ్లికి ఈ శుభం కార్డు పడింది. వీరి వివాహ వేడుకను పార్థిబన్, సీత కలిసి ఘనంగా నిర్వహించారు. పార్థిబన్, సీత మనస్పర్థల కారణంగా చాలా కాలం క్రితమే విడిపోయిన విషయం తెలిసిందే. అయితే కూతురి పెళ్లి పార్థిబన్, సీతల సమక్షంలో ఒక వేడుకలా జరగడం విశేషం. అక్షయ్, కీర్తన వివాహవేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, దయానిధిమారన్, ఎండీఎంకే నేత వైగోలతో పాటు మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్ వంటి పలువురు రాజకీయనేతలతో పాటు నటుడు రజనీకాంత్, లతారజనీకాంత్, శివకుమార్, సూర్య, విశాల్, అరుణ్‌విజయ్, విజయ్‌కుమార్, నటి జ్యోతిక, మీనా, శ్రీప్రియ, లక్ష్మి, కుష్బూ, సందర్.సీ సత్యరాజ్, జయంరవి, ప్రభుదేవా, జీవీ.ప్రకాశ్‌కుమార్, విజయ్‌సేతుపతి, ఉదయనిధిస్టాలిన్, దర్శకుడు మణిరత్నం, నటి సుహాసిని మణిరత్నం, రోహిణి, రాధిక శరత్‌కుమార్, నిర్మాత ఆర్బీ.చౌదరి. ఇళయరాజా, ఏఆర్.రెహ్మాన్, గాయకుడు ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం, సంగీతదర్శకుడు హరీష్‌జయరాజ్, కే.భాగ్యరాజ్,శంకర్, సినీ ప్రముఖులు హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య
ఆదిలాబాద్, గుడిహత్నూర్(బోథ్): కన్న కూతురి పెళ్లి నిశ్చయమైంది. ఎలాగోలా పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపుదామనుకుని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పెళ్లి ఖర్చులకు ఎక్కడా అప్పు దొరక్కపోవడంతో తండ్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గుడిహత్నూర్ మండలం తోషం గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఏఎస్సై అశోక్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పి.వెంకటరమణ(43) తాపీమేస్త్రీగా పని చేస్తూ భార్య లక్ష్మీ, కుమారుడు అనిల్, కూతురును పోషి స్తున్నాడు. కూతురు పెళ్లి ఆదిలాబాద్‌కు చెందిన యువకుడితో నిశ్చయమైంది. ఈ నెల 24న పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి ఏర్పాట్లు చేస్తూనే.. బంధువులకు పెళ్లి పత్రికలు సైతం పంపించారు. పెళ్లి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో తెలిసిన వారి వద్ద అప్పు కోసం ప్రయత్నించాడు. ఎక్కడా అప్పు లభించకపోవడంతో మనస్తాపం చెందా డు. మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెంకటరమణ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురు పెళ్లి జరి పించి సాగనంపాల్సిన తండ్రి కానరాని లోకాల కు వెళ్లడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై అశోక్ తెలిపారు. -
కూతురు పెళ్లి చేసే ఆర్థిక స్థోమత లేక..
సంగారెడ్డి ,అక్కన్నపేట(హుస్నాబాద్): అయ్యో భగవంతుడా..! అన్నెపున్నెం ఎరుగని రైతును తీసుకుపోతివా అని పల్లెవాసులు కన్నీరు పెట్టారు. తర్కవానికుంటలో మంగళవారం రైతు కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. రైతు భగవాన్‌రెడ్డి, కొడుకు ప్రేమ్‌చందర్‌రెడ్డి, కూతురు రోజాల అంత్యక్రియలకు హాజరైన ప్రజలు ఆ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు మున్నీరయ్యారు. భగవాన్‌రెడ్డి ఎవరికీ హాని తలపెట్టకుండా గ్రామస్తులతో కలిసిమెలిసి ఉండేవాడు. దీంతో జనం వారి అంత్యక్రియలకు తరలివచ్చారు. ఓ రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం తుర్కవానికుంటలో ఇదే మొదటిసారి కావడంతో ఆ విషాదం నుంచి పల్లె ఇంకా తేరుకోలేదు. చుట్టుముట్టిన సమస్యలను పరిష్కరించుకునే మార్గం లేక, ఎవరి సహాయం అందకపోవడం ఆ రైతును నిత్యం వేధించాయి. సమస్యల సుడిలో కూరుకుపోయిన రైతు లోకం విడిచి వెళ్లాలని నిర్ణయించకున్నాడు. వెంటాడిన నిరుద్యోగ సమస్య భగవాన్ రెడ్డి తన పిల్లలకు ఉన్నత చదువులు చదివించాడు. పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డాడు. కానీ పిల్లులు నిరుద్యోగులుగా రెండేళ్ల నుంచి ఇంట్లోనే ఉంటున్న తీరును కలచివేసింది. ఉద్యోగాలు రావేమోననే బెంగ అతడిని కుంగదీసింది. కూతురు పెళ్లీడుకొచ్చింది. కానీ పెళ్లి చేసేంత ఆర్థిక స్థోమత లేదు. పిల్లల నిరుద్యోగ సమస్య, కూతురు పెళ్లి సమస్యలు రైతుకు జీవితం మీద విరక్తిని కలిగించాయి. పెద్ద చదువులు చదివిన పిల్లలు తనలాగే వ్యవసాయ పనులు చేయాల్సి వస్తోందని కలత చెందిన రైతు కుటుంబ సభ్యులందరూ కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. పిల్లలకు ఆహారంలో విషం ఇచ్చి తర్వాత దంపతులు ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన ఊపిరితో భార్య కొట్టుమిట్టాడుతుండగా భగవాన్ రెడ్డి, అతడి పిల్లలు ఇద్దరు మరణించారు. అందరితో కలివిడిగా ప్రేమ్‌చందర్‌రెడ్డి.. ప్రేమ్‌చందర్‌రెడ్డి గ్రామంలో అందరితో కలివిడిగా ఉండేవాడు. నిత్యం ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉండేవాడు. ఎంబీఏ పూర్తి చేసిన ప్రేమ్‌చందర్‌రెడ్డి గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. గతంలో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం పరీక్ష రాయగా 6 మార్కుల తేడాతో ఉద్యోగం చేజారింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఉంటూ ఉద్యోగ అన్వేషణలోనే ఉన్నాడు. వారం క్రితమే స్వగ్రామానికి వచ్చి తండ్రికి సహాయంగా వ్యవసాయ పనులు చేసేవాడు. ఏ రోజుకైనా ఉద్యోగం సంపాదిస్తాడు అని భావించే క్రమంలో ప్రేమ్‌చందర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం స్నేహితులను, గ్రామస్తులను కలిచి వేసింది. వేధించిన భూ సమస్య.. అక్కన్నపేట మండలంలో రెండు నెలల కింద ధర్మారంలో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం జరిగింది. దీనికి భగవాన్‌రెడ్డి హాజరయ్యారు. అతడు ఇతరుల నుంచి కొనుగోలు చేసిన (సర్వే నంబర్ 123(2)లో) 1.20 గుంటల భూమికి సంబంధించిన పట్టా ఉంది. దీంతోపాటు మరో రైతు దగ్గర 1.20 ఎకరాల భూమి సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసి కబ్జాలో ఉంటూ సాగు చేస్తున్నాడు. సర్వే నంబర్ 123(2)లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని రైతులకు సీలింగ్ పట్టాలు ఇచ్చారు. రైతు పేరున ఉన్న 1.20 ఎకరాలతోపాటు తాను మరో రైతు వద్ద కొనుగోలు చేసిన 1.20 ఎకరాల భూమిని పట్టా చేసుకోవడానికి అధికారుల చుట్టూ తిరిగినా ఉపయోగం లేకపోయింది. ఇది లావుణి పట్టా.. దీన్ని మరో రైతు పేరు మీదకు మార్చడం వీలు కాదని కొందరు చెప్పారు. దీంతో రైతు పట్టా చేసుకోవడం కోసం అధికారుల చుట్టూ తిరిగాడు. తుర్కవానికుంటలో ప్రస్తుతం ఎకరా భూమికి రూ. 6లక్షలు ధర పలుకుతుండడంతో 1.20 ఎకరాలకు 9లక్షల భూమి తనకు దక్కకుండా పోతుందేమోనని రైతు ఆందోళన చెందాడు. కుటుంబ సమస్యలు, పిల్లల నిరుద్యోగం, బతుకు నిచ్చే భూమి పట్టా సమస్యలు రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించాయి. వివరాలు ఆరా తీసిన ఎమ్మెల్యే సతీష్‌కుమార్ అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని తర్కువానికుంటలో ఆత్మహత్య చేసుకున్న రైతు ఇంటిని బుధవారం ఎమ్మెల్యే సతీష్‌కుమార్ సందర్శించారు. ముగ్గురి మృతికి ఆయన సంతాపం తెలియజేశారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను అతడి బంధువులను అడిగి తెలుసుకున్నారు. రైతు కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటామని చెప్పారు. ఆయన వెంట ఎంపీపీ భూక్య మంగ, నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, మార్కెట్ చైర్మన్ లింగాల సాయన్న, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మ్యాక నారాయణ, తదితరులు ఉన్నారు. మృతుడి కుటుంబానికి జగ్గారెడ్డి రూ. లక్ష ఆర్థిక సహాయం అక్కన్నపేట(హుస్నాబాద్): పోతారం(జే) పంచాయతీ పరి« దిలోని తుర్కవానికుంట గ్రా మానికి చెందిన రైతు గుండా భగవాన్‌రెడ్డి కుటుంబం మంగళవారం ఆత్మహత్యకు యత్నించగా ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భగవాన్‌రెడ్డి భార్య రాజవ్వ కరీంనగర్ ఆస్పత్రిలో చిక్సిత పొందుతోంది. రాజవ్వను సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరామర్శించి కుటుంబానికి రూ. లక్ష నగదును అందించారు. ఆయనతోపాటు ఎల్లారెడ్డి, తదితరులు ఉన్నారు. -
ఎవరో కావాలని చేయిస్తున్నారు
మనోవర్తి కేసుపై పృథ్వీరాజ్ సాక్షి, హైదరాబాద్: ఎవరో కావాలని తన కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నారని, ఇది బాధాకరమని ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్ అన్నారు. 2015లో తన కూతురు పెళ్లి జరిపించానని, కుటుంబాన్ని పట్టించుకోకపోతే పెళ్లి ఎలా చేస్తానని ప్రశ్నించారు. తమను పృథ్వీరాజ్ పట్టించుకోవడంలేదని ఆయన భార్య శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఫ్యామిలీ కోర్టు.. మనోవర్తి కింద శ్రీలక్ష్మికి నెలకు రూ. 8 లక్షలు చెల్లించాలని ఉత్తర్వులు జారీచేసింది. కేసు విషయమై విదేశాల్లో షూటింగ్లో ఉన్న పృథ్వీరాజ్‌తో ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా.. ‘కేసు న్యాయస్థానంలో ఉన్నప్పుడు నేనేం మాట్లాడకూడదు. అడిగారు కాబట్టి చెబుతున్నా. నాకెలాంటి నోటీసులు రాలేదు. పైగా విడిపోవడానికి నేను సిద్ధంగా లేను’ అన్నారు. పృథ్వీరాజ్, శ్రీలక్ష్మిల తనయుడు సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అమ్మానాన్నల గొడవలు ఉన్న మాట నిజమేనని, అయితే అవి కోర్టు వరకు వెళ్తాయని అనుకోలేదన్నారు. అమ్మగారు చాలా అమాయకురాలని, ఎవరో తన వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నారన్నారు. విదేశాల నుంచి నాన్న రాగానే పూర్తి వివరాలు తెలియజేస్తారని చెప్పారు. -
కూతురి పెళ్లి ఎలా చేయాలో..
-
నిమ్మగడ్డవారి పెళ్లివేడుకలో ప్రముఖులు
-
కూతురు పెళ్లికి అప్పుపుట్టలేదని...
ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి): కూతురు పెళ్లికి అప్పుపుట్టలేదని మనస్తాపం చెందిన ఆర్టీసీ కండక్టర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. స్థానికంగా మంచాల రోడ్డులో నివాసముంటున్న నీళ్ల రాచకొండ(50) ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కూతురు వివాహం నిశ్ఛయం కావడంతో.. పెళ్లి ఖర్చుల అవసరార్థం అప్పు కోసం ప్రయత్నించాడు. కానీ ఎక్కడ ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో.. చివరకు మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నగరంలో మరో రైతు ఆత్మహత్య
* ఉరేసుకుని చనిపోయిన మెదక్ జిల్లా రైతు మల్లేశం * వాచ్‌మన్ పనికోసం వచ్చి అనంత లోకాలకు.. * కూతురు పెళ్లికి ఊళ్లో ఎకరా భూమి అమ్మకం * మిగిలిన రెండెకరాలు అప్పు కింద తనఖా * అప్పులోళ్ల వేధింపులతో గుండె చెదరి పట్నం దారి.. * మృతుడు మాజీ మావోయిస్టు లింబయ్య ఘటన మరవకముందే * హైదరాబాద్‌లో మరో విషాదం సాక్షి, హైదరాబాద్/గజ్వేల్: రాజధాని నగరంలో మరో విషాదం. మొన్న లింబయ్య ఉదంతం మరవకముందే మరో రైతు అప్పుల ఉరితాడుకు వేలాడాడు. ఓవైపు ఎండిన పంటలు, మరోవైపు అప్పుల కుప్పలతో దిక్కుతోచక హైదరాబాద్‌లో ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. బతుకుదెరువు వెతుక్కుంటూ నాలుగు రోజుల క్రితం నగరానికి చేరుకున్న ఆ రైతు శనివారం రాత్రి బేగంపేట సమీపంలో ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. సరిగ్గా పది రోజుల క్రితం లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద కరెంట్ స్తంభానికి ఉరేసుకుని నిజామాబాద్ జిల్లాకు చెందిన లింబయ్య ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఉపాధి కరువై.. బతుకు బరువై.. మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం రాంసాగర్ గ్రామానికి చెందిన జొగ్గొల్ల మల్లేశం (58)కు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ముగ్గురు పిల్లలకు పెళ్లిళ్లయ్యాయి. కుమారుడు.. భార్యపిల్లలతో హైదరాబాద్‌కు వలస వెళ్లి ఫ్రిజ్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. మల్లేశంకు ఊళ్లో మూడెకరాల భూమి ఉండగా... అందులో ఎకరా భూమి చిన్న కూతురు పెళ్లి కోసం అయిదేళ్ల క్రితమే అమ్మేశాడు. మిగిలిన రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీననం సాగిస్తున్నాడు. వరుసగా అయిదేళ్లు నష్టాలే మిగిలాయి. కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు భారంగా మారాయి. రూ.50 వేల అప్పు కింద మల్లేశంకు చెందిన రెండెకరాల భూమిని ఈ ఖరీఫ్‌లోనే ఓ వ్యక్తి గిరి(తనఖా) పెట్టుకున్నాడు. దీంతో సాగు పని కూడా లేకపోవడంతో మల్లేశంకు ఉపాధి కరువైంది. అప్పులోళ్లు ఇంటికి వచ్చి వేధించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బతుకుదెరువు కోసం ఈనెల 16న హైదరాబాద్ వచ్చాడు. తొలుత అల్వాల్‌లో ఉండే బావమర్ది శ్రీనివాస్ వద్దకు చేరుకుని రూ.లక్ష అప్పు కావాలని అడిగాడు. సర్దుబాటు కాకపోవడంతో చేసేది లేక అక్కడ్నుంచి నిరాశగా కొంపల్లికి వెళ్లిపోయాడు. ఓ అపార్ట్‌మెంట్‌కు వాచ్‌మెన్‌గా పని కుదిరాడు. శనివారం రాత్రి కొంపల్లి నుంచి ప్యారడైజ్ చౌరస్తా వద్ద ఉండే బాలంరాయి పంప్‌హౌజ్‌కు చేరుకున్నాడు. ఎవరూ లేని సమయంలో చెట్టుకు తన తువాలుతో ఉరేసుకున్నాడు. రాత్రి 9.30 గంటల సమయంలో దీన్ని గమనించిన సా ్థనికులు బేగంపేట్ పోలీసులకు సమాచారం అందించారు. 10 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గాంధీ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. రైతు వద్ద రూ.5,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం పోలీసులు మళ్లీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఓ సెల్‌ఫోన్ దొరకగా.. అందులోని నంబర్ల ఆధారంగా కుమారుడికి ఫోన్ చేశారు. మధ్యాహ్నం పోస్టుమార్టం అనంతరం కుమారుడికి మృతదేహాన్ని అప్పగించారు. నా బతుకేం కావాలె: రైతు భార్య ‘భర్త లేని నా బతుకు ఏం గావాలే..’ అంటూ మల్లేశం భార్య సుశీల గుండెలవిసేలా విలపించింది. ‘‘అయిదేండ్ల సంది ఎవుసంలో అన్ని అప్పులే మిగిలినయ్.. బిడ్డ పెండ్లప్పుడు ఒక ఎకరా అమ్మినం.. మిగిలిన రెండెకరాలు అప్పు కిందికి తనఖా పెట్టినం. పెట్టుబడి కోసం చేసిన అప్పులు మిత్తి మిత్తి పెరిగి 6 లక్షలయ్యాయి. అప్పిచ్చినోళ్లు రోజూ ఇంటికొచ్చి ఇజ్జత్ తీస్తుండ్రు.. ఆ బాధలు భరించలేక పట్నంల వాచ్మెన్ పనిజేసేందుకు పోయిండు..’’ అని ఆమె కన్నీటి పర్యంతమైంది. అప్పుల బాధకు తాళ లేకే: కుమారుడు అప్పుల బాధకు తాళలేకే తన తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడని రైతు కుమారుడు మల్లేశ్ చెప్పారు. పంటల్లేక వరుసగా నష్టం రావడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని, ఇలా అర్థంతరంగా అందరినీ వదిలి వెళ్లిపోతాడని ఊహించలేదన్నాడు. హలం పట్టినా.. తుపాకీ ఎత్తినా.. హలం పట్టినా.. సమ సమాజ స్థాపనకు తుపాకీ ఎత్తినా మల్లేశం బతుకు మారలేదు. 1998కు పూర్వం మల్లేశం వివ్లవ భావాలకు ఆకర్షితుడై పీపుల్స్‌వార్ ఇందుప్రియాల్ దళం లో దళ సభ్యునిగా ఎనిమిదేళ్లపాటు పనిచేశాడు. అప్పటి ఎస్పీ ద్వారాక తిరమలరావు సమక్షంలో లొంగిపో యాడు. -
కూతురి పెళ్లి ఆగిపోయిందని..
అనంతపురం : కూతురి పెళ్లి ఆగిపోయిందనే మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం వేల్పుమడుగు గ్రామానికి చెందిన గనప్ప(45) కూతురి వివాహం డోర్నకల్ మండలానికి చెందిన యువకుడితో నిశ్చయమైంది. ఈ క్రమంలో పెళ్లి పనుల్లో మునిగిపోయిన గనప్పకు ఓ చేదు నిజం తెలిసింది. తన కూతురు మరో యువకుడిని ప్రేమించిందని, ఆ యువకుడు కాబోయే పెళ్లి కొడుక్కి ఈ విషయం చెప్పడంతో.. మగ పెళ్లివారు వివాహాన్ని నిరాకరిస్తున్నారని తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన గనప్ప సోమవారం సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కుటుంబసభ్యులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా శుక్రవారం వేల్పుమడుగు గ్రామ శివారులో గొర్రెలను మేపుతున్న కాపరులకు ఓ మృతదేహం కనిపించడంతో గ్రామస్థులకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన గనప్ప కుటుంబ సభ్యులు మృతదేహన్ని గనప్పదిగా గుర్తించి బోరుమన్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతోపాటు పక్కన పురుగులమందు డబ్బా ఉండటంతో ఇంట్లో నుంచి వెళ్లిన రోజునే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కూతురి పెళ్లి కోసం దొంగగా మారాడు..
దొంగగా అవతారమెత్తిన ఓ తండ్రి బీపీఎంను బెదిరించి పింఛన్లసొమ్మును లాక్కెళ్లాడు పిస్టల్, బుల్లెట్స్, నగదు స్వాధీనం మహబూబ్‌నగర్ క్రైం: తనకూతురి పెళ్లి కోసం ఓ తండ్రి దొంగగా మారాడు. కట్నం కింద ఇవ్వాల్సిన డబ్బును ఎలాగైనా సంపాదించాలన్న దురాశతో స్నేహితుడితో కలిసి దారిదోపిడీకి పాల్పడ్డాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. వివరాలను ఎస్పీ పి.విశ్వప్రసాద్ సోమవారం తన కార్యాలయంలో వెల్లడించారు. వనపర్తి మండలం మెటిపల్లితండాకు చెందిన కేతావత్ శంకర్‌నాయక్ తాపీమేస్త్రీ. బతుకుదెరువు కోసం కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అతడికి పెళ్లీడుకు వచ్చిన ఓ కూ తురు ఉంది. కూలీడబ్బులు పూట గడవడానికే సరిపోవడం లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో అధికమొత్తం లో సంపాదించి..కుమార్తె పెళ్లి జరిపించా లని ఆశపడ్డాడు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో ఉన్న బీహార్‌కు చెందిన పప్పు అనే మిత్రుడికి చెప్పి విలపించాడు. కూలీ చేసి పెళ్లి చేయలేవని.. ఏదైనా దొంగతనం చేస్తే వివాహం చేయగలుగుతామని సలహా ఇచ్చాడు. దీంతో శంకర్‌నాయక్ దృష్టి దొంగతనాల వైపునకు మళ్లింది. ఇద్దరు కలిసి నాలుగునెలల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి వెళ్లి అక్కడ రూ.27వేలతో ఓ పిస్తోలును కొనుగోలుచేశారు. అనంతరం హైదరాబాద్ వచ్చిన శంకర్‌నాయక్ డబ్బు సంపాదించేందుకు పథకం రచించాడు. ఈ క్రమంలో తన స్నేహితుడు, వనపర్తి మండలంలోని ఖాసీంనగర్ గ్రామానికి చెందిన కాట్రావత్ నాగరాజుతో కలి శాడు. అతడికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో ఇద్దరి ఆలోచనలు కార్యరూపం దాల్చాయి. దారిదోపిడీలే లక్ష్యం పథకంలో భాగంగా గతమార్చి 26వ తేదీన ఆసరా పింఛన్లకు సంబంధించిన రూ.1.50లక్షలను పంపిణీ చేసేందుకు బ్రాంచ్ పోస్టుమాస్టర్ శిరీష తన సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి ఓ వాహనంలో ఖాసీంనగర్ గ్రామానికి వెళ్తుం డగా అప్పటికే కాపుగాసిన శంకర్‌నాయక్ వారిని బెదిరించాడు. ఇంతలో ఆమె చేతిలో ఉన్న బ్యాగును లాగేందుకు య త్నించగా తిరగబడటంతో గాల్లోకి కా ల్పులు జరిపి స్నేహితుడిలో కలిసి ఉడాయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు వనపర్తి పోలీసులు కేసుదర్యాప్తు చేపట్టారు. బాధితుడు చంద్రశేఖర్‌రెడ్డి ఇచ్చి న సమాచారంతో పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. చివరికి శంకర్‌నాయక్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో వారిని అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. వారినుంచి రూ.87వేల నగదుతో పాటు ఓ పిస్టల్, మూడు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదించడంతో పోలీసుల కృషిని ఎస్పీ ప్రశంసించారు. అనంతరం ఐడీ పార్టీకి చెందిన శ్రీనివాస్‌రావు, రాయుడులకు నగదు పారితోషికాన్ని అందజేశారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ మల్లారెడ్డి, డీఎస్పీ చెన్నయ్య, సీఐలు షాకీర్‌హుస్సేన్, కిషన్, గోపాల్పేట ఎస్ఐ సైదులు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమార్తె వివాహం
-
పెళ్లి ఖర్చులు సీఎం సహాయ నిధికి..
షోలాపూర్, న్యూస్‌లైన్: అతనొక రాజకీయ నాయకుడు.. అందులోనూ కుమార్తె వివాహం.. ఇక పెళ్లి ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉంటాయో మీరే ఊహించుకోవచ్చు.. ఆగండాగండి.. మీరు ఊహిస్తున్నట్లు ఆయన తన కుమార్తె పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించలేదు.. కేవలం నిశ్చితార్థం ఖర్చులోనే పెళ్లి జరిగిందనిపించేశాడు.. అయినా అతడిని ఎవరూ తిట్టుకోలేదు.. పిసినారి అని అనలేదు.. ఎందుకో తెలుసా.. పెళ్లికోసం ఖర్చు పెట్టాల్సిన సొమ్మును అతడు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశాడు.. అదీ అక్కడి విశేషం..! వివరాల్లోకి వెళితే.. బాలాసాహెబ్ మోరే మరాఠ్వాడాలోని అకుల్కోట్ పంచాయితీ సమితి ప్రతిపక్ష నేత. ఆయన తన కుమార్తె సౌజన్యకు చంద్రకాంత్ క్షీరసాగర్తో వివాహం నిశ్చయించారు. ఈ మేరకు బుధవారం పట్టణంలోనే నిశ్చితార్థం పెట్టుకున్నారు. జనవరి 29వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. సాధారణంగా నిశ్చితార్థం, వివాహం ఇలా రెండు వేడుకలకూ అదే బంధువులను ఆహ్వానిస్తారు. దీంతో రెండుసార్లు వేడుకల కోసం ఖర్చుపెట్టే సొమ్ములో కొంత పొదుపు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయాలని మోరే సంకల్పించగా, వరుడి తరఫు వారు సైతం అంగీకరించారు. దీంతో పెళ్లి సమయంలో వేడుకలను రద్దుచేయాలని నిశ్చయించారు. ఆ రోజు ఖర్చు రూ.లక్షా వెయ్యి రూపాయలుగా తేలడంతో సదరు మొత్తాన్ని నిశ్చితార్థం సమయంలోనే చెక్కు రూపంలో స్థానిక తహశీల్దార్‌కు అందజేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా బాలాసాహెబ్ మోరే మాట్లాడుతూ.. ప్రస్తుతం తీవ్ర క్షామంతో అల్లాడుతున్న మరాఠ్వాడాను ఆదుకునేందుకు తమ వంతు సాయంగా ఈ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి అందజేశామన్నారు. వృథా ఖర్చులు తగ్గించుకుని, ఆ సొమ్మును కరువు బారిన పడిన రైతులను ఆదుకునేందుకు అందజేయాలనే సంకల్పంతోనే ఈ పనికి పూనుకున్నామని చెప్పారు. -
కూతురు పెళ్లి చేయలేక తండ్రి...
సంగెం: పెళ్లీడుకొచ్చిన కూతురుకు వివాహం చేయలేకపోతున్నాననే వేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రాపల్లిలో జరిగిన ఈ ఘటన వివరాలు... గ్రామానికి సౌరం సారయ్య (48)కు కూతురు మాధవి, కుమారుడు రాజేశ్ ఉన్నారు. భార్య సావిత్రి 20 ఏళ్ల క్రితం పిల్లలను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి కూలి చేసి సారయ్య పిల్లలను పోషిస్తున్నాడు. కూతురు మాధవి పెళ్లీడుకు వచ్చింది. పెళ్లి చేసేందుకు డబ్బులు లేకపోవడంతో మనస్తాపం చెందిన సారయ్య సోమవారం పురుగుల మందు తాగాడు. వరంగల్ ఎంజీఎంకు తరలించగా, మంగళవారం మృతి చెందాడు. -
ఇల్లు ఎందుకు అమ్మావని..
నవమాసాలు మోసి కని, పెంచిందనే కనికరం కూడా అతడికి కలగలేదు..గోరుముద్దలు..లాలిపాటలు గుర్తుకేరాలేదు.. నాన్నా తల్లినిరా అన్నా వదల్లేదు.. కర్రతో తలపై బలంగా కొట్టి.. ఆపై నాపరాయిపై తోసేయడంతో ‘తల్లి’డిల్లి ‘పోయింది’..ఈ దారుణం మంగళవారం నకిరేకల్‌లో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం .. -నకిరేకల్ నకిరేకల్‌లోని శివాజీనగర్‌లో నివాసముంటున్న పుపాల కళమ్మ(45) కుమారుడు సతీష్, కుమార్తె రాజేశ్వరి సంతానం. తన తల్లిదండ్రులు ఇచ్చిన స్థలంలో రేకులతో ఇల్లు నిర్మించుకుని నివసిస్తోంది. భర్త పన్నెం డేళ్ల క్రితమే చనిపోవడంతో కూలి పనులు చేస్తూ పిల్లలను పెద్దచేసింది. కుమారుడు సతీష్ నాలుగేళ్ల క్రితమే కులాంతర వివాహం చేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చేసేదేమీ లేక కళమ్మ అప్పు చేసి కుమార్తె వివాహం చేసింది. అప్పు తీర్చేందుకు కళమ్మ ఉన్న ఇంటిని విక్రయించాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని కుమారుడికి కూడా చెప్పింది. కళమ్మ తొమ్మిది నెలల క్రితం ఇల్లు విక్రయించింది. ఇల్లు ఖాళీ చేయలేదు. విక్రయించిన వారికి నాలుగు రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ చేసింది. మంగళవారం ఇంటిని ఖాళీ చేస్తుండగా సతీష్ ఇంటికి వచ్చాడు. ఇల్లు ఎందుకు విక్రయించావని తల్లితో గొడవపడ్డాడు. ఇద్దరి ఘర్షణ తారాస్థాయికి చేరడంతో కోపోద్రిక్తుడైన సతీష్ కర్రతో కళమ్మ తలపై బలంగా కొట్టాడు. నేను నీ కన్నతల్లినిరా అన్నా వినకుండా నాపరాయిపై తోసేయడంతో కళమ్మ తలకు బలమైన గాయమైంది. రక్తపు మడుగులో ఆమెను చూసి సతీష్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంట్లోనే ఉన్న కుమార్తె రాజేశ్వరి తల్లిని 108 వాహనంలో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూసింది. సీఐ శ్రీనివాసరావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలిం చారు. మృతురాలి కూతురు రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
చేసిన అప్పులు తీర్చలేక..
వారు వ్యవసాయాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు.. తమకున్న పొలమేగాక మరికొంత కౌలుకు తీసుకుని పంటలు వేశారు.. దానిద్వారా వచ్చే ఆదాయంతోనే ఓ రైతు తమ కూతురి వివాహం చేద్దామనుకున్నాడు.. అయితే ఎన్ని బోర్లు వేసినా నీరు పడలేదు.. దీనికితోడు ప్రకృతి ప్రకోపానికి పంటంతా దెబ్బతింది.. దీంతో మనోవేదనకు గురై విద్యుత్ తీగలను పట్టుకుని తనువు చాలించాడు.. ఇంకో రైతు చేసిన అప్పులు తీర్చలేక తనకున్న కాడెద్దులను సైతం అమ్ముకున్నాడు. చివరకు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు...ఇలా జిల్లాలో అన్నదాతల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. లం సింగారం గ్రామపంచాయతీలోని ఎద్దుమిట్టతండాకు చెందిన చీన్యానాయక్ (41) కు సమీపంలో మూడెకరాల పొ లం ఉంది. గత ఏడాది మరో పదెకరాలను కౌలుకు తీసుకుని పత్తి, వేరుశనగ సాగుచేశాడు. వీటికోసం సుమారు *ఆరు ల క్షల అప్పు తెచ్చాడు. ఎనిమిది బోర్లు వేసినా నీరు పడలేదు. ఈ క్రమంలోనే తుపాను కారణంగా భారీ వర్షాలకు పంట దె బ్బతింది. చేతికందిన కొద్దిపాటి పంటకు ఇటీవల మార్కెట్లో సరైన ధర రాలేదు. మరోవైపు కూతురి వివాహం ఎలా చేయాలోనని మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం సమీపంలోని పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్కు అమర్చిన విద్యుత్ తీగలను పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయనకు భార్య బొజ్జితో పాటు కూతురు జయ, కుమారుడు గోపాల్ ఉన్నారు. ఈ విషయమై పోలీసులకు సమాచారమివ్వడంతో సిద్ధాపూర్ ఎస్ఐ చంద్రమోహన్‌రావు, ఏఎస్ఐ మద్దిలేటి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మరో సంఘటనలో అమ్రాబాద్ మండలం ఎల్మపల్లికి చెందిన చారగొండ పట్టాబి (58) కి సమీపంలో రెండెకరాల పొలం ఉంది. అందులో ఈసారి సుమారు *లక్ష అప్పు తెచ్చి పత్తి సాగుచేసినా ఆశించిన స్థాయిలో పంట పండలేదు. ఈ క్రమంలోనే ఉన్న కాడెద్దులనూ అమ్ముకున్నాడు. ఏడాదిక్రితం కుమారుడు వెంకటేశ్వర్లు పనికోసం భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్ నగరానికి వలసవెళ్లాడు. మనోవేదనకు గురైన పట్టాబి శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఇనుపకొండికి ఉరేసుకుని చనిపోయాడు. ఈయనకు భార్య బాలకిష్టమ్మతోపాటు కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. బాధిత కు టుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు కోరారు. -
చందా...దందా: ఓ ఉన్నతాధికారి కుమార్తె పెళ్లికి వసూళ్ల పర్వం
మంత్రి పేషీలోని ఉన్నతాధికారి కుమార్తె పెళ్లికి వసూళ్ల పర్వం సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఎంకిపెళ్లి సుబ్చి చావుకొచ్చిందన్నట్లు.. ఒక అధికారి ఇంట్లో పెళ్లి కిందిస్థాయి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. వేలాది రూపాయలు ఇండెంట్ పెట్టి మరీ వసూలు చేస్తుండటంతో దిక్కుతోచకపోయినా.. ఇవ్వకపోతే ఏం ఇబ్బంది వస్తుందోనని వారు ముడుపులు చెల్లిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో ఈ వ్యవహారం సాగుతోంది. రాష్ట్ర పురపాలక శాఖామంత్రి ఎం. మహీధరరెడ్డి పేషీలో ఒక ఉన్నతాధికారి కుమార్తె వివాహం ఈ నెల 14న హైదరాబాద్‌లో జరగనుంది. దీంతో ఒక ఉన్నతాధికారి రంగంలోకి దిగి రాష్ట్రంలోని నగరపాలక సంస్థ, మున్సిపాలిటీల్లో అధికారులకు ఇండెంట్లు ఇచ్చినట్లు తెలిసింది. గుంటూరు కార్పొరేషన్‌లోని ఉన్నతాధికారికే ఈ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ‘ఇది చాలా కాన్ఫెడెన్షియల్ మ్యాటర్.. బయటకు వచ్చిందంటే చర్యలు తప్పవు..’ అంటూ ముందే హెచ్చరికలు జారీచేశారు. విభాగాల వారీగా అధికారుల క్యాడర్‌ను బట్టి ఇండెంట్‌ను నిర్ణయించారు. ఇంజినీరింగ్ విభాగంలో ఇద్దరు అధికారులకు ఈ బాధ్యతలను అప్పగించారు. అసిస్టెంట్ ఇంజినీరు క్యాడర్ అయితే రూ.6 వేలు, డీఈ క్యాడర్ అయితే రూ.8 వేలు, ఈఈ క్యాడర్‌కు రూ.10 వేలు చొప్పున, పట్టణ ప్రణాళికా విభాగం ఉన్నతాధికారి ద్వారా బిల్డింగ్ ఇన్స్పెక్టర్ నుంచి టీపీఎస్ క్యాడర్ వరకు రూ.6 వేలు, అసిస్టెంట్ సిటీప్లానర్, ఆ పైస్థాయి వారి నుంచి రూ.8 వేల నుంచి పదివేల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతి విభాగంలో అధికారులు, సిబ్బంది నుంచి సొమ్ము వసూళ్లు సాగుతున్నాయి. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున సొమ్ము వసూలు చేస్తున్నారు.