
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, జగిత్యాల: మల్లాపూర్ మండలం కొత్తందారాజుపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. దుబాయ్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నఈ గ్రామ వాసి రాజిరెడ్డి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో వీరి కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.
20 రోజుల క్రితమే రాజిరెడ్డి కూతురి వివాహం జరగాల్సింది. పెళ్లికి గంట ముందు పెళ్లి కొడుకు తండ్రి గుండెపోటుతో మరణించాడు. దీంతో విహవాం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ ఘటనతో తీవ్ర మానసిక వేదనకు గురై రాజిరెడ్డికి గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. ఆస్పత్రికి తరలించే లోపే అతను ప్రాణాలు కోల్పోయాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
చదవండి: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం