వారు వ్యవసాయాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు.. తమకున్న పొలమేగాక మరికొంత కౌలుకు తీసుకుని పంటలు వేశారు.. దానిద్వారా వచ్చే ఆదాయంతోనే ఓ రైతు తమ కూతురి వివాహం చేద్దామనుకున్నాడు..
అయితే ఎన్ని బోర్లు వేసినా నీరు పడలేదు.. దీనికితోడు ప్రకృతి ప్రకోపానికి పంటంతా దెబ్బతింది.. దీంతో మనోవేదనకు గురై విద్యుత్ తీగలను పట్టుకుని తనువు చాలించాడు.. ఇంకో రైతు చేసిన అప్పులు తీర్చలేక తనకున్న కాడెద్దులను సైతం అమ్ముకున్నాడు. చివరకు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు...ఇలా జిల్లాలో అన్నదాతల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది.
లం సింగారం గ్రామపంచాయతీలోని ఎద్దుమిట్టతండాకు చెందిన చీన్యానాయక్ (41) కు సమీపంలో మూడెకరాల పొ లం ఉంది. గత ఏడాది మరో పదెకరాలను కౌలుకు తీసుకుని పత్తి, వేరుశనగ సాగుచేశాడు. వీటికోసం సుమారు *ఆరు ల క్షల అప్పు తెచ్చాడు. ఎనిమిది బోర్లు వేసినా నీరు పడలేదు. ఈ క్రమంలోనే తుపాను కారణంగా భారీ వర్షాలకు పంట దె బ్బతింది.
చేతికందిన కొద్దిపాటి పంటకు ఇటీవల మార్కెట్లో సరైన ధర రాలేదు. మరోవైపు కూతురి వివాహం ఎలా చేయాలోనని మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం సమీపంలోని పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు అమర్చిన విద్యుత్ తీగలను పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయనకు భార్య బొజ్జితో పాటు కూతురు జయ, కుమారుడు గోపాల్ ఉన్నారు. ఈ విషయమై పోలీసులకు సమాచారమివ్వడంతో సిద్ధాపూర్ ఎస్‌ఐ చంద్రమోహన్‌రావు, ఏఎస్‌ఐ మద్దిలేటి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.
మరో సంఘటనలో అమ్రాబాద్ మండలం ఎల్మపల్లికి చెందిన చారగొండ పట్టాబి (58) కి సమీపంలో రెండెకరాల పొలం ఉంది. అందులో ఈసారి సుమారు *లక్ష అప్పు తెచ్చి పత్తి సాగుచేసినా ఆశించిన స్థాయిలో పంట పండలేదు. ఈ క్రమంలోనే ఉన్న కాడెద్దులనూ అమ్ముకున్నాడు.
ఏడాదిక్రితం కుమారుడు వెంకటేశ్వర్లు పనికోసం భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్ నగరానికి వలసవెళ్లాడు. మనోవేదనకు గురైన పట్టాబి శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఇనుపకొండికి ఉరేసుకుని చనిపోయాడు. ఈయనకు భార్య బాలకిష్టమ్మతోపాటు కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. బాధిత కు టుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు కోరారు.