బిలియనీర్లు అనగానే సాధారణంగా టాటాలు, అంబానీ, అదానీలే గుర్తువస్తారు. వీరితోపాటు ప్రముఖ పారిశ్రామికవేత్త,భారతదేశపు అత్యంత సంపన్నుల ఫోర్బ్స్ జాబితాలో నిలిచిన, దుబాయ్‌లోని నివసిస్తున్న రవి పిళ్లై కూడా ఒకరు. ఈ ఎన్నారై వ్యాపారవేత్త రవి పిళ్లై(68) కు సంబంధించి మరో విశేషం కూడా ఉంది. 100 కోట్ల రూపాయల విలువైన ఎయిర్‌బస్ హెలికాప్టర్‌ను కొనుగోలు చేసిన రికార్డు మాత్రం రవి పిళ్లై సొంతం. (ఐటీ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే మీకో శుభవార్త!)
కేరళలోని కొల్లంకు చెందిన రవి పిళ్లై చాలా కష్టపడి బిలియనీర్‌గా ఎదిగిన వ్యక్తి. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన రవి పట్టుదలగా తన వ్యాపార సామ్రాజ్యాన్నిబిల్డ్ చేసుకున్నారు. లోప్రొఫైల్ మెంటైన్ చేసే ఆయన స్వచ్ఛంద కార్యక్రమాలకు కూడా పాపులర్. ప్రస్తుతం ఆఫ్‌పీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈవోగా రవి పిళ్లై 2.8 బిలియన్ డాలర్ల (18,200 కోట్లు) సంపదతో అత్యంత సంపన్న కేరళీయులలో ఒకరు.
2022, జూన్‌లో అత్యాధునిక ఎయిర్‌బస్ H145 హెలికాప్టర్‌ను అప్పట్లోనే దీనివిలువ. రూ. 100 కోట్లు. ఈ హెలికాప్టర్‌లో ఇద్దరు పైలట్‌లు,మరో ఏడుగురు ప్రయాణించ వచ్చు. ఇది సముద్ర మట్టానికి 20వేల అడుగుల ఎత్తు నుంచి లాంచింగ్, ల్యాండింగ్ చేయగల సామర్థ్యం దీని సొంతం. (టాప్ పెయిడ్ హీరోయిన్ల లిస్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చిందెవరో తెలిస్తే..షాక్‌వుతారు)
రైతు కుటుంబ నేపథ్యం: లక్ష అప్పుతో మొదలై వ్యాపార సామ్రాజ్యం
సెప్టెంబర్ 2, 1953లో జన్మించిన రవి పిళ్లై కొచ్చి విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. న్యూయార్క్‌లోని ఎక్సెల్సియర్ కళాశాల నుంచి తత్వశాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందాడు. లక్ష రూపాయల అప్పుతో తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించించారు. 1978లో, రవి పిళ్లై సౌదీ అరేబియా వెళ్లి చమురు సంపన్న గల్ఫ్ దేశంలో తన నిర్మాణ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ నిర్మాణ సంస్థ పేరే నాసర్ ఎస్. అల్ హజ్రీ కార్పొరేషన్ (NSH).
కుమార్తె పెళ్లి ఒక విశేషం
రవి పిళ్లైకి సంబంధించిన మరోవిషయం ఏమిటంటే నవంబర్ 26, 2015లో తన కుమార్తె వివాహానికి 42 దేశాల నుండి 30వేల గెస్ట్‌లను ఆహ్వానించారు. అనేక కంపెనీలు, సీఈవీలో,పలు రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు, మిడిల్ ఈస్టర్న్ రాజకుటుంబ సభ్యులు ఈ పెళ్లికి అతిథులు హాజరుకావడంతో అపుడు విశేషంగా నిలిచింది. కొచ్చికి చెందిన డాక్టర్ ఆదిత్య విష్ణుతో తన కుమార్తె డాక్టర్ ఆరతి రవి పిళ్లై వివాహానికి రూ.55 కోట్లు ఖర్చు చేశారు. చిత్ర కళా దర్శకుడు సాబు సిరిల్ నేతృత్వంలోని 200 మంది నిపుణుల బృందం పెళ్లి మండపాన్ని రూపొందించారు. బాహుబలి సినిమా సెట్ కంటే వెడ్డింగ్ సెట్ చాలా గొప్పగా ఉందనే ప్రశంసలు వెల్లువెత్తాయి. రవి పిళ్లై కుమారుడు గణేష్ పిళ్లై వివాహం కూడా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
పద్మశ్రీ
2010లో భారత ప్రభుత్వం విశిష్ట పురస్కారం పద్మశ్రీ ని అందుకున్నారు. 2008లో ప్రవాసీ భారతీయ సమ్మాన్ సత్కరాన్నిపొందారు.
Comments
Please login to add a commentAdd a comment