Ravi Pillai
-
అంబానీ,అదానీ కాదు: తొలి 100 కోట్ల ఎయిర్‌బస్ హెలికాప్టర్, ఇంకా విశేషాలు
బిలియనీర్లు అనగానే సాధారణంగా టాటాలు, అంబానీ, అదానీలే గుర్తువస్తారు. వీరితోపాటు ప్రముఖ పారిశ్రామికవేత్త,భారతదేశపు అత్యంత సంపన్నుల ఫోర్బ్స్ జాబితాలో నిలిచిన, దుబాయ్‌లోని నివసిస్తున్న రవి పిళ్లై కూడా ఒకరు. ఈ ఎన్నారై వ్యాపారవేత్త రవి పిళ్లై(68) కు సంబంధించి మరో విశేషం కూడా ఉంది. 100 కోట్ల రూపాయల విలువైన ఎయిర్‌బస్ హెలికాప్టర్‌ను కొనుగోలు చేసిన రికార్డు మాత్రం రవి పిళ్లై సొంతం. (ఐటీ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే మీకో శుభవార్త!) కేరళలోని కొల్లంకు చెందిన రవి పిళ్లై చాలా కష్టపడి బిలియనీర్‌గా ఎదిగిన వ్యక్తి. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన రవి పట్టుదలగా తన వ్యాపార సామ్రాజ్యాన్నిబిల్డ్ చేసుకున్నారు. లోప్రొఫైల్ మెంటైన్ చేసే ఆయన స్వచ్ఛంద కార్యక్రమాలకు కూడా పాపులర్. ప్రస్తుతం ఆఫ్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈవోగా రవి పిళ్లై 2.8 బిలియన్ డాలర్ల (18,200 కోట్లు) సంపదతో అత్యంత సంపన్న కేరళీయులలో ఒకరు. 2022, జూన్‌లో అత్యాధునిక ఎయిర్‌బస్ H145 హెలికాప్టర్‌ను అప్పట్లోనే దీనివిలువ. రూ. 100 కోట్లు. ఈ హెలికాప్టర్లో ఇద్దరు పైలట్లు,మరో ఏడుగురు ప్రయాణించ వచ్చు. ఇది సముద్ర మట్టానికి 20వేల అడుగుల ఎత్తు నుంచి లాంచింగ్, ల్యాండింగ్ చేయగల సామర్థ్యం దీని సొంతం. (టాప్ పెయిడ్ హీరోయిన్ల లిస్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చిందెవరో తెలిస్తే..షాక్‌వుతారు) రైతు కుటుంబ నేపథ్యం: లక్ష అప్పుతో మొదలై వ్యాపార సామ్రాజ్యం సెప్టెంబర్ 2, 1953లో జన్మించిన రవి పిళ్లై కొచ్చి విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. న్యూయార్క్‌లోని ఎక్సెల్సియర్ కళాశాల నుంచి తత్వశాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందాడు. లక్ష రూపాయల అప్పుతో తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించించారు. 1978లో, రవి పిళ్లై సౌదీ అరేబియా వెళ్లి చమురు సంపన్న గల్ఫ్ దేశంలో తన నిర్మాణ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ నిర్మాణ సంస్థ పేరే నాసర్ ఎస్. అల్ హజ్రీ కార్పొరేషన్ (NSH). కుమార్తె పెళ్లి ఒక విశేషం రవి పిళ్లైకి సంబంధించిన మరోవిషయం ఏమిటంటే నవంబర్ 26, 2015లో తన కుమార్తె వివాహానికి 42 దేశాల నుండి 30వేల గెస్ట్‌లను ఆహ్వానించారు. అనేక కంపెనీలు, సీఈవీలో,పలు రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు, మిడిల్ ఈస్టర్న్ రాజకుటుంబ సభ్యులు ఈ పెళ్లికి అతిథులు హాజరుకావడంతో అపుడు విశేషంగా నిలిచింది. కొచ్చికి చెందిన డాక్టర్ ఆదిత్య విష్ణుతో తన కుమార్తె డాక్టర్ ఆరతి రవి పిళ్లై వివాహానికి రూ.55 కోట్లు ఖర్చు చేశారు. చిత్ర కళా దర్శకుడు సాబు సిరిల్ నేతృత్వంలోని 200 మంది నిపుణుల బృందం పెళ్లి మండపాన్ని రూపొందించారు. బాహుబలి సినిమా సెట్ కంటే వెడ్డింగ్ సెట్ చాలా గొప్పగా ఉందనే ప్రశంసలు వెల్లువెత్తాయి. రవి పిళ్లై కుమారుడు గణేష్ పిళ్లై వివాహం కూడా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. పద్మశ్రీ 2010లో భారత ప్రభుత్వం విశిష్ట పురస్కారం పద్మశ్రీ ని అందుకున్నారు. 2008లో ప్రవాసీ భారతీయ సమ్మాన్ సత్కరాన్నిపొందారు. -
Ravi Pillai: ఒకప్పుడు పేద రైతు కొడుకు.. ఈ రోజు బిలినీయర్
'కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు' అనే మాటలకు నిలువెత్తు నిదర్శనం 'రవి పిళ్లై'. పేదరికంతో పోరాడుతున్న రైతు కుటుంబంలో జన్మించిన ఈయన ఈ రోజు కేరళలో మాత్రమే కాకుండా మిడిల్ ఈస్ట్‌లోని అత్యంత సంపన్నులైన భారతీయులలో ఒకరుగా ఉన్నారు. కేరళ కొల్లాం తీరప్రాంత పట్టణానికి చెందిన ఒక గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రవి పిళ్ళై కష్టాలు ఎన్ని ఎదురైనా చదువు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. తరువాత చిట్-ఫండ్ కంపెనీతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే నష్టాలపాలయ్యాడు. ఆ తరువాత 150 మందితో కన్స్ట్రక్షన్ (construction) కంపెనీ ప్రారంభించాడు, క్రమంగా తన ఎదుగుదల ప్రారంభమైంది. ఈ రోజు ఇందులో ఏకంగా 70,000 కంటే ఎక్కువమంది పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు ది రావిజ్ అష్టముడి, ది రవిజ్ కోవలం మరియు ది రవిజ్ కడవు వంటి 5 స్టార్ హోటళ్లను నడుపుతున్నాడు. (ఇదీ చదవండి: Keerthy Suresh: వామ్మో.. మహానటి ఆస్తులు అన్ని కోట్లా?) పిళ్లై ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో అనేక గృహాలు కూడా ఉన్నట్లు సమాచారం, ఇందులో ఒకటి పూణేలోని ట్రంప్ టవర్ లగ్జరీ కాండో. కొల్లాంలో RP మాల్, 300 పడకల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని కలిగి ఉన్నాడు. నిరంతర కృషి, పట్టుదలతో సక్సెస్ సాధించిన రవి పిళ్ళైకి భారత ప్రభుత్వం 2008లో ప్రవాసీ భారతీయ సమ్మాన్, 2010లో పద్మశ్రీ అవార్డులు అందించింది. అంతే కాకుండా న్యూయార్క్ ఎక్సెల్సియర్ కాలేజీ నుంచి డాక్టరల్ డిగ్రీ కూడా అందుకున్నారు. పేదరికంతో పోరాడుతున్న రైతు కొడుకుగా జన్మించిన రవి పిళ్లై RP గ్రూప్ సామ్రాజ్యాన్ని నిలబెట్టి, ప్రస్తుతం 7.8 బిలియన్ డాలర్లు సంపాదించారు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 64,000 కోట్లు కంటే ఎక్కువ. లగ్జరీ హోటల్స్ మాత్రమే కాకుండా స్టీల్, గ్యాస్, ఆయిల్, సిమెంట్, షాపింగ్ మాల్స్ వంటి వ్యాపారాల్లో కూడా తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నారు. (ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండా 'ఆఫ్‌లైన్ ట్రాన్సక్షన్'.. మీకు తెలుసా?) దాదాపు 100 కోట్లు ఖరీదైన ఎయిర్‌బస్ హెచ్145 హెలికాప్టర్‌ను చేసుకున్న మొదటి భారతీయుడిగా పిళ్లై కావడం గమనార్హం. ఈయన వద్ద ఆధునిక లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఇందులో రోల్స్ రాయిస్ గోస్ట్, మెర్సిడెస్ మేబాచ్ ఎస్ 600, బిఎండబ్ల్యు 520 డి, ఆడి ఎ 6 మ్యాట్రిక్స్, మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 500, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఉన్నాయి. -
దేశంలోనే తొలిసారిగా ఎయిర్‌బస్ హెలికాప్టర్ కొన్న కేరళ బిలియనీర్!
ప్రముఖ ఆర్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ బి. రవి పిళ్ళై అరుదైన ఘనతను సాధించారు. దేశంలోని తొలిసారిగా ₹100 కోట్ల విలువైన ఎయిర్‌బస్ H145 హెలికాప్టర్ కొనుగోలు చేసిన వ్యక్తిగా ఈ బి.రవి పిళ్ళై నిలిచారు. 68 ఏళ్ల ఈ కేరళ బిలియనీర్ ప్రస్తుతం 2.5 బిలియన్ డాలర్ల విలువ ఆస్తిని కలిగి ఉన్నారు. బి. రవికి చెందిన వివిధ కంపెనీల్లో సుమారు 70,000 మంది ఉద్యోగులను పనిచేస్తున్నారు. ప్రస్తుతం యుఏఈ వెలుపల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. హెలికాఫ్టర్ కొనుగోలు చేయడంతో అతని పర్యాటక కార్యకలాపాలు ఊపందుకున్నాయి, ఎందుకంటే అతనికి రాష్ట్రవ్యాప్తంగా లగ్జరీ హోటళ్ళు ఉన్నాయి. కేరళ రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల మీదుగా తన అతిథులను రవాణా చేయడానికి ఉపయోగిస్తారు అని ఆర్పీ గ్రూప్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అత్యాధునిక భద్రతా ఫీచర్లను కలిగి ఉన్న అత్యాధునిక హెలికాఫ్టర్ ఏడుగురు ప్రయాణీకులను, ఒక పైలట్'ను తీసుకెళ్లగలదు. ఈ హెలికాప్టర్ సముద్ర మట్టానికి 20,000 అడుగుల ఎత్తులో ల్యాండింగ్ & టేకాఫ్ చేసే సామర్ధ్యం కలదు. ఆర్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ బి. రవి పిళ్ళై ఎక్కువ శాతం లో ప్రొఫైల్ కలిగి ఉంటారు. పిళ్ళై, తన ఛారిటీ కార్యకలాపాల వల్ల భాగ ప్రసిద్ధి చెందారు. (చదవండి: ఆహా! ఏమి అదృష్టం.. ఏడాదిలో లక్షకు రూ.23 లక్షలు లాభం!) -
ఆ పెళ్లి ఖర్చు రూ.55 కోట్లు!
తిరువనంతపురం : పెళ్లిళ్లకు అయ్యే ఖర్చును నియంత్రించాలని కేరళ మహిళ కమిషన్ ఓ వైపు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే...మరోవైపు కేరళకు చెందిన ఎన్నారై తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. అందుకోసం ఆయన అక్షరాల రూ. 55 కోట్లు ఖర్చు పెడుతున్నారు. పెళ్లి మండపం కోసమే 20 కోట్లు ఖర్చు పెట్టారంటే మిగతా వాటికి ఎంత రేంజ్లో ఖర్చు చేస్తున్నారో ఊహించుకోండి మరి.... వివరాల్లోకి వెళితే... కేరళ ఎన్నారై రవి పిళ్లై... తన కుమార్తె డాకర్ట్ అరతీని కొచ్చికి చెందిన డాక్టర్ ఆదిత్య విష్ణుకు ఇచ్చి గురువారం వివాహం జరిపిస్తున్నారు. తన గారాల పట్టి వివాహ వేడుకకు దేశంలోని ప్రముఖులతోపాటు ప్రపంచవ్యాప్తంగా 42 దేశాల నుంచి ప్రభుత్వాధినేతలను ఆయన ఆహ్వానం పలికారు. వీఐపీలు ఈ వేడుక వద్దకు తరలించేందుకు రెండు ఛార్టర్డ్ ఫ్లైట్లు తిరువనంతపురం ఎయిర్ పోర్ట్‌లో ఇప్పటికే సిద్ధంగా ఉంచారు. అంతేనా 250 మంది పోలీసులు.. 350 మంది ప్రైవేట్ భద్రత సిబ్బంది ..వారి భద్రతను పర్యవేక్షించనున్నారు. ఇక ఈ వివాహ వేడుక సందర్భంగా మలయాళ చిత్ర హీరోయిన్లు శోభన, మంజు వారియర్‌తో డాన్స్ ప్రోగ్రాములు. స్టిఫెన్ దేవసే ఆధర్వంలో మ్యూజికల్ షోను కూడా ఏర్పాటు చేశారు. ఇక కళ్యాణ మండపం కోసం ఏకంగా టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాహుబలి చిత్రానికి సంబంధించిన 'సెట్స్' ను వేయించారు. ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌తో బాహుబలి తరహాలో సెట్టింగ్స్ వేయించి మరీ వివాహం జరిపిస్తున్నారు. ఇందుకోసం ఎనిమిది ఎకరాలలో రూ. 20 కోట్లు ఖర్చ పెట్టి మరీ ఈ సెట్టింగ్స్ వేశారు. కేరళకు చెందిన రవి పిళ్లై గల్ఫ్‌లో ఆర్పీ గ్రూప్‌ని నిర్వహిస్తున్నారు. ఈ గ్రూప్ ఆధ్వరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, గనులు, విద్యా, నిర్మాణ రంగాల్లో వ్యాపారం సాగుతుంది. ఆర్పీ గ్రూప్‌కు దేశవ్యాప్తంగా 26 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలలో 80 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన సర్వేలో కేరళ ఎన్నారైల్లో అత్యధిక సంపన్నుల జాబితాలో రవి పిళ్లై మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.