ప్రముఖ ఆర్‌పీ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ బి. రవి పిళ్ళై అరుదైన ఘనతను సాధించారు. దేశంలోని తొలిసారిగా ₹100 కోట్ల విలువైన ఎయిర్‌బస్ H145 హెలికాప్టర్ కొనుగోలు చేసిన వ్యక్తిగా ఈ బి.రవి పిళ్ళై నిలిచారు. 68 ఏళ్ల ఈ కేరళ బిలియనీర్ ప్రస్తుతం 2.5 బిలియన్ డాలర్ల విలువ ఆస్తిని కలిగి ఉన్నారు. బి. రవికి చెందిన వివిధ కంపెనీల్లో సుమారు 70,000 మంది ఉద్యోగులను పనిచేస్తున్నారు. ప్రస్తుతం యుఏఈ వెలుపల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
హెలికాఫ్టర్ కొనుగోలు చేయడంతో అతని పర్యాటక కార్యకలాపాలు ఊపందుకున్నాయి, ఎందుకంటే అతనికి రాష్ట్రవ్యాప్తంగా లగ్జరీ హోటళ్ళు ఉన్నాయి. కేరళ రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల మీదుగా తన అతిథులను రవాణా చేయడానికి ఉపయోగిస్తారు అని ఆర్‌పీ గ్రూప్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అత్యాధునిక భద్రతా ఫీచర్లను కలిగి ఉన్న అత్యాధునిక హెలికాఫ్టర్ ఏడుగురు ప్రయాణీకులను, ఒక పైలట్'ను తీసుకెళ్లగలదు. ఈ హెలికాప్టర్ సముద్ర మట్టానికి 20,000 అడుగుల ఎత్తులో ల్యాండింగ్ & టేకాఫ్ చేసే సామర్ధ్యం కలదు. ఆర్‌పీ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ బి. రవి పిళ్ళై ఎక్కువ శాతం లో ప్రొఫైల్ కలిగి ఉంటారు. పిళ్ళై, తన ఛారిటీ కార్యకలాపాల వల్ల భాగ ప్రసిద్ధి చెందారు.
(చదవండి: ఆహా! ఏమి అదృష్టం.. ఏడాదిలో లక్షకు రూ.23 లక్షలు లాభం!)
Comments
Please login to add a commentAdd a comment