Success Story: Meet Dubai Businessman Multi-Millionaire Pb Abdul Jebbar From Kerala - Sakshi
Sakshi News home page

PB Abdul Jebbar Success Story: అమ్మ ఆశీస్సులతో రూ. 22000 కోట్ల కంపెనీ,అంతేనా..!

Published Wed, Jun 21 2023 4:56 PM | Last Updated on Wed, Jun 21 2023 5:43 PM

Meet Dubai businessman multi-millionaire PB Abdul Jebbar fromKerala success story - Sakshi

పుట్టింది ఒక మూరుమూల గ్రామం. చిన్నపుడే  కష్టాలు. అయితేనేం అమ్మ ఆశీస్సులు ఫలించాయి. సంకల్పానికి ..కాలం కలిసి వచ్చింది. జీవితం కొత్త మలుపు తిరిగింది. దాన్ని అందిపుచ్చుకుని రూ. 22000 కోట్ల పడగలెత్తాడు. దుబాయ్‌కి చెందిన భారతీయ వ్యాపారవేత్త ప్రముఖ ప్యాకేజింగ్ కంపెనీ  హాట్‌ప్యాక్ గ్లోబల్ గ్రూప్  ఎండీ పీబీ అబ్దుల్ జెబ్బార్  స్ఫూర్తిదాయకమైన  సక్సెస్‌ స్టోరీ ..

కేరళలోని త్రిసూర్ జిల్లాలోని చమక్కలా అనే గ్రామంలో  జన్మించారు పీబీ అబ్దుల్ జెబ్బార్. ఆరేళ్ల వయసున్నప్పుడే తండ్రి చనిపోయాడు. దీంతో కష్టాలు తప్పలేదు.  పిల్లల్ని పెంచిపోషించి  వారిని  గొప్పోళ్లను చేయాలని  తల్లి  భావించడమేకాదు దాన్నొక సవాలుగా తీసుకుంది. అమ్మకు అండగా కొంచెం కొంచెం సంపాదిస్తూ తన చదువు ఖర్చులను తానే భరించేవాడు. దుబాయ్‌ లాంటి దేశాలకు ఉపాధి కోసం వెళ్లే వారిలో కేరళ వాసులే  ఎక్కువ. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వారి నుంచి వస్తువులను కొనుగోలు చేసి లాభాలకు అమ్మేవాడు. ఈ వ్యాపారమే అతనికి, కుటుంబానికి సాయంగా నిలిచింది.అయితే ఉద్యోగం కోసం దుబాయ్‌ వెళ్లడంతో  జబ్బార్‌ జీవితం కీలక మలుపు తిరిగింది. విదేశాలకు వెళ్లాలని,విజయవంతమైన వ్యాపారవేత్త కావాలని కలల సాకారానికి తొలి అడుగు  పడింది.

టర్నింగ్‌ పాయింట్‌
1990లో ఉద్యోగం వెతుక్కుంటూ దుబాయ్ వెళ్లే అవకాశం రావడమే పీబీ అబ్దుల్ జెబ్బార్ జీవితంలో ముఖ్యమైన టర్నింగ్‌ పాయింట్‌. ఇండెంట్ కంపెనీలో మేనేజర్‌గా తొలి ఉద్యోగంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. వ్యాపార మెళకువలు నేర్చుకున్నాడు.  విదేశీ పార్టనర్స్‌తో ఎలా మెలగాలో కూడా బాగా  తెలిసి వచ్చింది.  సేల్స్‌,అకౌంటింగ్, మనీ మేనేజ్‌మెంట్‌ , నిర్వహణ ఇలా అన్ని రంగాల్లోనే ఆల్ రౌండర్‌గా ఆరితేరాడు.   (రెండుసార్లు ఫెయిల్‌...రూ. 2463 కోట్లకు అధిపతి: మిస్బా అష్రఫ్ సక్సెస్‌ స్టోరీ )

1995లో మజేద్ ప్లాస్టిక్స్ అనే తన ప్యాకేజింగ్ కంపెనీని ప్రారంభించాడు. పదేళ్లలో,తొలి తయారీ యూనిట్‌ను ప్రారంభించాడు.  పేపర్ కప్పులు, క్లాంగ్ ఫిల్మ్‌లు, డిస్పోజబుల్ ఫుడ్ ప్యాకేజింగ్ సహా 3500కి పైగా ఉత్పత్తులు కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి.  హాట్‌ప్యాక్ నేడు ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకుఎగుమతి చేస్తోంది. సస్టైనబుల్ ప్యాకేజింగ్‌లో అగ్రగామిగా కంపెనీ స్పెయిన్,యూ​కే, అమెరికా, ఆస్ట్రేలియాతో సహా 75 దేశాలలో  వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే స్థాయికి ఎదిగింది.  29 శాఖలు, 3500 మంది ఉద్యోగులు , 25000 క్లయింట్లతో మూడు పువ్వులు ఆరు కాయలుగా  రూ. 22000 కోట్ల టర్నోవర్‌  కంపెనీగా వెలుగొందుతోంది.

అక్కడే ఆగిపోలేదు
శ్రీమంతుడు సినిమాలో  చెప్పినట్టు  తిరిగి ఇవ్వకపోతే లావే పోతాం అనుకున్నాడేమో ఎమో గానీ..తన పుట్టిన గడ్డ కేరళకు తిరిగి ఏదైనా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. త్రిసూర్‌లో ఎన్విరోగ్రీన్ క్యారీ బ్యాగ్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ప్రారంభించాడు. ఇది పర్యావరణ అనుకూలమైన కాగితం ఉత్పత్తులను తయారు చేస్తుంది. దయా హాస్పిటల్, యూనివర్సల్ ఇంజనీరింగ్ కాలేజీని కూడా నడుపుతున్నాడు. వీటి ఆరోగ్య సంరక్షణ  విద్యా రంగంలో సేవలందిస్తూ  పలువురి ప్రశంసలందుకుంటున్నారు.

అమ్మ ఆశీస్సులు, కల
ఈ విజయం తన తల్లికి అంకితమని ఆమె ఆశీస్సులే తనను విజయపథంలో నడిపించాయని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు జెబ్బార్.  ఏదైనా కొత్త వెంచర్‌ను ప్రారంభించే ముందు ఎపుడూ ఆమె ఆశీస్సులు తీసుకుంటానని చెప్పారు. (అపుడు పాల ప్యాకెట్‌ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!)

అవార్డులు
గ్లోబల్ మీడియా ఈవెంట్స్ అండ్ అచీవ్‌మెంట్స్ అవార్డు
ఎన్‌ఆర్‌ఐ ఎంటర్‌ప్రెన్యూర్  కైరాలి టీవీ అవార్డు
సీఈవో ఫర్‌  లైఫ్ 2021  
ప్యాకేజింగ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2021 (ప్రైమ్ అవార్డ్స్) 
2022 మిడిల్ ఈస్ట్ మీడియా (సీఈఓ) ఐటీపీ మీడియా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement