![Kerala Suchetha Satish Sings In140 Languages Sets Guinness World Record - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/12/sucheta%20satish.jpg.webp?itok=4ynEaxhY)
మనసుంటే మార్గముంటుంది. ప్రతిభ ఉండాలేగానీ అవార్డులు, రివార్డులు, ప్రపంచ రికార్డులు మనకోసం వెదుక్కుంటూ వస్తాయి. ఇదే విషయాన్ని ఒక యువతి నిరూపించింది. తన పాటలతో రికార్డులను తన వెంట తిప్పుకుంటోంది.
ఒక కాన్సర్ట్‌లో ఏకంగా 140 భాషల్లో పాటలు పాడి సరికొత్త ప్రపంచ రికార్డును సాధించింది కేరళ కుట్టి. గత ఏడాది నవంబర్ 24న దుబాయ్, యుఎఇలో జరిగిన కాన్సర్ట్ ఫర్ క్లైమేట్ సందర్భంగా కేరళకు చెందిన సుచేత సతీష్ తన గాన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. తన అద్భుత ఘనతను చాటుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పింది. దీనికిసంబంధించిన వీడియో ఇన్‌స్టాలో షేర్ అవుతోంది.
ఈ రికార్డును గిన్నిస్ బుక్ యాజమాన్యం అధికారికంగా ధృవీకరించింది.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేజీ ప్రకారం , దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియంలో వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడానికి సుచేత 140 భాషలలో ప్రదర్శనలిచ్చి రికార్డును బద్దలు కొట్టారు. దుబాయ్‌లో జరిగిన COP 28 సమ్మిట్‌కు హాజరైన 140 దేశాల ప్రాతినిధ్యానికి గుర్తుగా 140 నంబర్ ఎంపిక చేసినట్టు వివరించింది. సుచేత సతీష్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తన విజయాన్ని షేర్ చేసింది. దీంతో నెటిజనులు అభినందనలు కురిపించారు. ఇన్‌క్రెడిబుల్! వెయ్యి మైళ్ల ప్రయాణం అయినా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అంటూ కామెంట్ చేశారు.
2018 జనవరిలో లాంగెస్ట్ లైవ్ సింగింగ్ కన్సర్డ్ పెట్టిన అమ్మాయిగా రికార్డు. అలాగే అత్యధిక భాషల్లో పాడిన ప్రపంచ రికార్డుకూడా సొంతం చేసుకుంది. 2021 మ్యూజిక్ బియాండ్ బోర్డర్స్ గిన్నిస్ రికార్డును సాధించింది. ఈ ప్రోగ్రామ్‌లో సుచేత సతీష్ 6 గంటల 15 నిమిషాల పాటు 102 భాషల్లో పాడి రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పారు. ఈ రికార్డులను అమెరికా, మయామి వరల్డ్ రికార్డ్ అకాడెమీ నిర్ధారించింది.
2005 ఆగస్టు17న కన్నూర్‌లో అయిలియాత్ సుమిత, డాక్టర్ టీసీ సతీష్ దంపతులకు జన్మించింది. అన్నయ్య సుశాంత్ సతీష్ ఉన్నారు. 2 నెలల వయస్సులో దుబాయ్‌కి షిప్ట్. మూడేళ్ల వయస్సు నుంచే పాడటం మొదలు పెట్టింది. నాలుగేళ్లనుంచే కర్ణాటక సంగీతం నేర్చుకుంటోంది. చాలా చిన్న వయసులోనే ప్రముఖ గాయనీ గాయకులందరికీతోనూ పరిచయాటుండటం తన అదృష్టమనీ, ప్రముఖ గాయని శ్రీమతి పి.సుశీలను తన గాడ్ మదర్‌గా భావిస్తుందిసుచేత సతీష్.
Comments
Please login to add a commentAdd a comment