దుబాయ్ : ఆమె ఓ పేరుగాంచిన మోడల్. ఓ కాంట్రాక్ట్ పని నిమిత్తం దుబాయ్ వెళ్లి ఓ హోటల్‌లో బస చేసింది. అయితే అదే హోటల్‌లో దిగిన ఓ వ్యాపారవేత్త ఆమెపై అఘాయిత్యం చేయబోయాడు. అతన్ని నుంచి తప్పించుకునేందుకు ఆరో అంతస్థు నుంచి దూకేసింది. వెన్నెముకకు గాయం కాగా ప్రాణాలతో ఆమె బయటపడింది. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పోలీసులు అరెస్ట్ చేయటం ఇక్కడ విశేషం.
భాదితురాలి కథనం ప్రకారం... సైబీరియాకు చెందిన 22 ఏళ్ల ఎక్టెరీనా.. ఓ కాస్మోటిక్ సంస్థతో కాంట్రాక్ట్ పని కోసం దుబాయ్‌కు వెళ్లింది. అక్కడ ఓ పాకిస్థానీ వ్యాపారవేత్త(39) ఒప్పందం కోసం హోటల్ గదికి ఆమెను ఆహ్వానించాడు. ఆమె వెళ్లే సరికి అతను ఫుల్‌గా తాగేసి ఉన్నాడు. ఆ మత్తులో ఆమెపై అత్యాచారయత్నం చేయబోయాడు. ఆమె ప్రతిఘటించటంతో ఓ కత్తితో ఆమెను బెదిరించి బట్టలిప్పాలని బెదిరించాడు.
ప్రాణ భయంతో అతను చెప్పినట్లుగా ఆమె చేసింది. ఆపై అతని నుంచే తప్పించుకునేందుకు నగ్నంగానే హోటల్ బిల్డింగ్ నుంచి దూకేసింది. ఘటన తర్వాత పారిపోయేందుకు యత్నించిన వ్యాపారవేత్తను ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్టెరీనా వెన్నెముకకు తీవ్ర గాయాలు కావటంతో వైద్యులు రెండు సర్జరీలను చేశారు.
బాధితురాలి అరెస్ట్...
అయితే ఆమె తనను కత్తితో చంపే యత్నం చేసిందని నిందితుడు ఫిర్యాదు చేశాడు. బాధితురాలు చెబుతున్నట్లు అత్యాచారం ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. పైగా అతని ఒంటిపై కత్తి గాయాలు ఉన్నాయి. దీంతో మోడల్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమెను అరెస్ట్ చేశారు. ఆస్పత్రి నుంచి నేరుగా ఆమెను జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. దీనికితోడు ఆమె మోడలింగ్‌తోపాటు వ్యభిచారం కూడా నిర్వహిస్తోందని.. అందుకే దుబాయ్ వచ్చిందని సదరు వ్యాపారవేత్త ఆరోపిస్తున్నాడు. మరోవైపు ఎక్టెరీనా తల్లి మాత్రం వాటిని ఖండిస్తోంది. దుబాయ్‌లోని రష్యన్ కాన్సులేట్ ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment