siberia
-
వేల ఏళ్ల పురాతనమైన వినాశకర వైరస్ల విజృంభణ!
వాషింగ్టన్: రాజులు, సంపన్నులు దాచిన గుప్తనిధులు, లంకెబిందెలు వందల ఏళ్లకు ఇంకెవరికో దొరికితే సంబరమే. కానీ అందుకు భిన్నంగా జరిగితే?. అలాంటి ఉపద్రవమే ముంచుకు రావొచ్చని జీవశాస్త్రవేత్తలు మానవాళిని హెచ్చరిస్తున్నారు. 48,500 సంవత్సరాలపాటు మంచుమయ ఆర్కిటిక్ ఖండంలో మంచు ఫలకాల కింద కూరుకుపోయిన వినాశకర వైరస్లు పర్యావరణ మార్పులు, భూతాపం కారణంగా మంచు కరిగి బయటికొస్తున్నాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా ఆ వైరస్‌లకు ఇప్పటికీ ఇంకొక జీవికి సోకే సాంక్రమణ శక్తులు ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో యకూచి అలాస్ సరస్సులో తవి్వతీసిన నమూనాల్లో పురాతన వ్యాధికారక వైరస్‌లను ఇటీవల జీవశాస్త్రవేత్తల బృందం కనుగొంది. వాటిలో కొన్ని రకాలకు జాంబీ(దెయ్యం)వైరస్‌లుగా వర్గీకరించారు. నిద్రాణ స్థితిలో ఉన్నప్పటికీ ఇంకో జీవికి సంక్రమించే సత్తా ఇంకా వీటికి ఉందో లేదో పరీక్షిస్తున్నట్లు ఎయిక్స్–మార్సెల్లీ విశ్వవిద్యాలయంలో జన్యు శాస్త్రవేత్త జీన్ మైఖేల్ క్లావెరీ చెప్పారు. ‘‘ఆర్కిటిక్ ఖండం ఉపరితలంలో 20 శాతం భూభాగం శాశ్వతంగా మంచుతో కప్పబడి ఉంది. అత్యంత చల్లని, ఆక్సిజన్‌రహిత, ఘనీభవించిన ఈ ప్రదేశంలో పెరుగును పడేస్తే అలా పాడవ్వకుండా అలాగే ఉంటుంది. ఒక 50వేల సంవత్సరాల తర్వాత సైతం తినేయొచ్చు’ అని క్లావెరీ అన్నారు. నెదర్లాండ్స్‌లోని రోటెర్డామ్ ఎరాస్మస్ మెడికల్ సెంటర్లోని వైరాలజీ శాస్త్రవేత్త మేరియాన్ కూప్‌మెన్స్ మరికొన్ని వివరాలు చెప్పారు. ‘‘ ఈ మంచు ఫలకాల కింది వైరస్లు బయటికొచ్చి వ్యాప్తి చెందితే ఎలాంటి రోగాలొస్తాయో ఇప్పుడే చెప్పలేం. అయితే 2014లో సైబీరియాలో మేం ఇదే తరహా వైరస్‌లను పరీక్షించగా వాటికి ఏకకణ జీవులకు సోకే సామర్థ్యం ఉందని తేలింది. 2015లోనూ ఇదే తరహా పరీక్షలు చేశాం. ల్యాబ్‌లో అభివృద్దిచేసిన జీవులకూ ఈ వైరస్లు సోకాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో మానవసంచారం పెరగనంతకాలం వీటితో ప్రమాదం ఏమీ లేదు. శతాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న పురాతన పొలియో వ్యాధికారక వైరస్‌లకు ఇప్పటికీ ఆ సంక్రమణ శక్తి ఉండొచ్చు. మనుషుల రాకపోకలతో అంటువ్యాధులను వ్యాపింపజేసే వైరస్లు ఆర్కిటిక్ ప్రాంతం దాకా వ్యాపిస్తే అవి, ఇవీ అన్ని కలసి కొత్తరకం ఊహించని వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాం’’ అని వేరియాన్ కూప్‌మెన్స్ విశ్లేíÙంచారు. -
అతిపెద్ద గొయ్యి.. ఇక్కడ తవ్వే కొద్ది వజ్రాలు!
తూర్పు సెర్బియాలో ఉన్న వజ్రాల గని ఇది. భూమ్మీద అతిపెద్ద గోతుల్లో ఒకటిగా ఇది రికార్డులకెక్కింది. దీని వ్యాసం 1200 మీటర్లు, లోతు 525 మీటర్లు. తొలిసారిగా ఈ ప్రాంతంలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు 1955లో నాటి సోవియట్ భూగర్భ శాస్త్రవేత్త యూరీ ఖబార్దిన్ గుర్తించారు. వజ్రాలను వెలికి తీసేందుకు అప్పటి సోవియట్ ప్రభుత్వం 1957లో ఇక్కడ మిర్నీ మైన్ పేరిట గనిని ప్రారంభించింది. ఈ గని నుంచి ఏకధాటిగా 2001 వరకు వజ్రాల వెలికితీత కొనసాగింది. తర్వాత కొన్నాళ్లు ఇది మూతబడింది. ఇది రష్యన్ వజ్రాల కంపెనీ ‘ఎయిరోసా’ చేతుల్లోకి వెళ్లడంతో 2009 నుంచి మళ్లీ వజ్రాల వెలికితీత కొనసాగుతోంది. ఇక్కడ వజ్రాల గని ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఏటా సగటున కోటి కేరట్ల (రెండువేల కిలోలు) వజ్రాల వెలికితీత జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. మరో నలబై ఏళ్లకు పైగా ఇక్కడి నుంచి వజ్రాలను వెలికితీసే అవకాశాలు ఉన్నాయని ఎయిరోసా కంపెనీ భావిస్తోంది. -
నదిపైనే ల్యాండింగ్ !
మాస్కో: రన్‌వేపై ల్యాండ్ చేయడం మామూలే.. నది ఉపరితలంపై విమానాన్ని పరుగెత్తించడంలోనే ఉంది అసలు మజా అనుకున్నాడో ఏమో. రష్యాలో చిన్న విమానాన్ని ఒక పైలట్ నేరుగా నదిపైనే ల్యాండ్ చేశాడు. అదృష్టవశాత్తు నది ఉపరితలం మొత్తం దట్టంగా మంచుతో నిండిపోవడంతో ప్రయాణికుల ప్రాణాలు నిలబడ్డాయి. రష్యాలో తూర్పు సైబీరియా పరిధిలోని జిర్యాంకా విమానాశ్రయ సమీపంలో జరిగిందీ ఘటన. రష్యాలోని సఖా రిపబ్లిక్ ప్రాంతంలోని యాకుట్సŠక్ నగరం నుంచి 34 మంది ప్రయాణికులతో ఆంటోవ్ ఏఎన్–24 విమానం గురువారం ఉదయం జిర్యాంకా నగరానికి బయల్దేరింది. భారీగా మంచు కురుస్తుండటంతో జిర్యాంకా ఎయిర్పోర్ట్ రన్‌వే సరిగా కనబడక దానిని దాటేసి ఎదురుగా ఉన్న కోలిమా నదిపై ల్యాండ్‌చేశాడు. నగరంలో ప్రస్తుతం గడ్డకట్టే చలి వాతావరణం రాజ్యమేలుతోంది. మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత దెబ్బకు నది ఉపరితలం మొత్తం గడ్డకట్టింది. దీంతో దీనిపై ల్యాండ్ అయిన విమానం అలాగే కొన్ని మీటర్లు సర్రున జారుతూ ముందుకెళ్లి ఆగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఘటనకు కారకుడైన పైలట్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. సోవియట్ కాలంనాటి ఈ చిన్న విమానాన్ని పోలార్ ఎయిర్‌లైన్స్ నడుపుతోంది. -
46 వేల ఏళ్ల నాటి పురుగుని బతికించారు! పిల్లల్నికంటోంది కూడా..!
ఎప్పుడూ మంచుతో దట్టంగా కప్పబడి ఉండే సైబిరియాలో ఓ పురుగుని గుర్తించారు శాస్త్రవేత్తలు. దాన్ని తీసుకోస్తే ఎన్నో అద్భుతాలు వెలుగులోకి వచ్చాయి. శాస్త్రవేత్తలే విస్తుపోయాలే బతకడమే గాక పిల్లల్ని కంటోంది. నిజానికి కీస్తూ పూర్వం నాటి వాటిని గుర్తిస్తే అబ్బురపడతాం. అలాంటిది.. ఇది ఏకంగా వేల ఏళ్ల నాటిది. పైగా అంతటి మంచులో ఘనీభవించి ఉండి కూడా బతకడం నిజంగా ఆశ్చర్యమే కదా!. వివరాల్లోకెళ్తే..సైబీరియన్ పెర్మాఫ్రాస్ట్ మంచు ప్రాంతంలో భూమి ఉపరితలానికి 40 మీటర్లు కింద మంచులో ఘనీభవించి ఉన్న ఓ పురుగుని గుర్తించారు శాస్త్రవేత్తలు. దీన్ని ల్యాబ్‌కి తీసుకొచ్చి పరిశోధనలు చేశారు డ్రెస్డన్లోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ సెల్ బయాలజీ అండ్ జెనిటిక్స్కి చెందిన ప్రోఫెసర్ ఎమెరిటస్. 'క్రిప్లోబయోసిస్' అనే నిద్రాణ స్థితిలో జీవించిందని తెలిపారు. ఇది అంతటి గడ్డకట్టే చలిలో చెడిపోకుండా అలానే ఉంది. నీరు, ఆక్సిజన్ లేకపోవడం, ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయిన స్థితిని కూడా తట్టుకుని బతికిందన్నారు. ఇది పురాతన రౌండ్‌వార్మ్(వానపాము) జాతికి చెందినదని తెలిపారు. ఇది దారుణమైన వాతావరణ స్థితులను తట్టుకుని బతకగలవని చెప్పారు. ఆయా వాతావరణ స్థితుల్లో.. ఆ పురుగుల్లో జీవక్రియ రేట్లు గుర్తించలేని స్థాయిలో పడిపోతాయి. ఆ పురుగుపై ఉన్న నిక్షేపాల ఆధారంగా 46 వేల ఏళ్ల క్రితం నాటిదని లెక్కించారు శాస్త్రవేత్తలు. దానికి తాము ప్రాణం పోయడంతో జీవించడం ప్రారంభించడమే గాక పిల్లల్ని కంటోందని అన్నారు. ఇలానే ఐదేళ్ల క్రితం, రష్యాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికో కెమికల్ అండ్ బయోలాజికల్ ప్రాబ్లమ్స్ ఇన్ సాయిల్ సైన్స్ శాస్త్రవేత్తలు సైబీరియన్‌లో రెండు రౌండ్‌వార్మ్ జాతులను కనుగొన్నారు. తదుపరి విశ్లేషణ కోసం జర్మనీలోని ల్యాబ్‌లకు దాదాపు 100 పురుగులను తీసుకెళ్లారు. ఇన్స్టిట్యూట్లోని రెండు పురుగులను నీటితో రీహైడ్రేట్ చేయడం ద్వారా బతికించారు. వాళ్లు కూడా వాటిని..దాదాపు 45 వేల నుంచి 47 వేల ఏళ్ల నాటి పురుగులని వాటిపై ఉన్న నిక్షేపాల ఆధారంగా చెప్పుకొచ్చారు. పురుగులపై జన్యు విశ్లేషణ చేశారు. దీంతో ఇవి అప్పటి జాతికి చెందినవని తేలింది. దీనిని పరిశోధకులు ‘పానాగ్రోలైమస్ కోలిమెనిస్’ అని పిలుస్తారు. క్రిప్టోబయోసిస్ అనే నిద్రాణ స్థితిలో ఉన్న ఈ పురుగులు మనుగడ సాగించడానికి ట్రెహలోస్ అనే చక్కెరను ఉత్పత్తి చేస్తాయి. అవి గడ్డకట్టినా.. నిర్జలీకరణాన్ని తట్టుకొని కొన్ని ఏళ్లు నిద్రాణ వ్యవస్థలో ఉండగలవని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ అంశం ఇప్పుడూ సైన్సు పరంగా ఓ అద్భుత సంచలనంగా ఉంది. ఈ జీవులు ఒకరకంగా మారుతున్న జీవైవిధ్యాన్ని రక్షించే ప్రాధాన్యతను నొక్కి చెప్పడమే గాక విపరీతమైన పరిస్థితుల్లో జీవించే సామర్థ్యం గురించి తెలియజేసిందన్నారు. అలాగే నాటి కాలం, అప్పటి పరిస్థితులు, వాటి జీవనశైలిని.. తెలుసుకోవాడానికి ఇదోక గొప్ప వనరుగా ఉంటుదన్నారు పరిశోధకులు. (చదవండి: కార్యాలయాల్లో 'వై' బ్రేక్! ఏంటంటే ఇది!) -
గడ్డకట్టే మంచులో జాంబీ వైరస్లు!
గ్లోబల్ వార్మింగ్‌తో మానవాళికి ముమ్మాటికీ ముప్పే!. అతిశీతోష్ణ స్థితి ప్రాంతాల్లో.. వాతావరణ మార్పుల ప్రభావం పెను ముప్పుకు దారి తీయొచ్చని శాస్త్రవేత్తలు గత కొన్నేళ్లుగా హెచ్చరిస్తూ వస్తున్నారు. వాతావరణం వేడెక్కడం వల్ల మంచు కరిగిపోవడం.. అందులో అప్పటికే చిక్కుకున్న మీథేన్ వంటి గ్రీన్‌హౌజ్ వాయువులు విడుదల కావడం, తద్వారా పరిస్థితి మరింత దిగజారుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే.. గడ్డ కట్టుకుపోయే స్థితిలో ఉన్న మంచులో సైతం.. ప్రమాదకరమైన వైరస్ల ఉనికి ఉంటుందని, ఒకవేళ ఇవి గనుక విజృంభిస్తే .. మానవాళికి ముప్పు ఊహించని రీతిలో ఉండొచ్చని తాజాగా సైంటిస్టులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనాతో ప్రపంచ మానవాళి ఎంత ఇబ్బంది పడిందో కళ్లారా చూశాం. అలాగే.. కనుమరుగు అయ్యాయనుకునే వైరస్ల జాడ.. మంచు ప్రాంతాల్లో సజీవంగా తరచూ బయటపడుతుంటుంది కూడా. కానీ, వాటి ప్రభావం ప్రపంచంపై ఏమేర ఉంటుందనే దానిపై ఓ స్పష్టత అంటూ లేకుండా పోయింది. తాజాగా.. రష్యాలోని సైబీరియా రీజియన్‌లో సుమారు 48 వేల సంవత్సరాల వయసున్న వైరస్ల ఉనికిని.. గడ్డకట్టుకుపోయిన ఓ సరస్సు అడుగు భాగం సేకరించారు యూరోపియన్ సైంటిస్టులు. మంచు ప్రాంతాల్లో తమ పరిశోధనల్లో భాగంగా.. మొత్తం పదమూడు రకాల వ్యాధికారకాలను గుర్తించి.. ‘జాంబీ వైరస్’లుగా వాటిని వ్యవహరిస్తున్నారు. అయితే ఆశ్చర్యంగా.. ఇంతకాలం గడ్డకట్టిన స్థితిలో ఉన్నా కూడా అంటువ్యాధులు ప్రబళించే సామర్థ్యంతో అవి ఉన్నట్లు చెప్తున్నారు. రష్యా, జర్మనీ, ఫ్రాన్స్‌కు చెందిన సైంటిస్టులు ఈ వైరస్లు తిరిగి విజృంభిస్తే.. ఏమేర ప్రభావం చూపుతాయి అనే అంశంపై పరిశోధనలు ముమ్మరం చేశారు. వీటి వయసు ఎంత? అంటువ్యాధులను ఎలా వ్యాప్తి చెందిస్తాయి? బయటకు వచ్చాక వాటి ప్రభావం ఎలా ఉంటుంది?.. మనిషి/జంతువుల్లో వాటి ప్రభావం ఏమేర ఉంటుంది?.. తదితర అంశాలపై ఇప్పుడే ఓ అంచనాకి రాలేమని, మరికొంత సమయం పడుతుందని రీసెర్చర్లు చెప్తున్నారు. ఇదీ చదవండి: మంకీపాక్స్ పేరు మారింది! -
ప్రపంచంలో అత్యంత చల్లగా ఉండే ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎంతో తెలుసా?
మనం కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు తగ్గితేనే గజగజ వణికిపోతాం. మరి ప్రపంచంలో అత్యంత చల్లగా ఉండే ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? అది ఎక్కడుంది? అనే విషయాలేంటో చూద్దాం! – సాక్షి, సెంట్రల్ డెస్క్ మైనస్ 60 డిగ్రీలు.. అంటార్కిటికా అత్యంత చల్లగా ఉండే ఖండం అని అందరికీ తెలిసిందే. అక్కడ జనాభా ఉండదు. అక్కడికి కేవలం కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధనల నిమిత్తం వచ్చి వెళ్తుంటారు. ఇదికాకుండా ప్రపంచంలో అత్యంత చల్లగా ఉండే ప్రదేశం ఏంటంటే.. రష్యాలో సైబీరియాలోని యాకుత్స్క్ నగరం. తక్కువ జనాభా ఉండే ప్రాంతాల్లో ఇదొకటి. ఇక్కడి జనాభా 3,36,200. వీరిలో ఎక్కువ మంది అల్రోసా అనే కంపెనీ నిర్వహించే వజ్రాల గనిలో పనిచేస్తుంటారు. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 60 డిగ్రీలు. అయితే అంతకంటే ఎక్కువ చలిని కూడా తాము అనుభవించినట్లు స్థానికులు చెబుతారు. అయితే ఉష్ణోగ్రతను కొలిచేందుకు వినియోగించే థర్మామీటర్లో మైనస్ 63 డిగ్రీలే గరిష్టంగా చూపుతుంది. అంతకంటే ఎక్కువ ఉన్నా ఇది చూపలేదు. ఇంకోటి కూడా ఉంది.. యాకుత్స్క్ నగరం అత్యంత శీతల ప్రాంతమైనప్పటికీ దీనికంటే ఎక్కువ చలి ఉన్న ప్రాంతం ఇంకోటి ఉంది. అదేంటంటే ఒమికోన్. అది కూడా రష్యాలోనే ఉంది. అక్కడ జనాభా 500లోపే. ఇక్కడ 1924లో ఉష్ణోగ్రత మైనస్ 71.2 డిగ్రీలు నమోదైంది. అయితే, ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. యాకుత్స్స్, ఒమికోన్ ప్రాంతాలు దగ్గర దగ్గరగా ఉండవు. రెండింటి మధ్య దూరం 928 కిలోమీటర్లు. ఒకచోటి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లాలంటే 21 గంటలకు పైనే పడుతుంది. ఎక్కువగా చల్లగా ఎందుకంటే..? సైబీరియాలో అత్యంత చలి ఎందుకు ఉంటుంది.. అంటే ఇది అత్యంత ఎత్తులో ఉండటంతోపాటు ల్యాండ్మాస్ పెద్దఎత్తున ఉంటుందని పెన్సిల్వేనియాలోని మిల్లెర్స్విల్లే యూనివర్సిటీ ప్రొఫెసర్ అలెక్స్ డికారియా చెప్పారు. సాధారణంగా మహాసముద్రాల్లో కంటే కూడా భూమి త్వరగా వేడెక్కుతుంది..అంతే వేగంగా చల్లగా మారిపోతుంది. అందుకే భూ ఉపరితలం మీద ఉష్ణోగ్రతలు అత్యంత ఎక్కువగా, తక్కువగా నమోదవుతుంటాయి. అదే సైబీరియా విషయానికొస్తే.. మంచు కీలక పాత్ర పోషిస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే వేడిని ఈ మంచు అంతరిక్షంలోకి వెనక్కి పంపుతుంది. అందువల్ల సైబీరియాలో అత్యంత చల్లగా ఉంటుందని చెబుతారు. సాధారణంగా ఎక్కువ ఎత్తులో ఉండే ప్రాంతంలో పీడనం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అక్కడ గాలి స్థిరంగా ఉంటుంది. దీనికితోడు తక్కువ తేమ శాతం ఉండటంతోపాటు ఆకాశం కూడా నిర్మలంగా ఉంటుంది. దీంతో భూఉపరితలం చాలా చల్లగా ఉంటుందని అంటారు అలెక్స్ డికారియా. తక్కువ తేమశాతం, నిర్మలమైన ఆకాశం వల్ల భూమి నుంచి వచ్చే రేడియేషన్ వాతావరణంలో పైభాగానికి చేరి తద్వారా అంతరిక్షంలోకి వెళ్తుంది. దీని ఫలితంగా భూఉపరితలం చల్లగా ఉంటుంది. సైబీరియా చాలా సురక్షితమైన ప్రాంతమని చెబుతారు స్థానికులు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఉగ్రవాద దాడులు ఉండవు. విపత్తులు కూడా ఉండవు. దీనికితోడు వాతావరణ కాలుష్యం బెడద అసలే ఉండదు. -
బంకర్లలోకి పుతిన్ కుటుంబం?!
మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం ముదిరి అణుయుద్ధంగా మారుతుందన్న భయం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లో ఉందని రష్యాకు చెందిన రాజకీయ శాస్త్ర అధ్యాపకుడు ప్రొఫెసర్ వాలెరీ సోలేవే అభిప్రాయపడ్డారు. అందుకే పుతిన్ తన కుటుంబ సభ్యులను సైబీరియాలోని భూగర్భ నగరానికి రహస్యంగా పంపించారని చెప్పారు. ఆల్టై పర్వతాల వద్ద ఉన్న ఈ నగరంలో న్యూక్లియర్ బంకర్లున్నాయన్నారు. పుతిన్ మానసిక, శారీరక రుగ్మతలతో బాధపడుతున్నారని ఆయన ఆరోపించారు. గతంలో సైతం పుతిన్‌పై వాలెరీ పలు అభియోగాలు చేశారు. వీటికిగాను ఆయన్ను పోలీసులు పలుమార్లు విచారించారు. ఆయన ఇంటిని సోదా చేసి పలు ఎలక్ట్రానిక్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికీ వాలెరీపై కేసు నడుస్తూనే ఉంది. మాస్కో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంస్థలో వాలెరీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. పుతిన్ అనారోగ్యాలను ప్రజలనుంచి దాస్తున్నారని ఆయన పలుమార్లు విమర్శించారు. అంతేకాకుండా రక్షణ మంత్రి సెర్గే షోగుతో కలిసి పుతిన్ క్షుద్రపూజలు కూడా చేశారన్నారు. అయితే వాలెరీ అంచనాలను, అభిప్రాయాలను పలువురు కట్టుకథలుగా కొట్టిపారేస్తున్నారు. (చదవండి: రష్యాపై ఆంక్షలు.. అమెరికాకు గట్టి షాక్!.. తప్పుబట్టిన అమెరికన్ దేశం) -
రష్యాలో విమానం అదృశ్యం.. ప్రయాణికులంతా సేఫ్
మాస్కో/టాంస్క్: రష్యాను వరుస విమాన ప్రమాదాలు వెంటాడుతున్నాయి. జూలై 6న 28 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం రాడార్ నుంచి అదృశ్యమై ఆ తర్వాత కూలిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం ఇలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది. సుమారు 13 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న విమానం అదృశ్యమయింది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం గాలింపు చర్యలు మొదలు పెట్టింది. గంటల వ్యవధిలోనే విమానం ఆచుకీ గుర్తించింది. ప్రయాణికులందరిని కాపాడింది. ఆ వివరాలు.. సైబీరియాలో ప్రాంతీయ విమానాలను నడిపే చిన్న విమానయాన సంస్థ సిలాకు చెందిన ఓ విమానం శుక్రవారం కేడ్రోవి పట్టణం నుంచి టాంస్క్ నగరానికి వెళ్తుండగా తప్పిపోయింది. విమానంలో 19 మంది ప్రయాణికులున్నారు. విమానం అదృశ్యం గురించి తెలియగానే అధికారులు హెలికాప్టర్లను రంగంలోకి దించి.. గాలింపు చర్యలు మొదలుపెట్టారు. గంటల వ్యవధిలోనే రెస్క్యూ హెలికాప్టర్లు విమానం ఆచూకీ కనిపెట్టాయి. ప్రమాద స్థలానికి చేరుకుని దానిలో ఉన్న ప్రయాణికులందరని సురక్షితంగా తీసుకువచ్చాయి. పది రోజులజ క్రితం రష్యాలోని పెట్రోపావ్‌లోవిస్క్– కామ్‌చట్‌స్కై నగరం నుంచి పలానా నగరానికి 28 మందితో బయలుదేరిన విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. ల్యాండింగ్‌కు కొంత సమయం ముందు రాడార్ నుంచి విమానం అదృశ్యమైంది. విమానంతో కమ్యూనికేషన్ ఆగిపోయింది. అనంతరం విమానానికి సంబంధించిన శకలాన్ని ఒకోట్స్ సముద్ర తీరప్రాంతంలో కనుగొన్నారు. విమానంలోని వారెవరూ బతికి ఉండకపోవచ్చని రష్యా మీడియా పేర్కొంది. విమానం సముద్రంలోని రాతిబండలను గుద్దుకొని ఉండొచ్చని ప్రాథమిక అంచనా వేశారు. -
24 వేల ఏళ్ల తర్వాత బతికొచ్చాయి!
మాస్కో: అవును నిజమే ఆ జీవులు 24 వేల సంవత్సరాల తర్వాత బతికాయి.. డెల్లాయిడ్ రోటిఫెర్స్ అనే సూక్ష్మజీవులు అప్పట్లో రష్యాలోని సైబీరియా ప్రాంతంలో మంచు అడుగు భాగాల్లో సుప్తావస్త స్థితిలోకి జారుకున్నాయి. తాజాగా ఆ సూక్ష్మ జీవులు నిద్ర నుంచి మేలుకున్నాయి. 24 వేల ఏళ్ల తర్వాత సంతానం కూడా ఉత్పత్తి చేశాయి. రోటిఫెర్స్ మంచి నీటిలో జీవించే సూక్ష్మజీవులు. గడ్డ కట్టే స్థితి (ఘనీభవ స్థితి)లో దాదాపు పదేళ్లు జీవించి ఉంటాయని ఇప్పటికే పరిశోధకులు గుర్తించారు. అయితే వీటి గురించి మరింత లోతుగా తెలుసుకునేందుకు రష్యాలోని సాయిల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్లోని సాయిల్ క్రయాలజీ లేబొరేటరీ పరిశోధకులు ముందడుగు వేశారు. ఈశాన్య సైబీరియాలోని అలజేయా నదికి సమీపంలో మంచు నమూనాలను తీసుకుని పరిశోధనలు చేశారు. ఈ మంచు అవక్షేపాల్లో డజన్ల కొద్దీ రోటిఫెర్స్ను వారు గుర్తించారు. ఈ సూక్ష్మ జీవులను లేబొరేటరీకి తీసుకొచ్చి వాటికి ప్రాణం పోశారు. వాటిలో కొన్ని జీవులు ‘పార్థో జెనెసిస్’అనే అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా వాటి సంతానానికి జన్మనిచ్చాయి. రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతి, అవక్షేపాలు ఉన్న లోతును బట్టి ఇవి దాదాపు 24 వేల ఏళ్ల కిందటివిగా కనుగొన్నారు. ఆ సమయంలో సైబీరియాలోని మామ్మత్ జాతి ఏనుగులు సంచరిస్తూ ఉండేవని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త మాలావిన్ వివరించారు. చదవండి: మరో 80 ఏళ్లలో మాల్దీవులు మాయం..! -
యువతులకు ఘోరమైన అనుభవం
రష్యాలోని సైబీరియన్ నగరం క్రస్నోయార్స్క్లో లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించి రోడ్డెక్కినందుకు ఇద్దరు యువతులకు ఘోరమైన అనుభవం ఎదురయింది. సరైన కారణం లేకుండా ఇంటి నుంచి ఎవరు బయటకు రాకూడదనే లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించి 17, 18 ఏళ్ల వయస్సుగల ఆ ఇద్దరు అమ్మాయిలు ఓ రోజు రాత్రి పూట వాకింగ్‌కు వెళ్లారు. వారిలో ఒకరు లైంగిక దాడులకు గురికాగా, ఒకరు అత్యాచారానికి గురయ్యారు. వారి ఫోన్లు, నగలను ఎత్తుకు పోయారు. ఏప్రిల్ 20వ తేదీన జరిగిన ఈ సంఘటనను పక్కన పెడిగే ఆ యువతులకు ఇప్పుడు లాక్డౌన్ ఉత్తర్వులు ఉల్లంఘించినందుకు 33 పౌండ్ల (దాదాపు మూడు వేల రూపాయలు) చొప్పున జరిమానా విధించారు. (విమానం ఎక్కిందని ఆశ్చర్యపోతున్నారా..) ఈ విషయాన్ని క్రస్నోయార్స్క్ నగర అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మీడియా హెడ్ ఎకతెరీనా రోసిత్స్కాయ బుధవారం ధ్రువీకరించారు. ఆ రోజున ఓ యువతిపై అత్యాచారం చేసే ప్రయత్నంలో లైంగిక దాడి జరగ్గా, మరో యువతి లైంగిక దాడికి గురిందని, ఆ యువతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ 55 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఏకతెరీనా తెలిపారు. అతడి వద్దనే యువతుల నగలు, సెల్ఫోన్లు దొరకడంతో రేప్, లైంగిక దాడి కేసుల్లో నిందితుడిని విచారిస్తున్నామని చెప్పారు. బాధితులకు జరిమానా విధించడం ఎంత మేరకు సమంజసమని ప్రశ్నించగా, కేసునుబట్టి అన్ని కేసులకు శిక్షలుంటాయని ఏకతెరీనా చెప్పారు. (లాక్డౌన్: తక్కువ తింటున్నారు) -
గడ్డకట్టే చలిలో స్నానమంటే...
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో మానవులు నివసించే అత్యంత శీతల ప్రాంతం రష్యాకు సమీపంలోని సైబీరియా. అక్కడి ఉష్ణాగ్రతల గురించి తెలుసుకుంటేనే మనకు నిలువెల్లా వణకు పుట్టాల్సిందే! శీతల కాలంలో మైనస్ డిగ్రీలకు పడిపోయే అతి శీతల ప్రాంతాల్లో మానవులు ఆ కొద్దికాలం చలిని తట్టుకోవాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అదే ఎప్పుడూ మైనస్ డిగ్రీల సెల్సియెస్ అంటే, మైనస్ ఐదు నుంచి మైనస్ 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే సైబీరియా ప్రాంతంలో నివసించాలంటే నిత్య పోరాటమే. కానీ అది అక్కడి స్థానికులకు అంతగా వర్తించదు. అతిశీతలంగా ఉండే సైబీరియాలోని యకుటియా ప్రాంతంలో నివసిస్తున్నవారు అక్కడి వాతావరణానికి పూర్తిగా అలవాటు పడిపోయారు. అక్కడ వేడి నీళ్లలో చొక్కా, పైజామా ఉతికి ఆరేసే లోపే అవి గడ్డకట్టుకుపోయి మంచు విగ్రహాల్లా తయారవుతాయి. వేడి నీళ్లలోనూ ఆకాశంలోకి కుమ్మరిస్తే ఆకాశంలోనే గడ్డ కట్టుకుపోయి మంచులా కురుస్తుంది. వేడి వేడి న్యూడిల్స్ దింతామన్న లోపే అది గాలిలోనే గడ్డకుపోతాయి, కొన్ని వేడి వేడి తిను పదార్థాలైతే నోటిలోకి పోగానే గొంతులో గడ్డకట్టుకు పోతాయట. గత వారం ఓ పర్యాటక బృందం అక్కడికి వెళ్లినప్పుడు అక్కడ నిజంగా మైనస్ 59 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది. అంతటి శీతల మంచు ప్రాంతంలో ఓ స్కూల్ టీచర్ గలైనా డావిడోవా, బట్టలుతికితే అవి ఎలా క్షణాల్లో గడ్డకట్టుకుపోతాయో చూపించారు. గ్లాసులో పోసిన వేడి వేడి నీళ్లు క్షణాల్లో ఎలా మంచుగా మారుతాయో చూపారు. అన్నింటికంటే దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే సమీపంలోని చురాప్చా కుగ్రామంలో మంచుతో కూడిన నీటి గుంటలో దాదాపు 80 ఏళ్ల వృద్ధుడు స్నానం చేయడం. అలాంటి నీళ్లలో స్నానం చేస్తే తప్పా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించదని ఆ వృద్ధుడు తెలిపారు. సైబీరియాలో కుగ్రామాలే కాదు, పెద్ద పెద్ద నగరాలు కూడా ఉన్నాయి. శీతాకాలంలో మాస్కో నగరంలో మంచు కురిసినట్లు అక్కడి గ్రామల్లో, నగరాల్లో ఎప్పుడూ మంచు కురుస్తూనే ఉంటోంది. మంచు నీటిలో, మంచులో దొరికే చేపలు అక్కడి ప్రజలకు ప్రధాన ఆహారం. చలిని తట్టుకునేందుకు వారు చలి కోట్లు, చలి ప్యాంట్లు, చలి టోపీలు ధరిస్తారు. -
సైబీరియాలో ‘మండుతున్న’ సముద్రం
-
సైబీరియాలో ‘మండుతున్న’ సముద్రం
-
సైబీరియాలో ‘మండుతున్న’ సముద్రం
సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు సైబీరియా సముద్రం వేడితో ఉడుకుతోందని, సముద్రం ఉపరితలంపై బుడగలు వస్తున్నాయని స్థానిక ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ సహకారంతో ఆ సముద్రంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు 80 శాస్త్రవేత్తల బృందం అక్కడికి వెళ్లింది. సముద్రం అట్టడుగు నుంచి విడుదలవుతున్న మితిమీరిన మిథేన్ గ్యాస్ సముద్రం ఉపరితలంపై బుడగలుగా పేరుకుంటోందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. మంచుతో కప్పబడిన ప్రాంతంలో కూడా తవ్వితో మిథేన్ గ్యాస్ వెలువడుతోంది. అంతటి మంచులోనూ మిథేన్ గ్యాస్ తగులబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో ఉన్న సరాసరి మిథేన్ గ్యాస్‌కన్నా సైబీరియాలో ఆరేడింతలు ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్న శాస్త్రవేత్తలు దిగ్భ్రాంతికి గురైనట్లు ‘న్యూస్‌వీక్ రిపోర్ట్’ వెల్లడించింది. ‘ఇదొక మిథేన్ గ్యాస్ ఫౌంటేన్. ఇంతటి ఈ గ్యాస్ నా జీవితంలో నేను ఎక్కడా చూడలేదు’ అని శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహిస్తున్న ‘టామ్స్క్ పాలిటెక్నిక్ యూనివర్శిటీ’ ప్రొఫెసర్ ఇగార్ సెమిలేటర్ వ్యాఖ్యానించారు. మిథేన్ గ్యాస్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ ప్రాంతం వాతావరణం వేడిగా ఉంది. సముద్రం ఉపరితలంపై పేరుకున్న మిథేన్ బుడగలు నిప్పు తగిలితే మండుతాయని లేదా వాటంతట అవే పేలిపోతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మిథేన్ గ్యాస్ 20 శాతం పెరగడం వల్ల ప్రపంచ వాతావరణంలో ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ పెరుగుతుందట. కార్బన్ డై ఆక్సైడ్ కంటే మిథేన్ గ్యాస్ వల్ల వాతావరణం 23 శాతం ఎక్కువ వేడెక్కుతుందట. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరగడానికి మనషులు ఎలా కారణం అవుతున్నారో, ఈ మిథేన్ గ్యాస్ పెరగడానికి కూడా వారే కారణం అవుతున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చమురు కోసం జరుపుతున్న తవ్వకాల వల్ల మిథేన్ ఎక్కువగా వాతావరణంలోకి విడుదలవుతోందని వారు తెలిపారు. ప్రపంచ భూవాతావరణంలో మిథేన్ గ్యాస్ నిల్వలు ఇంతకుముందు శాస్త్రవేత్తలు అంచనావేసిన దానికన్నా 25 శాతం ఎక్కువగా ఉంటుందని సైబీరియా సముద్ర తలాన్ని అధ్యయనం చేసిన అనంతరం శాస్త్రవేత్తలు చెప్పారు. -
సూరీడు ఆన్ సిక్ లీవ్..
కోడి నోరు ఎవరో కట్టేసినట్లు.. సూర్యుడేదో సిక్ లీవ్ పెట్టినట్లు.. గత శుక్రవారం సైబీరియాలోని వెర్కోయాన్స్లో తెలవారనే లేదు.. ఉదయం 8 అవుతున్నా.. చిమ్మచీకటి ఆకాశంలో కుర్చీ వేసుకుని కూర్చుంది.. తొలుత బిత్తరపోయినా.. తర్వాత అక్కడి జనం నెమ్మదిగా సర్దుకున్నారట.. ఎందుకంటే.. గతేడాది జూలైలో కూడా ఇలాగే అయిందట. తర్వాత పరిస్థితి మారినప్పటికీ.. ఇలా ఎందుకు జరిగిందన్న దానిపై అధికారికంగా ఎలాంటి వివరణ వెలువడలేదు. కాకపోతే.. సైబీరియాలో కొన్ని చోట్ల అడవులు తగలబడటం వల్ల వాతావరణంలో కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువగా వెలువడిందని.. దీని వల్ల దట్టమైన మేఘాలు ఏర్పడి.. అవి సూర్యుడిని కప్పేసి ఉంటాయని వాతావరణ నిపుణులు చెప్పారు. అయితే, ఆ రోజున వాతావరణంలో పరిమితికి మించి కార్బన్ మోనాక్సైడ్ శాతం ఉన్నప్పటికీ.. అది మరీ ఇలా సూర్యుడిని ముంచేసేంత స్థాయి కాదని తాజాగా తేలింది. ఇంతకీ ఎలా జరిగిందంటారు?? -
40 వేల ఏళ్లనాటి ఓ రాకాసి తల..
సైబీరియా : 40 వేల ఏళ్ల నాటి ఓ రాకాసి తోడేలు తలను శాస్త్రవేత్తలు గుర్తించారు. మెదడుతో సహా రాకాసి తోడేలు తలలోని ఇతర భాగాలు పెద్దగా పాడవకుండా ఉండటం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ రాకాసి తోడేలు తల పరిమాణము ప్రస్తుత మున్న తోడేళ్ల తల కంటే పెద్దదిగా ఉంది. మామూలు తోడేళ్ల తల 9 అంగుళాలు ఉంటే ఈ రాకాసి తల దాదాపు 16 అంగుళాల పొడువు ఉంది. సైబీరియాలోని యాకుటియాల అనే ప్రాంతంలో దీని కనుగొన్నారు. రష్యన్ శాస్త్రవేత్త డాక్టర్ అల్బర్ట్ ప్రోటోపోపోవ్ మాట్లాడుతూ.. ‘’ఇదో ప్రత్యేకమైన ఆవిష్కరణ. పూర్తి స్థాయి కణజాలంతో ఓ జంతువు తలను కనుగొనటం ఇదే మొదటిసార’’ని అన్నారు. టోక్యోకు చెందిన జికియే యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ప్రొఫెసర్ నావోకీ సుజుకి మాట్లాడుతూ.. ఆ రాకాసి తోడేలు తలలోని కండరాళ్లు, వివిధ భాగాలు, మెదడు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న తోడేళ్ల జాతితో, సింహాలతో రాకాసి తోడేళ్లను పోల్చిచూసి వాటి శక్తి సామర్థ్యాలను బేరీజువేస్తామ’’ని చెప్పారు. -
రష్యాలో అగ్ని ప్రమాదం.. 37 మంది మృతి
రష్యా : సైబీరియా రాష్ట్రం కెమెరోవో పారిశ్రామిక నగరంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ షాపింగ్ మాల్లో జరిగిన ప్రమాదంలో 37 మంది మృతిచెందారు. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరో 70 మంది ఆచూకీ గల్లంతైంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కొంతమంది అగ్నిప్రమాదం జరిగిన షాపింగ్ మాల్ కిటీకీల నుంచి దూకడంతో చనిపోయినట్లు తెలిసింది. ఈ నగరం రాజధాని మాస్కోకు 3600 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రమాదానికి గల ప్రాథమిక కారణాలు అధికారులు ఇంకా వెల్లడించలేదు. -
మోడల్‌పై రేప్ అటెంప్ట్.. ఊహించని మలుపు
దుబాయ్ : ఆమె ఓ పేరుగాంచిన మోడల్. ఓ కాంట్రాక్ట్ పని నిమిత్తం దుబాయ్ వెళ్లి ఓ హోటల్లో బస చేసింది. అయితే అదే హోటల్లో దిగిన ఓ వ్యాపారవేత్త ఆమెపై అఘాయిత్యం చేయబోయాడు. అతన్ని నుంచి తప్పించుకునేందుకు ఆరో అంతస్థు నుంచి దూకేసింది. వెన్నెముకకు గాయం కాగా ప్రాణాలతో ఆమె బయటపడింది. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పోలీసులు అరెస్ట్ చేయటం ఇక్కడ విశేషం. భాదితురాలి కథనం ప్రకారం... సైబీరియాకు చెందిన 22 ఏళ్ల ఎక్టెరీనా.. ఓ కాస్మోటిక్ సంస్థతో కాంట్రాక్ట్ పని కోసం దుబాయ్‌కు వెళ్లింది. అక్కడ ఓ పాకిస్థానీ వ్యాపారవేత్త(39) ఒప్పందం కోసం హోటల్ గదికి ఆమెను ఆహ్వానించాడు. ఆమె వెళ్లే సరికి అతను ఫుల్‌గా తాగేసి ఉన్నాడు. ఆ మత్తులో ఆమెపై అత్యాచారయత్నం చేయబోయాడు. ఆమె ప్రతిఘటించటంతో ఓ కత్తితో ఆమెను బెదిరించి బట్టలిప్పాలని బెదిరించాడు. ప్రాణ భయంతో అతను చెప్పినట్లుగా ఆమె చేసింది. ఆపై అతని నుంచే తప్పించుకునేందుకు నగ్నంగానే హోటల్ బిల్డింగ్ నుంచి దూకేసింది. ఘటన తర్వాత పారిపోయేందుకు యత్నించిన వ్యాపారవేత్తను ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్టెరీనా వెన్నెముకకు తీవ్ర గాయాలు కావటంతో వైద్యులు రెండు సర్జరీలను చేశారు. బాధితురాలి అరెస్ట్... అయితే ఆమె తనను కత్తితో చంపే యత్నం చేసిందని నిందితుడు ఫిర్యాదు చేశాడు. బాధితురాలు చెబుతున్నట్లు అత్యాచారం ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. పైగా అతని ఒంటిపై కత్తి గాయాలు ఉన్నాయి. దీంతో మోడల్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమెను అరెస్ట్ చేశారు. ఆస్పత్రి నుంచి నేరుగా ఆమెను జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. దీనికితోడు ఆమె మోడలింగ్‌తోపాటు వ్యభిచారం కూడా నిర్వహిస్తోందని.. అందుకే దుబాయ్ వచ్చిందని సదరు వ్యాపారవేత్త ఆరోపిస్తున్నాడు. మరోవైపు ఎక్టెరీనా తల్లి మాత్రం వాటిని ఖండిస్తోంది. దుబాయ్‌లోని రష్యన్ కాన్సులేట్ ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టింది. -
మార్జాలరాజ్యం.. కోశ్లాండియా!
అది పశ్చిమ సైబీరియాలోని ఓ చిన్న గ్రామం. పేరు ప్రిగోరోడ్ని. రెండేళ్ల కిందటివరకు ఏ గుర్తింపూలేని గ్రామం అది. అయితే ఆ గ్రామాన్ని ప్రపంచానికి పిల్లులు పరిచయంచేశాయి. ఎందుకంటే అక్కడిపిల్లుల సంఖ్య ఎంతో తెలుసా.. పదిలక్షల పైమాటే. సంఖ్యలోనే కాదు.. అందంలోనూ ఏమీ తీసిపోనట్లు ఉంటాయి అవి. ప్రిగోరోడ్ని గ్రామాన్ని ‘కోశ్లాండియా’అని పిలుస్తారు. దీనికిపిల్లుల స్వర్గధామం అనిఅర్థం. ఈ గ్రామం ఇంత ఫేమస్ కావడానికి.. పిల్లుల ఊరు కావడానికి కారణం లెబిడివా అనే 59 ఏళ్ల మహిళ.. ఆమె భర్త సెర్గెయ్. 2003లో ఇంట్లో పెంచుకునేందుకు వారు ఓ పిల్లిని తెచ్చుకున్నారు. ఫిలైన్ జాతికి చెందిన ఈ పిల్లికి బబుష్కా అని ముద్దు పేరు పెట్టుకున్నారు. ఓ ఏడాది తర్వాత ఈ పిల్లి ఐదు బుజ్జి పిల్లులకు జన్మనిచ్చింది. ప్రస్తుతం అక్కడ దాదాపు 10 లక్షల పిల్లులు ఉండొచ్చని లెబిడివా చెబుతున్నారు. రెండేళ్ల కింద వీటి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఊరు ప్రపంచానికి తెలిసింది. ఇంకేముంది ఈ పిల్లులు.. అవి ఉన్న ఆ ఊరు నెట్లో హల్చల్ చేస్తూ నెటిజన్ల మనసు దోచుకుంటున్నాయి. -
ఆకాశంలో అద్భుతం : ఏలియన్స్ అని భయాందోళన
సైబీరియా, రష్యా : అర్ధరాత్రి కావొస్తోంది. ఒక్కసారిగా ఆకాశంలో భారీ వెలుగు. ఏం జరుగుతుందో ఉత్తర సైబీరియా ప్రజలకు అర్థం కాలేదు. గుండ్రటి ఆకారంలో ఆకాశం నుంచి పెద్ద వెలుగు ఏర్పడటాన్ని అందరూ గుర్తించారు. ఆ దృశ్యాలను ఫోన్లలో బంధించారు. ఏలియన్లు రష్యాలో దిగుతున్నాయంటూ సోషల్‌మీడియాలో కొందరు పోస్టులు చేశారు. దీంతో కొందరు సైబీరియన్లు భయంతో వణికిపోయారు. ఈలోగా ఆకాశంలో వచ్చిన వెలుగు మిలటరీ చేసిన రాకెట్ ప్రయోగం వల్ల ఏర్పడి ఉండొచ్చిన లేదా ఉత్తర ధ్రువం నుంచి వచ్చే వెలుగు కావొచ్చని, ప్రజలు భయాందోళనలకు గురికావొద్దంటూ రష్యన్ కథనాలను ప్రసారం చేయడంతో వారందరూ ఊపరిపీల్చుకున్నారు. నాలుగు రాకెట్లను ఒకేసారి ప్రయోగించడంతో వాటి ఇంధన ప్రభావం వల్ల ఆకాశం మిరుమిట్లు గొలుపుతూ దర్శనం ఇచ్చినట్లు చెబుతున్నారు. 2009లో నార్వే కూడా అర్థరాత్రి ప్రయోగాలు నిర్వహించడంతో ఆ ప్రదేశంలోని ఆకాశం మిరుమిట్లు గొలుపుతూ కనిపించింది. -
శ్వాస సిగరెట్ పొగలా వచ్చేదట..!
సాక్షి, వెబ్ డెస్క్ : చలి చలిగా అల్లింది.. గిలి గిలిగా గిల్లింది... జనవరి మాసం అరె మంచు కురిసే సమయం... ఇలా చలి గురించి మనకు ఎన్నో పాటలున్నాయి. పాటలు పాడుకుంటే బాగానే ఉంటుంది. కానీ, నిజంగా అంతటి చలిలో ఉంటే ఎలా ఉంటుంది?. రష్యాలోని ఓమియాకాన్ భూమ్మీద అత్యంత శీతల ప్రాంతం. అత్యంత శీతలంగా ఉండే ఈ ప్రాంతంలో వేడి నీటి కుంటలు ఉన్నాయి. ఓమియాకాన్ అంటే ‘గడ్డ కట్టని నీరు’ అని అర్థం. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన వేడి నీటి కుంటల కారణంగానే ఓమియాకాన్ అభివృద్ధిపై రష్యాను దృష్టి సారించేలా చేసింది. రెయిన్ డీర్లకు నీటిని అందించేందుకు ఓమియాకాన్‌లో నివాసం ఉండే 50 మంది కుంటలను వినియోగిస్తుంటారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇక్కడి ఉష్ణోగ్రతలు దాదాపు -50 డిగ్రీలకు పడిపోతాయి. ఆ సమయంలో వెచ్చదనం కోసం కర్ర, బొగ్గులను మండించి చలి కాచుకుంటారు ఓమియాకాన్ వాసులు. సముద్రమట్టానికి 750 మీటర్ల ఎత్తులో ఉన్న ఓమియాకాన్‌లో డిసెంబర్ నెల నుంచి వేసవి వరకూ పగటి పూట సమయాల్లో విపరీతమైన మార్పులు ఉంటాయి. ఒక్కోరోజు కేవలం మూడు గంటలు మాత్రమే పగటి సమయం ఉంటుంది. ఒక్కోసారి పగటి సమయం అత్యధికంగా 21 గంటలు వరకూ ఉంటుంది. ఓమియాకాన్‌లో కేవలం ఒకే ఒక దుకాణం, పాఠశాల ఉన్నాయి. -52 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటే వాటిని మూసేస్తారు. అలాంటి ప్రదేశంలో అడ్వెంచర్ ఫోటోగ్రాఫర్ అమోస్ చాపెల్ అక్కడి వాతావరణాన్ని, పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఐదు వారాల పాటు ఓమియాకాన్‌లో పర్యటించిన చాపెల్ చలి తన కాళ్లను పట్టుకున్నట్లు, నోట్లోని లాలాజలం గడ్డ కట్టి, పెదవులని గుచ్చుతున్నట్లు అనిపించిందని చెప్పారు. శ్వాస తీసుకుని వదులుతుంటే అది పొగలా కనిపించేదని తెలిపారు. ఫొటోలను తీసే సమయంలో శ్వాసను బిగబట్టినట్లు చెప్పారు. ఓమియాకాన్ వాసులు నీటిలోకి వెళ్లడానికి భయపడతారని తెలిపారు. అలాంటిది చైనా యాత్రికులు అక్కడి నీటిలో ఈత కొట్టడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అనస్థేసియా అనే అమ్మాయి స్నేహితులతో కలసి ఓమియాకాన్ను సందర్శించిన సమయంలో దిగిన ఫొటో ఇప్పుడు సోషల్‌మీడియా వైరల్‌గా మారింది. అనస్థేసియా సోషల్‌మీడియాలో పోస్టు చేసిన ఫొటోల్లో వారి కనుబొమ్మలు కూడా మంచు తీవ్రతకు గడ్డకట్టుకుపోయాయి. -
32 వేల ఏళ్ల క్రితం చనిపోతే.. బతికించారు
మరణించిన వారికి తిరిగి ప్రాణాలు పోసే పరిశోధనలు ప్రపంచలోనే కొద్ది చోట్ల జరుగుతున్నాయి. మన దేశంలో గతేడాది ఓ రాష్ట్ర ప్రభుత్వం ఆయుర్వేద గ్రంధాల్లో చెప్పిన సంజీవనిని కనుగొనడానికి కొంత మొత్తంలో నిధులను కూడా కేటాయించింది. చాలా ఏళ్ల క్రితం చనిపోయి ఇంకా మిగిలి ఉన్న జీవుల డీఎన్ఏ కణాలతో ప్రాణం ఉన్న జన్యువులను కలిపి బతికించే ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిశోధనలే నిర్వహిస్తున్న రష్యా ఆ దిశగా ముందడుగు వేసింది. దాదాపు 32 వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ఓ మొక్కను తిరిగి భూమి మీద మొలకెత్తేలా చేసింది. దాని పేరు సైలిన్ స్టెలోఫిల్లా. సైబీరియాలోని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెల్ బయోఫిజిక్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనల కోసం కోలైమా నది పరివాహక ప్రాంతంలో చనిపోయిన జీవుల జన్యువుల కోసం అన్వేషిస్తున్నారు. ఈ సమయంలో నదికి దగ్గరలోని ఓ ప్రాంతంలో పరిశోధకుడికి మంచు దిబ్బల కింద ఓ ఉడుత తన ఆహారం కోసం దాచుకున్న చిన్న గింజ తారస పడింది. గింజతో టెస్ట్ ల్యాబ్‌కు చేరుకున్న పరిశోధకులు అది 32 వేల సంవత్సరాల క్రితం జీవించిన సైలిన్ స్టెలోఫిల్లా అనే గడ్డి మొక్కకు చెందిన గింజగా గుర్తించారు. సైలిన్ స్టెలోఫిల్లా నేటి ప్రపంచంలో కూడా ఉంది. అయితే కాలాంతరంలో దాని జన్యువుల్లో భారీ మార్పులు జరిగాయి. దీంతో గింజను మొలకెత్తించి వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన మొక్కను తిరిగి మొలిపించాలని నిర్ణయించుకున్న పరిశోధకులు అందులో సఫలమయ్యారు. రష్యా శాస్త్రవేత్తలు సాధించిన విజయం మరణించిన జంతువుల జన్యువులను ప్రాణం ఉన్న డీఎన్ఏ జన్యువులతో కలిపి ఊపరిలూదే అవకాశం ఉందనే ఆశలను చిగురింపజేస్తోంది. -
గ్రామ సమీపంలో కుప్పకూలిన రష్యా విమానం
రష్యా: రష్యా విమానం ఒకటి కుప్పకూలిపోయింది. రక్షణ శాఖకు చెందిన 2-18 విమానం సైబీరియాలోని బులున్‌స్కీ జిల్లా యాకుతియాలో కూలిపోయినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలియజేశారు. ఈ విమానంలో మొత్తం 40మంది ప్రయాణీకులు ఉన్నారు. ‘ఈ ప్రమాదం జరిగినప్పటికీ ప్రయాణీకులు, విమాన సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు భావిస్తున్నాం. అయితే, 16మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలివద్దకు సహాయ చర్యలు చేపట్టేందుకు హెలికాప్టర్లు వెళ్లాయి. స్థానిక వైద్య బృందాలు కూడా ఇప్పటికే తరిలి వెళ్లాయి’ అని రష్యా రక్షణ శాఖ అధికారులు చెప్పారు. కోల్ట్ సోవో విమానాశ్రయం నుంచి బయలు దేరిన విమానం టిక్సీ అనే గ్రామానికి 16 కిలోమీటర్ల దూరంలో కూలిపోయిందని స్పుత్నిక్ న్యూస్ వెల్లడించింది. తొలుత 27 మంది చనిపోయి ఉంటారని వార్తలు వచ్చినా అనంతరం ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని రష్యా రక్షణ శాఖ స్పష్టం చేసింది. -
వేటగాడి చేతికి చిక్కి..
► ఎక్కడ నుంచో వలస వచ్చి ఇక్కడ ►ప్రాణాలు కోల్పోతున్న విదేశీ పక్షులు ► అతిథి విహంగాలకు కనీస రక్షణ ►కరువవుతున్న వైనం కాశీబుగ్గ : ఎంతో అపురూపంగా చూసుకోవాల్సిన విదేశీ విహంగాలు వేటగాళ్లకు బలైపోతున్నా రుు. అతిథి విహంగాల విషయంలో కొన్ని ప్రాంతాలు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటే పలాస-కాశీబుగ్గలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్ర దర్శిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అంతరకుడ్డ చెరువులో సైబీరియా దేశానికి చెం దిన విదేశీ పక్షులు (రత్తకన్న) వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారుు. విచక్షణారహితంగా వాటి ని చంపి సంచుల్లో వేసుకుని దర్జాగా వెళ్లిపోతున్నా అడిగే వారు లేకపోయారు. చెరువుల్లో పంటపొలాల్లో మాటువేసి దొరికిన గువ్వపిట్టను పాదంతో తొక్కిపట్టి చంపుతున్న వైన సా క్షి కెమేరాకు చిక్కింది. దీన్ని చూసిన స్థానికులు చింతాడ మాధవరావు, పైల చిట్టి, ప్రతాప్‌కుమార్‌లు పక్షిని పరిశీలించి వారిని మందలిం చారు. వారంతా దీన్ని రత్తకన్న పక్షిగా గుర్తిం చారు. అప్పటికే వేటగాళ్లు నాలుగు గువ్వపిట్టల పీక నులిపి చంపారు. టెక్కలి మండలం తేలి నీలాపురం ప్రసిద్ధ విదేశీపక్షులు కేంద్రం నుంచి ఆహారం కోసం సముద్ర తీరం గుండా కొన్ని వివిధ ప్రాంతాలకు వస్తుంటారుు. ఇప్పుడిప్పుడే పలాస, పూండి వంటి ప్రాంతాలకు చల్లని వాతావరణం కోసం వలస వస్తున్నారుు. ఈ పరిస్థితి గమనించిన వేటగాళ్లు వీటిని వేటాడి చంపేస్తున్నారు. వీరు పలాసలోనే నివాసముం టున్నట్లు సమాచారం. పూర్తిగా తుప్పు పట్టిన, గుర్తింపులేని ద్విచక్రవాహనాలను నడుపుతున్నారు. పక్షుల వేటనే వృత్తిగా జీవనం కొనసాగిస్తున్న ఈ కుటుంబాలు ప్రతి నెలరోజులకు ప్రాంతాలు మారుతుంటారు. ఇకనైనా అధికారులు స్పందించి పక్షులను కాపాడాలని, పక్షిజాతిని కాపాడాలని పలువురు కోరుకుంటున్నారు. -
హెలికాప్టర్ కూలి 19 మంది దుర్మరణం
-
హెలికాప్టర్ కూలి 21మంది దుర్మరణం
మాస్కో: రష్యాలో ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిన ఘటనలో 21మంది దుర్మరణం చెందారు. గాయపడిన మరో ముగ్గురిని ప్రాణాలతో రక్షించారు. క్రస్నోయార్క్ రీజియన్ నుంచి ఉరెంగోయ్ వెళుతున్న హెలికాప్టర్ సైబీరియా యమల్ ద్వీపకల్పంలో ల్యాండ్ అవుతుండగా శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా ఎంఐ-8 హెలికాప్టర్ ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే కారణమని సమాచారం. ప్రమాద స్థలి నుంచి రెండు బ్లాక్ బాక్సులను సహాయక సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. డేటా రికార్డర్, వాయిస్ రికార్డులకు సంబంధించి రెండు బ్లాక్ బాక్సులను స్వాధీనం చేసుకున్నామని, ప్రమాదానికి గురైనప్పుడు కారణాలను గుర్తించేందుకు వాటిని విశ్లేషించాల్సి ఉందని రష్యన్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ ఫెడరల్ ఏజెన్సీ అధికారి వెల్లడించారు. కాగా ప్రమాద సమయంలో హెలికాప్టర్లో 22మంది ప్రయాణికులు, ముగ్గురు విమానా సిబ్బంది ఉన్నారు. క్షతగాత్రుల్లో ఒకరు మొబైల్ ఫోన్ ద్వారా ఎమర్జెనీ విభాగానికి సమాచారం ఇవ్వడంతో స్థానిక సహాయ అధికారులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. -
రష్యా భారీ కార్చిచ్చు.. ఐదుగురి మృతి
మాస్కో: రష్యాలోని సైబీరియాలో కార్చిచ్చు తలెత్తి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. వందల మంది తమ నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. దక్షిణ సైబిరియాలో దాదాపు 560 మంది సెలవుదినం కావడంతో విడిది కోసం అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడ తాత్కళికంగా ఏర్పాటుచేసుకున్న నివాసాల్లో ఉన్నారు. అనుకోకుండా అక్కడ ఉన్న ఎండుగడ్డికి నిప్పు అంటుకోవడంతో అప్పటికే బలంగా వీస్తున్న గాలుల వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో ప్రాణనష్టం చోటుచేసుకుంది. 62 మందికి గాయాలవ్వగా.. 11మంది పరిస్థితి విషమంగా ఉంది. విమానాలు, హెలికాప్టర్లు, రైళ్ల ద్వారా మంటలను ఆర్పేందుకు దాదాపు 5,000 వేల మంది రంగంలోకి దిగారు. అయినప్పటికీ మంటలు అదుపులోకి తీసుకురావడం కష్టమై పోయింది. 16 గ్రామాలను మంటల బారిన పడకుండా రక్షించగా.. 42 గ్రామాల్లో 900 భవనాలు మంటల బారిన పడ్డాయి. భారీ స్థాయిలో ఆస్తి నష్టం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. -
సమస్యల ఆటపాక కేంద్రం
పర్యాటక కేంద్రం అభివృద్ధి శూన్యం చిత్తడిగా మారిన రహదారులు మూలనపడ్డ ఫెడల్బోట్లు రహదారిలో వీధిలైట్లు లేవు ఆటపాక (కైకలూరు) : జిల్లాలో ప్రసిద్ధి గాంచిన ఆటపాక పక్షుల విహార కేంద్రం సమస్యలతో కునారిల్లుతోంది. ఆస్ట్రేలియా, సైబీరియా వంటి విదేశాల నుంచి అరుదైన పెలికాన్ పక్షులు కొల్లోరు సరస్సుకు తరలివస్తుంటాయి. వాటిని చూసేందుకు సందర్శకులు ఉత్సాహంగా వస్తారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఉన్న పక్షుల విహార కేంద్రాల్లో ఆటపాకలో మాత్రమే బోటు షికారు చేస్తూ ఎక్కువ సంఖ్యలో పెలికాన్ పక్షులను తిలకించే అవకాశం ఉంది. పర్యావరణ అధ్యయన కేంద్రం (ఈఈసీ) వద్ద పక్షుల నమూనాలతో ఏర్పాటుచేసిన మ్యూజియం సందర్శకులను ఆకర్షిస్తోంది. జిల్లా నలుమూలల నుంచి, ఇతర జిల్లాల నుంచి కుటుంబ సభ్యులతో ప్రకృతి ఆస్వాదిద్దామని వచ్చే యాత్రికులు ఇక్కడి అసౌకర్యాలను చూసి అటవీ అధికారులు పనితీరును విమర్శిస్తున్నారు. మౌలిక సదుపాయాలు కరువు ఆటపాక పక్షుల కేంద్రంలో యాత్రికులకు కనీస సదుపాయాలు కరువయ్యాయి. ఆట పాక నుంచి ఈఈసీ కేంద్రానికి వెళ్లే మార్గం చిన్నపాటి వర్షంపడినా బురదకయ్యిగా మారుతోంది. వాహనచోదకులు అదుపుతప్పి జారి పడుతున్నారు. పర్యాటకులకు తాగునీటి సౌకర్యం లేదు. పక్షుల కేంద్రం టికెట్టు కౌంటర్ వద్ద ఏర్పాటుచేసిన ట్యాంకులో నీరు తాగేం దుకు వీలుగాలేదని సందర్శకులు పేర్కొంటున్నారు. ఈఈసీ కేంద్రం వద్ద కూడా తాగునీటి వసతి లేదు. పక్షుల కేంద్రం రహదారి వెంబడి ఒక్కటంటే ఒక్క వీధిలైటు లేదు. దీంతో సాయింత్రం వచ్చే యాత్రికులు చికటిపడితే భయపడుతున్నారు. ఇటీవల చికట్లో వెళ్తున్న ముగ్గురు యాత్రికులు ఓ పామును తొక్కారు. అది కాటువేయకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. యాత్రికులకు కొల్లేరు సరస్సు విశిష్టత, ఆశ్రయం పొందే పక్షుల విరాలు తెలిపేందుకు ఒక్క గైడూ లేడు. పర్యాటక కేంద్రం ప్రవేశానికి రూ.10, బోటు షికారుకు రూ.200 వసూలు చేస్తున్న అటవీ అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు. మూలన పడిన ఫెడల్ బోట్లు యాత్రికులను ఆకర్షించడానికి పట్టణాలకే పరిమితమైన ఫెడల్బోటు షికారును అటవీ అధికారులు ఆటపాక పక్షుల కేంద్రం వద్ద ఏర్పాటు చేశారు. కొద్ది నెలల క్రితం రెండు బోట్లు మరమ్మతులకు గురయ్యాయి. అయితే వాటికి మరమ్మతులు చేయించడంలేదు. ఆరు నెలల క్రితం ఈదురుగాలులకు ఈఈసీ కేంద్రం పైకప్పు రే కులు ఎగిరి సమీప చేపల చెరువుల వద్ద పడ్డాయి. ఆ రేకులను ఇప్పటి వరకూ తొలగించలేదు. మరోపక్క పక్షుల విహార చెరువు గట్లు కోతకు గురవుతున్నా సరిచేయడంలేదు. అటవీ అధికారులు స్పందించి మౌలిక వసతులు కల్పించడంతోపాటు, సమస్యలను పరిష్కరించాలని సందర్శకులు కోరుతున్నారు. అంచనాలు రూపొందించాం ఆటపాక పక్షుల విహార కేంద్రం రోడ్డు మరమ్మతులకు అంచనాలు రుపొందించామని అటవీశాక రేంజర్ సూర్యప్రకాశరావు చెప్పారు. ఈ కేంద్రం వద్ద పెలికాన్ పక్షుల అవాసాల కోసం కృత్రిమ ఇనుప స్టాండ్లను ఏర్పాటు చేశామన్నారు. రానున్న రోజుల్లో ఈ కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. -
భయానికి కేరాఫ్ ఈ బాత్రూమ్..
నిజంగానే మీరు భయపడాలంటే.. ఈ బాత్రూమ్లోకి వెళ్లాల్సిందే. సముద్రమట్టానికి 8,500 అడుగుల ఎత్తులో.. అదీ కొండంచున.. పడిపోతున్నట్లు ఉన్న ఈ మరుగుదొడ్డి సైబీరియాలోని కారాట్యూరెక్లో ఉన్న అల్టాయ్ పర్వతాల్లో ఉంది. ఒకేసారి ఇద్దరు ముగ్గురు దూరితే.. కూలిపోతుందేమో అన్నట్లు కనిపిస్తుంది. ఇంతకీ ఇలాంటి ప్లేసులో దీన్ని ఎవరి కోసం నిర్మించారనేదేగా మీ డౌట్.. ఇక్కడ ఓ వాతావరణ కేంద్రం ఉంది. అందులో కేవలం ఐదుగురు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ‘ప్రకృతి’ పిలిచినప్పుడల్లా వారు ఉపయోగించుకోవడానికే దీన్ని 1939లో నిర్మించారు. ఆ మధ్య బెలారస్‌కు చెందిన ఇంటర్‌ఫ్యాక్స్ న్యూస్ ఏజెన్సీ మరుగుదొడ్లపై నిర్వహించిన సర్వేలో.. భయం పుట్టించే బాత్రూమ్లలో ఇది మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఇంటర్‌ఫ్యాక్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ఇందులోకి పోవాలంటే ఎవరైనా వణకాల్సిందే.. రోజూ దీన్ని ఉపయోగిస్తూ పోతూ ఉంటే.. కొన్నాళ్లకు ఇదంటే మీకు భయం తగ్గొచ్చు’ అని వ్యాఖ్యానించారంటేనే.. దీని కెపాసిటీ ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు.