సైబీరియా : 40 వేల ఏళ్ల నాటి ఓ రాకాసి తోడేలు తలను శాస్త్రవేత్తలు గుర్తించారు. మెదడుతో సహా రాకాసి తోడేలు తలలోని ఇతర భాగాలు పెద్దగా పాడవకుండా ఉండటం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ రాకాసి తోడేలు తల పరిమాణము ప్రస్తుత మున్న తోడేళ్ల తల కంటే పెద్దదిగా ఉంది. మామూలు తోడేళ్ల తల 9 అంగుళాలు ఉంటే ఈ రాకాసి తల దాదాపు 16 అంగుళాల పొడువు ఉంది. సైబీరియాలోని యాకుటియాల అనే ప్రాంతంలో దీని కనుగొన్నారు. రష్యన్ శాస్త్రవేత్త డాక్టర్ అల్బర్ట్ ప్రోటోపోపోవ్ మాట్లాడుతూ.. ‘’ఇదో ప్రత్యేకమైన ఆవిష్కరణ. పూర్తి స్థాయి కణజాలంతో ఓ జంతువు తలను కనుగొనటం ఇదే మొదటిసార’’ని అన్నారు.
టోక్యోకు చెందిన జికియే యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ప్రొఫెసర్ నావోకీ సుజుకి మాట్లాడుతూ.. ఆ రాకాసి తోడేలు తలలోని కండరాళ్లు, వివిధ భాగాలు, మెదడు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న తోడేళ్ల జాతితో, సింహాలతో రాకాసి తోడేళ్లను పోల్చిచూసి వాటి శక్తి సామర్థ్యాలను బేరీజువేస్తామ’’ని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment