రష్యాలోని సైబీరియన్ నగరం క్రస్నోయార్స్క్‌లో లాక్‌డౌన్ ఆంక్షలను ఉల్లంఘించి రోడ్డెక్కినందుకు ఇద్దరు యువతులకు ఘోరమైన అనుభవం ఎదురయింది. సరైన కారణం లేకుండా ఇంటి నుంచి ఎవరు బయటకు రాకూడదనే లాక్‌డౌన్ ఆంక్షలను ఉల్లంఘించి 17, 18 ఏళ్ల వయస్సుగల ఆ ఇద్దరు అమ్మాయిలు ఓ రోజు రాత్రి పూట వాకింగ్‌కు వెళ్లారు. వారిలో ఒకరు లైంగిక దాడులకు గురికాగా, ఒకరు అత్యాచారానికి గురయ్యారు. వారి ఫోన్లు, నగలను ఎత్తుకు పోయారు. ఏప్రిల్ 20వ తేదీన జరిగిన ఈ సంఘటనను పక్కన పెడిగే ఆ యువతులకు ఇప్పుడు లాక్‌డౌన్ ఉత్తర్వులు ఉల్లంఘించినందుకు 33 పౌండ్ల (దాదాపు మూడు వేల రూపాయలు) చొప్పున జరిమానా విధించారు. (విమానం ఎక్కిందని ఆశ్చర్యపోతున్నారా..)
ఈ విషయాన్ని క్రస్నోయార్స్క్ నగర అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మీడియా హెడ్ ఎకతెరీనా రోసిత్స్‌కాయ బుధవారం ధ్రువీకరించారు. ఆ రోజున ఓ యువతిపై అత్యాచారం చేసే ప్రయత్నంలో లైంగిక దాడి జరగ్గా, మరో యువతి లైంగిక దాడికి గురిందని, ఆ యువతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ 55 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఏకతెరీనా తెలిపారు. అతడి వద్దనే యువతుల నగలు, సెల్‌ఫోన్లు దొరకడంతో రేప్, లైంగిక దాడి కేసుల్లో నిందితుడిని విచారిస్తున్నామని చెప్పారు. బాధితులకు జరిమానా విధించడం ఎంత మేరకు సమంజసమని ప్రశ్నించగా, కేసునుబట్టి అన్ని కేసులకు శిక్షలుంటాయని ఏకతెరీనా చెప్పారు. (లాక్డౌన్: తక్కువ తింటున్నారు)
Comments
Please login to add a commentAdd a comment