ఎప్పుడూ మంచుతో దట్టంగా కప్పబడి ఉండే సైబిరియాలో ఓ పురుగుని గుర్తించారు శాస్త్రవేత్తలు. దాన్ని తీసుకోస్తే ఎన్నో అద్భుతాలు వెలుగులోకి వచ్చాయి. శాస్త్రవేత్తలే విస్తుపోయాలే బతకడమే గాక పిల్లల్ని కంటోంది. నిజానికి కీస్తూ పూర్వం నాటి వాటిని గుర్తిస్తే అబ్బురపడతాం. అలాంటిది.. ఇది ఏకంగా వేల ఏళ్ల నాటిది. పైగా అంతటి మంచులో ఘనీభవించి ఉండి కూడా బతకడం నిజంగా ఆశ్చర్యమే కదా!.
వివరాల్లోకెళ్తే..సైబీరియన్ పెర్మాఫ్రాస్ట్ మంచు ప్రాంతంలో భూమి ఉపరితలానికి 40 మీటర్లు కింద మంచులో ఘనీభవించి ఉన్న ఓ పురుగుని గుర్తించారు శాస్త్రవేత్తలు. దీన్ని ల్యాబ్‌కి తీసుకొచ్చి పరిశోధనలు చేశారు డ్రెస్డన్‌లోని మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ సెల్ బయాలజీ అండ్ జెనిటిక్స్‌కి చెందిన ప్రోఫెసర్ ఎమెరిటస్. 'క్రిప్లోబయోసిస్' అనే నిద్రాణ స్థితిలో జీవించిందని తెలిపారు. ఇది అంతటి గడ్డకట్టే చలిలో చెడిపోకుండా అలానే ఉంది. నీరు, ఆక్సిజన్ లేకపోవడం, ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయిన స్థితిని కూడా తట్టుకుని బతికిందన్నారు. ఇది పురాతన రౌండ్‌వార్మ్(వానపాము) జాతికి చెందినదని తెలిపారు.
ఇది దారుణమైన వాతావరణ స్థితులను తట్టుకుని బతకగలవని చెప్పారు. ఆయా వాతావరణ స్థితుల్లో.. ఆ పురుగుల్లో జీవక్రియ రేట్లు గుర్తించలేని స్థాయిలో పడిపోతాయి. ఆ పురుగుపై ఉన్న నిక్షేపాల ఆధారంగా 46 వేల ఏళ్ల క్రితం నాటిదని లెక్కించారు శాస్త్రవేత్తలు. దానికి తాము ప్రాణం పోయడంతో జీవించడం ప్రారంభించడమే గాక పిల్లల్ని కంటోందని అన్నారు. ఇలానే ఐదేళ్ల క్రితం, రష్యాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికో కెమికల్ అండ్ బయోలాజికల్ ప్రాబ్లమ్స్ ఇన్ సాయిల్ సైన్స్ శాస్త్రవేత్తలు సైబీరియన్‌లో రెండు రౌండ్‌వార్మ్ జాతులను కనుగొన్నారు. తదుపరి విశ్లేషణ కోసం జర్మనీలోని ల్యాబ్‌లకు దాదాపు 100 పురుగులను తీసుకెళ్లారు. ఇన్‌స్టిట్యూట్‌లోని రెండు పురుగులను నీటితో రీహైడ్రేట్ చేయడం ద్వారా బతికించారు. వాళ్లు కూడా వాటిని..దాదాపు 45 వేల నుంచి 47 వేల ఏళ్ల నాటి పురుగులని వాటిపై ఉన్న నిక్షేపాల ఆధారంగా చెప్పుకొచ్చారు.
పురుగులపై జన్యు విశ్లేషణ చేశారు. దీంతో ఇవి అప్పటి జాతికి చెందినవని తేలింది. దీనిని పరిశోధకులు ‘పానాగ్రోలైమస్ కోలిమెనిస్’ అని పిలుస్తారు. క్రిప్టోబయోసిస్ అనే నిద్రాణ స్థితిలో ఉన్న ఈ పురుగులు మనుగడ సాగించడానికి ట్రెహలోస్ అనే చక్కెరను ఉత్పత్తి చేస్తాయి. అవి గడ్డకట్టినా.. నిర్జలీకరణాన్ని తట్టుకొని కొన్ని ఏళ్లు నిద్రాణ వ్యవస్థలో ఉండగలవని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ అంశం ఇప్పుడూ సైన్సు పరంగా ఓ అద్భుత సంచలనంగా ఉంది. ఈ జీవులు ఒకరకంగా మారుతున్న జీవైవిధ్యాన్ని రక్షించే ప్రాధాన్యతను నొక్కి చెప్పడమే గాక విపరీతమైన పరిస్థితుల్లో జీవించే సామర్థ్యం గురించి తెలియజేసిందన్నారు. అలాగే నాటి కాలం, అప్పటి పరిస్థితులు, వాటి జీవనశైలిని.. తెలుసుకోవాడానికి ఇదోక గొప్ప వనరుగా ఉంటుదన్నారు పరిశోధకులు.
(చదవండి: కార్యాలయాల్లో 'వై' బ్రేక్! ఏంటంటే ఇది!)
Comments
Please login to add a commentAdd a comment