Ancient fossil
-
కుజునిపై జీవముండేదా?
కుజ గ్రహం మీద పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన క్యూరియాసిటీ రోవర్ తాజాగా కీలకమైన విశేషాలను సేకరించింది. కుజుని ఉపరితలంపై పురాతన పగుళ్లను కనిపెట్టింది. ఇప్పటికీ ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉన్న ఆ పగుళ్లను ఫొటోలు, వీడియోలు తీసి భూమికి పంపింది. వాటిని చూసి సైంటిస్టులే ఆశ్చర్యపోతున్నారు. ఒకదాని తరువాత ఒకటిగా వచ్చి పోయే తడి, పొడి ఆవర్తనాలకు సూచికలైన ఈ తరహా పగుళ్లు జీవం పుట్టుకకు అత్యంత అనుకూలమని చెబుతారు. ..ఎండా, వానా కాలాలు కుజ గ్రహంపై అత్యంత పురాతన కాలం నాటి బురదమయమైన పగుళ్లను క్యూరియాసిటీ రోవర్ కనిపెట్టింది. షట్కోణాకృతిలోని ఆ పగుళ్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. వీటిని తొలినాటి కుజునిపై తడి, పొడి ఆవర్తనాల తాలూకు ఆనవాళ్లుగా భావిస్తున్నారు. జీవం పుట్టుకకు ఇవి అత్యంత కీలకమే గాక ఎంతో అనుకూలం కూడా. భూమిపై మాదిరిగా కుజునిపై క్రమానుగతంగా తడి, పొడి ఋతువులు, మరోలా చెప్పాలంటే వేసవి, వానాకాలాలు ఒకదాని తర్వాత ఒకటిగా వస్తూ పోతూ ఉండేవనేందుకు ఈ ఆవర్తనాలు నిదర్శనమని పరిశోధనకు సారథ్యం వహించిన విలియం రేపిన్ అభిప్రాయపడ్డారు. మట్టి పొర, లవణ ఖనిజాలతో సమృద్ధమైన వాటి పై పొరల మధ్య జోన్లో ఈ చక్రాలను కనిపెట్టారు. బురద ఎండిపోయినకొద్దీ కుంచించుకుపోయి, పగుళ్లిచ్చి టీ ఆకారపు జంక్షన్ మాదిరిగా ఏర్పడ్డాయి. పదేపదే నీరు పారిన మీదట వై ఆకృతిలోకి, అంతిమంగా షట్కోకోణాకృతిలోకి మారి గట్టిపడ్డాయి. భూమ్మీద మాదిరిగానే ఎండా, వానా కాలాలు క్రమం తప్పకుండా వచ్చేవని కచ్చితంగా చెప్పవచ్చని రేపిన్ చెప్పారు. ‘పైగా భూమి మాదిరిగా కుజునిపై టెక్టానిక్ ఫలకాలు లేవు. కనుక ఆ గ్రహం తాలూకు పురాతన చరిత్ర సురక్షితంగా ఉంది’అని అన్నారు. ఈ పరిశోధన ఫలితాలను నేచర్ జర్నల్‌లో తాజాగా ప్రచురించారు. జీవం తాలూకు ఆనవాళ్లు ఇప్పటికీ ఇంత సురక్షితంగా ఉన్న కుజుని వంటి గ్రహం భూమికి ఇంత సమీపంగా ఉండటం ఒక రకంగా మన అదృష్టం. విశ్వ రహస్యాలను ఛేదించే క్రమంలో ఇదో పెద్ద ముందడుగు కాగలదు’ – విలియం రేపిన్, పరిశోధన సారథి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
46 వేల ఏళ్ల నాటి పురుగుని బతికించారు! పిల్లల్నికంటోంది కూడా..!
ఎప్పుడూ మంచుతో దట్టంగా కప్పబడి ఉండే సైబిరియాలో ఓ పురుగుని గుర్తించారు శాస్త్రవేత్తలు. దాన్ని తీసుకోస్తే ఎన్నో అద్భుతాలు వెలుగులోకి వచ్చాయి. శాస్త్రవేత్తలే విస్తుపోయాలే బతకడమే గాక పిల్లల్ని కంటోంది. నిజానికి కీస్తూ పూర్వం నాటి వాటిని గుర్తిస్తే అబ్బురపడతాం. అలాంటిది.. ఇది ఏకంగా వేల ఏళ్ల నాటిది. పైగా అంతటి మంచులో ఘనీభవించి ఉండి కూడా బతకడం నిజంగా ఆశ్చర్యమే కదా!. వివరాల్లోకెళ్తే..సైబీరియన్ పెర్మాఫ్రాస్ట్ మంచు ప్రాంతంలో భూమి ఉపరితలానికి 40 మీటర్లు కింద మంచులో ఘనీభవించి ఉన్న ఓ పురుగుని గుర్తించారు శాస్త్రవేత్తలు. దీన్ని ల్యాబ్‌కి తీసుకొచ్చి పరిశోధనలు చేశారు డ్రెస్డన్లోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ సెల్ బయాలజీ అండ్ జెనిటిక్స్కి చెందిన ప్రోఫెసర్ ఎమెరిటస్. 'క్రిప్లోబయోసిస్' అనే నిద్రాణ స్థితిలో జీవించిందని తెలిపారు. ఇది అంతటి గడ్డకట్టే చలిలో చెడిపోకుండా అలానే ఉంది. నీరు, ఆక్సిజన్ లేకపోవడం, ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయిన స్థితిని కూడా తట్టుకుని బతికిందన్నారు. ఇది పురాతన రౌండ్‌వార్మ్(వానపాము) జాతికి చెందినదని తెలిపారు. ఇది దారుణమైన వాతావరణ స్థితులను తట్టుకుని బతకగలవని చెప్పారు. ఆయా వాతావరణ స్థితుల్లో.. ఆ పురుగుల్లో జీవక్రియ రేట్లు గుర్తించలేని స్థాయిలో పడిపోతాయి. ఆ పురుగుపై ఉన్న నిక్షేపాల ఆధారంగా 46 వేల ఏళ్ల క్రితం నాటిదని లెక్కించారు శాస్త్రవేత్తలు. దానికి తాము ప్రాణం పోయడంతో జీవించడం ప్రారంభించడమే గాక పిల్లల్ని కంటోందని అన్నారు. ఇలానే ఐదేళ్ల క్రితం, రష్యాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికో కెమికల్ అండ్ బయోలాజికల్ ప్రాబ్లమ్స్ ఇన్ సాయిల్ సైన్స్ శాస్త్రవేత్తలు సైబీరియన్‌లో రెండు రౌండ్‌వార్మ్ జాతులను కనుగొన్నారు. తదుపరి విశ్లేషణ కోసం జర్మనీలోని ల్యాబ్‌లకు దాదాపు 100 పురుగులను తీసుకెళ్లారు. ఇన్స్టిట్యూట్లోని రెండు పురుగులను నీటితో రీహైడ్రేట్ చేయడం ద్వారా బతికించారు. వాళ్లు కూడా వాటిని..దాదాపు 45 వేల నుంచి 47 వేల ఏళ్ల నాటి పురుగులని వాటిపై ఉన్న నిక్షేపాల ఆధారంగా చెప్పుకొచ్చారు. పురుగులపై జన్యు విశ్లేషణ చేశారు. దీంతో ఇవి అప్పటి జాతికి చెందినవని తేలింది. దీనిని పరిశోధకులు ‘పానాగ్రోలైమస్ కోలిమెనిస్’ అని పిలుస్తారు. క్రిప్టోబయోసిస్ అనే నిద్రాణ స్థితిలో ఉన్న ఈ పురుగులు మనుగడ సాగించడానికి ట్రెహలోస్ అనే చక్కెరను ఉత్పత్తి చేస్తాయి. అవి గడ్డకట్టినా.. నిర్జలీకరణాన్ని తట్టుకొని కొన్ని ఏళ్లు నిద్రాణ వ్యవస్థలో ఉండగలవని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ అంశం ఇప్పుడూ సైన్సు పరంగా ఓ అద్భుత సంచలనంగా ఉంది. ఈ జీవులు ఒకరకంగా మారుతున్న జీవైవిధ్యాన్ని రక్షించే ప్రాధాన్యతను నొక్కి చెప్పడమే గాక విపరీతమైన పరిస్థితుల్లో జీవించే సామర్థ్యం గురించి తెలియజేసిందన్నారు. అలాగే నాటి కాలం, అప్పటి పరిస్థితులు, వాటి జీవనశైలిని.. తెలుసుకోవాడానికి ఇదోక గొప్ప వనరుగా ఉంటుదన్నారు పరిశోధకులు. (చదవండి: కార్యాలయాల్లో 'వై' బ్రేక్! ఏంటంటే ఇది!) -
16వ శతాబ్దపు శిల్పాలను పరిరక్షించుకోవాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం, నాగిరెడ్డిపాలెం– మన్నె సుల్తాన్‌పాలెం మధ్య పొలాల్లో క్రీస్తు శకం 16వ శతాబ్దానికి చెందిన విజయనగర రాజుల కాలానికి చెందిన వీరభద్రాలయం శిథిలమై, అందులో నిలువెత్తు శిల్పాలు దెబ్బతిన్నాయని, వాటిని పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించాలని పురావస్తు పరిశోధకుడు, ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి (సీసీవీఏ) సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి కోరారు. చారిత్రక సంపదను కాపాడి భవిష్యత్ తరాలకు అందించేందుకు సీసీవీఏ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక పరిశోధనా కార్యక్రమంలో భాగంగా ఆదివారం బెల్లంకొండ మండలం పరిసర ప్రాంతాల్లో పర్యటించానని శివనాగిరెడ్డి ప్రకటనలో తెలిపారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన వీరభద్రుడు, భద్రకాళి శిల్పాలు జీర్ణావస్థలో ఉన్నాయని వివరించారు. నాగిరెడ్డిపాలెం శివారు ప్రాంతంలో ఉన్న క్రీస్తు 16వ శతాబ్దానికి చెందిన శిథిలమైన శివాలయాన్ని కూడా పునర్నిర్మాణం చేసి భావితరాలకు వాటి గొప్పతనాన్ని చాటాలని ఆయన కోరారు. అక్కడ ఉన్న చారిత్రక సంపద గురించి సమీపంలోని గ్రామస్థులకు అవగాహన కల్పించామని పేర్కొన్నారు. -
గొట్టిప్రోలు కోటదిబ్బ.. 2వేల ఏళ్ల నాటి చరిత్రకు సాక్ష్యం
నాయుడుపేట: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా నాయుడుపేట మండలం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో గొట్టిప్రోలు గ్రామం ఉంది. ఊరి ముఖద్వారానికి ఎడమవైపు ఎత్తైన కొండలాగా ఓ దిబ్బ కనిపించేది. పిచ్చిమొక్కలతో నిండి వుండే ఈ దిబ్బ మీద మేకలు, గొర్రెలు మేపే కాపరులకు వర్షాకాలంలో ఇక్కడ కుండ పెంకులు, పాతరాతి యుగానికి సంబంధించిన వస్తువులు లభించేవి. వాటిని చూసి అప్పటి పెద్దలు ఇక్కడ రాజులు వుండేవారట అని ముందు తరాలవారికి చెప్పెవారు. గ్రామంలోని కోట దిబ్బలో ఓ మూలన పల్లవులనాటి విష్ణుమూర్తి విగ్రహం గ్రావెల్(గులకరాళ్లు) తవ్వకాల్లో బయటపడడంతో గ్రామ ప్రజలు అప్పటి నుంచి పూజలు చేసేవారు. కోట దిబ్బగా పిలువబడే ప్రాంతం 40 ఎకరాలు స్థలంలో వుంది. గడిచిన రెండు దశాబ్ధాల్లో గ్రావెల్ అక్రమ రవాణా కోసం కొంత మంది పెత్తందారులు కోట దిబ్బను ద్వంసం చేసి సొమ్ముచేసుకున్నారు. ఇందులో పురాతన వస్తు సామగ్రి ఓక్కోక్కటిగా బయటపడడంతో గ్రామస్తులు కొంత మంది అక్రమ రవాణా చేయరాదంటూ అడ్డుకున్నారు. విషయం పురవస్తుశాఖ అధికారుల దృష్టికి చేరింది. ఏడాది తరువాత ఆర్కియాలజీ అధికారులు స్పందించారు. కోట దిబ్బ చుట్టూ నలబై ఎకరాలకు చుట్టు హద్దులు వేశారు. ఇందులోకి బయటవ్యక్తులు ఎవ్వరూ ప్రవేశించరాదంటూ దండోరా వేయించారు. గ్రామ పెద్దలతో మాట్లాడి పురావస్తుశాఖ సారద్యంలో తవ్వకాలు చేపడుతామని చెప్పారు. రెవెన్యూ, పోలీస్ జిల్లా ఉన్నతాధికారులకు పురావస్తుశాఖ శాస్త్రవేత్తలు, అధికారులు ఇక్కడి పరిస్థితిపై వివరించారు. డ్రోన్ కెమెరాలతో 40 ఎకరాలోని అన్ని ప్రదేశాలను చిత్రీకరించారు. గ్రామంలోని వంద మందికిపైగా కూలీలతో పురావస్తుశాఖ అధికారులు, సిబ్బంది తవ్వకాలు ప్రారంభించారు. తొలిదశలో పెంకులు, చిన్న చిన్నరాతి ముక్కలు బయటపడ్డాయి. వీటిపై పురావస్తుశాఖ అధికారులు పరిశోధనలు చేయాలని ఆశాఖ పరిశోధనశాలలకు పంపడం జరిగింది. పల్లవులు, రోమన్లు, శాతవాహనుల కాలంనాటి ఆనవాళ్లు కనిపిస్తున్నాయని పరిశోధనల్లో తేటతెల్లమవుతుందని అధికారులు వెల్లడించారు. పూర్తి స్థాయి తవ్వకాలు చేపట్టి పరిశోధనలు చేస్తే తప్ప ఓ కొలిక్కిరాదని అధికారులు నిర్ణయానికి వచ్చారు. రెండువేల ఏళ్లనాటి పురాతన కట్టడాలు.... పురావస్తు తవ్వకాల్లో బయల్పడ్డ కట్టడాలు రెండు వేల ఏళ్ళనాటి మధ్య యుగంనాటి చరిత్ర పురాతన కట్టడాలని శాసననాలు చెబుతున్నాయి. స్వర్ణముఖినది బంగాళాఖాతం సముద్రతీరానికి దగ్గరగా వుండడంతో రోమన్లతో వర్తక వ్యాపారాలు కొసాగించేందుకు ఇక్కడ కట్టడాలు చేసి వుండవచ్చని భావిస్తున్నారు. ఇదే క్రమంలో చతుర్ముఖి ముఖం కలిగిన విష్ణుమూర్తి విగ్రహంతో పాటు నాణ్యమైన నలుపు, ఎరుపు మట్టిపాత్రలు,నాణ్యాలు, జాడీలు గృహాపకరణాలు బయల్పడ్డాయి. పల్లవుల కాలం నాటివిగా భావిస్తున్న విగ్రహాలు అలనాటి శిల్పకళను చాటిచెప్పే విధంగా వుండటమే కాక నాటి చరిత్రను వివరిస్తున్నాయి. రెండువేళ్ల నాటి డ్రైనేజీ వ్యవస్థ, భారీ ఘన ఇటుకలతో చుట్టూ వలయాకారంలో గోడ నిర్మాణం, 48–49 వెడల్పు కలిగిన ఇటుకల వుండడంతో.. ఇవి అమరావతి, నాగార్జున కొండ శాతవాహనుల కాలంనాటి నిర్మాణంలో వాడిన ఇటుకలుగా తెలుస్తోంది. సముద్రతీరం ప్రాంతానికి దగ్గరగా వ్యాపార వాణిజ్య పరంగా అనువైన ప్రాంతం కావడంతో కోట దిబ్బను ఎంచుకుని.. ఇక్కడ కట్టడాలు నిర్మించిన ఆనవాళ్లు బయల్పడ్డాయని ఆర్కియాలజీ అధికారులు గుర్తించారు. గొట్టిప్రోలు గ్రామం కోటదిబ్బలో చేపట్టిన పురావస్తుశాఖ తవ్వకాలను ఆశాఖ విశ్రాంత జాయింట్ డైరెక్టర్ జనరల్ ఆర్ఎస్ బిస్ట్ పరిశీలించారు. తవ్వకాల్లో శాతవాహన కాలంనాటి ఆనవాళ్లు కోటదిబ్బలో బయల్పడిన ఆ ప్రాంతాన్ని ఆర్ఎస్ బిస్ట్ చూశారు. ఇక్కడ బయల్పడిన కట్టడాలు శాతవాహనుల కాలంలో ఏర్పాటు చేసుకున్న కోటలో రాజులు, పరిపాలకులు, లోపలభాగంలోనే కోర్టు, సెక్యూరిటీ వంటి పురాతన కట్టడాల మాదిరి కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఇతర ప్రాంతాలకు వర్తక వాణిజ్యపరంగా ఇక్కడి నుంచే జరిగి వుంటాయని స్పష్టం చేశారు. గొట్టిప్రోలు శాతవాహన కాలంనాటి కట్టడాలు బయటపడడం చరిత్రగా మారనుందని అన్నారు. వీటిని కళాశాలలు, పాఠశాలలోని విద్యార్థులకు ప్రదర్శించి.. శాతవాహనుల చరిత్ర అర్థమయ్యేలా చూపాలన్నారు. గొట్టిప్రోలులో పురావస్తు కట్టడాలు ఉన్నట్లు ఎలా గుర్తించారు..! గొట్టిప్రోలు గ్రామానికి శివారుప్రాంతంలో 30 అడుగులు ఎత్తుగల దిబ్బవుండేది. ఇక్కడ గ్రావెల్ విరివిగా వుండడంతో ఇది కొందరికి కల్పతరువుగా మారింది. దిబ్బను సొంతం చేసుకుని ప్రకృతి సంపదను దొచుకుంటే కోట్లు గడించవచ్చని దీనిపై దృష్టిసారించారు. దాదాపుగా 30 అడుగులు ఎత్తు ఉండే దిబ్బ ప్రస్తుతం 7 అడుగులు ఎత్తుకు తగ్గింది. అప్పటికే కోటలో కట్టడాలు ఒక్కొక్కటిగా బయల్నడుతూ వచ్చాయి. అది గమనించిన గ్రామంలోని ఓ విద్యావంతుడు గ్రావెల్ తవ్వకాలను అడ్డుకుంటూ వచ్చాడు. అదేక్రమంలో పురావస్తుశాఖ అధికారులకు సందేశాలు పంపుతూ వచ్చినా ప్రయోజనం లేకపోయింది. 2018 నవంబర్‌లో పురవాస్తుశాఖ అధికారులు స్వర్ణముఖినది తీరాల వెంబడి గ్రామాల ఆలయాలు, పురావస్తు కట్టడాలు ఎక్కడెక్కడ వున్నాయోనని పరిశీలించారు. ఈసమయంలో గొట్టిప్రోలు వద్ద కోట దిబ్బలో పురావస్తు కట్టడాలు వున్నట్లు శాసనాలలో గుర్తించారు. -
రాళ్లలో రాక్షస బల్లి!
సాక్షి, హైదరాబాద్ : డైనోసార్.. ఈ పేరు వినగానే కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించి ఆ తర్వాత కనుమరుగైన రాక్షస బల్లులని అందరూ ఠక్కున చెబుతారు. మరి అవి తిరుగాడిన ప్రాంతాల గురించి అడిగితే మాత్రం మనలో చాలా మంది తెలియదనే బదులిస్తారు. అయితే మన దేశంలో ప్రత్యేకించి పూర్వపు ఆదిలా బాద్ జిల్లాలోని ప్రాణహిత–గోదావరి నదీ తీరాలు డైనోసార్లకు స్వర్గధామంగా ఉండేవన్న విషయం తెలుసా? ఆశ్చర్యంగా అని పిస్తున్నా ఇది నిజం. ఇంతకంటే విస్తుగొలిపే విషయాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. డైనోసార్ శిలాజాలు ఇప్పటికీ ఆ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. డైనోసార్లే కాదు, ఆ కాలంలో జీవించిన ఇతర ప్రాణుల శిలాజాలు కూడా అక్కడ ఉన్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెలుగు చూసినా ఆ తర్వాత పరిశోధనలు నిలిచిపోవటంతో ఈ విషయం కాస్తా మరుగున పడిపోయింది. ఇప్పుడు తాజాగా కొందరు ఔత్సాహిక పరిశోధకులు ప్రస్తుత మంచిర్యాల జిల్లా యామన్‌పల్లి (వేమన్‌పల్లి) చుట్టుపక్కల పరిశీలించినప్పుడు డైనోసార్తోపాటు ఇతర ప్రాణులకు చెందిన శిలాజాలుగా భావిస్తున్న భాగాలు కనిపించాయి. వంతెన రాళ్లలో శిలాజాలు... ఇది మంచిర్యాల జిల్లా యామన్‌పల్లి శివారులో నిర్మించిన వంతెన. ఈ బ్రిడ్జి రివెట్‌మెంట్‌కు వినియోగించిన రాళ్ల మధ్యలో ప్రత్యేకంగా కనిపిస్తున్న రాళ్ల ఆకారాలను పరిశీలిస్తే అవి డైనోసార్ శిలాజాలన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఆ ప్రాంతాన్ని ఔత్సాహిక పరిశోధక బృందంలోని çసముద్రాల సునీల్, పులిపాక సాయిలు పరిశీలించినప్పుడు రివెట్మెంట్ రాళ్ల మధ్య శిలాజాలను పోలినవి కనిపించాయి. శాస్త్రీయ నిర్ధారణ కోసం వాటి ఫొటోలను పుణె డెక్కన్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి.ఎల్. బాదామ్కు పంపగా ఆయన పరిశీలించి అందులో దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం తిరగాడిన ఓ జాతి తాబేలు శిలాజంగా గుర్తించారు. మిగతా రాళ్లలో కూడా డైనోసార్ శిలాజాలకు దగ్గరి పోలికలున్నట్లు పేర్కొన్నారు. వాటిని స్వయంగా పరిశీలించి పరిశోధిస్తే కచ్చితత్వం వస్తుందని వెల్లడించారు. అయితే పరిశోధనలు లేకపోవడం, భవిష్యత్తు అధ్యయనాలకు వీలుగా ఆ ప్రాంతాన్ని పరిరక్షించకపోవడంతో ఈ శిలాజాలు వేగంగా ధ్వంసమవుతున్నాయి. రాక్షసబల్లి రెండో ఆకృతి ఇక్కడిదే... ప్రపంచవ్యాప్తంగా డైనోసార్లపై విస్తృత పరిశోధనలు సాగుతున్నాయి. దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం తిరగాడిన వాటి జీవిత విశేషాలపై ఇప్పటికీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కానీ డైనోసార్లు అన్ని ప్రాంతాల్లో లేవు. మన దేశంలోని గుజరాత్, రాజస్తాన్‌లలో వాటి జాడ ఉండేదని వెలుగుచూడగా ఆ తర్వాత మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులో ప్రాణహిత–గోదావరి తీరాల్లో జాడ కనిపించినట్లు శాస్త్రవేత్తలు చాలాకాలం క్రితమే గుర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్ బీఎం బిర్లా సైన్స్ సెంటర్లో ప్రత్యేకార్షణగా ఉన్న ‘డైనోసారియం’లో కనిపించే భారీ రక్షాసబల్లి ఆకృతి యామన్‌పల్లి ప్రాంతంలో లభించిన డైనోసార్ అవశేషాలతో రూపొందించినదే. 44 అడుగుల పొడవు, 16 అడుగుల ఎత్తున్న ఈ అస్తిపంజరం యామన్‌పల్లిలో 1974–1980 మధ్య జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఖనిజాన్వేషణలో దొరికింది. 12 డైనోసార్లకు చెందిన 840 అవశేషాలను అప్పట్లో వెలికితీశారు. అందుకే ఆ రాక్షసబల్లికి ‘కోటసారస్ యమనపల్లిన్సిస్’ అనే పేరుపెట్టారు. కానరాని పరిశోధనలు... ఆంగ్లేయుల జమానాలోనే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) ఈ ప్రాంతంలో ఖనిజాన్వేషణ సమయంలో డైనోసార్ శిలాజాలను గుర్తించింది. ఆ సమయంలో కొందరు విదేశీ పరిశోధకులు కూడా వచ్చి ఇక్కడ పరిశోధనలు నిర్వహించారు. ఆ తర్వాత జీఎస్ఐ అడపాదడపా పరిశోధనలు తప్ప ప్రత్యేకంగా అధ్యయనాలు లేకుండా పోయాయి. 1980లలో జీఎస్ఐకి చెందిన తెలుగు పరిశోధకులు పొన్నాల యాదగిరి ఇక్కడే ఎగిరే రాక్షసబల్లి అవశేషాలను గుర్తించారు. ఆ తర్వాత కొత్త విషయాలేవీ వెలుగు చూడలేదు. గోదావరి బేసిన్ పరిధిలోని మలేరి, ధర్మారం, కోటలలో ఇప్పటి వీటి అవశేషాలు లభించాయి. డైనోసార్ ఎముకలు, వాటి గుడ్లు, గుడ్ల పెంకులు, ఎముకలు, అప్పటి చేపలు, తాబేళ్లు, మొసళ్ల శిలాజాలు కనిపించాయి. మహారాష్ట్ర–తెలంగాణల్లో విస్తరించిన ప్రాణహిత–గోదావరి తీరాల్లో ఆంజియోస్పర్మ్ చెట్లు విస్తృతంగా ఉండటంతో వాటి ఆకులను తినేందుకు ఈ ప్రాంతాల్లో డైనోసార్లు ఎక్కువగా ఉండేవని పరిశోధకులు గుర్తించారు. మరి వారు స్మగ్లర్లా...? డైనోసార్ అవశేషాల అధ్యయనం పేరు చెప్పి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ ప్రాంతాల్లో తవ్వకాలు సాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఇలా తవ్వగా ఏర్పడ్డ పెద్ద గొయ్యిని ఆ కోవదేనని పేర్కొంటున్నారు. ఇప్పటికీ వ్యవసాయ పనుల కోసం దున్నుతున్నప్పుడు డైనోసార్ శిలాజాలు వెలుగుచూస్తున్నాయి. వాటిపై కొంత అవగాహన ఉన్నవారు ఆ శిలాజాలను సేకరించి అన్వేషణకు వచ్చే ‘స్మగ్లర్ల’తో బేరసారాలు సాగిస్తున్నారని సమాచారం. ఇటీవల కొందరికి ఈ ప్రాంతంలో డైనోసార్‌కు చెందిన భారీ ఎముకల శిలాజాలు దొరికాయని, వాటిని దాచి ఆసక్తి ఉన్న వారికి అమ్మకం కోసం యత్నిస్తున్నారని సమాచారం. శిలాజాలు ఎలా... డైనోసార్లు దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం సంచరించాయి. ప్రకృతి విపత్తులతో అవి అంతరించాయి. కానీ కోట్ల ఏళ్ల కాలంలో వాటి కళేబరాలు, గుడ్లు శిలాజాలుగా మారిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అగ్నిపర్వతం నుంచి వెలువడ్డ లావా ప్రవహించి అవి రాళ్లుగా మారిపోయాయి. -
అతి పురాతన శిలాజం ఇదే.!
టొరంటో: ఇంత వరకు భూమ్మీద ఉన్న అతి పురాతన శిలాజాలాన్ని కనుగొన్నారు కెనడాకు చెందిన శాస్త్రవేత్తలు. అతి పురాతన జీవంకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన ఈ శిలాజం దాదాపు నాలుగున్నర కోట్ల కంటే ముందు కాలానికి చెందిదని పరిశోధకులు చెబుతున్నారు. కెనడాలోని క్యూబెక్‌కు సమీపంలో గల ‘నువ్యాగిట్టుక్ సుప్రక్రస్టల్ బెల్ట్’ (ఎన్ఎస్బీ)లోని రాళ్లలో ఈ శిలాజాలం బయటపడింది. ఈ ఎన్‌ఎస్‌బీలో ‘ఉష్ణజలీకరణ బిలం’ పద్ధతి ద్వారా ఏర్పడిన అవక్షేప శిలలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన మాథ్యుడాడ్ మాట్లాడుతూ... ‘ఇప్పటి వరకు చేసిన ఆవిష్కరణల ద్వారా తెలిసిన విషయమేమిటంటే... జీవం వేడి నుంచే పుట్టింది. భూమిపై నీరు, జీవం ఆవిర్భవించిన సమయంలోనే అంగారుకునిపై కూడా నీరుందని తేలింది’ అని తెలిపారు. దీంతో పాటు కొన్ని ఖనిజ శిలాజాలను కూడా గుర్తించామని మరో శాస్త్రవేత్త డొమినిక్ పపినీయు పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ భూమిపై ఉన్న జీవ చరిత్రతో పాటు విశ్వంలోని మిగత గ్రహాలపై జీవి మనుగడను గుర్తించడానికి ఉపోయగపడుతుందని పపినీయ అభిప్రాయపడ్డారు. ఈ ఆవిష్కరణ కంటే ముందు ఆస్ట్రేలియాలో సుమారు 3కోట్ల ఏళ్ల క్రితంనాటి శిలాజాన్ని గుర్తించారు.