
కోడి నోరు ఎవరో కట్టేసినట్లు.. సూర్యుడేదో సిక్ లీవ్ పెట్టినట్లు.. గత శుక్రవారం సైబీరియాలోని వెర్కోయాన్స్‌లో తెలవారనే లేదు.. ఉదయం 8 అవుతున్నా.. చిమ్మచీకటి ఆకాశంలో కుర్చీ వేసుకుని కూర్చుంది.. తొలుత బిత్తరపోయినా.. తర్వాత అక్కడి జనం నెమ్మదిగా సర్దుకున్నారట.. ఎందుకంటే.. గతేడాది జూలైలో కూడా ఇలాగే అయిందట. తర్వాత పరిస్థితి మారినప్పటికీ.. ఇలా ఎందుకు జరిగిందన్న దానిపై అధికారికంగా ఎలాంటి వివరణ వెలువడలేదు. కాకపోతే.. సైబీరియాలో కొన్ని చోట్ల అడవులు తగలబడటం వల్ల వాతావరణంలో కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువగా వెలువడిందని.. దీని వల్ల దట్టమైన మేఘాలు ఏర్పడి.. అవి సూర్యుడిని కప్పేసి ఉంటాయని వాతావరణ నిపుణులు చెప్పారు. అయితే, ఆ రోజున వాతావరణంలో పరిమితికి మించి కార్బన్ మోనాక్సైడ్ శాతం ఉన్నప్పటికీ.. అది మరీ ఇలా సూర్యుడిని ముంచేసేంత స్థాయి కాదని తాజాగా తేలింది. ఇంతకీ ఎలా జరిగిందంటారు??