గ్రామ సమీపంలో కుప్పకూలిన రష్యా విమానం | Russian defence ministry Il-18 plane crashes in Siberia | Sakshi
Sakshi News home page

గ్రామ సమీపంలో కుప్పకూలిన రష్యా విమానం

Published Mon, Dec 19 2016 11:36 AM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM

గ్రామ సమీపంలో కుప్పకూలిన రష్యా విమానం

గ్రామ సమీపంలో కుప్పకూలిన రష్యా విమానం

రష్యా విమానం ఒకటి కుప్పకూలిపోయింది. రక్షణ శాఖకు చెందిన 2-18 విమానం సైబీరియాలోని బులున్‌స్కీ జిల్లా యాకుతియాలో కూలిపోయినట్లు ఎన్‌ఫోర్స్మెంట్‌ అధికారులు తెలియజేశారు.

రష్యా: రష్యా విమానం ఒకటి కుప్పకూలిపోయింది. రక్షణ శాఖకు చెందిన 2-18 విమానం సైబీరియాలోని బులున్‌స్కీ జిల్లా యాకుతియాలో కూలిపోయినట్లు ఎన్‌ఫోర్స్మెంట్‌ అధికారులు తెలియజేశారు. ఈ విమానంలో మొత్తం 40మంది ప్రయాణీకులు ఉన్నారు.

‘ఈ ప్రమాదం జరిగినప్పటికీ ప్రయాణీకులు, విమాన సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు భావిస్తున్నాం. అయితే, 16మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలివద్దకు సహాయ చర్యలు చేపట్టేందుకు హెలికాప్టర్లు వెళ్లాయి. స్థానిక వైద్య బృందాలు కూడా ఇప్పటికే తరిలి వెళ్లాయి’  అని రష్యా రక్షణ శాఖ అధికారులు చెప్పారు. కోల్ట్‌ సోవో విమానాశ్రయం నుంచి బయలు దేరిన విమానం టిక్సీ అనే గ్రామానికి 16 కిలోమీటర్ల దూరంలో కూలిపోయిందని స్పుత్నిక్‌ న్యూస్‌ వెల్లడించింది. తొలుత 27 మంది చనిపోయి ఉంటారని వార్తలు వచ్చినా అనంతరం ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని రష్యా రక్షణ శాఖ స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement