మార్జాలరాజ్యం.. కోశ్లాండియా! | News about Siberia cats | Sakshi
Sakshi News home page

మార్జాలరాజ్యం.. కోశ్లాండియా!

Published Sun, Feb 4 2018 3:12 AM | Last Updated on Sun, Feb 4 2018 3:12 AM

News about Siberia cats - Sakshi

అది పశ్చిమ సైబీరియాలోని ఓ చిన్న గ్రామం. పేరు ప్రిగోరోడ్ని. రెండేళ్ల కిందటివరకు ఏ గుర్తింపూలేని గ్రామం అది. అయితే ఆ గ్రామాన్ని ప్రపంచానికి పిల్లులు పరిచయంచేశాయి. ఎందుకంటే అక్కడిపిల్లుల సంఖ్య ఎంతో తెలుసా.. పదిలక్షల పైమాటే. సంఖ్యలోనే కాదు.. అందంలోనూ ఏమీ తీసిపోనట్లు ఉంటాయి అవి. ప్రిగోరోడ్ని గ్రామాన్ని ‘కోశ్లాండియా’అని పిలుస్తారు. దీనికిపిల్లుల స్వర్గధామం అనిఅర్థం.

ఈ గ్రామం ఇంత ఫేమస్‌ కావడానికి.. పిల్లుల ఊరు కావడానికి కారణం లెబిడివా అనే 59 ఏళ్ల మహిళ.. ఆమె భర్త సెర్గెయ్‌. 2003లో ఇంట్లో పెంచుకునేందుకు వారు ఓ పిల్లిని తెచ్చుకున్నారు. ఫిలైన్‌ జాతికి చెందిన ఈ పిల్లికి బబుష్కా అని ముద్దు పేరు పెట్టుకున్నారు. ఓ ఏడాది తర్వాత ఈ పిల్లి ఐదు బుజ్జి పిల్లులకు జన్మనిచ్చింది.

ప్రస్తుతం అక్కడ దాదాపు 10 లక్షల పిల్లులు ఉండొచ్చని లెబిడివా చెబుతున్నారు. రెండేళ్ల కింద వీటి ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఈ ఊరు ప్రపంచానికి తెలిసింది. ఇంకేముంది ఈ పిల్లులు.. అవి ఉన్న ఆ ఊరు నెట్‌లో హల్‌చల్‌ చేస్తూ నెటిజన్ల మనసు దోచుకుంటున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement