నంబర్ తీసుకుని ఎంత పని చేశాడు..!
దుబాయి: భారత్‌కు చెందిన వికలాంగ బాలుడిపై పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. దుబాయిలోని అల్ రషిదియా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఫిబ్రవరిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలివీ.. ఓ మానసిక వికలాంగుడు ఇంటి సమీపంలో రోడ్డు పక్కన ఉన్న అతడి వద్దకు వచ్చి మాటలు కలిపాడు. స్నేహం పేరుతో బాలుడి ఫోన్ నంబర్ అడిగి తీసుకున్నాడు.
తరచూ అతను బాలుడితో మాట్లాడేవాడు. బాలుడి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న ఆ వ్యక్తి మాయమాటలు చెప్పి తన కారులో ఎక్కించుకున్నాడు. అనంతరం నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితుడి తండ్రి అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు జరిపిన పోలీసులు ఫిబ్రవరి 25వ తేదీన నిందితుడిని అరెస్టు చేశారు. అయితే నిందితుడు తన తప్పేమీ లేదని కోర్టులో వాదించాడు.
బాలుడు తనను పది దిర్హామ్‌లు అడిగాడని తెలిపాడు. ఇవ్వకపోయేసరికి కారులో తనతోపాటు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించటంతో లైంగిక దాడి చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. వైద్య పరీక్షలో బాలుడి మానసిక అపరిపక్వత నిర్ధారణ కావటంతో కోర్టు అతని వాదనలను తోసిపుచ్చింది. నిందితుడు శిక్షార్హుడేనని కోర్టు తేల్చిచెప్పింది. దీనిపై తుది తీర్పు వెలువడాల్సి ఉంది.