Indian boy
-
ఇండియన్ స్టూడెంట్‌కి వేధింపులు
-
ఎల్బ్రస్ శిఖరంపై సు'గంధం' పరిమళం
సాక్షి, అమరావతి: ఎనిమిదేళ్ల బాలుడు ఎత్తైన పర్వతాన్ని అధిరోహించాడు. యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తైన ప్రముఖ శిఖరం ఎల్బ్రస్ను అతి పిన్న వయసులోనే అధిరోహించిన తొలి భారతీయ బాలుడిగా రికార్డు సృష్టించాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి, మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడి కుమారుడైన గంధం భువన్ రష్యాలోని ఎల్బ్రస్ పర్వతం (5,642 మీటర్లు)ను ఈ నెల 18వ తేదీన అధిరోహించి చరిత్ర సృష్టించాడు. అనంతపురానికి చెందిన కోచ్ శంకరయ్య, విశాఖపట్నానికి చెందిన పర్వాతారోహకుడు, అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ చాంపియన్ భూపతిరాజు వర్మ, కర్ణాటక నుంచి నవీన్ మల్లేష్ బృందంతో కలిసి భువన్ సెప్టెంబర్ 11న రష్యాకు బయలుదేరాడు. ఈ నెల 12న టెర్స్‌కోల్‌లోని మౌంట్ ఎల్బ్రస్ బేస్‌కు వెళ్లిన ఆ బృందం 13 వ తేదీన 3,500 మీటర్లు అధిరోహించి తిరిగి బేస్ క్యాంప్‌కు చేరుకుంది. అక్కడ కొంత శిక్షణ అనంతరం 18వ తేదీన 5,642 మీటర్ల ఎత్తైన ఎల్బ్రస్ పర్వత శిఖరాన్ని చేరుకుని ఉదయం 8:00 గంటలకు (మాస్కో సమయం) మన జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. ఈ బృందం ప్రస్తుతం పర్వతాన్ని దిగి బేస్ క్యాంప్‌నకు చేరుకుని ఈ నెల 23న భారత్‌కు తిరిగి రానుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. కోచ్ శిక్షణతోనే ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్న భువన్ తల్లిదండ్రుల ప్రోత్సాహం, శిక్షకులు అందించిన మెళకువల వల్లే తాను ఈ ఘనతను సాధించినట్టు వీడియో సందేశంలో పేర్కొన్నాడు. దేశంలో చాలామంది ప్రతిభావంతులైన పిల్లలున్నారని, వారికి తగిన ప్రోత్సాహం, అవకాశం కల్పిస్తే అద్భుతమైన రికార్డులు సృష్టిస్తారని స్పష్టం చేశాడు. అతి శీతల వాతావరణం సవాల్‌గా మారినప్పటికీ, పలు ఇబ్బందులు చవిచూస్తూ తాను అనుకున్న విధంగా సాహసోపేతమైన యాత్రను ముగించినట్టు తెలిపాడు. -
3,200 కి.మీ.ల సైకిల్ యాత్ర.. రూ. 3.7 లక్షల విరాళాలు
లండన్: ఐదేళ్ల తెలుగు బాలుడు 3,200 కిలోమీటర్ల సైకిల్ యాత్రలో పాల్గొని అక్షరాలా రూ.3.7 లక్షలు సేకరించాడు. భారత్‌లో కరోనా మహమ్మారిపై పోరాటానికి తనవంతు సాయం అందించేందుకు ఈ బాలుడు చేసిన సాహసం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన అనీశ్వర్ కుంచాల బ్రిటన్‌లోని మాంచెస్టర్ సిటీలో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. ‘లిటిల్ పెడలర్స్ అనీశ్ అండ్ ఫ్రెండ్స్’ పేరిట మేలో సైకిల్ క్యాంపెయిన్ ప్రారంభించాడు. ఇందులో అతడితోపాటు 60 మంది బాలురు పాల్గొన్నారు. మొత్తం 3,200 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేశారు. ప్రజల నుంచి రూ.3.7 లక్షల విరాళాలు సేకరించారు. బ్రిటన్‌లో కరోనాపై పోరాటంలో భాగంగా నేషనల్ హెల్త్ సర్వేకు సాయం చేసేందుకు క్రికెట్ చాంపియన్‌షిప్ కూడా అనీశ్వర్ ప్రారంభించాడు. ఐదేళ్ల అనీశ్వర్ యూకేలో ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు. నేతలు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. -
14 ఏళ్లకే పైలెట్ అయిన భారత సంతతి బాలుడు
దుబాయి: భారతీయ సంతతికి చెందిన యూఏఈ బాలుడు అరుదైన రికార్డు సృష్టించాడు. 14 ఏళ్లవయస్సులోనే సింగిల్ ఇంజిన్ విమానాన్ని నడిపిన పిన్న వయస్కుడిగా రికార్డు సాధించాడు. షార్జాలోని ఢిల్లీ ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న మన్సూర్ అనిస్(14)కి చిన్నప్పటి నుంచే పైలెట్ కావాలని కోరిక ఉండేది. దాన్ని సాధించేందుకు గాను కెనడాకు చెందిన ఏవియేషన్ అకాడెమీలో చేరాడు. సింగిల్ ఇంజిన్ సెస్నా-152 రకం విమానాన్ని పది నిమిషాల పాటు ఒక్కడే ఒంటరిగా నడిపి, ఏవియేషన్ సంస్థ నుంచి స్టూడెంట్ పైలెట్ ధ్రువీకరణ పత్రాన్ని పొందాడు. ఇందుకు సంబంధించి ఆగస్టు 30వ తేదీన కెనడా ఏవియేషన్ విభాగం నిర్వహించిన వివిధ పరీక్షల్లో 90శాతం స్కోరు సాధించాడు. అతి తక్కువ శిక్షణ సమయంలోనే పైలెట్‌గా అర్హత సాధించిన పిన్న వయస్కుడిగా కూడా మన్సూర్ రికార్డు నెలకొల్పాడని అతడి తండ్రి అలీ అస్గర్ అనిస్ తెలిపారు. వేసవి సెలవుల్లో తల్లితోపాటు మన్సూర్ కెనడా వెళ్లి విమాన పైలెట్ శిక్షణ పొందాడని అలీ తెలిపారు. తన సోదరుడు క్వాయిద్ ఫైజీ ఇండియాలో జెట్ ఎయిర్వేస్లో పైలెట్‌గా పనిచేస్తున్నాడని, అతని స్ఫూర్తితోనే మన్సూర్ పైలెట్ శిక్షణ పొందాడని మునీరా తెలిపారు. మన్సూర్ తండ్రి అలీ షార్జాలో అలీ సివిల్ ఇంజినీర్ కాగా, తల్లి మునీరా కెమిస్ట్రీ టీచర్‌గా పనిచేస్తున్నారు. కాగా, భారత్, దుబాయిలలో పైలెట్ అర్హత వయస్సు 18 ఏళ్లు కాగా, కెనడాలో 14 ఏళ్లకే పైలెట్ శిక్షణ పొందే అవకాశం ఉంది. -
నంబర్ తీసుకుని ఎంత పని చేశాడు..!
దుబాయి: భారత్‌కు చెందిన వికలాంగ బాలుడిపై పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. దుబాయిలోని అల్ రషిదియా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఫిబ్రవరిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలివీ.. ఓ మానసిక వికలాంగుడు ఇంటి సమీపంలో రోడ్డు పక్కన ఉన్న అతడి వద్దకు వచ్చి మాటలు కలిపాడు. స్నేహం పేరుతో బాలుడి ఫోన్ నంబర్ అడిగి తీసుకున్నాడు. తరచూ అతను బాలుడితో మాట్లాడేవాడు. బాలుడి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న ఆ వ్యక్తి మాయమాటలు చెప్పి తన కారులో ఎక్కించుకున్నాడు. అనంతరం నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితుడి తండ్రి అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు జరిపిన పోలీసులు ఫిబ్రవరి 25వ తేదీన నిందితుడిని అరెస్టు చేశారు. అయితే నిందితుడు తన తప్పేమీ లేదని కోర్టులో వాదించాడు. బాలుడు తనను పది దిర్హామ్‌లు అడిగాడని తెలిపాడు. ఇవ్వకపోయేసరికి కారులో తనతోపాటు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించటంతో లైంగిక దాడి చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. వైద్య పరీక్షలో బాలుడి మానసిక అపరిపక్వత నిర్ధారణ కావటంతో కోర్టు అతని వాదనలను తోసిపుచ్చింది. నిందితుడు శిక్షార్హుడేనని కోర్టు తేల్చిచెప్పింది. దీనిపై తుది తీర్పు వెలువడాల్సి ఉంది. -
బ్రెయిగో ల్యాబ్స్‌లో ఇంటెల్ పెట్టుబడులు
శాంటాక్లారా, అమెరికా: చౌక బ్రెయిలీ ప్రింటర్స్ రూపకల్పనతో సంచలనం సృష్టించిన ప్రవాస భారతీయ బాలుడు శుభం బెనర్జీ (13) తాజాగా టెక్నాలజీ దిగ్గజం ఇంటె ల్ దృష్టినీ ఆకర్షించాడు. బ్రెయిగో ల్యాబ్స్ పేరిట బెనర్జీ ఏర్పాటు చేసిన స్టార్టప్ సంస్థలో ఇంటెల్ కూడా పెట్టుబడులు పెట్టింది. ఇలా వెంచర్ క్యాపిటల్ అందుకున్న ఔత్సాహిక వ్యాపారవేత్తల్లో అత్యంత పిన్న వయస్కుడు బెనర్జీనే అయి ఉంటాడని ఇంటెల్ వర్గాలు పేర్కొన్నాయి. సాధారణ బ్రెయిలీ ప్రింటర్ల ధర ప్రస్తుతం 2,000 డాలర్ల (సుమారు రూ.1.20 లక్షలు) పైచిలుకు ఉంటోంది. ఈ నేపథ్యంలో చౌకగా వీటిని అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో బెనర్జీ కృషి చేశాడు. చివరికి లెగో రోబోటిక్స్ కిట్‌ను ఉపయోగించి 350 డాలర్ల స్థాయిలో (సుమారు రూ.21,000) ప్రింటర్‌ను రూపొందించాడు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రింటర్లు 9 కిలోల పైగా బరువుంటుండగా.. బెనర్జీ తీర్చిదిద్దిన ప్రింటరు బరువు కొన్ని పౌండ్లు మాత్రమే. స్కూలు ప్రాజెక్టుగా దీన్ని చేపట్టిన బెనర్జీ తాజాగా వీటి విక్రయాల కోసం పూర్తిస్థాయి కంపెనీనే ప్రారంభించాడు. -
యూఏఈలో సత్తా చాటిన భారత బాలుడు
దుబాయ్: భారతీయ బాలుడొకరు యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్(యూఏఈ)లో అరుదైన ఘనత సాధించాడు. అరబీ మతోపన్యాస పోటీ 'ప్రీచర్ ఆఫ్ ద నేషన్'లో అతడు విజేతగా నిలిచి వార్తల్లో నిలిచాడు. కర్ణాటకలోని భక్తల్ ప్రాంతానికి చెందిన ఇబ్రహీం షబాన్ద్రీ ఈ ఘనత సాధించాడు. 70 పోటీదారులను వెనక్కు నెట్టి అతడు విజయం సాధించాడు. అతడి వాక్పటిమకు అరబీ ప్రజలు, న్యాయ నిర్ణేతలు ముగ్దులయ్యారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ పోటీ నిర్వహించారు. తన కుమారుడు విజేతగా నిలవడం పట్ల ఇబ్రహీం తండ్రి ఫహీం అహ్మద్ హర్షం వ్యక్తం చేశాడు. ఎంతో కష్టపడి అంకితభావంతో తన కుమారుడు అరబీ నేర్చుకున్నాడని తెలిపాడు. -
13వ అంతస్థు నుంచి పడి ఏడేళ్ల ఎన్నారై బాలుడి మృతి
షార్జాలో విషాదకర సంఘన చోటుచేసుకుంది. అక్కడి తమ అపార్టుమెంటులోని 13వ అంతస్థు బాల్కనీ లోంచి కింద పడిపోయి ఏడేళ్ల భారత సంతతి బాలుడు మరణించాడు. దాంతో నిర్లక్ష్యం వహించినందుకు పోలీసులు ఆ బాలుడి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో ఆడుకోవాల్సిన చిన్న పిల్లాడు బాల్కనీలోకి వెళ్లి, అంత పైకి ఎలా ఎక్కాడని, అంత జరుగుతున్న ఎందుకు గమనించలేకపోయారని పోలీసులు వాళ్లను ప్రశ్నించారు. దుబాయ్ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతానికి పోలీసులకు ఓప్రత్యక్ష సాక్షి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. బాలుడి మృతదేహాన్ని అల్ కువాయిట్ ఆస్పత్రికి తరలించి అక్కడినుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపారు. షార్జా పోలీసులు ప్రత్యక్ష సాక్షులను కూడా ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రులు ఇళ్లలో తమ పిల్లలను ఒంటరిగా వదిలేయొద్దని, కనీసం ఇంట్లో పనివాళ్లయినా వాళ్లను కనిపెట్టుకుని ఉండాలని షార్జా పోలీసు అధికారి కల్నల్ సుల్తాన్ అల్ ఖయాల్ తెలిపారు. ఇటీవలి కాలంలో యూఏఈలో పలువురు పిల్లలు ఇలా కిందపడి మరణించారు. -
పరీక్షా పత్రం...
ఫన్ ప్రశ్న: ప్రేమంటే ఏమిటి? (మార్కులు 40) అమెరికా స్టూడెంట్... జవాబు: లవ్ ఈజ్ లైఫ్ (మార్కులు 40కి 10) లండన్ కుర్రాడు.. జవాబు: లవ్ ఈజ్ పెయిన్ (మార్కులు: 40కి 10) ఇండియన్ కుర్రాడు.. ప్రేమకు నిర్వచనం: ‘హృదయానికి సంబంధించిన ఒకానొక రుగ్మత’ రకాలు: వన్ సైడ్ లవ్, టు సెడైడ్ లవ్ వయసు: వయసుతో నిమిత్తం లేదు. లక్షణాలు: టెన్షన్ పగటి కలలు నిద్రలేమి చికిత్స: యాంటీ లవ్ థెరపి (40కి 40)