బ్రెయిగో ల్యాబ్స్‌లో ఇంటెల్ పెట్టుబడులు | Shubham, 13, Silicon Valley's youngest entrepreneur, develops Braille printer | Sakshi
Sakshi News home page

బ్రెయిగో ల్యాబ్స్‌లో ఇంటెల్ పెట్టుబడులు

Published Wed, Jan 21 2015 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM

బ్రెయిగో ల్యాబ్స్‌లో ఇంటెల్ పెట్టుబడులు

బ్రెయిగో ల్యాబ్స్‌లో ఇంటెల్ పెట్టుబడులు

శాంటాక్లారా, అమెరికా: చౌక బ్రెయిలీ ప్రింటర్స్ రూపకల్పనతో సంచలనం సృష్టించిన ప్రవాస భారతీయ బాలుడు శుభం బెనర్జీ (13) తాజాగా టెక్నాలజీ దిగ్గజం ఇంటె ల్ దృష్టినీ ఆకర్షించాడు. బ్రెయిగో ల్యాబ్స్ పేరిట బెనర్జీ ఏర్పాటు చేసిన స్టార్టప్ సంస్థలో ఇంటెల్ కూడా పెట్టుబడులు పెట్టింది. ఇలా వెంచర్ క్యాపిటల్ అందుకున్న ఔత్సాహిక వ్యాపారవేత్తల్లో అత్యంత పిన్న వయస్కుడు బెనర్జీనే అయి ఉంటాడని ఇంటెల్ వర్గాలు పేర్కొన్నాయి.

సాధారణ బ్రెయిలీ ప్రింటర్ల ధర ప్రస్తుతం 2,000 డాలర్ల (సుమారు రూ.1.20 లక్షలు) పైచిలుకు ఉంటోంది. ఈ నేపథ్యంలో చౌకగా వీటిని అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో బెనర్జీ కృషి చేశాడు. చివరికి లెగో రోబోటిక్స్ కిట్‌ను ఉపయోగించి  350 డాలర్ల స్థాయిలో (సుమారు రూ.21,000) ప్రింటర్‌ను రూపొందించాడు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రింటర్లు 9 కిలోల పైగా బరువుంటుండగా.. బెనర్జీ తీర్చిదిద్దిన ప్రింటరు బరువు కొన్ని పౌండ్లు మాత్రమే. స్కూలు ప్రాజెక్టుగా దీన్ని చేపట్టిన బెనర్జీ తాజాగా వీటి విక్రయాల కోసం పూర్తిస్థాయి కంపెనీనే ప్రారంభించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement