యూఏఈలో సత్తా చాటిన భారత బాలుడు | Indian boy chosen 'Preacher of the Nation' in UAE | Sakshi
Sakshi News home page

యూఏఈలో సత్తా చాటిన భారత బాలుడు

Published Wed, Jul 16 2014 7:23 PM | Last Updated on Sat, Sep 2 2017 10:23 AM

యూఏఈలో సత్తా చాటిన భారత బాలుడు

యూఏఈలో సత్తా చాటిన భారత బాలుడు

దుబాయ్: భారతీయ బాలుడొకరు యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్(యూఏఈ)లో అరుదైన ఘనత సాధించాడు. అరబీ మతోపన్యాస పోటీ 'ప్రీచర్ ఆఫ్ ద నేషన్'లో అతడు విజేతగా నిలిచి వార్తల్లో నిలిచాడు. కర్ణాటకలోని భక్తల్ ప్రాంతానికి చెందిన ఇబ్రహీం షబాన్ద్రీ ఈ ఘనత సాధించాడు. 70 పోటీదారులను వెనక్కు నెట్టి అతడు విజయం సాధించాడు.

అతడి వాక్పటిమకు అరబీ ప్రజలు, న్యాయ నిర్ణేతలు ముగ్దులయ్యారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ పోటీ నిర్వహించారు. తన కుమారుడు విజేతగా నిలవడం పట్ల ఇబ్రహీం తండ్రి ఫహీం అహ్మద్ హర్షం వ్యక్తం చేశాడు. ఎంతో కష్టపడి అంకితభావంతో తన కుమారుడు అరబీ నేర్చుకున్నాడని తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement