Singaram
-
తొలి మహిళా పెట్రోల్ బంక్: 'స్త్రీశక్తి... ఇంధనమై'..
‘పెట్రోల్ బంక్‌లో మహిళలు ఉద్యోగం చేయగలరా!’ అనే పురుషాధిపత్య అనుమానాన్ని పటాపంచలు చేస్తూ... ‘బ్రహ్మాండంగా చేయగలరు’ అని నిరూపించారు మహిళలు.ఇప్పుడు ఆ దారిలో మరో ముందడుగు... తొలి మహిళా పెట్రోల్ బంక్. ఇద్దరు కలెక్టర్ల చొరవ, కృషితో తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం చౌరస్తాలో తొలిసారిగా జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ఏర్పాటు అయింది...నారాయణపేట జిల్లాలో మహిళాసమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ఏర్పాటు చేయించాలనే ఆలోచన గత కలెక్టర్ కోయ శ్రీహర్షకు వచ్చింది. ‘మీరు ముందుకు వస్తే పెట్రోల్ బంకును ఏర్పాటు చేయిస్తాను’ అని హామీ ఇచ్చారాయన. దీంతో మహిళా సమాఖ్య సభ్యులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. డీఆర్డీఏ కార్యాలయానికి అనుకొని ఉన్న ఆరు గుంటల ప్రభుత్వ భూమిని డీఆర్డీఏ, జడ్ఎంఎస్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి బీపీసీఎల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కలెక్టర్ బదిలీపై వెళ్లడంతో ‘అయ్యో!’ అనుకున్నారు. పెట్రోల్ బంక్ కల సాధ్యం కాదు అనుకున్నారు.అయితే ప్రస్తుత కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఫైల్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లారు. రాష్ట్రంలోనే తొలి మహిళ పెట్రోల్ బంకు ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు. 35 వేల లీటర్ల (పెట్రోల్, డిజిల్) నిల్వ సామర్థ్యం ఉండే ఈ బంకు 24 గంటలు పనిచేస్తుంది. బంకు నిర్వహణ ద్వారా వచ్చే కమిషన్ జిల్లా సమాఖ్యకు చేరుతుంది. దీనికి అదనంగా ప్రతి నెలా రూ.10 వేలు బీపీసీఎల్ మహిళా సమాఖ్యకు అందిస్తుంది. బంకు నిర్వహణ ద్వారా 10 మంది మహిళా సభ్యులకు ఉపాధి లభించనుంది. ఈ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చిన ఒకాయన ఇలా అన్నాడు.... ‘ఎంతైనా ఆడవాళ్ల ఓపికే వేరు’ పెట్రోల్ బంక్‌ను విజయపథంలో నడిపించడంలో ఆ ఓపిక, ఉత్సాహం, శక్తిసామర్థ్యాలు వారికి ఇంధనంగా మారాయి.కలలో కూడా ఊహించలేదునారాయణపేటలో మహిళ సంఘం ద్వారా పెట్రోల్ బంకును ఏర్పాటు చేసుకుంటామని కలలో కూడా ఊహించలేదు. ఇది అయ్యే పని కాదనుకున్నాం. ప్రభుత్వ ప్రోత్సాహంతో బంకు ఏర్పాటు కావడం, అందులో సేల్స్ ఎగ్జిక్యూటిగా ఉద్యోగంలో చేరడం సంతోషంగా ఉంది. నెలకు రూ.11 వేల జీతం వస్తుంది. కుటుంబానికి ఎంతో అండగా ఉండేందుకు తోడ్పడుతుంది.– జగదీశ్వరి, సెల్స్ ఉమన్ , జడ్.ఎం.ఎస్. పెట్రోల్ బంకు మరింత మందికి ఉపాధినారాయణపేట జడ్ఎంఎస్ అధ్యక్షురాలిగా మూడేళ్ల నుంచి పనిచేస్తున్నా. జడ్ఎంఎస్కు వరి కొనుగోలు కేంద్రాల ద్వారా, స్త్రీనిధి కింద వచ్చే ఆదాయంతో నెట్టుకొచ్చేవాళ్లం. పెట్రోల్ బంక్ రూపంలో అదనపు ఆదాయం రావడంతో మరింత మంది ఉపాధి అవకాశాలకు వీలైంది.– చంద్రకళ, పెట్రోల్ బంకు మేనేజర్– కలాల్ ఆనంద్ కుమార్ గౌడ్, సాక్షి, నారాయణపేట -
పోలీసు జీపులోనే నిందితుడి హత్య
సేలం/కేకే.నగర్(చెన్నై): పోలీసులు జీపులో కోర్టుకు తీసుకెళుతున్న వ్యక్తిని 10 మంది దుండగులు దాడి చేసి హత్య చేసిన సంఘటన తిరునెల్వేలిలో శుక్రవారం చోటుచేసుకుంది. తూత్తుకుడి జిల్లా పుల్లావెలికి చెందిన సింగారం ఓ హత్య కేసులో నిందితుడు. ప్రస్తుతం పాళయంకోట సెంట్రల్ జైల్లో ఉన్న ఇతను శుక్రవారం కేసుకు సంబంధించి కోర్టులో హాజరు కావాల్సి ఉంది. ఎస్ఐ, మరో ముగ్గురు పోలీసులు ఎస్కార్టుగా సింగారంను జీపులో తీసుకెళుతున్నారు. పాళయంకోట కేటీసీ నగర్ చెక్‌పోస్టు సమీపంలో వెళుతుండగా వీరి జీపును కారులో వచ్చిన 10 మంది అడ్డుకున్నారు. వెంటనే పోలీసుల కళ్లల్లో కారం చల్లి వెంట తెచ్చుకున్న మారణాయుధాలతో సింగారంపై దాడి చేసి హత్యచేసి, తర్వాత జీపును ధ్వంసం చేసి పారిపోయారు. -
మోటకొండూరులో కలపొద్దు
ఆత్మకూరు(ఎం) : మండలంలోని సింగారం, కొండాపురం, చాడ, నాంచారిపేట, కాటెపల్లి గ్రామాలను కొత్తగా ఏర్పాటైన మోటకొండూరు మండలంలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్షాల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల ప్రజలు గురువారం చేపట్టిన తహసీల్దార్ కార్యాలయ ముట్టడి కార్యక్రమం విజయవంతమైంది. ఉదయం 11గంటలకు వచ్చిన ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు మోటకొండూరు వద్దు.. ఆత్మకూరు(ఎం) ముద్దు... అంటూ నినాదాలు చేశారు. తహసీల్దార్ చాంబర్ వద్ద బైఠాయించారు. దీంతో తహసీల్దార్ లక్క అలివేలు భువనగిరి ఆర్డీఓ ఎంవీ.భూపాల్‌రెడ్డికి సమాచారం అందించారు. స్థానిక నాయకుడైన పి.పూర్ణచందర్రాజును ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడించారు. సాయంత్రం 4.15లకు భువనగిరి ఆర్డీఓ వచ్చి ఆందోళనకారులతో మాట్లాడుతూ ప్రభుత్వం కూడా ప్రజాభిప్రాయసేకరణ ప్రకారమే ముందుకెళ్తుదే తప్ప మోటకొండూరులో కలపదని చెప్పడంతో ఆందోళన విరమించారు. యాదగిరిగుట్ట సీఐ రఘువీర్‌రెడ్డి, ఎస్ఐలు పి.శివనాగప్రసాద్, మధుసూదన్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి బందోబస్తును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు గుండు పెంటయ్యగౌడ్, సూదగాని యాదయ్యగౌడ్, పైళ్ల తులసమ్మ, ఎంపీటీసీ పచ్చిమట్ల మదార్ గౌడ్, వివిద పార్టీల నాయకులు పి. పూర్ణచందర్‌రాజు. పి.హేమలత, యాస లక్ష్మారెడ్డి, బొబ్బల ఇంద్రారెడ్డి, రచ్చ గోవర్ధన్, ఏలూరి వెంకటేశ్వర్లు, చాడ శశిధర్‌రెడ్డి, పంజాల పెంటయ్య, సత్తమ్మ, కొప్పుల సువర్ణ, కొప్పుల అండాలు పాల్గొన్నారు. -
చీర సింగారం..నారు సురక్షితం
బయ్యారం : చుట్టూ చీరలు..తడిక మాదిరి చుట్టేశారు. వేలాది రూపాయలు వెచ్చించి మిరప గింజలు కొని..పోసిన నారును ఇలా..చీరల కాంపౌడ్ లోపల పోసేసుకున్నారు. పశువులు తొక్కకుండా కాపాడుకునేందుకు బయ్యారంలో రైతులు ఈ ఉపాయం చేశారు. అప్పుడే వస్తున్న మొలకలను అస్తమానం కాపలా కాయలేక, వదిలేస్తే వచ్చే నష్టం భరించలేక..ఇదిగో ఇలా చీరలతో రక్షణ వలయం ఏర్పాటు చేసుకున్నారు. వారెవ్వా..భలే ఐడియా వేశారే..అని కొందరు రైతులు ఆశ్చర్యపోతున్నారు. -
కోడిపందాలపై దాడి: 29 మంది అరెస్ట్
హైదరాబాద్ : రంగారెడ్డి యాచారం మండలం సింగారంలో నిర్వహిస్తున్న కోడిపందాలపై ఎస్ఓటీ పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఈ సందర్భంగా 29 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 3 లక్షల నగదు, 8 కార్లు, 31 సెల్ఫోన్లతోపాటు 23 కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చేసిన అప్పులు తీర్చలేక..
వారు వ్యవసాయాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు.. తమకున్న పొలమేగాక మరికొంత కౌలుకు తీసుకుని పంటలు వేశారు.. దానిద్వారా వచ్చే ఆదాయంతోనే ఓ రైతు తమ కూతురి వివాహం చేద్దామనుకున్నాడు.. అయితే ఎన్ని బోర్లు వేసినా నీరు పడలేదు.. దీనికితోడు ప్రకృతి ప్రకోపానికి పంటంతా దెబ్బతింది.. దీంతో మనోవేదనకు గురై విద్యుత్ తీగలను పట్టుకుని తనువు చాలించాడు.. ఇంకో రైతు చేసిన అప్పులు తీర్చలేక తనకున్న కాడెద్దులను సైతం అమ్ముకున్నాడు. చివరకు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు...ఇలా జిల్లాలో అన్నదాతల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. లం సింగారం గ్రామపంచాయతీలోని ఎద్దుమిట్టతండాకు చెందిన చీన్యానాయక్ (41) కు సమీపంలో మూడెకరాల పొ లం ఉంది. గత ఏడాది మరో పదెకరాలను కౌలుకు తీసుకుని పత్తి, వేరుశనగ సాగుచేశాడు. వీటికోసం సుమారు *ఆరు ల క్షల అప్పు తెచ్చాడు. ఎనిమిది బోర్లు వేసినా నీరు పడలేదు. ఈ క్రమంలోనే తుపాను కారణంగా భారీ వర్షాలకు పంట దె బ్బతింది. చేతికందిన కొద్దిపాటి పంటకు ఇటీవల మార్కెట్లో సరైన ధర రాలేదు. మరోవైపు కూతురి వివాహం ఎలా చేయాలోనని మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం సమీపంలోని పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్కు అమర్చిన విద్యుత్ తీగలను పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయనకు భార్య బొజ్జితో పాటు కూతురు జయ, కుమారుడు గోపాల్ ఉన్నారు. ఈ విషయమై పోలీసులకు సమాచారమివ్వడంతో సిద్ధాపూర్ ఎస్ఐ చంద్రమోహన్‌రావు, ఏఎస్ఐ మద్దిలేటి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మరో సంఘటనలో అమ్రాబాద్ మండలం ఎల్మపల్లికి చెందిన చారగొండ పట్టాబి (58) కి సమీపంలో రెండెకరాల పొలం ఉంది. అందులో ఈసారి సుమారు *లక్ష అప్పు తెచ్చి పత్తి సాగుచేసినా ఆశించిన స్థాయిలో పంట పండలేదు. ఈ క్రమంలోనే ఉన్న కాడెద్దులనూ అమ్ముకున్నాడు. ఏడాదిక్రితం కుమారుడు వెంకటేశ్వర్లు పనికోసం భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్ నగరానికి వలసవెళ్లాడు. మనోవేదనకు గురైన పట్టాబి శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఇనుపకొండికి ఉరేసుకుని చనిపోయాడు. ఈయనకు భార్య బాలకిష్టమ్మతోపాటు కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. బాధిత కు టుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు కోరారు.