మోటకొండూరులో కలపొద్దు
మోటకొండూరులో కలపొద్దు
Published Thu, Sep 15 2016 10:23 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
ఆత్మకూరు(ఎం) : మండలంలోని సింగారం, కొండాపురం, చాడ, నాంచారిపేట, కాటెపల్లి గ్రామాలను కొత్తగా ఏర్పాటైన మోటకొండూరు మండలంలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్షాల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల ప్రజలు గురువారం చేపట్టిన తహసీల్దార్ కార్యాలయ ముట్టడి కార్యక్రమం విజయవంతమైంది. ఉదయం 11గంటలకు వచ్చిన ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు మోటకొండూరు వద్దు.. ఆత్మకూరు(ఎం) ముద్దు... అంటూ నినాదాలు చేశారు. తహసీల్దార్ చాంబర్ వద్ద బైఠాయించారు. దీంతో తహసీల్దార్ లక్క అలివేలు భువనగిరి ఆర్డీఓ ఎంవీ.భూపాల్‌రెడ్డికి సమాచారం అందించారు. స్థానిక నాయకుడైన పి.పూర్ణచందర్‌రాజును ఆర్డీఓతో ఫోన్‌లో మాట్లాడించారు. సాయంత్రం 4.15లకు భువనగిరి ఆర్డీఓ వచ్చి ఆందోళనకారులతో మాట్లాడుతూ ప్రభుత్వం కూడా ప్రజాభిప్రాయసేకరణ ప్రకారమే ముందుకెళ్తుదే తప్ప మోటకొండూరులో కలపదని చెప్పడంతో ఆందోళన విరమించారు. యాదగిరిగుట్ట సీఐ రఘువీర్‌రెడ్డి, ఎస్‌ఐలు పి.శివనాగప్రసాద్, మధుసూదన్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి బందోబస్తును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు గుండు పెంటయ్యగౌడ్, సూదగాని యాదయ్యగౌడ్, పైళ్ల తులసమ్మ, ఎంపీటీసీ పచ్చిమట్ల మదార్ గౌడ్, వివిద పార్టీల నాయకులు పి. పూర్ణచందర్‌రాజు. పి.హేమలత, యాస లక్ష్మారెడ్డి, బొబ్బల ఇంద్రారెడ్డి, రచ్చ గోవర్ధన్, ఏలూరి వెంకటేశ్వర్లు, చాడ శశిధర్‌రెడ్డి, పంజాల పెంటయ్య, సత్తమ్మ, కొప్పుల సువర్ణ, కొప్పుల అండాలు పాల్గొన్నారు.
Advertisement