#HelmetsReturn Gifts:ఇటీవలి కాలంలోపెళ్ళిళ్లకు రిటన్ గిఫ్ట్‌లు ఇవ్వడం చాలా కామన్‌గా మారింది. అలా ఓ పెళ్లిలో పెళ్లి కుమార్తె తండ్రి ఇచ్చిన రిటన్ గిఫ్ట్ వైరల్‌గా మారింది. రిటన్ గిఫ్ట్ ఏంటి? వైరల్ కావడం ఏంటి? అనుకుంటున్నారా? అయితే మీరీ స్టోరీ తెలుసుకోవాల్సిందే.
ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కోర్బా జిల్లా, ముదాపూర్ ప్రాంతానికి చెందిన సెద్ యాదవ్ తన కుమార్తె వివాహం ఘనంగా జరిపించాడు. తన కుమార్తె, స్పోర్ట్స్ టీచర్ నీలిమతో, సరన్‌గఢ్-బిలైగఢ్ జిల్లాలోని లంకాహుడా గ్రామానికి చెందిన ఖమ్‌హాన్ యాదవ్‌తో మూడు ముళ్ల వేడుకను ముచ్చటగా జరిపించాడు. విందు భోజనాలు కూడా ఘనంగా ఏర్పాటు చేశాడు. అయితే ఆ పెళ్లికి వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్‌లుగా హెల్మెట్‌లు ఇవ్వడం వార్తల్లో నిలిచింది. అంతేకాదు ఇది చూసిన అతిథులు ఆశ్చర్యపోయారు.
ఇదీ చదవండి: అపుడు సల్మాన్ మూవీ రిజెక్ట్.. ఒక్క సినిమాతో కలలరాణిగా..ఈ స్టార్ కిడ్ ఎవరు?
అయితే రోడ్డు భద్రతపై జనంలో అవగాహన కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు వధువు తండ్రి. రోడ్డుపై ప్రయాణిస్తున్నపుడు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినపుడు తామిచ్చిన హెల్మెట్లు ఉపయోగడాలని భావించామన్నాడు. పెళ్లికి వచ్చిన వారిలో 60 మంది అతిథులకు స్వీట్లతోపాటు హెల్మెట్లను రిటర్న్ గిఫ్ట్‌లుగా ఇచ్చినట్లు సెద్ యాదవ్ తెలిపాడు. అంతేకాదు ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కుటుంబ సభ్యులంతా కలిసి హెల్మెట్లు ధరించి మరీ డ్యాన్సులు చేసినట్టు సంబరంగా చెప్పుకొచ్చాడు.
రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమైన మద్యం తాగి వాహనాలు నడపడం మానుకోవాలని అతిథులను కోరారు. అందరూ జీవితం విలువను గుర్తించాలని పిలుపునిచ్చాడు. రోడ్డు భద్రత, హెల్మెట్ల వాడకంపై అవగాహన కల్పించేందుకు తన కుమార్తె పెళ్లి వేడుక తనకొక వేదికను అందించిందంటూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
అటు గిఫ్ట్స్ అందుకున్న బంధువులు, సన్నిహితులు చాలామంచి ఆలోచన అంటూ సెద్‌ను అభినందించారు. ఆనదంతో వారు స్టెప్పులు వేశారు.
గతంలో బెంగళూరులో కూడా
గతంలో బెంగళూరులో కూడా ఇలాంటి సంఘటన ఒకటి నమోదైంది. తమ పెళ్లికి వచ్చిన అతిథులకు హెల్మెట్లు, మొక్కలు గిఫ్ట్‌గా ఇచ్చారు నూతన జంట శివరాజ్, సవిత. ఇలా అయినా కొంతమంది ప్రాణాలైనా రక్షించగలిగితే తమకదే చాలని, అలాగే తామిచ్చిన మొక్కల్లో 500 మొక్కలు బతికినా తమకు ఆనందమేనని వెల్లడించారు. పెళ్లిళ్లలకు మందు, విందు, మ్యూజిక్ అంటూ చేసే వృధా ఖర్చులకు బదులుగా, ఇలా చేయడం ద్వారా, అటు పర్యావరణానికి, ఇటు భవిష్యత్తరాలకు మేలు చేసిన వారమవుతాంటూ వెల్లడించాడు శివరాజ్.
Comments
Please login to add a commentAdd a comment