నర్సమ్మ మృతదేహం
రసూల్‌పురా:కుమార్తెలకు వివాహం జరగడం లేదని మనస్తాపానికిలోనైన ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బోయిన్‌పల్లి పీఎస్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై సాయికిరణ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పాతబోయిన్‌పల్లి కోయబస్తీకి చెందిన నర్సమ్మ (35) మల్కాజిగిరి సబ్‌రిజిష్ట్రర్ కార్యాలయంలో అటెండర్‌గా పని చేసేది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. పెళ్లీడు వచ్చినా తన కుమార్తెలకు సంబంధాలు కుదరడం లేదని గత కొన్ని రోజులుగా బాధపడుతోంది. ఈ విషయమై ఈనెల 23న బంధువులతో గొడవపడగా, వారు ఆమెను మందలించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే గదిలోకి వెళ్లిన నర్సమ్మ చీరతో ప్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గుర్తించిన కుటుంబసభ్యులు ఆమెను బాలనగర్ లోని బీబీఆర్ ఆసుపత్రిలో తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment