![Love Affair: Women Attempts Suicide Over Harassments In Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/10/crime.jpg.webp?itok=IhdvuVun)
లీజా(పైల్), నిందితుడు అప్సర్
సాక్షి, మైలార్‌దేవ్‌పల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఒరిస్సాకు చెందిన పరమేశ్వర్ 20ఏళ్ల కిందట లక్ష్మీగూడలో నివాసం ఏర్పా టు చేసుకున్నాడు. ఆయనకు నలుగురు సంతానం. ఇదే ప్రాంతానికి చెందిన అక్రం అలియాస్ అప్సర్(20) నివసిస్తున్నాడు. పరమేశ్వర్ చిన్న కూతురు లీజా(20) అప్సర్ ఒకే కళాశాలలో ఇంటర్ చదువుకున్నారు. వీరి ఇళ్లు కూడా దగ్గరగా ఉండడంతో కళాశాలకు వెళ్తూ, వచ్చే సమయంలో ప్రేమలో పడ్డారు. విషయం గమనించిన లీజా కుటుంబ సభ్యులు పలుమార్లు అప్సర్‌ను హెచ్చరించారు.
చదవండి: బ్యుటిషియన్ ఆత్మహత్య
లీజాను బయటకు వెళ్లనీయకుండా తల వెంట్రుకలను కట్ చేయించి ఇంట్లోనే ఉంచారు. దీంతో ఆ యువతి మానసికంగా కుంగిపోయింది. దీనికి తోడు అప్సర్ తరుచూ ఫోన్ చేస్తూ వేధిస్తున్నాడు. ఈ వేధింపులు తట్టుకోలేని యువతి ప్రియుడితో సుమారు గంటపాటు ఫోన్‌లో మాట్లాడాక ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఆమె మృతి చెందాక కూడా అఫ్సర్ 135 సార్లు ఫోన్ చేశాడు. ఇరువురు ఫోన్ మాట్లాడుకుంటూనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని స్నేహితులు, బంధువులు వాపోతున్నారు. ఈ మేరకు అఫ్సర్‌ను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
చదవండి:
బిర్యానీ ప్యాకెట్లలో బంగారు ముక్కు పుడకలు
చంపి అయినా ‘పరువు’ కాపాడుకోవాలనుకుని..
Comments
Please login to add a commentAdd a comment