
టాలీవుడ్ నటుడు కాదంబరి కిరణ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇవాళ ఆయన కుమార్తె కల్యాణం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. తారామతి బారాదరిలో జరిగిన ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాదంబరి కిరణ్ చిన్న కుమార్తె పూర్ణ సాయిశ్రీకి సాయి భార్గవతో వివాహం జరిగింది.
ఈ వేడుకకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హీరో శ్రీకాంత్, మురళి మోహన్, కోట శ్రీనివాసరావు, రామజోగయ్య శాస్త్రి, తనికెళ్ల భరణి, అలీ, భాస్కరభట్ల, సాయికుమార్, బండ్ల గణేష్ హాజరయ్యారు. సీనియర్ నటుడైన కాదంబరి కిరణ్ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. భరత్ అనే నేను, రంగస్థలం, శ్రీమంతుడు చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment