
వధూవరులతో సజ్జల రామకృష్ణారెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్
నెల్లూరు(సెంట్రల్): నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ద్వితీయ కుమార్తె వైష్ణవి, నవీన్‌ల వివాహం ఆదివారంలోని నగరంలోని అనిల్ గార్డెన్స్‌లో వైభవంగా జరిగింది.దీనికి పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్, ఫ్లోర్‌లీడర్ పి.రూప్‌కుమార్‌యాదవ్, విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకుడు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, టీడీపీ నాయకులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మేయర్ అబ్దుల్ అజీజ్, ఇంకా వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment