Kotam Reddy Sridhar Reddy
-
వెన్నుపోటు నేతలకు భంగపాటు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు:నమ్మిన వారిని మోసం చేయడం, వారిని నట్టేట ముంచేయడం చంద్రబాబు నాయుడి నైజం. సొంత మామనే వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్న చంద్రబాబు నిజస్వరూపం తెలిసి కూడా మరోసారి నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డిలు బొక్కబోర్లా పడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆ ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీలోకి ఆహ్వానించినప్పుడు చెప్పిన తియ్యటి మాటలు ఇప్పుడు విన్పించడం లేదు. దీంతో ఆ ముగ్గురి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మాటమార్చి మోసం చేసి.. వెంకటగిరి, నెల్లూరురూరల్, ఉదయగిరి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డిలు చంద్రబాబు చేసిన మోసంపై మథన పడుతున్నారు. జిల్లాలోనే ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చి సీనియర్ పొలిటీషియన్‌గా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి పరిస్థితి ప్రస్తుతం కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఆనం ప్రస్తుతం చంద్రబాబు రాజకీయ క్రీడలో ఓ పావుగా మారారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయనను 2016లో ఎమ్మెల్సీ లేదా మంత్రి పదవి ఆశ చూపడంతో టీడీపీలో చేరారు. పచ్చ కండువా కప్పుకోగానే మాట మార్చిన చంద్రబాబు కనీసం ఆత్మకూరు పార్టీ ఇన్‌ఛార్జ్‌గా కూడా ఇవ్వకుండా అవమానించారు. టీడీపీలో జరిగిన అవమానాల్ని తట్టుకోలేక కుమిలిపోతున్న తరుణంలో వైఎస్సార్సీపీ అక్కున చేర్చుకుని వెంకటగిరి నుంచి బరిలోకి దింపి గెలిపించుకుంది. అయితే అక్కున చేర్చుకున్న పార్టీనే కాదనుకున్న ఆనం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయడంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాల్సి వచ్చింది. దీంతో ఆనం టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లి పార్టీ కండువా కప్పుకోకుండానే లోకేశ్ యువగళం పాదయాత్రలో హల్చల్ చేశారు. జిల్లా పార్టీ సారథ్య బాధ్యతలతో పాటు నెల్లూరు సిటీ, ఆత్మకూరు సీట్లు ఇస్తామని టీడీపీ అధినేత నమ్మబలకడంతో ఆనం యువగళంలో పాల్గొన్నారు. తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అ«ధినేత మాట మారింది. జిల్లా పార్టీ సారథ్య బాధ్యతలు కాకుండా.. ఒక్క ఆత్మకూరుకే పరిమితం కావాలని ఆదేశాలొచ్చాయి. ఆత్మకూరులో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. టీడీపీ అంతర్గత సర్వేల్లో కూడా ఈ విషయం తేలడంతో ఆత్మకూరులో పోటీ చేస్తే ఓటమి తప్పదని తెలుసుకున్న ఆనం తనకు నెల్లూరు సిటీ లేదా వెంకటగిరి స్థానాన్ని కేటాయించాలని చంద్రబాబు వద్ద మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆత్మకూరు లేదా సర్వేపల్లిలో పోటీ చేయాలని తెగేసి చెప్పడంతో ఆనంకు దిక్కతోచని పరిస్థితి నెలకొంది. చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోయానంటూ ఆంతరంగికుల వద్ద వాపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఉదయగిరికి చెందిన కొందరు టీడీపీ నేతలు ఆనం వద్దకు వెళ్లి ఉదయగిరి రావాలని ఆహ్వానించగా పార్టీలో తన పరిస్థితి ఏమిటో అర్థం కావటం లేదని వాపోయారని తెలుస్తోంది. కోటంరెడ్డి సీటు వెనుక కుట్ర నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పరిస్థితి కూడా టీడీపీలో అయోమయంగా మారింది. రూరల్ టీడీపీ టికెట్ నీదేనంటూ మాట ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ సీటు జనసేనకు ఇచ్చేందుకు తెరవెనుక రాజకీయం చేస్తున్నారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జిల్లాలో ఒక్క సీటైనా జనసేన అడిగే అవకాశం ఉంది. ముందుగా నెల్లూరు సిటీ మీద జనసేన కన్నుపడింది. అయితే మాజీ మంత్రి పొంగూరు నారాయణ తన సామాజికవర్గంలో ఉన్న పరపతిని ఉపయోగించి జనసేన అధినేత వద్ద పంచాయితీ పెట్టారని, నెల్లూరు సీటు ఆశించకుండా ఉంటే ప్యాకేజీతోపాటు మరోచోట పోటీ చేస్తే అక్కడ అయ్యే ఖర్చంతా తానే భరిస్తానంటూ షరతు పెట్టారని ప్రచారం జరుగుతోంది. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి రూరల్ టికెట్ రాకుండా తెరవెనుక కుట్ర చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. చంద్రశేఖర్‌రెడ్డికి చంద్రబాబు ఝలక్ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఉదయగిరి టికెట్ నీదేనంటూ చంద్రబాబు మాటలు నమ్మి టీడీపీ కండువా కప్పుకున్న చంద్రశేఖర్‌రెడ్డికి చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. అసెంబ్లీ టికెట్ కాదు కదా ఎమ్మెల్సీ కూడా ఇచ్చేది లేదని, ముందు పార్టీకి పనిచేయాలంటూ ఆదేశాలిచ్చారంట. చంద్రశేఖర్‌రెడ్డి సతీమణికి పార్టీ పదవి ఇచ్చి ‘ఈ పదవే నీకు ఎక్కువ ఇక చాలు’ అని చెప్పడంతో చంద్రశేఖర్‌రెడ్డి మైండ్ బ్లాంక్ అయిందని చెప్పుకుంటున్నారు. ఇటుఉదయగిరిలో కూడా టీడీపీ నేతలు చంద్రశేఖర్‌రెడ్డికి కనీస గౌరవంకూడా ఇవ్వటం లేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించక పోవడంతో ఆయన పరిస్థితి కూడా కుడితిలో పడ్డ ఎలుకలా తయారై ఇంటికే పరిమితం అయ్యారనే ప్రచారం సాగుతోంది. -
టీడీపీకి ఆనం షాక్.. అయోమయ స్థితిలో కోటంరెడ్డి
వైఎస్సార్సీపీ కంచుకోటగా పేరొందిన నెల్లూరు జిల్లాలో పాగా వేయడానికి టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఆది నుంచి బెడిసి కొడుతున్నాయి. పార్టీ సీనియర్లకు టికెట్ ఇస్తే ఓటమి తప్పదని, కొత్త వారికి ఇద్దామంటే అభ్యర్థులు దొరకడం లేదని అధిష్టానం తలలు పట్టుకుంటోంది. నెల్లూరు ఎంపీతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల నియామకం ఒక సమస్య అయితే జనసేనతో పొత్తు పచ్చనేతల్లో వర్గపోరుకు దారితీస్తోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్ నుంచి అసెంబ్లీ స్థానం వరకు ఎవరూ బరిలో దిగేందుకు ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో నెల్లూరు పార్లమెంట్ స్థానానికి కొత్త అభ్యర్థి కోసం అధిష్టానం అన్వేషణ చేస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఓటమి చెందారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండడంతో నెల్లూరు పార్లమెంట్ సీటుకు టీడీపీ తరఫున ఎవరు పోటీ చేసినా ఓటమి తప్పదనేది భయంతో పలాయనం చిత్తగిస్తున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో పలు నియోజకవర్గాల నుంచి కొత్త ముఖాలను బరిలోకి దింపాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన పొత్తులో భాగంగా ఆ పార్టీ నేతలు నెల్లూరు సిటీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ప్యాకేజీ ఇచ్చి రూరల్ నియోజకవర్గం వైపు మళ్లించే ప్రయత్నాలు చేయిస్తున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. దీంతో నెల్లూరు రూరల్ తనకే అని అనుకుంటున్న వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. టికెట్ ఇస్తే టీడీపీ తరఫున... లేకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని శ్రీధర్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ► సర్వేపల్లి నుంచి పోటీ చేసేందుకు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నప్పటికీ వరుసగా ఐదుసార్లు ఓటమి చెందిన నేపథ్యంలో ఈసారి కొత్త వ్యక్తిని నిలబెట్టాలని టీడీపీ భావిస్తోంది. అందుకే ఇప్పటి వరకు సోమిరెడ్డి అభ్యర్థిత్వంపై స్పష్టత లేదని సమాచారం. ► కోవూరులో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ దఫా ఆయన కుమారుడు దినేష్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో వైఎస్సార్సీపీకి ఉన్న బలంతో పాటు పోలంరెడ్డిపై ఉన్న వ్యతిరేకత కారణంగా ఇక్కడ కూడా కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ► కావలిలో ఇప్పటికే నలుగురు నేతలు టికెట్ అడుగుతున్నప్పటికీ వీరందరూ మండలస్థాయి నాయకులే. కొత్తగా మైనింగ్ మాఫియా డాన్ డి.వెంకటకృష్ణారెడ్డికి సీటు ఇవ్వాలనుకున్నా ఓటమి తప్పదని సర్వేల్లో తేలింది. దీనికి తోడు క్షేత్రస్థాయిలో టీడీపీ క్యాడర్ కూడా సహకరించే పరిస్థితి లేదు. దీంతో ఇక్కడి అభ్యర్థి ఎవరనేది తేలకుండా ఉంది. ► ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని, ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ టికెట్ మాదే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. పనిలో పనిగా వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నాడు. ఇక బీసీ మార్కుతో చెంచలబాబు యాదవ్ సీటు ఆశిస్తున్నాడు. మరి చంద్రబాబు బ్యాగ్ బరువున్న వ్యక్తుల వైపే చూస్తాడా? సామాజిక న్యాయం వైపు చూస్తాడా అనేది తేలాల్సి ఉంది. ► ఆత్మకూరు నుంచి వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని దింపాలని యోచిస్తున్న టీడీపీకి ఆయన బిగ్‌షాక్ ఇచ్చినట్లు తెలిసింది. ఆత్మకూరు నుంచి పోటీలో ఉండబోనని తెగేసి చెప్పినట్లు సమాచారం. ఇటీవల వరుసగా రెండు దఫాలు ఆయన సొంతంగా సర్వే నిర్వహిస్తే ప్రజాదరణ తక్కువగా ఉన్నట్లు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆనం సైతం ముఖం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. ► కందుకూరు నుంచి ఇంటూరి బ్రదర్స్ మధ్య పోటీ ఉంది. ఇందులో ఇంటూరు నాగేశ్వరరావుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనే ప్రచారం నడుస్తోంది. అయితే వైఎస్సార్సీపీ బలంగా ఉన్న కందుకూరులో టీడీపీ ఓటమి తప్పదని, దీంతో కొత్త వారికి టికెట్ ఇవ్వాలనే ఆలోచనతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఎదురు పెట్టుబడికి సిద్ధంగా అధిష్టానం మొత్తంగా అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలా ఉండడంతో ఆ పార్టీ అధినేత తల పట్టుకున్నట్లు సమాచారం. సీట్ల కోసం డబ్బు మూటలతో వస్తారని ఆశించిన చంద్రబాబుకు పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువు కావడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. అయితే సర్వేపల్లి, కోవూరు, కావలి, కందుకూరు, ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల నుంచి ఆ పార్టీకి అభ్యర్థులు ఉన్నప్పటికీ కనీసం అధికార పార్టీకి ఏ మాత్రం పోటీ ఇచ్చే స్థాయి నేతలు కాకపోవడంతో వీరి స్థానంలో కొత్త వారిని రంగంలోకి దింపాలని టీడీపీ అధినేత యోచన. ఇందుకు బడాబాబులను ఆహ్వానిస్తున్నప్పటికీ పోటీకి వారు కూడా సిద్ధంగా లేకపోవడంతో కొంచెం పెట్టుబడి మీరు పెట్టండి.. మిగతాది పార్టీ చూసుకుంటుందని హామీ ఇస్తున్నారంట. కొత్త వారు దొరక్కపోతే కోవూరు, కందుకూరు, ఉదయగిరిలో పాత వారికే టికెట్లు కేటాయించే అవకాశం ఉంది. సర్వేపల్లి, కావలి, ఆత్మకూరులో కచ్చితంగా కొత్త అభ్యర్థులు వస్తారని తెలుస్తోంది. -
చంద్రబాబు అరెస్ట్‌పై మా ఆనం, కోటంరెడ్డి ఓవరాక్షన్ చూస్తే..
-
ఎమ్మెల్యే కోటంరెడ్డికి షాక్.. గట్టి ఎదురుదెబ్బ!
ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పార్టీకి ద్రోహం చేసి ఫిరాయించారు. మరికొందరిని కూడా వెంట తీసుకెళ్ళారు. కొత్తగా వచ్చిన వైఎస్ఆర్సీ ఇన్చార్జ్ ఫిరాయించిన ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్నారు. ఎమ్మెల్యే వెంట వెళ్లిన నేతలు ఒక్కొక్కరుగా తిరిగి వెనక్కు వస్తున్నారు. తన వెంటే ఉన్నారనుకుంటూ వెనక్కు తిరిగి చూసుకునేలోపే వారు జంప్ చేస్తున్నారట. అధికార పార్టీ పన్నిన వ్యూహంతో ఫిరాయించిన ఎమ్మెల్యే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు?.. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శ్రీధరరెడ్డి వ్యవహారం తేడాగా ఉండటంతో పార్టీ నేతలు కొందరు రెండోసారి ఆయనకు టికెట్ ఇవ్వవద్దని చెప్పినా.. ఆయన మీద నమ్మకంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూరల్ టికెట్ ఇచ్చి గెలిపించారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా అనేకసార్లు తన అనుచరులకు కూడా చెప్పారట. అయితే, మూడోసారి టికెట్ రాదని గ్రహించిన కోటంరెడ్డి.. టీడీపీతో టచ్‌లోకి వెళ్లారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనపై వేటు వేసింది. పార్టీ నుంచి బయటికి వెళుతున్న సమయంలో ఎమ్మెల్యే వెంట 10 మంది కార్పొరేటర్లు, నెల్లూరు మేయర్ స్రవంతి ఉన్నారు. కోటంరెడ్డికి ఎదురుదెబ్బ.. టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని నెల్లూరు రూరల్ టీడీపీ ఇంచార్జీగా నియమించడంతో.. పార్టీలోని ఓ వర్గం ఆయనని వ్యతిరేకిస్తూ వచ్చింది. మేయర్ స్రవంతికి కూడా ప్రాధాన్యత తగ్గింది. రూరల్ ప్రజలు కూడా ఎమ్మెల్యేని పట్టించుకోవటం మానేశారు. దీనికి తోడు ఎమ్మెల్యే కోటంరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డికి.. మేయర్ స్రవంతి దంపతులతో కొంత గ్యాప్ వచ్చింది. మేయర్‌కి ప్రాధాన్యత లేకుండా గిరిధర్ రెడ్డి ప్రతీ విషయంలోనూ అడ్డు తగిలే వారని మేయర్ అనుచరులు చెబుతున్నారు. దీంతో మేయర్ తిరిగి వైఎస్ఆర్సీపీలోకి వచ్చేశారు. ఎమ్మెల్యేను నమ్మి వెంట వచ్చిన మేయర్‌ను ఎమ్మెల్యే సోదరుడు ఇబ్బంది పెట్టారట. గిరిధర్‌రెడ్డి విషయాన్ని మేయర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళితే ఆయన తమ్ముడికే మద్దతు ఇవ్వడంతో మనస్తాపానికి గురైన మేయర్ సొంత పార్టీలోకి వచ్చేశారు. ఎమ్మెల్యేతో ఉండే మరో 8 మంది కార్పొరేటర్లు కూడా వైఎస్ఆర్సీ ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి టచ్‌లోకి వచ్చేశారట. పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెనక్కు వచ్చేస్తామని వేగుల ద్వారా సంకేతాలు పంపిస్తున్నారంటూ టాక్ నడుస్తోంది. అదాల ప్రభాకర్ రెడ్డి మార్క్.. ప్రజల నాడి తెలిసిన నేతగా ఉన్న అదాల ప్రభాకర్ రెడ్డి, ప్రత్యర్ధుల ఎత్తులను చిత్తు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీపై వారు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పి కొడుతూనే.. ఒక్కొక్కరినీ పార్టీలోకి తెస్తున్నారు. పార్టీ మీద అభిమానం ఉండే వాళ్ళని ఆహ్వానిస్తూ.. వారికి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు. దీంతో ఫిరాయించిన ఎమ్మెల్యే వెనుక ఉన్న వారందరూ.. బ్యాక్ టు హోమ్ అన్నట్లుగా వచ్చేస్తున్నారు. దానికి తోడు రూరల్ ఇంచార్జీ గా ఉన్న ఎంపీ ఆదాల ప్రతి డివిజన్ లో కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులు చేస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నాలుగేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చెయ్యలేని పనులు.. ఆదాల చేసి చూపించడం జనాల్లోకి బాగా వెళుతోంది. కోటంరెడ్డికి వెన్నుపోటు తప్పదు.. వచ్చే ఎన్నికల్లో రూరల్ నియోజక వర్గంలో మరోసారి వైసీపీ జెండా ఎగరడం ఖాయమని టీడీపీ కేడర్ కూడా నమ్ముతోంది. టీడీపీలో ఉండే అసంతృప్తులే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వెన్నుపోటు పొడవడం పక్కా అని పార్టీలో చర్చ నడుస్తోంది. దానికి తోడు చంద్రబాబు అరెస్ట్‌తో క్యాడర్లో నైరాశ్యం పెరిగిపోవడం.. చంద్రబాబు అవినీతి చేశాడని కార్యకర్తలు కూడా బలంగా నమ్ముతూ ఉండటంతో.. వైఎస్సార్సీపీలోకి వచ్చేందుకు కీలక నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. -
వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన కోటంరెడ్డి
-
కోటంరెడ్డికి భారీ షాక్..
-
ఫిరాయింపు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి షాక్
-
కోటంరెడ్డి దొంగ డ్రామాలపై బీజేపీ నేతలు ఫైర్
-
కోటంరెడ్డిపై మంత్రి అంబటి కామెంట్స్
-
కోటంరెడ్డి సోదరులకు ఎదురుదెబ్బ
నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ తన ఉనికిని కోల్పోతోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరిన అనంతరం నెల్లూరు ఎంపీ, వైఎస్సార్సీపీ రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలు ప్రాంతాలకు చెందిన వారు అధిక సంఖ్యలో వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. శనివారం రాత్రి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరులు, నెల్లూరు రూరల్ పరిధిలోని 28వ డివిజన్‌కు చెందిన కొండిశెట్టి జగదీష్, 22వ డివిజన్‌కు చెందిన గుంజి రవి ఆధ్వర్యంలో పేర్నాటి ప్రసాద్, అజయ్, చరణ్‌రెడ్డి, పవన్, రాములతోపాటు సుమారు వెయ్యి మంది యువకులు ఎంపీ ఆదాల నివాసంలో ఆయన సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించి ఆదాల నివాసం ఎదుట బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. భారీ గజమాలతో ఎంపీ ఆదాలను సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపునకు సమష్టిగాకృషి చేయాలని పిలుపునిచ్చారు. యువతకు వైఎస్సార్సీపీలో సముచిత స్థానం కల్పిస్తామని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగా రెడ్డి, కార్పొరేటర్లు విజయభాస్కర్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, రైల్వే బోర్డు మెంబర్ వెంకయ్య, మర్రిపాడు జెడ్పీటీసీ సభ్యుడు మల్లు సుధాకర్‌రెడ్డి, టీవీఎస్ కమల్, కాలేషా, రఫీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కక్కిన కూడే పరమాన్నమాయే.. లోకేశ్ కోసమేనా ఇంత హైప్!
మనంతట మనం బెల్లం.. యాలకులు.. చిక్కనిపాలు .. జీడిపప్పు వేసి వండుకుని చేసేదాన్ని పరమాన్నం అంటాం. మరి ఎవరో ఆరగించి కక్కిన కూడు పరమాన్నం అని ఎలా అంటాం?. అంత దిక్కుమాలిన గాచ్చారం ఎవరికీ ఉంటుంది. ఎవరికీ అంటే.. అంతకు మించి మరో మార్గం లేనివాళ్లకు అది తప్ప మరో గతిలేని వాళ్లకు ఆ కక్కిన కూడే మహాభాగ్యం అవుతుంది. టీడీపీ పరిస్థితి సైతం అచ్చం అలాగే ఉంది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వేసి అనైతికానికి పాల్పడి వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి వెలివేతకు గురైన ఆనం రామనారాయణ రెడ్డి (వేంకటగిరి), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి(ఉదయగిరి), కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్) వరుసగా టీడీపీ లీడర్లతో సమావేశమవుతూ వస్తున్నారు. వాళ్లకు మరి వేరే మార్గం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గెంటేశాక వేరే మార్గం లేదు కాబట్టి టీడీపీ గుమ్మానికి వేలాడక తప్పదు. నెల్లూరులో గత ఎన్నికల్లో ఒక సీట్ కూడా గెలవలేక మొత్తం పది సీట్లూ వైఎస్సార్సీపీకి అప్పగించి బిక్కముఖం వేసిన టీడీపీకి ఇప్పుడు సస్పెండ్ అయిన ఈ ముగ్గురే దిక్కయ్యారు. వీళ్ళను వంద తలలు నరికివచ్చిన కాలభైరవుల్లా కీర్తిస్తూ ఎల్లో మీడియా సైతం విస్తృత కవరేజి ఇవ్వడం చూస్తుంటే టీడీపీ వాళ్ళు ఎంత కరువులో ఉన్నారో అర్థం అవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత లీడర్లు పార్టీ నుంచి అవుట్ గోయింగ్ తప్ప ఇన్ కమింగ్ లేక మొహం వాచిపోయిన టీడీపీ, ఎల్లోమీడియాకు కరువులో ఉన్న కుక్కకు వల్లకాట్లో ఎముక దొరికినట్లయింది. దీంతో వారినే రకరకాలుగా చూపిస్తూ ఆషాఢంలో పండగ చేసుకుంటున్నారు. లోకేశ్ కోసమే హైప్.. త్వరలో నెల్లూరులోకి ప్రవేశించనున్న నారా లోకేష్ పాదయాత్రకు హైప్ తేవడానికి తప్ప ఈ ముగ్గురి చేరిక టీడీపీకి ఎందుకూ పనికిరాదన్న విషయం కార్యకర్తలకు అర్థం అవుతూనే ఉంది. వాస్తవానికి చంద్రబాబుకు, టీడీపీకి ప్రజల్లో ఆమోదం ఉంది. గ్రాఫ్ పెరిగితే కనీసం సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీపీలు ఒక్కరైనా చేరాలి కదా. మరి అలాంటి చేరిక ఒక్కటీ లేదు అంటే గత ఎన్నికల్లోనే సీఎం జగన్ చేతిలో చచ్చి మమ్మీగా మారిన శవానికి ఈ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అనే పట్టు చీర కట్టి ఉత్తుత్తి ముస్తాబు చేయడం తప్ప శవం లేచేది లేదని గ్రామస్థాయిలో కార్యకర్తలు చెవులుకొరుక్కుంటున్నారు టీడీపీలో గొడవల మాటేమిటి.. మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకున్నట్లు ఉంది టీడీపీ తీరు. ఆల్రెడీ టీడీపీలో కొన్నాళ్లుగా ఉంటూ వస్తున్న నాయకుల మధ్య తలెత్తుతున్న గొడవలు సర్దుబాటు చేయడం వదిలేసి వైఎస్సార్సీపీ నుంచి వెలివేతకు గురైన వాళ్ళను చూసి పండగ చేసుకుంటున్నట్లు ఉంది. ఇప్పటికే విజయవాడలో పార్టీకి నిప్పెట్టేసి దూరం నుంచి చలి కాస్తున్న కేశినేని నానిని ఏమీ చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు అటు సత్తెనపల్లిలో కోడెల శివరామ్ చేస్తున్న గాయి గత్తరను సైతం వినే ధైర్యం చేయడం లేదు. ఇక గన్నవరంలో తంగిరాల సౌమ్య ఆర్తనాదాలు అరణ్యరోదనే అవుతున్నాయి. ఇక ఫారిన్ నుంచి నేరుగా సూట్ కేసులతో దిగిపోయి డబ్బుతో చంద్రబాబును కొట్టి చిలకలూరిపేటలో పత్తిపాటి పుల్లారావుకు నిద్రలేని రాత్రులు పరిచయం చేసిన భాష్యం ప్రవీణ్ వ్యవహారం సైతం ఒక తలనొప్పి. రాత్రికి రాత్రి ఫారిన్ నుంచి దిగిపోయి అక్కడక్కడా సేవలు పేరిట ఈవెంట్స్ చేస్తే సరిపోతుందా? మరి మేము ఏమవ్వాలి అని వెక్కివెక్కి ఏడుస్తున్న పుల్లరావు ఆవేదన ఎవరికి వినబడడం లేదు. ప్రస్తుతానికి కొన్నాళ్ళు ఈ వైస్సార్సీపీ ఎమ్మెల్యేలతో ఈవెంట్ నడపడం తప్ప వేరే మార్గం లేదని చంద్రబాబుకు అర్థం అయింది. ఇది కూడా చదవండి: జేపీ నడ్డా వ్యాఖ్యలపై పేర్ని నాని కౌంటర్ -
ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, అమరావతి: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనపై ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు హత్యాయత్నం కింద నమోదైన కేసులో దర్యాప్తు నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. కేసు ప్రాథమిక దశలో ఉన్నందున దర్యాప్తును నిలిపివేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఫిర్యాదుదారు వాదన వినకుండా ఉత్తర్వులు ఇవ్వడం కూడా సాధ్యం కాదంది. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ఫిర్యాదుదారు వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని గుర్తు చేసింది. ఒకవేళ ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే మిగిలిన కేసుల్లో కూడా ఇలాంటి పిటిషన్లు కోకొల్లలుగా దాఖలవుతాయని తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఫిర్యాదుదారు మాతంగి వెంకటకృష్ణను, పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై జస్టిస్ శ్రీనివాసరెడ్డి గురువారం విచారణ జరిపారు. పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే ముందు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద ఫిర్యాదుదారు వాదన వినడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంగా చెప్పిందని ఉదాహరణలతో వివరించారు. శ్రీధర్‌రెడ్డిపై నమోదైన కేసు ప్రాథమిక దశలోనే ఉందని తెలిపారు. అంతకు ముందు శ్రీధర్‌రెడ్డి తరపు న్యాయవాది తప్పెట నాగార్జునరెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాజకీయ కారణాలతో కేసు నమోదు చేశారన్నారు. పిటిషనర్ విషయంలో ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. -
‘జాగ్రత్త నీ జాతకం మొత్తం ఉంది’.. కోటంరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటంరెడ్డి ఆరోపణల్లో వాస్తవాలు లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. ‘కోటంరెడ్డి చెప్పింది అబద్దమని శివారెడ్డి చెబుతున్నారు. శ్రీధర్‌రెడ్డి ఆరోపణల్లో వాస్తవాలు లేవు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. జరగని విషయాన్ని జరిగినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆడియో రికార్డులను ట్యాపింగ్ అని చెబుతున్నారు. జరిగింది ఫోన్ ట్రాప్ కాదు.. చంద్రబాబు ట్రాప్. శ్రీధర్ రెడ్డి అబద్ధాలకు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోంది. ట్యాపింగ్ ఆరోపణలు నిజమైతే కోర్టుకు ఎందుకు వెళ్లలేదు. తనకు అండగా నిలిచిన పార్టీకే కోటంరెడ్డి ద్రోహం చేశాడు. అందుకే కోటంరెడ్డికి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వాపును చూసి బలమనుకుని భ్రమపడుతున్నాడు. ప్రజలంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉన్నారు’ అని కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగానే ఆదాల ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రతీరోజు శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశాల్లో పచ్చి డ్రామాలు వేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈరోజు వరకు నేను ఎలాంటి మచ్చ లేకుండా రాజకీయాలు చేశాను. ఈ మూడున్నర ఏళ్లలో నువ్వు ఎన్ని అరాచకాలు చేశావో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నీకు పార్టీ, కార్యకర్తలు అవసరం లేదు. డబ్బు మీదు నీకు ప్రేమ ఎక్కువ అందుకే ఎలాంటి పనిచేయడానికైనా నువ్వు వెనుకాడలేదు. శ్రీధర్ రెడ్డి జాతకం మొత్తం త్వరలో బయటకు వస్తుంది. కొన్ని రోజుల్లోనే ప్రజలకు నీ గురించి అన్ని విషయాలను చెబుతున్నారు. నువ్వు ప్రజలను, రియల్టర్లను, వ్యాపారులను ఎలా బెదిరించావో అందరకీ తెలుసు. ఇకనైనా జాగ్రత్తగా ఉండు’ అని వార్నింగ్ ఇచ్చారు -
ట్యాపింగ్ కాదది.. రికార్డింగే
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో రాజకీయం చేయడానికి ఏ సమస్యా లేకపోవడంతో జరగనే జరగని ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు చిత్రీకరించి.. దానిని జాతీయ సమస్యగా సృష్టించి, పోరాటం చేసే స్థాయికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దిగజారారు. ఈ కుట్రలో కోటంరెడ్డి పాత్రధారి. ఇందులో భాగంగా కోటంరెడ్డి ప్రభుత్వంపై బురద చల్లి పార్టీ వీడాలనుకోవడం దారుణం. ఇంతకూ రికార్డ్ చేసింది కోటంరెడ్డి మిత్రుడే’ అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, విద్యుత్, అటవీ, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. గురువారం వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. టీడీపీ రాజకీయ లబ్ధి కోసమే.. ‘నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్ సంభాషణను ఆయన మిత్రుడే రికార్డింగ్ చేసి.. అందరికీ పంపారు. బయట సర్క్యులేట్ అవుతున్న ఆ ఆడియో క్లిప్‌ను ఇంటెలిజెన్స్ అధికారి కోటంరెడ్డికి పంపి, సరి చూసుకోవాలని సూచించారు. వైఎస్సార్సీపీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి... టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో సమావేశమయ్యాక.. 2024లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పిన మాటల ఆడియో కూడా సర్క్యులేట్ అవుతోంది. చంద్రబాబుతోనూ లోకేశ్‌తోనూ కోటంరెడ్డి ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని టీడీపీ నేతలే చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే.. చంద్రబాబుతో కోటంరెడ్డి సంప్రదింపులు జరుపుతున్నట్లుగా మేం అప్పుడే గుర్తించేవాళ్లం కాదా? టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ద్వారా చంద్రబాబు.. మా ఫోన్లను ట్యాపింగ్ చేశారని.. దానిపై న్యాయస్థానంలో కేసు కూడా వేశాం. వాళ్లలాగే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు రాజకీయ లబ్ధి కోసం టీడీపీ కుట్ర పూరితంగా చిత్రీకరిస్తోంది.’ – సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు టీడీపీలో చేరే వారు బావిలో దూకినట్లే ‘ఇష్టం లేనివారు టీడీపీలోకి వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చు. కానీ ప్రభుత్వంపై, వైఎస్సార్సీపీపై బురదజల్లాలనుకోవడం సమంజసం కాదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీని స్థాపించకపోతే నీలాంటి వాళ్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యేవారా? కోటంరెడ్డి ఆరోపిస్తున్నట్లుగా అది ఫోన్ ట్యాపింగ్ కానే కాదు. ఆయన మిత్రుడే రికార్డ్ చేశారన్న విషయం కోటంరెడ్డికి కూడా తెలుసు. ఇదంతా చంద్రబాబు కుట్ర. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలకు సీఎం వైఎస్ జగన్ భయపడరు. టీడీపీలో చేరే ఎమ్మెల్యేలు బావిలో దూకినట్టే. కోటంరెడ్డిలాంటి వాళ్లు వెళ్లినా వైఎస్సార్సీపీకి వచ్చే నష్టమేమీ ఉండదు. లోకేశ్ పాదయాత్ర టీడీపీకి గుదిబండగా మారుతుంది.’ – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యుత్, అటవీ, గనుల శాఖ మంత్రి డిసెంబర్ 25న బాబును కలిశారు ‘నీ ఫోన్ సంభాషణను నీ మిత్రుడు రామశివారెడ్డి రికార్డ్ చేసి, అందరికీ పంపారు. అది బయట సర్క్యులేట్ అవుతుంటే.. ఇంటెలిజెన్స్ అధికారి దాన్ని నీకు వాట్సాప్‌లో పంపి.. సరి చూసుకోవాలని సూచించడంలో తప్పేముంది? ఇది వాస్తవం కాదంటే.. నీ ఫోన్‌కు సంబంధించి గత ఆర్నెల్ల వాట్సాప్ డేటాను బహిర్గతం చేయగలవా? కోటంరెడ్డిని సీఎం జగన్ ఎంతగానో నమ్మితే.. ఇలా నమ్మక ద్రోహానికి పాల్పడటం తగదు. డిసెంబర్ 25న బ్లూ కలర్ బెంజ్ కారులో చంద్రబాబు ఇంటికి కోటంరెడ్డి వచ్చి.. రెండు గంటలపాటు మాట్లాడి వెళ్లారు. ఇదివరకటిలాగే మాజీ మంత్రి నారాయణతో సంబంధాలు కొనసాగించాలని బాబు చెప్పారు. లోకేశ్‌తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. పాదయాత్రకు ముందు లోకేశ్ సలహాలు కూడా అడిగారు. కోటంరెడ్డి ఆస్పత్రిలో ఉన్నప్పుడు లోకేశ్ ఫోన్ ద్వారా పరామర్శించారు అని టీడీపీ నేతలు, కోటంరెడ్డి పక్కనున్న వారే చెబుతున్నారు.’ – పేర్ని నాని, మాజీ మంత్రి -
'సీఎం జగన్‌కు నమ్మకం తప్ప అనుమానాలు లేవు'
తాడేపల్లి: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలను మాజీ మంత్రి కొడాలి నాని తిప్పికొట్టారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. ఆ పని చేయడం చంద్రబాబుకే అలవాటు అని పేర్కొన్నారు. సీఎం జగన్ వల్లే తనకు పదవి వచ్చిందని కోటంరెడ్డి అనేక సార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈయనకు చంద్రబాబు మంత్రి పదవి ఆఫర్ చేసినట్టున్నారని, పార్టీ మారాలనుకున్నాడు కాబట్టే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. పార్టీ నుంచి ఇలాంటి వారు పోతేనే మంచిదని చెప్పారు. సీఎం జగన్ బలహీన వర్గాలకు పదవులు ఇస్తున్నారని కొడాలి చెప్పారు. బలమైన వర్గాలకు పదవులిస్తే బలహీన వర్గాలు ఏమై పోవాలని ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్‌కు అబద్దాలు చెప్పడం చేతకాదని, ఏదైనా ముక్కుసూటిగా చెబుతారుని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్‌ను ఏం చేయలేకపోయారని, ఇప్పుడు ఏం చేయగలరని ప్రశ్నించారు. 'ఐఫోన్ నుంచి ఐఫోన్ రికార్డు కాదని ఎవరు చెప్పారు? మాకందిన సమాచారం పోలీసులతో పంచుకోవడం సహజమే ఇంటెలిజెన్స్ డీజీ కూడా ప్రభుత్వంలో భాగమే. డీజీ ఎమ్మెల్యేలకు మెసేజ్‌లు పెట్టకూడదా? సీఎం జగన్‌కు నమ్మకం తప్ప అనుమానాలు లేవు. ఆయన బీ ఫారం ఇస్తానంటే.. నెల్లూరు నుంచి జనం క్యూ కడతారు.' అని కొడాలి పేర్కొన్నారు. పేర్ని నాని రియాక్షన్.. మాజీ మంత్రి పేర్ని నాని కూడా కోటంరెడ్డి ఆరోపణలపై స్పందించారు. ప్రతి ఫోన్లో రికార్డింగ్ యాప్ ఉంటుందన్నారు. ప్రతి కాల్ రికార్డు చేసి సర్క్యూలేట్ చేయవచ్చని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరిగితే మూడు నెలల కిందే చెప్పొచ్చు కదా? అని ప్రశ్నించారు. సానుభూతి కోసమే కోటంరెడ్డి ఇదంతా చేస్తున్నాడని విమర్శించారు. 'ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. వెళ్లిపోవడానికి నిర్ణయించుకుని ప్రభుత్వంపై బురద వేస్తున్నావా? ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్ప ఇంకే పని ఉండదా? మేం ట్యాపింగ్ సాఫ్ట్‌వేర్‌ను కొనలేదు. జగన్ పార్టీ పెట్టకపోతే ఇంతమంది ఎమ్మెల్యేలు అయ్యేవారా?' అని పేర్ని వ్యాఖ్యానించారు. చదవండి: 'కోటంరెడ్డి బ్రదర్స్ తినే ప్రతి మెతుకు సీఎం జగన్ పెట్టిన భిక్షే' -
భారీ వర్షం: నెల్లూరు జలమయం
సాక్షి, నెల్లూరు: జిల్లాలో బుధవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు నగరంలోని పలుచోట్ల రోడ్లు, లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు పొంగిపొర్లుతోంది. భారీ వర్షానికి కోవూరు ప్రాంతంలో నారుమళ్లు నీటి మునిగియి. మాగుంట లే ఔట్లో అండర్ బ్రిడ్జి కింద ప్రవహిస్తున్న నీటిలో ఆర్టీసీ బస్సు ఇరుక్కుపోయింది. భారీ వర్షాలకు అస్తవ్యస్తమైన పలు ప్రాంతాలు, రూరల్ పరిధి డివిజన్లలో స్థానిక వెఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గురువారం పర్యటించారు. రైల్వే పనులు వల్లే ఈ పరిస్థితి ఎదురైందని, కార్పొరేషన్ అధికారులతో రైల్వే శాఖ సమన్వయం చేసుకోకుండా పనులు చేస్తుండటం వల్లనే ఈ దుస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు. వర్షపు నీళ్లు సాధ్యమైనంత త్వరగా బయటకు పంపించి, పరిస్థితిని పునరుద్ధరిస్తాం శ్రీధర్‌రెడ్డి తెలిపారు. -
ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి సీఎం జగన్ పరామర్శ
నెల్లూరు : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఫోన్లో పరామర్శించారు. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి శనివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసుకున్న సీఎం ఫోన్ చేసి మాట్లాడారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నెల్లూరులో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీధర్‌రెడ్డి చెన్నై అపోలో ఆస్పత్రికి వెళ్లారు. -
ఎమ్మెల్యే కోటంరెడ్డికి మాతృ వియోగం
నెల్లూరు(సెంట్రల్): నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తల్లి మృతి చెందారు. ఆయన తల్లి సరళమ్మ శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు. సంగం మండలం పడమటిపాళెంలో శనివారం ఉదయం 10.30 గంటలకు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. విషాదంలో పడమటిపాళెం సంగం: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తల్లి కోటంరెడ్డి సరళమ్మ (72) మృతితో సంగం మండలం పడమటిపాళెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతి విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమె గతంలో తమకు చేసిన సాయాన్ని గుర్తుచేసుకుంటూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఆమె భౌతికకాయానికి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. రోదించిన ఎమ్మెల్యే తల్లి మృతి చెందారనే సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పడమటిపాళేనికి శుక్రవారం రాత్రి చేరుకున్నారు. తల్లి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కన్నీరు పెట్టడం చూసి గ్రామస్తులు, స్నేహితులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. రెండో కుమారుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ కార్యాలయ ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సరళమ్మ మృతదేహానికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఏసునాయుడు, విజయా డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సంతాపం వ్యక్తం చేసిన మంత్రి మేకపాటి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తల్లి సరళమ్మ ఆకస్మిక మృతికి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నియోజకవర్గ ప్రజలను కుటుంబంలా చూసుకునే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ధైర్యంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. నివాళులర్పించిన కాకాణి నెల్లూరు(సెంట్రల్): నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తల్లి సరళమ్మ పార్థివదేహానికి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సంగం మండలం పడమటిపాళెంలో నివాళులర్పించారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
పేదలకు అండగా ఉంటాం
-
టీడీపీకి మరోసారి షాక్
సాక్షి, నెల్లూరు: టీడీపీకి మరోసారి షాక్ తగిలింది. నెల్లూరు జిల్లా టీడీపీ అధికార ప్రధానిధి సీ.ఎచ్. హరిబాబు యాదవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో మంతనాలు జరిపారు. దీంతో హరిబాబు త్వరలో వైఎస్సార్సీపీ పార్టీలోకి చేరనున్నట్లు సమాచారం. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వెంకటాచలం మండలం, సర్వేపల్లికి చెందిన 70 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరారు. పెదకాకానికి చెందిన 40 కుటుంబాల టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య వారికి పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించారు. పశ్చిమగోదావరి: ఉండి మండలం చిలుకూరులో టీడీపీ ఖాళీ అయింది. మాజీ ఏఎంసీ చైర్మన్ చిలుకూరి నరసింహరాజు, గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు ముదునూరి సోమరాజు, రెండువందల మంది టీడీపీ కార్యకర్తలు ఉండి వైఎస్సార్సీపీ ఇంచార్జి పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. కృష్ణా: గంపలగూడెం మండలం దుందిరాలపాడులో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వంద మంది వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి మండల పార్టీ కన్వీనర్ చావా వెంకటేశ్వరరావు సాదరంగా ఆహ్వానించారు. -
శాసనసభ హక్కుల కమిటీ చైర్మన్‌గా కాకాణి
సాక్షి, నెల్లూరు: రాష్ట్ర శాసనసభ కమిటీల్లో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు ఆగ్ర తాంబూలం దక్కింది. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం వివిధ కమిటీలకు చైర్మన్లను, సభ్యులను నియమించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిని శాసనసభ హక్కుల కమిటీ చైర్మన్‌గా నియమించారు. అలాగే శాసనసభ రూల్స్ కమిటీలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని, శాసనసభ పిటిషన్స్ కమిటీ సభ్యుడిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని నియమించారు. అలాగే ప్రివిలేజ్ కమిటీలో సభ్యుడిగా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్‌ను నియమించారు. అసెంబ్లీ నిర్వహణ, విధివిధానాల అమలు, సభ్యుల హక్కుల పరిరక్షణలో కమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించనున్నాయి. -
లోకేశ్ దీక్షలా.. జనం నవ్వుకుంటున్నారు!
-
నెల్లూరు జిల్లా టీడీపీకి మరో షాక్
-
ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్
నెల్లూరు(సెంట్రల్)/సాక్షి, అమరావతి: తన ఇంటిపై దాడి చేశారని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీఓ సరళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నెల్లూరు రూరల్ పోలీసులు ఆదివారం ఉదయం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని అరెస్టు చేశారు. ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించి, రూరల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇదే కేసులో ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్సీపీ నేత బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డిని కూడా అరెస్టు చేశారు. ఎమ్మెల్యేను, శ్రీకాంత్‌రెడ్డిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, బెయిల్ మంజూరు చేశారు. దౌర్జన్యం చేశానని నిరూపిస్తే క్షమాపణ చెబుతా.. తాను ఏ తప్పూ చేయలేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీడీఓ సరళ ఇంటిపై తాను దాడి చేశాననడం అవాస్తవం అని చెప్పారు. సరళ తనకు సోదరితో సమానమని పేర్కొన్నారు. ఆమె తల్లి తనకు తల్లితో సమానమన్నారు. తన సన్నిహితుడికి సంబంధించిన లేఔట్ విషయంలో మంచినీటి కుళాయి ఇవ్వాలని గతంలో అడిగాను తప్ప ఏనాడూ ఆమెను తిట్టడం గానీ, ఆమె ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేయడం గానీ చేయలేదన్నారు. ప్రభుత్వం నిజనిర్ధారణ కమిటీ వేసి, విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. తాను ఎంపీడీఓ విషయంలో తప్పు చేసి ఉంటే తనను పార్టీ నుంచి షోకాజ్ నోటీసు ఇవ్వకుండా బహిష్కరించవచ్చని అన్నారు. తాను ఎంపీడీఓ ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేశానని నిరూపిస్తే సరళకు క్షమాపణ చెప్పడంతో పాటు, ఆమె తల్లికి కూడా క్షమాపణ చెబుతానన్నారు. నెల్లూరు ఎస్పీ పక్షపాతంగా అర్ధరాత్రులు వచ్చి, తన ఇంటి వద్ద హడావుడి చేసి అరెస్టు చేశారని శ్రీధర్‌రెడ్డి ఆక్షేపించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులపై దాడులు జరిగినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. ఇప్పుడు ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించడం అభినందనీయమని అన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది: ఎంపీడీఓ సరళ తన ఇంటిపై దాడి జరిగిన ఫలితంగా ఇకపై ఉద్యోగం చేయగలమా అనే పరిస్థితుల్లో.. ఇంకెవరికీ ఇలా జరగకూడదనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని వెంకటాచలం ఎంపీడీఓ సరళ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించిన తీరు ఉద్యోగులందరికీ ఒక భరోసా, ధైర్యం, నమ్మకాన్ని కలిగించిందని తెలిపారు. స్వేచ్ఛగా పనిచేయగలిగే ధైర్యాన్ని ముఖ్యమంత్రి కల్పించారని అన్నారు. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి కాపాడారని చెప్పారు. ప్రభుత్వంపై ఉద్యోగులకు నమ్మకం పెరిగిందన్నారు. సీఎంకు ఏపీ జేఏసీ ధన్యవాదాలు ఎంపీడీఓ సరళ ఫిర్యాదుపై స్పందించి, జరిగిన సంఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏపీ జేఏసీ–అమరావతి ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు ఏపీ జేఏసీ నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఫణి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వెంకటాచలం ఎంపీడీఓ సరళపై ఇంటిపై దాడి ఘటనలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన అనుచరులను అరెస్టు చేయడం పట్ల ఏపీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. అధికారం చేపట్టిన అనతి కాలంలోనే అన్ని వసతులు కల్పిస్తూ వైఎస్ జగన్ ఉద్యోగుల పక్షపాతిగా పేరొందారని వెల్లడించింది. ఉద్యోగులపై దాడి జరిగినప్పుడు అండగా నిలిచి, వెంటనే చర్యలు చేపట్టడం పట్ల ధన్యవాదాలు తెలియజేసింది. -
నెల్లూరు ఘటనపై సీఎం ఆరా
-
నెల్లూరు ఘటనపై సీఎం సీరియస్
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లాలో చోటుచేసుకున్న ఘటనపై సీఎం వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. అధికారులతో అనుచితంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దని డీజీపీ గౌతం సవాంగ్‌కు స్పష్టం చేశారు. తప్పు చేసినట్లు తగిన ఆధారాలుంటే చట్ట ప్రకారం ఏ చర్యకైనా వెనుకాడవద్దని ఆదేశించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అతని అనుచరులు తన ఇంటిపైకి వచ్చి రభస సృష్టించారని వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో భేటీ అయిన ముఖ్యమంత్రి రాత్రికి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అనంతరం ఈ ఘటన వివరాలు డీజీపీ నుంచి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. చట్టం ఎదుట అందరూ సమానమేనని, చట్టం అమలు విషయంలో స్వేచ్ఛగా పని చేసుకోవాలని, ఈ అంశంలో ఎవరికీ మినహాయింపులు ఉండబోవని సీఎం హెచ్చరించారు. -
దాడి చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం
సాక్షి, నెల్లూరు : డోలేంద్ర ప్రసాద్‌పై తాను దాడి చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. నెల్లూరులోని రూరల్ వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 11వ తేదీ రాత్రి తాను డోలేంద్ర ప్రసాద్‌పై దాడి చేసి, ఎవరినో కిడ్నాప్ చేశానని కేసు నమోదు చేయించారని, అప్పుడు తాను మద్యం మత్తులో ఉన్నానని చెప్పడం జరిగిందన్నారు. తనకు ప్రసాద్ 1981 సంవత్సరం నుంచి తెలుసన్నారు. రెండు విషయాల్లో విభేదాలు తనకు డోలేంద్ర ప్రసాద్‌కు రెండు విషయాల్లో విభేదాలు వచ్చాయన్నారు. ఎన్నికలకు మూడునెలల ముందు డోలంద్ర నా వద్దకు వచ్చారని ఎమ్మెల్యే వెల్లడించారు. ‘చంద్రబాబుతో అంతా మాట్లాడాను. నేను చెప్పినట్లే సీట్లు ఇస్తామన్నారు. టీడీపీలో చేరి రూరల్ నుంచి పోటీ చేయి. ఖర్చంతా చంద్రబాబే చూసుకుంటారు. ఈసారి టీడీపీ ప్రభుత్వమే వస్తుంది’ అని డోలేంద్ర తనకు చెప్పారన్నారు. తాను దీనిని వ్యతిరేకించి రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ఆయనతోనే నా ప్రయాణం తప్ప, ఇంకో పార్టీ మారేది లేదని తెగేసి చెప్పానని కోటంరెడ్డి తెలిపారు. అలాగే ‘కస్తూరీదేవి స్కూల్ విషయలో తనను ఉద్యమం చేయమన్నారు. అయితే ఉద్యమం చేసేందుకు అక్కడేముందని అడిగాను. జీవీకే సంస్థ కూడా స్కూల్లో జీతాలు, కార్పొరేట్ స్థాయిలో పేద విద్యార్థులకు విద్యను, ఇతర వసతులు కల్పిస్తానని చెప్పడం జరిగింది. ఇక ఎందుకు ఉద్యమం చేయాలి’ తాను డోలేంద్రతో అనడంతో కక్ష కట్టినట్టుగా ఉన్నారని చెప్పారు. ప్రమాణం చేస్తారా? డోలేంద్ర ప్రసాద్ ఫోన్ చేసి మాట్లాడాలని, ఎక్కడ ఉన్నావో చెబితే వస్తానని అడిగారని ఎమ్మెల్యే వెల్లడించారు. అయితే మీరెందుకు తానే వస్తానని ప్రసాద్‌కు చెప్పి 11వ తేదీ రాత్రి ఆయన ఇంటికి వెళ్లడం జరిగిందన్నారు. అయితే అప్పటికే అతను మద్యం మత్తులో ఉన్నాడని ఎమ్మెల్యే తెలిపారు. కస్తూరీదేవి విద్యాలయానికి వెళుతున్నావని తెలిసిందని, అక్కడ ఉద్యమం చేయాలని తనతో డోలేంద్ర అన్నారన్నారు. అయితే తాను ఎందుకు ఉద్యమం చేయాలని ప్రశ్నించడం జరిగిందన్నారు. ఈ మాటతో జీవీకే వారికి అమ్ముడుపోయావని తనను ప్రసాద్ అన్నారని, తాను కల్పించుకుని ఎక్కడ ఏ సమస్య ఉన్నా నిజాయితీగా పోరాటం చేస్తానని, గతంలో ఈ సమస్యపై 72 రోజులు పోరాటం చేసిన వ్యక్తిని అని చెప్పడంతోపాటు, ఎవరు ఎవరికి అమ్ముడుపోయారో జిల్లాలోని అందరికీ తెలుసని చెప్పానన్నారు. ఈ విషయంపై మాత్రమే మాట్లాడి వచ్చేశానన్నారు. అక్కడే తమ కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉన్న డాక్టర్ వసుంధర కూడా ఉన్నారన్నారు. ఈ విషయాన్ని వక్రీకరిస్తూ తాను మద్యం మత్తులో దాడి చేసినట్లుగా పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారన్నారు. దీంతోపాటు ఎవరినో కిడ్నాప్ చేసినట్లుగా కూడా కేసు పెట్టడం జరిగిందన్నారు. కాగా ప్రత్యక్ష సాక్షి అయిన వసుంధర ఏమి చెప్పిందో స్టేషన్లో అందరూ తెలుసుకోవచ్చన్నారు. తాను మద్యం మత్తులో ఉన్నట్లు మీ బిడ్డలపై ప్రమాణం చేయడానికి సిద్ధమా అని డోలేంద్రకు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి సవాల్ విసిరారు. అయితే తాను దాడి చేసినట్లుగా కేసు పెట్టిన వ్యక్తి ఆ సమయంలో వైద్యశాలకు ఎందుకు వెళ్లలేదో చెప్పాలన్నారు. తాను ఎప్పుడూ హింసకు దూరమని, గాంధీగిరి పద్ధతిలోనే సమస్యలకు పరిష్కారం చూపే తనపై ఈ విధంగా ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. డోలేంద్ర చేస్తున్న అవినీతిని, దుర్మార్గాలను అడ్డుకుంటానన్నారు. పత్రిక ముసుగులో చేస్తున్న బ్లాక్‌మెయిల్‌ను, అవినీతి, అక్రమాలను అడ్డుకుంటానన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రూప్‌కుమార్ యాదవ్, నాయకులు తాటి వెంకటేశ్వర్లు, బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, బొబ్బల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కేసు నమోదు నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, అతని అనుచరులపై దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఈనెల 11వ తేదీ రాత్రి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన అనుచరులు తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి దాడి చేశారని లెక్చరర్స్‌కాలనీలో నివాసం ఉంటున్న జమీన్రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ దర్గామిట్ట పోలీసులకు లిఖిత ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేతోపాటు ఆయన పీఏ విష్ణు, మురళీకృష్ణ యాదవ్, సురేష్, మరో ఇద్దరిపై దర్గామిట్ట పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
క్లీన్ సిటీగా నెల్లూరు
సాక్షి, నెల్లూరు : ‘నెల్లూరును అద్భుతంగా చేస్తానని మాటలు చెప్పను..నెల్లూరును క్లీన్‌సిటీగా మాత్రం తీర్చిదిద్దుతాం’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ పీ అనిల్‌కుమార్‌యాదవ్ తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం సాయంత్రం కార్పొరేషన్ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ ప్రత్యేక అధికారి శేషగిరిబాబు, కమిషనర్ అలీంబాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, నెల్లూరు ప్రజల ఆశీస్సులతో తనకు మంత్రిగా అవకాశం వచ్చిందన్నారు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పారదర్శక పాలనను అందిస్తామన్నారు. ప్రజలు పన్ను రూపంలో కార్పొరేషన్‌కు చెల్లించే ప్రతి రూపాయికి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటానన్నారు. నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు. నగరం అందాల పేరుతో ప్రజల ఆరోగ్యాలను విస్మరించకుండా క్లీన్ నెల్లూరుగా చేసి చూపిస్తామన్నారు. ఇటీవల అధిక ఉష్ణోగ్రతల కారణంగా నీటి సమస్య తలెత్తిందన్నారు. భూగర్భజలాలు అడుగంటాయన్నారు. భవిష్యత్తులో తాగునీటి సమస్య తలెత్తకుండా వర్షపు నీటిని భూమిలో నిల్వ చేసేలా ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తామన్నారు. ఫ్లెక్సీలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూస్తామన్నారు, ఫ్లెక్సీల పన్నులను ఆన్లైన్లో కార్పొరేషన్‌కు చెల్లించేలా చర్యలు చేపడుతామన్నారు. కార్పొరేషన్ వాహనాలకు జీపీఎస్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. భూగర్భడ్రైనేజీ కనెక్షన్‌కు ప్రతి ఇంటికీ రూ.5వేల నుంచి రూ.6వేల వరకు ఖర్చవుతుందని, ప్రజలపై ఆ భారం లేకుండా చూస్తామన్నారు. ముఖ్యంగా తెల్లరేషన్ కార్డుదారులకు వెసులుబాటు కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్యాకేజీ విధానానికి స్వస్తి కాంట్రాక్ట్ పనులను ప్యాకేజీల రూపంలో నాలుగు నుంచి ఐదు శాతం ఎక్కువ మొత్తానికి భారీ కంపెనీలకు అప్పగించే విధానానికి స్వస్తి పలుకుతామని మంత్రి అనిల్‌కుమార్ తెలిపారు. కార్పొరేషన్లో చేపట్టే అభివృద్ధి పనులకు టెండర్లు నిర్వహిస్తామన్నారు. 150 మందికిపైగా కాంట్రాక్టర్లకు అనుమతి ఇచ్చి తక్కువ మొత్తానికి కోడ్ చేసిన వారికి పనులు అప్పగిస్తామన్నారు. అభివృద్ధి పనులపై అన్ని పార్టీల నాయకులతో సమీక్షలు నిర్వహించి వారి అభిప్రాయాలను తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, మాజీ కార్పొరేటర్లు పీ రూప్‌కుమార్‌యాదవ్, ఆనం రంగమయూర్‌రెడ్డి, లక్ష్మీసునంద, నూనె మల్లికార్జున్‌యాదవ్, అడిషనల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, హెల్త్‌ఆఫీసర్ వెంకటరమణ, ఎస్ఈ రవికృష్ణంరాజు, తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నేతల అరాచకం
నెల్లూరు(సెంట్రల్): అధికారం పోతుందనే ఆక్రోశం, ఆందోళనతో టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడుతున్నారు. నగరంలో ఏది జరిగినా దాన్ని వైఎస్సార్‌సీపీపైకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నగరంలో టీఎన్ఎస్ఎఫ్ నేత తిరుమలనాయుడుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం దాడి చేశారు. ఈ దాడిని నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అనుచరులు చేశారంటూ టీడీపీ నేతలు విషప్రచారం మొదలు పెట్టారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర నుంచి ప్రతి ఒక్కరూ హడావుడిగా మొత్తం ఇది వైఎస్సార్సీపీ అరాచకాలు చేస్తుందంటూ ప్రచారాలు మొదలు పెట్టా రు. తిరుమలనాయుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ ఐదేళ్లలో ఎన్నో వివాదాలు సృష్టించారు. ఎంతో మందితో వ్యక్తిగత వైరం ఉన్నట్లు తెలుస్తోంది. అతని వ్యక్తి గత గొడవల నేపథ్యంలో జరిగిన దాడిని వైఎస్సార్సీపీ నాయకులు చేశారంటూ ప్రచారం చేయడం మొదలు పెట్టారు. వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి తిరుమలనాయుడుపై వ్యక్తిగత కారణాలతో దాడి జరిగితే దాన్ని వైఎస్సార్సీపీ చేసినట్లు సృష్టించిన టీడీపీ నాయకులు, తక్షణమే మేయర్ అబ్దుల్ అజీజ్ సోదరులు అబ్దుల్జలీల్ 50 మందిని వెంట వేసుకుని రూరల్ వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి చేశారు. ఎమ్మెల్యేకు చెందిన ఫ్లెక్సీలు చించివేయడమే కాకుండా, కార్యాలయంలో నానా బీభత్సం సృష్టించారు. బీద రవిచంద్ర ఆదేశాలతో మేయర్ అబ్దుల్ అజీజ్ సోదరుడు అబ్దుల్ జలీల్ అరాచకానికి పాల్పడ్డాడు. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ టీడీపీ ఓడిపోతుందనే భయంతో టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడుతున్నారంటూ చర్చించుకున్నారు. పోలీసుల ప్రేక్షక పాత్ర టీఎన్ఎస్ఎఫ్ నాయకుడిపై దాడి జరిగిన తర్వాత నుంచి పోలీసులు రూరల్ కార్యాలయం వద్ద ఉన్నారు. కానీ అంత మంది పోలీసులు ఉన్నా, టీడీపీ నాయకులు వచ్చి వైఎస్సార్సీపీ రూరల్ కార్యాలయంలోకి చొరబడి నానా బీభత్సం చేస్తున్నా.. అక్కడే ఉన్న పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన తర్వాత నింపాదిగా వచ్చిన పోలీసులు దాడి చేస్తున్న వారిని తీసుకుని వ్యానులో ఎక్కించడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ముందుగానే దాడి చేస్తామని పోలీసులకు సమాచారం టీడీపీ నేతలు అందించగా, కావాలనే పోలీసులు పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
కోటంరెడ్డిపై అక్రమ కేసులు దారుణం
-
‘పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు’
సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను భ్రస్టు పట్టిస్తున్నారని వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కుట్రతో కేసులు పెట్టి అరెస్ట్ చేయటం సిగ్గుచేటన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీకి సంబంధం లేకుండా ఇంటలిజెన్స్ డీఎస్పీ చెప్పినట్లు కింద స్థాయి సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. వైఎస్సార్ సీపీ నేతలను భయభ్రాంతులకు గురి చేసేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకుల్లా కాకుండా అధికారుల మాదిరిగా పోలీసులు వ్యవహరించాలని సూచించారు. పోలీసుల అనాలోచిత నిర్ణయాలు..తప్పుడు అరెస్టులను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామన్నారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించే ఉద్యోగులు ఇబ్బంది పడతారని హెచ్చిరంచారు. చంద్రబాబు ఓటమి భయంతో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓటమి భయంతో వైఎస్సార్ సీపీ ఓట్లను తొలగిస్తున్నారని, దీనిని ప్రశ్నించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల కనుసన్నలలోనే సర్వే బృందం ఓట్లను తొలగిస్తోందన్నారు. తప్పుడు కేసులకు భయపడమని తేల్చి చెప్పారు. శ్రీధర్ రెడ్డికి అందరూ అండగా నిలిచి పోరాడతామన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులను ప్రశ్నించినందుకు..
-
సెంట్రల్ జైలుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులను ప్రశ్నించినందుకు అరెస్టయిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు ఆయనను సెట్రల్ జైలుకు తరలించారు. ఆయన అరెస్ట్‌పై పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోటంరెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కోటంరెడ్డి రిమాండ్‌పై ఆయన కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. కోటం రెడ్డిని అక్రమంగా అరస్ట్ చేశారని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సర్వేల పేరుతో వైఎస్సార్సీపీ ఓట్లను తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నేతలపైనే కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. -
శ్రీధర్‌రెడ్డిని దీవించండి
నెల్లూరు(సెంట్రల్): నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలను కుటుంబసభ్యులుగా భావించి నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని దీవించాలని ఆయన కుటుంబసభ్యులు కోరుతున్నారు. శ్రీధర్‌రెడ్డిని మీ చేతుల్లో పెడుతున్నాం.. వచ్చే ఎన్నికల్లో దీవించండి అంటూ వారు బుధవారం రూరల్ నియోజవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కుటుంబసభ్యులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా శ్రీధర్‌రెడ్డి రాసిన లేఖను ప్రతి ఇంటికి తిరిగి అందజేస్తున్నారు. ఆయన్ను ఆశీర్వదించాలని కోరుతున్నారు. ప్రజల్లోనే ఉంటున్నారు శ్రీధర్‌రెడ్డి నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేశారు. అలాగే సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. వృద్ధులకు, దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని అక్కున చేర్చుకుని నేనున్నానంటూ చేయూతనిచ్చారు. వివిధ వర్గాలకు తన సొంత నిధులతో మౌలిక వసతుల కల్పించారు. పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇలా ఎమ్మెల్యే చేసిన కార్యక్రమాలను వివరిస్తూ మరోసారి దీవించాలని ప్రజలను కోరారు. కుటుంబం అంతా ప్రజల్లోనే.. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కుటుంబం మొత్తం రూరల్ నియోజవర్గంలోని ప్రజల వద్దకు వెళుతున్నారు. ఎమ్మెల్యే సతీమణి సుజిత ఎల్లంటిలో, పెద్ద కుమార్తె హైందవి పెనుమర్తిలో, చిన్నకుమార్తె వైష్ణవి కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డు వద్ద ప్రచారం చేశారు. అదే విధంగా పెద్ద అల్లుడు బాలానందరెడ్డి, చిన్న అల్లుడు నవీన్‌లు రూరల్ నియోజవర్గంలోని అర్బన్ డివిజన్ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. శ్రీధర్‌రెడ్డి తమ్ముడు గిరిధర్‌రెడ్డి సజ్జాపురంలో ప్రజలను కలిశారు. ఇప్పటివరకు సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కుటుంబసభ్యులు తమ ప్రాంతాలకు రావడంతో ప్రజలు మేమున్నామంటూ వారికి భరోసా ఇస్తున్నారు. -
పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం
నెల్లూరు(సెంట్రల్): నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. రూరల్ నియోజకవర్గంలోని 17వ డివిజన్ ఆకుతోట ఎస్సీవాడలో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి సొంత నిధులతో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో మొత్తం 50 ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అందులోభాగంగా 17వ మెడికల్ క్యాంప్‌ను నిర్వహించామన్నారు. చాలా మంది పేదలు కనీసం వైద్య పరీక్షలు కూడా చేయించుకోలేని పరిస్థితిలో ఉంటారన్నారు. అటువంటి పేదల కోసం ఉచితంగా అన్ని రకాల పరీక్షలు నిర్వహించి మందులు కూడా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటు వైద్యుల సలహాల మేరకు సర్జరీలు, కంటి అద్దాలు కూడా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నియోజకవర్గంలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మిద్దె మురళీకృష్ణయాదవ్, పేనేటి సుధాకర్, పంట్రంగి అజయ్, కల్యాణ్, మీజూరు వినయ్, బట్టా గిరిధర్, చిన్నా, వెంకట కృష్ణ, మీదూరు నారాయణ, పేనేటి రమణయ్య, కటారి రత్నమ్మ, పేనేటి నాగభూషణం పాల్గొన్నారు. -
బ్రిడ్జి కోసం మురుగు కాలువలో దిగిన ఎమ్మెల్యే
నెల్లూరు (వేదాయపాళెం): ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూడలేక ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఏకంగా తీవ్ర దుర్గంధం వెదజల్లే మురుగు కాల్వలోకి దిగి నిరసన తెలిపారు. వీలైనంత త్వరగా వరద కాలువపై బ్రిడ్జి నిర్మించి ప్రజల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గంట పాటు మురుగు కాల్వలోనే నిల్చున్నారు. చివరకు అధికారులు దిగివచ్చి హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ చాణక్యపురి వద్ద ఉన్న వరద కాలవపై బ్రిడ్జి నిర్మించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో స్థానికులు ఈ మార్గంలో రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎన్నిసార్లు చెప్పినా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోలేదు. దీంతో బుధవారం ఆయన నేరుగా ఆ మురుగు కాలువ వద్దకు చేరుకున్నారు. తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నా లెక్కచేయకుండా.. నడుములోతు ఉన్న మురుగు నీటిలోకి దిగి నిల్చున్నారు. ఇరిగేషన్ అధికారులు వచ్చి సమాధానమిచ్చే వరకు బయటకు రానన్నారు. దాదాపు గంట పాటు ఆ మురుగు నీటిలోనే ఉండిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఇరిగేషన్ ఉన్నతాధికారులు.. జేఈ బాలసుబ్రహ్మణ్యాన్ని ఘటనా స్థలికి పంపించారు. పనులను గంట లోపు ప్రారంభిస్తామని.. 45 రోజుల్లోపు బ్రిడ్జి నిర్మిస్తామని ఆయన చెప్పడంతో ఎమ్మెల్యే కాలువలో నుంచి బయటకు వచ్చారు. తమ కోసం మురుగు నీటిలోకి సైతం దిగి నిరసన తెలిపిన ఎమ్మెల్యేను స్థానికులు అభినందించారు. -
వైభవంగా కోటంరెడ్డి కుమార్తె వివాహం
నెల్లూరు(సెంట్రల్): నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ద్వితీయ కుమార్తె వైష్ణవి, నవీన్‌ల వివాహం ఆదివారంలోని నగరంలోని అనిల్ గార్డెన్స్‌లో వైభవంగా జరిగింది.దీనికి పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్, ఫ్లోర్‌లీడర్ పి.రూప్‌కుమార్‌యాదవ్, విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకుడు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, టీడీపీ నాయకులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మేయర్ అబ్దుల్ అజీజ్, ఇంకా వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. -
టార్గెట్ వైఎస్సార్ సీపీ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై పోలీసుల వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. గత ఏడాది నుంచి జిల్లాలో సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ వ్యవహరం తాజాగా కొత్త రంగు పులుముకుని సరికొత్త మలుపు తిరిగింది. నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రజాప్రతినిధిగా అధికార దుర్వినియోగానికి పాల్పడారనే ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదు చేయడం జిల్లా రాజకీయ వర్గాల్లో హట్‌టాపిక్‌గా మారింది. దీనిపై కోటంరెడ్డి తీవ్రస్థాయిలో స్పందించి న్యాయపోరాటంతో ఎదుర్కొంటారని ప్రకటించారు. జిల్లాలో గతేడాది క్రికెట్ బెట్టింగ్ కేసులు వందల సంఖ్యలో నమోదయ్యాయి. ఈ క్రమంలో క్రికెట్ బుకీలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధాలు ఉన్నాయని అధికార పార్టీ ఒత్తిళ్లలో పోలీసులు మొదటి నుంచి ఆ దిశగానే విచారణ నిర్వహించారు. వాస్తవానికి జిల్లాలో అధికార పార్టీ కీలక నేతలు, ప్రజాప్రతినిధులకు బుకీలతో మంచి సంబంధాలు ఉన్నాయనేది బహిరంగ సత్యం. కానీ ఆ విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా అసత్య ప్రచారంతో ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేసే విధంగా జిల్లాకు చెందిన అధికార పార్టీ పెద్దలు రాజకీయంగా పోలీసులుపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ క్రమంలో నిజాయితీగా, ప్రజా సేవే పరమార్థంగా తన పని తాను చేసుకునిపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డిని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో కీలక రాజకీయ పరిణమాలు, పొలిటికల్ బీజీగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఒక పర్యాయం నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత రాజ్యసభ అభ్యర్థి ఎన్నికల సమయంలో నోటీసులు ఇచ్చారు. దీనిపై ఫైర్ అయిన ఎమ్మెల్యే కోటంరెడ్డి తాను బెయిల్ తెచ్చుకోకుండా న్యాయపోరాటం చేస్తానని గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి 366 రోజుల పాదయాత్ర ప్రారంభించిన సమయంలో కోర్టులో పోలీసులు చార్జీషీటు వేసి ఎమ్మెల్యేను నిందితుడిగా చేర్చారు. ఈ నెల 14న కోర్టుకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. ఈ పరిణామాల క్రమంలో కేసు మళ్లీ అవినీతి నిరోధక శాఖకు అప్పగించటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఈ కేసు నివేదికను డీజీపీ మాలకొండయ్యకు పంపిన క్రమంలో ఆయన కేసును ఏసీబీకి కేటాయించి కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో బుధవారం ఏసీబీ కేసు నమోదు చేసింది. నేడు ఎస్పీని కలవనున్న కోటంరెడ్డి తాజా పరిణమాల క్రమంలో నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి శుక్రవారం జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణను నేరుగానే కలవనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎస్పీ అపాయింట్మెంట్ తీసుకున్నారు. -
పొలిటికల్ డ్యూటీ చేస్తున్న ఎస్పీ
నెల్లూరు(సెంట్రల్): ప్రజలకు సేవ చేయాల్సిన ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ అధికార పార్టీ నేతలు చెప్పినట్లు పొలిటికల్ డ్యూటీ చేస్తున్నారని నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విరుచుకుపడ్డారు. నెల్లూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరురూరల్ నియోజకవర్గ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ తీరుపై మండిపడ్డారు. బెట్టింగ్ కేసులో ఇతరులకు సహకరించినట్లు తనపై విచారణ పూర్తిచేసి కోర్టులో ఎస్పీ రామకృష్ణ చార్జిషీట్ దాఖలు చేశారన్నారు. తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏ ఒక్క అధికారికి ఫోన్ చేసినా స్పందించే పరిస్థితి లేదన్నారు. కానీ క్రికెట్ బెట్టింగ్‌లో దొరికిన వారికి తాను పోలీసులకు ఫోన్ చేసి విడిపించానని కట్టుకథ ఎస్పీ అల్లారని, నిజంగా తాను ఏ పోలీసు అధికారికి ఫోన్ చేశానో స్పష్టం చేయాలన్నారు. బుకీలకు తాను సపోర్టు చేస్తే తప్పు అయినప్పుడు, పో లీసులు విడుదల చేసినప్పుడు వారిది కూడా తప్పేన న్నారు. తాను ఏ ఎస్సై, సీఐ డీఎస్పీకి ఫోన్ చేసి విడిపిం చానో ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. నంద్యాల ఎన్ని కల సమయంలో, రాజ్యసభ ఎన్నికలప్పుడు, తాను పాదయాత్ర చేపట్టబోయే సమయంలో ఎస్పీ కా వాలని తనపై బురదజల్లుతున్నారని ఆరోపించారు. ఎస్పీ నిజాయితీ పరుడా? ఎస్పీ రామకృష్ణ నిజాయితీ పరుడైతే క్రికెట్ బుకీలుగా ఉన్న వారు అధికార పార్టీ మంత్రులకు సన్మానాలు, విందులు ఇచ్చిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. వీరిపై చార్జీషీట్ వేసి ఏసీబీ, జ్యుడిషియల్ విచారణకు ఎందుకు లేఖ రాయడానికి ఎస్పీ భయపడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. బెట్టింగ్‌లు చేసే వారితో పోలీసు అధికారులు వారి అటెండర్లు, డ్రైవర్ల ఫోన్ నుంచి వెళ్లిన కాల్స్‌పై ఎందుకు విచారణ చేయడానికి ఎస్పీ జంకుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. పోలీస్ అధికారిగా కాకుండా పొలిటకల్ డ్యూటీ చేస్తున్నారని విమర్శించారు. 100 కేసులు పెట్టినా భయపడను తనపై అక్రమంగా వంద కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. ఎస్పీ రామకృష్ణ చేస్తున్న చట్టవ్యతిరేక కార్యక్రమాలను అడ్డుకుంటానన్నారు. అధికార పార్టీ నాయకులు ఆడించినట్లు ఆడుతూ తనపై అక్రమ, అబద్ధాల చార్జీషీట్ వేసిన దానిపై న్యాయపోరాటం చేస్తానన్నారు. ఎస్పీ తాటాకు బెదిరింపులకు తాను భయపడనని స్పష్టం చేశారు. -
కొనసాగుతున్న కక్ష సాధింపు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై పోలీసులు కక్ష సాధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. క్రికెట్ బెట్టింగ్ కేసులో విచారణకు హాజరుకాలేదనే కారణంతో కోర్టు సమన్లు జారీ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. అది కూడా366 రోజుల పాదయాత్రకు ఒక్కరోజు ముందుగా. ఈ వ్యవహారం వెనుక అధికార పార్టీ మంత్రులు, ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 14న కోర్టుకు హాజరుకావాలని.. నెల్లూరు రెండో నగర పోలీస్‌స్టేషన్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు కృష్ణసింగ్‌తో పాటు మరికొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో కృష్ణసింగ్‌తో పాటు మరికొందరు బుకీలను ఎమ్మెల్యే ప్రోత్సహించినట్లు వారికి సహకరించనట్లు, వారితో లావాదేవీలు నిర్వహించినట్లు తగిన ఆధారాలు సేకరించి ఎమ్మెల్యేకు రెండు పర్యాయాలు నోటీసులు ఇస్తే ఆయన విచారణకు నిరాకరించిన కారణంగా బుధవారం కోర్టులో చార్జీషీటు దాఖలు చేయగా వచ్చే నెల 14వ తేదీన కోర్టుకు హాజరుకావాలని ఎమ్మెల్యే కోటంరెడ్డితో పాటు ఇతరులకు సమన్లు జారీ చేశారని జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. కేసు తదుపరి దర్యాప్తును ఏసీబీ అధికారులు నిర్వహిస్తారని కేసును వారికి అప్పగించినట్లు ప్రకటనలో వివరించారు. న్యాయపోరాటంతోనే ఎస్పీ డొల్లతనంబయటపెడతా పోలీసులు తనపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. న్యాయ పోరాటంలోనే జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ డొల్లతనం బయటపెడతానన్నారు. తనపై అక్రమ కేసులో కుట్రలో ఉన్న మంత్రులు, పోలీసు పెద్దలు అందరి వివరాలను వెల్లడిస్తానని చెప్పారు. తానే గతంలో ఈ అక్రమ కేసును సీబీఐ, సీఐడీ లేదా ఏసీబీకి ఇవ్వాలని డిమాండ్ చేశానన్నారు. అక్కడ తాను, ఎస్పీ రామకృష్ణ ఇద్దరు వివరణలు ఇవ్వాలని, దీనికి తాను సిద్ధంగా ఉన్నానని ఎస్పీ సిద్ధంగా ఉన్నారా అని గతంలోనే ప్రశ్నించానని చెప్పారు. 2017లో అగస్టులో స్వయంగా జిల్లా పోలీస్ బాస్ ఈ కేసులో ఎమ్మెల్యే ప్రమేయం లేదని ప్రకటించారు. కానీ తర్వాత రాజకీయ కక్షతో నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో ఇచ్చారని మళ్లీ రెండో పర్యాయం 8 నెలల తర్వాత రాజ్యసభ ఎన్నికల సమయంలో రెండు సార్లు నోటీసులు ఇచ్చారని వివరించారు. ఇప్పుడు 366 రోజుల పాదయాత్ర షెడ్యూల్ ప్రకటించిన తర్వాత పాదయాత్రకు ఒక్కరోజు ముందు కోర్టు సమన్లు ఇచ్చిందని పోలీసులు ప్రకటించారు. ఇదంతా పక్కా ప్రణాళికతో పోలీస్ పెద్దల డైరక్షన్లో తనపై కుట్ర జరగుతుందని మండిపడ్డారు. తాను నిత్యం జనాల్లో ఉంటూ ప్రతి నిమిషం కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటుండగా పోలీసులు మాత్రం తాను అజ్ఞాతంలో ఉన్నట్లు చార్జీషీటులో పేర్కొనటం అత్యంత దారుణం అన్నారు. చార్జీషీటులో ఒక రకంగా పత్రికలకు ఒక రకంగా చెబుతూ జిల్లా ఎస్పీ మైండ్‌గేమ్ అడుతున్నారని, పూర్తి ఆధారాలతో పోలీసుల డొల్లతనాన్ని బయటపెడతానని, ఇలాంటి అక్రమ కేసులకు తానేమీ భయపడనని చెప్పారు. -
'పొలిటికల్ మైండ్ గేమ్‌ను అడ్డుకుంటా'
సాక్షి, నెల్లూరు: తనపై మోపిన అక్రమ కేసులను ప్రజా పోరాటాలతోనే అడ్డుకుంటానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రభుత్వం వేధిస్తోందని విమర్శించారు. అన్యాయంగా విపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. రాజకీయ ఒత్తిడులకు జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ తలొగ్గారని.. ఓఎస్డీ విఠలేశ్వర్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విచారణ హాజరయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పొలిటికల్ మైండ్ గేమ్‌లను అడ్డుకుంటానని.. ఆధారాలు ఉంటే కేసులు నమోదు చేసుకోవాలని ఆయన అన్నారు. -
కార్యకర్తలే వైఎస్సార్సీపీకి అండ
నెల్లూరు(సెంట్రల్): క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలే పార్టీకి అండ అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. 105 రోజుల మన ఎమ్మెల్యే – మన ఇంటికి ప్రజాబాట ముగింపు కార్యక్రమాన్ని ముత్యాలపాళెం ప్రాంతంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డితో కలిసి శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రామలింగాపురం, ముత్యాలపాళెం తన రాజకీయ ప్రస్థానానికి పునాదని, అందుకే ఈ ప్రాంతంలో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించానని చెప్పారు. క్షేత్రస్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్త రుణం తీసుకుంటానన్నారు. 105 రోజుల పాదయాత్రలో తన తల్లి దీవెనలతో పాటు, తనపై రూరల్ ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలతో ముందకు నడవగలిగానని వివరించారు. గతంలో తనకు అన్ని తెలుసనుకునే వాడినని , అయితే ప్రజల మధ్య తిరుగుతున్న సమమంలో తనకు తెలిసింది కొంతే అని, ప్రజల నుంచి తెలుసుకోవాల్సింది ఎంతో ఉందనే విషయాన్ని గ్రహించానని తెలిపారు. పాదయాత్ర సందర్భంగా తన స్నేహితులు ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించడంలో ఎంతో సంతృప్తి లభించిందని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం అధికారుల వద్దకు వెళ్లినప్పుడు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని గుర్తు చేశారు. త్వరలో మరో ప్రజాప్రస్థానానికి శ్రీకారం ప్రస్తుతం పాదయాత్ర ముగిసినా, కొన్ని ప్రాంతాల్లో తిరగాల్సి ఉందని, జగన్మోహన్రెడ్డి పాదయాత్ర జిల్లాలో పూర్తయిన అనంతరం ఫిబ్రవరి రెండో వారంలో పూర్తిచేస్తానని ప్రకటించారు. దివంగత సీఎం వైఎస్సార్ ప్రజాప్రస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్ర తరహాలో అదే పేరుతో 365 రోజుల ప్రజాప్రస్థానాన్ని ఏప్రిల్‌లో మొదలుపెడతానని స్పష్టం చేశారు. అందరితో చర్చించిన అనంతరం నిర్ణయిస్తానని తెలియజేశారు. తనకు రాజకీయంగా ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది జగన్మోహన్రెడ్డి అని, ఆయన తనకు దైవంతో సమానమన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి సీఎం అవడం ఖాయమని స్పష్టం చేశారు. తాను పాదయాత్రలో తిరుగుతున్న సమయంలో మాజీ ప్రభుత్వోద్యోగి కృష్ణారావు అన్న మాటలు ఎంతో నేర్పిందన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి మాట్లాడారు. శ్రీధర్‌రెడ్డి ఎంతో కష్టపడుతున్నారని, ఆయనకు అందరం తోడుగా ఉందామని పిలుపునిచ్చారు. తొలుత పాదయాత్ర ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి 105 మంది మహిళలు పసుపు, కుంకుమలతో ఆశీర్వదించారు. పార్టీ నగరా«ధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మన ఎమ్మెల్యే.. మన ఇంటికి
నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మన ఎమ్మెల్యే.. మన ఇంటికి 105 రోజుల ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజైన మంగళవారం గొల్లకందుకూరులో పర్యటించారు. ఇం టింటికీ వెళ్లి ప్రజలను పలకరించి సమస్యలను తెలుసుకున్నారు. సం బంధిత అధికారులకు ఫోన్ చేసి పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాబాట చేపట్టిన దృష్ట్యా నాలుగు నెలలపాటు కుటుంబ కార్యక్రమాలకు హాజరు కాలేనని, తన భార్య సుజిత హాజరవుతారని, ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ప్రజాబాట నిర్వహిస్తూనే శుభ కార్యక్రమాలకు హాజరుకావాలని అనుకున్నా సాధ్యం కావడం లేదన్నారు. క్షేత్రస్థాయిలో కార్యక్రమానికి ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆయన వెంట సర్పంచ్ పొనకా ప్రతిమ, ఎంపీటీసీ సభ్యుడు ఆవుల సరస్వతి, నేతలు పొనకా శివకుమార్‌రెడ్డి, ఆవుల గోపాలయ్య, సుధాకర్‌రెడ్డి, గుంజి బాబూరావు, అశోక్, పాదర్తి రంగయ్య, అయ్యప్ప, చేవూరి సుజాతమ్మ, చెరుకూరి శ్రీనివాసులు, తుమ్మూరు శ్రీనివాసులు, దయాకర్‌రెడ్డి, మహేంద్ర ఉన్నారు. -
చర్చ అంటే బాబు పారిపోతున్నారు
-
తన స్వార్థం కోసమే కేంద్రంతో సఖ్యత
చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నేత కోటంరెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీతో సీఎం చంద్రబాబు సఖ్యతతో ఉంటున్నది తన స్వార్థప్రయోజనాలకోసమే తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకోసం కాదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీలో తమ మిత్రపక్షం అధికారంలో ఉన్నంత మాత్రాన ప్రత్యేకంగా నిధులేమీ ఇవ్వబోమని ఆర్థికమంత్రి జైట్లీ తెగేసి చెప్పాక కూడా ఎన్డీఏలో టీడీపీ కొనసాగుతోందంటే రాష్ట్రప్రయోజనాలకోసం కానేకాదన్నారు. లక్షన్నర కోట్ల అమరావతి రాజధాని భూదందా, ఓటుకు కోట్లు, నయీమ్ వ్యవహారంపై కేంద్రం సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తే తాను, తన కుమారుడు లోకేశ్ జైలుకెళ్లాల్సి వస్తుందనే భయంతోనే బాబు ప్రధానితో సఖ్యంగా ఉంటున్నారని విమర్శించారు. అందుకే రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకున్నా.. విభజన చట్టంలోని హామీల్ని నెరవేర్చకున్నా సీఎం నిలదీయలేకపోతున్నారన్నారు. విభజనవల్ల అన్యాయమైన ఏపీకి ప్రధానంగా కావాల్సింది ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలని, వీటికి ఇంతవరకు అతీగతీ లేదని శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. రెండున్నరేళ్లుగా సాధించలేంది.. మిగిలిన రెండున్నరేళ్లలోమాత్రం ఏం సాధిస్తారు? అని చంద్రబాబును ప్రశ్నించారు. -
వెఎస్సార్సీపీ సమన్వయకర్తల సమావేశం నేడు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తల, ఎమ్మెల్యేల రాష్ట్ర స్థాయి సమావేశం ఈ నెల 17న జరుగుతుందని పార్టీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమావేశంలో ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమంపై ప్రధానంగా సమీక్షిస్తారని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా.. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు వ్యతిరేకంగా ముందుకు సాగుతున్న ఉద్యమమే ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమమని ఆయన వివరించారు. టీడీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని మరింత తీవ్రంగా ముందుకు ఎలా తీసుకువెళ్లాలనే అంశంపై బుధవారం నాటి సమావేశంలో చర్చించి కార్యాచరణను రూపొందించుకుంటామని కోటంరెడ్డి తెలిపారు. -
'మోదీ గారు..బాబు పాపాల్లో భాగం కావొద్దు'
హైదరాబాద్: ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. వందలకోట్లు వెదజల్లినా.. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి గెలుపు ఖాయమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ.. చంద్రబాబు పాపాల్లో భాగం కావొద్దంటూ కోరారు. ప్రధానికి సైతం మరక అంటించే ప్రయత్నం జరుగుతోందని ధ్వజమెత్తారు. తక్షణమే ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభ్యర్థించారు. -
భూదందాపై విచారణకు ఆదేశించండి
♦ చంద్రబాబుకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డిమాండ్ ♦ విచారణలో మీరు నిర్దోషులుగా తేలితే ♦ అప్పుడు విలేకరులపై చర్యలు తీసుకోవచ్చని సూచన సాక్షి, హైదరాబాద్: రాజధాని భూ దురాక్రమణపై అన్ని ఆధారాలతో వార్తలు ప్రచురించిన సాక్షి దినపత్రికపైనా, టీవీపైనా చర్యలు తీసుకుంటామని గాండ్రిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా రాజధాని భూదందాపై విచారణకు ఆదేశించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. విచారణకు సీఎం ఎందుకు వెనకడుగువేస్తున్నారో చెప్పాలన్నారు. భూ దందాలో తాను, తన కుమారుడు, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు నిర్దోషులని చంద్రబాబు, ఆయన అంతరాత్మ భావిస్తూ ఉంటే విచారణకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారన్నారు. విచారణలో తామంతా నిర్దోషులని తేలితే అపుడు విలేకరులపై చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారన్నారు. సాక్షిపైనే విచారణ జరిపిస్తారా? భూదందాపై సాక్షిలో వచ్చిన వార్తలపైనే విచారణ జరిపిస్తారా? లేక గతంలో మరి కొన్ని పత్రికల్లో మీ పార్టీ నేతలను ఉద్దేశించి ‘ఇసుకాసురులు’, ‘ఇసుకదొంగలు’ అని రాసిన విలేకరులపైనా చర్యలు తీసుకుంటారా? అని కోటంరెడ్డి ప్రశ్నించారు. కేంద్ర మంత్రి సుజనాచౌదరి బ్యాంకుల నుంచి వందల కోట్లు కొల్లగొట్టిన వైనంపై రాష్ట్ర , జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. అంతెందుకు ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో మీరూ.. మీ రేవంత్‌రెడ్డి అడ్డంగా దొరికిపోయిన ఉదంతాలు టీవీల్లోనూ పత్రికల్లోనూ వచ్చాయి. ‘మన వాళ్లు బ్రీఫ్డ్మి.. వాట్ ఐయామ్ సేయింగ్ ఈజ్’ అంటూ మీరు చెప్పిన మాటలు ప్రసారం చేసిన టీవీ చానెళ్లు, ప్రచురించిన పత్రికలపై కూడా చర్యలు తీసుకుంటారా? అని కోటంరెడ్డి ప్రశ్నించారు. సాక్షిలో ప్రచురితమైనవన్నీ మంత్రులు చేసుకున్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ఆధారంగానే అనే విషయం గుర్తించాలన్నారు. ఈ పత్రాలు అమెరికా, రష్యాలోని డాక్యుమెంట్లు ఎంత మాత్రం కాదన్నారు. ఏ భూములను రాసిస్తారు? రాజధాని ప్రాంతంలో భూములను కొని ఉంటే తాము రాసిస్తామని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని శ్రీధర్‌రెడ్డి అన్నారు. ‘ముఖ్యమంత్రి గారూ... ఏ భూములను రాసిస్తారు? మీ బినామీ వేముల రవికుమార్ కొనుగోలు చేసినవా? మీ మంత్రి నారాయణ పెద బామ్మర్ది సాంబశివరావు కొన్నవా? లేక ఆయన చిన బామ్మర్ది మునిశంకర్ కొన్న భూములా? లేదంటే మీ మంత్రి గారికి అత్యంత సన్నిహితురాలు, మా సోదరి సమానురాలు అయిన పొత్తూరి ప్రమీల గారు కొన్న భూములు రాసిస్తారా? పయ్యావుల కేశవ్ కొన్నవా? మీ ఎంపీ మురళీ మోహన్ గారి ఆస్తులా? మీ మంత్రి రావెల కిశోర్బాబువా? మీ లింగమనేని ఎస్టేట్స్ భూములు రాసిస్తారా? మీ మంత్రి పుల్లారావు బినామీ పేర్లతో కొన్న భూములు రాసిస్తారా? చెప్పండి అంటూ ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్మెంట్లో ఉన్నాయని ముఖ్యమంత్రి చెబుతున్నారని అవి దర్యాప్తు సంస్థల ఆధీనంలోకి వ చ్చింది ఇటీవలనే.. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లయిందని శ్రీధర్‌రెడ్డి గుర్తు చేశారు. ఇవి అటాచ్డ్ కాక ముందు మీరు, మీకుమారుడు హాయ్‌ల్యాండ్(అగ్రిగోల్డ్) ఆస్తులు దోచుకునేందుకు మాట్లాడుకున్న మాట నిజమా? కాదా? చెప్పాలన్నారు. అటాచ్డ్‌లో ఉన్నాయని చెబుతున్న ఆస్తులు మంత్రి పుల్లారావు ఆయన సతీమణి వెంకాయమ్మ పేరుతో ఎలా కొన్నారో చెప్పాలన్నారు. ఆ రైతులే కోటీశ్వరులయ్యే వారు కదా? రాజధాని ప్రాంత రైతులకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారని శ్రీధర్‌రెడ్డి అన్నారు. జోన్ 1, జోన్ 2 ప్రాంతంలో భూములున్న రైతులు వ్యవసాయం మాత్రమే చేసుకోవాలని నిర్దేశించి, కమర్షియల్ జోన్లలో మాత్రం చంద్రబాబు, ఆయన మంత్రుల బినామీలు భారీగా భూములను కొనుగోలు చేశారన్నారు. జోన్ 3 ప్రాంతంలో ఉండే రైతులకు అక్కడ రాజధాని వస్తుందని ముందుగా తెలియజేసి ఉంటే వారి భూములను తక్కువకు అమ్ముకుని ఉండే వారా? తరాలుగా ఆ భూములను నమ్ముకుని ఉన్న రైతులకు ఈ విషయం తెలిసి ఉంటే ఇపుడు కోటీశ్వరులయ్యే వారు కదా? అని శ్రీధర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
కనుల పండువగా గంధ మహోత్సవం
-
కనుల పండువగా గంధ మహోత్సవం
నెల్లూరు (బాలాజీనగర్): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని బారాషహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో దర్గా ప్రాంగణం కిటకిటలాడింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కాలని మొక్కుకుంటూ నెల్లూరు నగర, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రొట్టెలను మార్చుకున్నారు. దర్గాలో ప్రార్థనలు చేశారు. అనిల్‌కుమార్ మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహించుకునే రొట్టెల పండుగకు వచ్చిన భక్తులకు, నగర ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నట్లు తెలిపారు. శాసనసభ్యులుగా ఎన్నికవ్వాలని గతంలో తాము రొట్టెలను పట్టుకున్నట్లు గుర్తుచేసుకున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కాలని మొక్కుకున్నట్లు చెప్పారు. దర్గాలో పవిత్రమైన ఘట్టం గంధమహోత్సవం ఆదివారం అర్ధరాత్రి ప్రారంభమై సోమవారం ముగిసింది. దర్గాలోని 12 గుమ్మటాలకు గంధాన్ని లేపనం చేసి, ప్రత్యేక ప్రార్థనల అనంతరం భక్తులకు పంచిపెట్టారు. పండుగ చివరి రోజైన మంగళవారం భక్తులు మరింతమంది వచ్చే అవకాశముండటంతో అందుకనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
'దొరికిపోవడం వల్లే సెక్షన్ - 8 తెరపైకి'
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోవడం వల్లే సెక్షన్ - 8 ను తెరపైకి తెచ్చారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సెక్షన్ - 8 గురించి మాట్లాడుతున్న చంద్రబాబు ప్రత్యేక హోదా విషయం ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. దేశ చరిత్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఓటుకు రూ.5 కోట్లు ఖర్చు పెట్టిన దాఖలాల్లేవు. ఓటుకు నోటు వ్యవహారంలో దొరికిన చంద్రబాబును వెంటనే బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఏపీలో మరోసారి ఓటుకు రూ.కోట్లు వ్యవహారానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరలేపబోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే బలం లేని కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో టీడీపీ అభ్యర్థులను పోటీలో పెట్టారని విమర్శించారు. 'ప్రశ్నిస్తా..' అన్న వాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు.. ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అన్నాహజారే తమ్ముడిని అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.కోట్లు కుమ్మరించడానికి సిద్ధమవుతున్నారన్నారు. ఏపీలో ఎన్టీవీ ప్రసారాలను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కోటంరెడ్డి అన్నారు. పత్రికా స్వేచ్ఛను అడ్డుకునే హక్కు చంద్రబాబుకు లేదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు. -
'దొరికిపోవడం వల్లే సెక్షన్ - 8 తెరపైకి'
-
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కుమార్తె వివాహం
-
పచ్చచొక్కాలకే పందేరమా?
లబ్ధిదారుల ఎంపికలో ‘సామాజిక కార్యకర్తల’ పాత్రపై వైఎస్సార్సీపీ ధ్వజం హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ‘సామాజిక కా ర్యకర్తల’ పాత్రపై ఏపీ శాసనసభలో దుమారం చెలరేగింది. ఈ పేరిట పచ్చచొక్కాల వాళ్లను దొడ్డిదోవన ప్రవేశపెడుతున్నారని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిం చగా ప్రభుత్వం తమదని అధికార పక్షం ఎదురుదాడికి దిగింది. ఈ తీరును నిరసిస్తూ ప్రతిపక్షం సభ నుంచి వాకౌట్ చేసింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆర్కే రోజా, గౌరు చరితారెడ్డి, రాజన్న దొర, భూమా నాగిరెడ్డి, వెంకట సుజయకృష్ణ రంగారావు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నపై మంగళవారం సభలో చర్చ జరిగింది. మంత్రి యనమల రామకృష్ణుడు సమాధానం చెప్పిన తీరును శ్రీధర్‌రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. అధికారం శాశ్వతం కాదని, వ్యవస్థల్ని బతికించేలా ప్రభుత్వ తీరు ఉం డాలని హితవు పలికారు. తాము చెప్పింది తప్పయితే రాజీనామా చేస్తానని రాజన్నదొర సవాల్ విసిరారు. జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పాలకుల్లో ‘తమ’ తప్ప ‘మన’ అనే భావనే లేకపోవడం విచారకరమన్నారు. యనమల మాట్లాడుతూ ఈ కమిటీలకు సర్పంచ్ కన్వీనర్‌గా ఉంటారని, తామే కమిటీలను వేశామని, ప్రభుత్వానికి సర్వహక్కులు ఉన్నాయని, తమ అధికారాన్ని ఉపయోగించుకుంటున్నామని చెప్పడంతో విపక్షం నిరసన వ్యక్తం చేసింది. నెహ్రూ మంత్రి వ్యాఖ్యలను ఆక్షేపిస్తూ వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి తమ పార్టీ సభ్యులతో బయటకు వెళ్లిపోయారు. -
వారానికి ఒక రోజు చేనేత వస్త్రాలు ధరించాలి
నెల్లూరు (సెంట్రల్): వారంలో ఒకరోజు అధికారులు, రాజకీయ నాయకులతో పాటు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరిస్తే చేనేత కార్మికులకు మంచి జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. నగరంలోని సీపీఐ కార్యాలయ ప్రాంతంలో సోమవారం నిర్వహించిన చేనేత మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ వ్యాపారాలు లేకపోవడంతో చేనేత కార్మికులు దీనావస్థలో ఉన్నారన్నారు. చేనేత వస్త్రాలను తయారు చేసి అగ్గిపెట్టెలో అమర్చి దేశ ఘనతను నలుదిశలా చేనేత కార్మికులు వ్యాపింపజేశారన్నారు. అలాంటి చేనేతలను ఆదుకుని భారతదేశ సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే నిధులను ఎక్కువగా చేనేతలు నివసించే ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు చేస్తానని కోటంరెడ్డి వారికి హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు చంద్రబాబు చేనేత కార్మికులకు ఏవేవో హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించడం దారుణం అన్నారు. చేనేత కార్మికుల సమస్యలను పట్టించుకోని అధికార పార్టీని అసెంబ్లీలో నిలదీస్తానన్నారు. చేనేతల పోరాటాలకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని కోటంరెడ్డి అన్నారు. నిరుపేదలకు, సామాన్యులకు బ్యాంకులు లోన్లు ఇవ్వడం కష్టమైందని విమర్శించారు. పెద్దపెద్ద వాళ్లకు లోన్లు ఇస్తూ పేద వాళ్లను మరచిపోవడం సిగ్గుచేటన్నారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టా హేమసుందరరావు మాట్లాడుతూ చేనేత కార్మికులకు పింఛన్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తొలుత చేనేత కార్మికులు కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. చేనేత సంఘం రాష్ట్ర కార్యదర్శి జింకా చలపతి, చేనేత సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు పి.దశరథరామయ్య, జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, సీపీఐ జిల్లా కార్యదర్శి వి.రామరాజు, చేనేత సంఘం జిల్లా నాయకుడు వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. -
ఎదురుదాడే మీ విధానమా?
* ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, కోటంరెడ్డి * వైఎస్‌ను, జగన్‌ను ఆడిపోసుకోవడమే సర్కారు ప్రధాన ఎజెండా * లోటు బడ్జెట్ అంటూ మంత్రుల ఇంటి అద్దెల పెంపు సబబు కాదు * టీడీపీ కార్యకర్తలకు రాష్ట్ర ఖజానా దోచిపెట్టడమే పనిగా మారింది సాక్షి, హైదరాబాద్: కరువు తాండవిస్తూ అదును దాటి వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంగా మారిన తరుణంలో ప్రతిపక్షం చేసే సద్విమర్శల్ని ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా తప్పుడు లెక్కలతో ప్రభుత్వం ఎదురు దాడికి దిగుతోందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. అధికారపక్షం రైతాంగానికి ఏం చేయబోతున్నారో చెప్పకుండా వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ మోహన్‌రెడ్డిని ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. రాష్ట్రంలో ఇన్పుట్ సబ్సిడీ, పంట బీమా కింద రూ. 800 కోట్లు ఇవ్వాల్సి ఉందని, కేంద్రం తన వాటా విడుదల చేసినా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయకుండా తాత్సారం చేస్తుందని విమర్శించారు. రుణమాఫీ కింద రూ. 56 వేల కోట్లు పంట రుణాలు రద్దు చేయాల్సి ఉండగా, కనీసం రూ.5 వేల కోట్లకు కూడా రైతులు రెన్యువల్ చేసుకోలేకపోయారని తెలిపారు. ఇలాగే కొనసాగితే ప్రభుత్వం చెప్పే విజన్ 2029కైనా రుణమాఫీ జరగదని విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ... ‘‘లోటు బడ్జెట్లో ఉన్నాం, రాజధాని నిర్మాణం కోసం చందాలివ్వండి, త్యాగాలకు సిద్ధంకండి, పొదుపు పాటించండి.. అంటూ పదే పదే వల్లె వేసే రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు మంత్రులకు ఇంటి అద్దె సరిపోవడం లేదని నెలకు రూ.50 వేలు అదనంగా ఇవ్వాలని అసెంబ్లీలో ప్రతిపాదించడాన్ని ఏమని అర్థం చేసుకోవాలో తెలియడం లేదు’’ అని విమర్శించారు. ఆల్మట్టి పాపం వైఎస్‌దేనని నిండు సభలో ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ మాట్లాడటం ఆయన విచక్షణకే వదిలేస్తున్నామన్నారు. టీడీపీ భాగస్వామిగా అప్పట్లో దేవేగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో ఏఐడీపీ నిధుల్ని రూ.300 కోట్లు కేటాయించి ఆల్మట్టి ఎత్తు పెంపునకు చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వం కాదా? అని కోటంరెడ్డి ప్రశ్నించారు. పన్నులు పెంచితే పడిపోతారు: కల్పన ‘‘పన్నులు పెంచిన ఏ ప్రభుత్వాలూ మనలేదు, ఖచ్చితంగా పడిపోతాయి. మీరు కూడా రెవెన్యూ లోటుకు పన్నులు పెంచుతున్నారా లేదా? నిధులిచ్చేందుకు కేంద్రం హామీ ఇచ్చిందా? చెప్పండి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన శుక్రవారం అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ‘‘బడ్జెట్లో రూ.11 వేల కోట్లు లోటు చూపించారు, ఈ నిధులను కేంద్రం ఇస్తున్నట్టు హామీ ఇచ్చిందా? లేదంటే మీరు ఏమైనా పన్నులు వసూలు చేయాలనుకుంటున్నారా?’’ అనేది స్పష్టత ఇవ్వాలన్నారు. 2004 నుంచి 2009 వరకూ ఒక్క పైసా కూడా పన్నులు పెంచకుండా, రెండుసార్లు అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదని, ఈ విషయాన్ని వైఎస్సార్ పార్టీ గర్వంగా చెప్పుకోగలదని తెలిపారు. మద్య నియంత్రణలో భాగంగా జిల్లాకో డీ అడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారని, కానీ బడ్జెట్లో దీనికి నిధులు కేటాయించిన దాఖలాలు లేవని విమర్శించారు. కిరణ్‌ను కాపాడిందెవరో?: జగ్గిరెడ్డి కాలువల్లో నీటి సరఫరాను క్రమబద్ధీకరించే లస్కర్ పోస్టుల భర్తీ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు చిర్ల జగ్గిరెడ్డి చేసిన వ్యాఖ్యలు శుక్రవారం అసెంబ్లీలో కలకలం రేపాయి. ‘‘అధ్యక్షా, మంత్రులు పదేపదే మావైపు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో తప్పిదాలకు మేమేదో కారణమంటున్నటు వారి తీరుంది. పాత ప్రభుత్వాన్ని (కిరణ్) కాపాడింది ఎవరు సార్? మద్దతు ఇచ్చింది వీళ్లు కాదా? అది మరిచి ఆ తప్పుల్ని ప్రస్తావించేటప్పుడు మావైపు చూడడం ఎంతవరకు సబబు..?’’ అన్నారు. దీనికి విపక్ష సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేయగా పాలకపక్షం మిన్నకుంది. నిరసనల మధ్య మంత్రి సమాధానం ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్యనే నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి చేతులు దులుపుకున్నారు. కర్నూలు సమీపంలోని తుంగభద్ర నదిపై 69 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చెక్‌డ్యాం బ్రిడ్జిని మంజూరు చేసిన మాట నిజమేనని చెప్పారు. అంచనా వ్యయాన్ని 190 కోట్లకు పెంచామని చెప్పారు. అయితే దీనిపై ఎస్వీ మోహన్‌రెడ్డి అనుబంధ ప్రశ్న వేసేందుకు లేచి నిల్చున్నప్పటికీ మాట్లాడే అవకాశం రాలేదు. స్పీకర్ సభను వాయిదా వేయడంతో ఆయన ప్రశ్న అడగలేకపోయారు. -
టీడీపీకి స్పీకర్ గా కోడెల...
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. సభ మొత్తానికి కాకుండా శివప్రసాద్ రావు తెలుగుదేశం పార్టీకి స్పీకర్ గా వ్యవహరిస్తున్నారని కోటంరెడ్డి ఆరోపించారు. శాసనసభను తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ గా మార్చివేశారని ఆయన విమర్శించారు. సభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని స్పీకర్ పదే పదే అడ్డుకోవడం శోచనీయమని కోటం రెడ్డి అన్నారు. -
ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
{పొటెం స్పీకర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేసిన జిల్లా ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీ శాసనసభా పక్షంలో కాకాణి, గౌతమ్‌రెడ్డి, కోటంరెడ్డి, అనిల్ కుమార్ నెల్లూరు : జిల్లాలోని పది నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు గురువారం కొత్త రాష్ర్టం ఆంధ్రప్రదేశ్ తొలి శాసన సభలో ప్రొటెం స్పీకర్ నారాయణస్వామి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన సర్వేపల్లి, ఆత్మకూరు, నెల్లూరుసిటీ, నెల్లూరు రూరల్, గూడూరు, కావలి, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు కాకాణి గోవ ర్ధన్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య ప్రమాణ స్వీకారం చేయగా, టీడీపీకి చెందిన కోవూరు, ఉదయగిరి, వెంకటగిరి ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, బొల్లినేని రామారావు, కురుగొండ్ల రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభాపక్ష నేత జగన్మోహన్రెడ్డితో కలిసి బస్‌లో అసెంబ్లీకి వచ్చారు. వైఎస్సార్సీపీకి చెందిన ఏడుగురు శాసనసభ్యులు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికవగా, టీడీపీకి చెందిన ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు సైతం తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీ గడప తొక్కారు. వైఎస్సార్సీపీ శాసనసభా పక్షంలో నలుగురికి చోటు వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం కార్యవర్గంలో జిల్లాకు చెందిన నలుగురికి చోటు లభించింది. బుధవారం జరిగిన వైఎస్సార్సీపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో వీరిని ఎన్నుకున్నారు. శాసనసభాపక్షం కార్యదర్శిగా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఎన్నుకోగా, కార్యవర్గ సభ్యుడిగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్, సమన్వయకర్తగా ఆత్మకూరు శాసనసభ్యుడు మేకపాటి గౌతమ్‌రెడ్డిని ఎన్నుకున్నారు. శాసనసభాపక్షం అధికార ప్రతినిధిగా నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని నియమించారు. -
యాసిడ్ దాడి బాధితురాలికి వైఎస్సార్సీపీ నేతల పరామర్శ
నెల్లూరు: నెల్లూరు పట్టణంలోని రాధా ధియేటర్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీని వైఎస్ఆర్సీపీ నేతలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ లు పరామర్శించారు. కిసాన్ నగర్ కు చెందిన లక్ష్మీ చందన ఈ దాడిలో గాయపడ్డారు. యాసిడ్ తక్కువ గాఢత కలిగినది కావడంతో ఆమెకు పెద్ద గాయాలు కాక పోవడంతో దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. లక్ష్మిపై దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైద్యసాయం అందిస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి హామీ ఇచ్చారు.