మాట్లాడుతున్న శ్రీధర్‌రెడ్డి
నెల్లూరు(సెంట్రల్): క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలే పార్టీకి అండ అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. 105 రోజుల మన ఎమ్మెల్యే – మన ఇంటికి ప్రజాబాట ముగింపు కార్యక్రమాన్ని ముత్యాలపాళెం ప్రాంతంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డితో కలిసి శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రామలింగాపురం, ముత్యాలపాళెం తన రాజకీయ ప్రస్థానానికి పునాదని, అందుకే ఈ ప్రాంతంలో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించానని చెప్పారు. క్షేత్రస్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్త రుణం తీసుకుంటానన్నారు. 105 రోజుల పాదయాత్రలో తన తల్లి దీవెనలతో పాటు, తనపై రూరల్ ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలతో ముందకు నడవగలిగానని వివరించారు. గతంలో తనకు అన్ని తెలుసనుకునే వాడినని , అయితే ప్రజల మధ్య తిరుగుతున్న సమమంలో తనకు తెలిసింది కొంతే అని, ప్రజల నుంచి తెలుసుకోవాల్సింది ఎంతో ఉందనే విషయాన్ని గ్రహించానని తెలిపారు. పాదయాత్ర సందర్భంగా తన స్నేహితులు ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించడంలో ఎంతో సంతృప్తి లభించిందని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం అధికారుల వద్దకు వెళ్లినప్పుడు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని గుర్తు చేశారు.
త్వరలో మరో ప్రజాప్రస్థానానికి శ్రీకారం
ప్రస్తుతం పాదయాత్ర ముగిసినా, కొన్ని ప్రాంతాల్లో తిరగాల్సి ఉందని, జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర జిల్లాలో పూర్తయిన అనంతరం ఫిబ్రవరి రెండో వారంలో పూర్తిచేస్తానని ప్రకటించారు. దివంగత సీఎం వైఎస్సార్ ప్రజాప్రస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్ర తరహాలో అదే పేరుతో 365 రోజుల ప్రజాప్రస్థానాన్ని ఏప్రిల్లో మొదలుపెడతానని స్పష్టం చేశారు. అందరితో చర్చించిన అనంతరం నిర్ణయిస్తానని తెలియజేశారు. తనకు రాజకీయంగా ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది జగన్‌మోహన్‌రెడ్డి అని, ఆయన తనకు దైవంతో సమానమన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అవడం ఖాయమని స్పష్టం చేశారు. తాను పాదయాత్రలో తిరుగుతున్న సమయంలో మాజీ ప్రభుత్వోద్యోగి కృష్ణారావు అన్న మాటలు ఎంతో నేర్పిందన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి మాట్లాడారు. శ్రీధర్‌రెడ్డి ఎంతో కష్టపడుతున్నారని, ఆయనకు అందరం తోడుగా ఉందామని పిలుపునిచ్చారు. తొలుత పాదయాత్ర ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి 105 మంది మహిళలు పసుపు, కుంకుమలతో ఆశీర్వదించారు. పార్టీ నగరా«ధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment