Anam Vijay Kumar Reddy
-
మీరు ఎంతైనా భయపెట్టండి భయపడే ప్రసక్తే లేదు.. టీడీపీకి ఆనం స్ట్రాంగ్ వార్నింగ్
-
నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన జగన్ కు ధన్యవాదాలు
-
అభివృద్ధి అంటే ఇది అనేలా సీఎం జగన్ పాలన..
-
కోటంరెడ్డికి ఆనం విజయకుమార్ రెడ్డి దిమ్మతిరిగే కౌంటర్
-
'కోటంరెడ్డి బ్రదర్స్ తినే ప్రతి మెతుకు సీఎం జగన్ పెట్టిన భిక్షే'
నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆనం విజయ్‌కుమార్ రెడ్డి. జిల్లాలో అనవసరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. అధిష్టానం గుర్తిస్తేనే ఎవరైనా ఎమ్మెల్యే కాగలరని పేర్కొన్నారు. కోటంరెడ్డి పార్టీలో గుర్తింపు లేదనడం భావ్యం కాదన్నారు. పార్టీ నుంచి వెళ్లాలని కోటంరెడ్డికి ఎవరూ చెప్పలేదని విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. నెల జీతాలిచ్చి రౌడీషీటర్లను పెట్టుకొని దందాలు చేసిన వ్యక్తి ఆయన అని వ్యాఖ్యానించారు. హింసా రాజకీయాలు చేసి నీచ సంస్కృతికి తెరలేపారని ధ్వజమెత్తారు. కోటంరెడ్డి సోదరులు రాక్షసులుగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు. కౌన్సిలర్ స్థాయి కూడా లేని కోటంరెడ్డిని సీఎం జగన్ ఎమ్మెల్యేని చేశారని విజయ్‌కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కోటంరెడ్డి బ్రదర్స్ తినే ప్రతి మెతుకు సీఎం జగన్ పెట్టిన భిక్షే అన్నారు. టీడీపీతో కుమ్మక్కై అన్నం పెట్టిన పార్టీపై అభాండాలు మోపుతారా అని ప్రశ్నించారు. తన సోదరుడు ఆనం రామనారాయణరెడ్డి కూడా ఏం తక్కువై పార్టీకి దూరమయ్యారో తెలియడం లేదని విజయ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ తమ కుటుంబానికి అండగా నిలిచారని గుర్తు చేశారు. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారికైనా చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. రామనారాయణరెడ్డి తమ్ముడిగా కాకుండా సీఎం జగన్ మనిషిగా ఉంటానని పేర్కొన్నారు. చదవండి: ఇంకేం చర్యలు తీసుకుంటాం.. కోటంరెడ్డి వ్యవహారంపై స్పందించిన సజ్జల -
కార్యకర్తలే వైఎస్సార్సీపీకి అండ
నెల్లూరు(సెంట్రల్): క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలే పార్టీకి అండ అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. 105 రోజుల మన ఎమ్మెల్యే – మన ఇంటికి ప్రజాబాట ముగింపు కార్యక్రమాన్ని ముత్యాలపాళెం ప్రాంతంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డితో కలిసి శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రామలింగాపురం, ముత్యాలపాళెం తన రాజకీయ ప్రస్థానానికి పునాదని, అందుకే ఈ ప్రాంతంలో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించానని చెప్పారు. క్షేత్రస్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్త రుణం తీసుకుంటానన్నారు. 105 రోజుల పాదయాత్రలో తన తల్లి దీవెనలతో పాటు, తనపై రూరల్ ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలతో ముందకు నడవగలిగానని వివరించారు. గతంలో తనకు అన్ని తెలుసనుకునే వాడినని , అయితే ప్రజల మధ్య తిరుగుతున్న సమమంలో తనకు తెలిసింది కొంతే అని, ప్రజల నుంచి తెలుసుకోవాల్సింది ఎంతో ఉందనే విషయాన్ని గ్రహించానని తెలిపారు. పాదయాత్ర సందర్భంగా తన స్నేహితులు ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించడంలో ఎంతో సంతృప్తి లభించిందని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం అధికారుల వద్దకు వెళ్లినప్పుడు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని గుర్తు చేశారు. త్వరలో మరో ప్రజాప్రస్థానానికి శ్రీకారం ప్రస్తుతం పాదయాత్ర ముగిసినా, కొన్ని ప్రాంతాల్లో తిరగాల్సి ఉందని, జగన్మోహన్రెడ్డి పాదయాత్ర జిల్లాలో పూర్తయిన అనంతరం ఫిబ్రవరి రెండో వారంలో పూర్తిచేస్తానని ప్రకటించారు. దివంగత సీఎం వైఎస్సార్ ప్రజాప్రస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్ర తరహాలో అదే పేరుతో 365 రోజుల ప్రజాప్రస్థానాన్ని ఏప్రిల్‌లో మొదలుపెడతానని స్పష్టం చేశారు. అందరితో చర్చించిన అనంతరం నిర్ణయిస్తానని తెలియజేశారు. తనకు రాజకీయంగా ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది జగన్మోహన్రెడ్డి అని, ఆయన తనకు దైవంతో సమానమన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి సీఎం అవడం ఖాయమని స్పష్టం చేశారు. తాను పాదయాత్రలో తిరుగుతున్న సమయంలో మాజీ ప్రభుత్వోద్యోగి కృష్ణారావు అన్న మాటలు ఎంతో నేర్పిందన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి మాట్లాడారు. శ్రీధర్‌రెడ్డి ఎంతో కష్టపడుతున్నారని, ఆయనకు అందరం తోడుగా ఉందామని పిలుపునిచ్చారు. తొలుత పాదయాత్ర ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి 105 మంది మహిళలు పసుపు, కుంకుమలతో ఆశీర్వదించారు. పార్టీ నగరా«ధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఫిరాయింపుదారులు ఆత్మవిమర్శ చేసుకోవాలి
► వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ది చెబుతారు ► వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి నెల్లూరు(వేదాయపాళెం) : వైఎస్సార్సీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్లి పార్టీ ఫిరాయించిన నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని, వచ్చే ఎన్నికల్లో వీరికి రాజకీయ భవిష్యత్తు లేకుండా ప్రజలే తగిన రీతిలో బుద్దిచెబుతారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి అన్నారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో ఉన్న వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 439 మంది స్థాని క సంస్థల ప్రజాప్రతినిధులు వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందారని, టీడీపీకి 350 మాత్రమే ఉన్నారన్నారు. అనైతిక రాజకీయాలకు, ప్రలోభాలకు గురై కొం దరు పార్టీ మారారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు అభిమానించి వారిని గెలిపించడం జరిగిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వై ఎస్సార్సీపీ తరఫున గెలుపొందిన ప్రజాప్రతినిధులు నైతిక విలువలు పాటిస్తారని భావించారన్నారు. ఫిరాయించిన నాయకులు 6 నుంచి 8 శాతం వరకు వైఎస్సార్సీపీకి ఓటు వేయలేదన్నారు. వీరి వైఖ రిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు 180 ఓట్లు ఆధిక్యత వస్తుం దని ప్రకటించుకున్నారని, ఆ పరిస్థితి ఇప్పుడేమైందని ప్రశ్నించారు. పోలింగ్ రోజున మనుబోలు ఎంపీపీ చిట్టమూరు అని తమ్మ కుమర్తె చనిపోయిన దుఃఖం లో ఉన్నప్పటికీ పార్టీపై ఉన్న అభిమా నం, నైతిక విలువలు పాటించి వైఎస్సార్సీపీకి ఓటు వేశారన్నారు. ఎన్నికల్లో తన కోసం కృషిచేసిన నెల్లూరు, తిరుపతి ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవ య్య, జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేం ద్రరెడ్డి, నాయకులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డి, ఎల్లసిరి గో పాల్‌రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలి యజేశారు. సమావేశంలో పార్టీ నాయకులు బత్తల కృష్ణ, పుచ్చలపల్లి రాంప్రసాద్‌రెడ్డి, చెవిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆనం కార్తీక్‌రెడ్డి, మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, హనుమంతరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆనం నామినేషన్
నెల్లూరు(పొగతోట): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌రెడ్డి మంగళవారం రెండు సెట్ల నామినేషన్ల పత్రాలను దాఖలు చేశారు. 20 మంది అభ్యర్థులు ఆనం విజయకుమార్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు నాయకులు తరలివచ్చారు. వైఎస్సార్, వైఎస్.జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. తొలుత వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు. ఎన్నికల ఆర్ఓ, జాయింట్ కలెక్టర్ ఏ.మహమ్మద్ ఇంతియాజ్‌కు ఉదయం 11.56 నిమిషాలకు ఆనం విజయకుమార్‌రెడ్డి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి ఆశీసులతో, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి అండదండలు, అందరి సహకారంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మోజారిటీతో విజయం సాధిస్తామన్నారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ వైఎస్సార్ ఆశయసాధనకు కృషి చేస్తానని తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అధికారపార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులకు కనీస మర్యాద కూడా ఇవ్వడంలే దని తెలిపారు. స్థానిక సంస్థల్లో ఓటు అర్హత ఉన్న ప్రతిఒక్కరూ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆనం విజయకు మార్రెడ్డికి ఓటు వేసి గెలిపిం చాలన్నారు. ఈ ఎన్నికలు ప్రభుత్వానికి గుణపాఠం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు, తిరుపతి ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వి.వరప్రసాధ్, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, నెల్లూరు సిటీ, ఆత్మకూరు, కావలి, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు డాక్టర్ పి.అనిల్‌కుమా ర్యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్పర్సన్ పి.శిరిష, గూడూరు సమన్వయకర్త మేరిగ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. వాకాటి నామినేషన్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా వాకాటి నారాయణరెడ్డి నామి నేషన్ వేశా రు. నాలుగు సెట్లు దాఖాలు చేశారు. జిల్లా ఇన్చార్జి మం త్రి శిద్దా రాఘవరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసు లురెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, మాజీ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి తదితర నాయకులు సమక్షంలో వాకాటి నామినేషన్ దాఖాలు చేశారు. ఈ సందర్భంగా వాకాటి మాట్లాడుతూ అందరి సహకారంతో విజయం సాధిస్తామని తెలిపారు. నిబంధనలు తుంగలో తొక్కిన టీడీపీ నాయకులు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో అధికా రపార్టీ నాయకులు నిబంధనలను తుంగలో తొక్కారు. రాష్ట్ర మంత్రితోపాటు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్నికల నిబంధనలను పాటించలేదు. మంగళ వారం ఎన్నికల ఆర్ఓ, జాయింట్ కలెక్టర్ మహమ్మద్‌ఇంతియాజ్ చాంబర్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీఎన్నికల నామినేన్ల దాఖలు ప్రక్రియ నిర్వహిం చారు. ముందుగా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి ఆయనతోపాటు నలుగురు వెళ్లారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కు మార్యాదవ్లోనికి వెళ్లబోతే అక్కడ ఉన్న సీఐ కలుగజేసుకుని నలుగురికి మాత్రమే అనుమతి ఉందని ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి నామినేషన్ వేసే సమయంలో మాత్రం సీఐ ఎవరినీ అడ్డుకోలేదు. ఆ పార్టీనాయకులు అందరూ లోనికి వచ్చారు. జేసీ పలుమార్లు నలుగురికి మించి ఉండొద్దు అని చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థితోపాటు నలుగురు ఉన్నారు. వాకాటి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖాలు చేశారు. ఈ నాలుగు సెట్లకు నాయకులు మారుతూ వచ్చారు. ఒకరి తరువాత ఒకరుగా ఆర్ఓ కార్యాలయంలోకి వచ్చి నామినేషన్ల ప్రక్రియలో పాల్గొన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసు లురెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, పాశం సునీల్‌కుమార్, మాజీ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నగర మేయర్ అబ్దుల్అజీజ్, మాజీ ఎమ్మెల్యే కె.విజయరామిరెడ్డి, సూళ్లూరుపేట జెడ్పీటీసీ సభ్యుడు రామ చంద్రారెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆనం
-
ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌రెడ్డి
వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వెల్లడి సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఒంగోలు ఎంపీ, పార్టీ జిల్లా పరిశీలకుడు వైవీ సుబ్బారెడ్డి సోమవారం ఇక్కడ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పార్టీ జిల్లా నేతలు, స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆనం విజయకుమార్‌రెడ్డిని తమ పార్టీ అభ్యర్థిగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ప్రలోభాలు, బెదిరింపుల కారణంగా పార్టీ ఫిరాయించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా తిరిగి పార్టీలోకి రావాలని ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలు ఎమ్మెల్సీ స్థానానికి గౌరు వెంకటరెడ్డి నామినేషన్ కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్సార్సీపీ నేత గౌరు వెంకటరెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, బనగానపల్లె నియోజకవర్గ ఇన్చార్జి కాటసాని రామిరెడ్డి, ఆళ్లగడ్డ ఇన్చార్జి గంగుల ప్రభాకర్‌రెడ్డి తదితరులతో కలసి రిటర్నింగ్ అధికారికి ఆయన ఒక సెట్ నామినేషన్ పత్రాలను అందచేశారు. అనంతరం గౌరు వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సీఎం చంద్రబాబు నెరవేర్చలేదని మండిపడ్డారు. టీడీపీ పాలనపై జిల్లా ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు. -
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఆనం
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కొత్త నియమాలు జరిగినట్టు పార్టీ కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. -
'ఆ 8 మంది గురించి మాట్లాడడం అనవసరం'
నెల్లూరు: ప్రతిపక్షం గొంతు నొక్కాలని సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, విపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని కస్తూరిదేవి గార్డెన్స్‌లో బుధవారం జరిగిన సభలో ఆనం విజయకుమార్ రెడ్డికి పార్టీ కండువా వేసి వైఎస్సార్ సీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అవినీతి సొమ్ముతో తమ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. అనైతిక రాజకీయాలు ఎక్కువ కాలం కొనసాగబోవని ఆయన అన్నారు. చంద్రబాబు మోసాలపై తమ పోరాటం కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే... ఎండను ఖాతరు చేయకుండా, ఆలస్యమైనా కూడా ఏ ఒక్కరి ముఖంలో చికాకు కన్పించకుండా అప్యాయతను పంచిపెడుతున్న అందరికీ చేతులు జోడించి శిరసు వంచి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను విజయన్నను మన పార్టీలో చేర్చుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది రాష్ట్ర ప్రజల మనోభావాలకు విజయన్న చేరిక అద్దం పడుతోంది మొన్న వెళ్లిపోయిన 8 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడడం అనవసరం ప్రతిపక్షమంటే ప్రజల గొంతు, మాట్లాడలేని ప్రజల గొంతు చంద్రబాబు మోసాలకు అవస్థలు పడుతున్న ప్రజల గొంతే ప్రతిపక్షం అలాంటి ప్రతిపక్షం గొంతు నొక్కేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు తన పార్టీ టికెట్ పై గెలవకపోయినా అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నాలు చేస్తున్నారు రాజకీయాలలో ఉన్నప్పుడు ప్రజలు మన వైపు చూస్తారు రాజకీయాలలో ఉన్నప్పుడు వ్యక్తిత్వం, విశ్వసనీయత అనే రెండు గుణాలు ఉండాలి ఈ రెండు గుణాలు లేకుంటే ఇంట్లో పెళ్లాం కూడా మీ వెంట నడిచే పరిస్థితి ఉండదు అధికారం కోసం, కుర్చీ కోసం సొంత మామను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు వ్యక్తిత్వం ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పడం, అధికారంలోకి వచ్చాక మోసగించడం చంద్రబాబు విశ్వసనీయత కొనుగోళ్లకు వెళ్లిపోయిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడం అనవసరం సోనియాతో చంద్రబాబు కుమ్మక్కై కేసులు పెట్టినా నేను భయపడలేదు దేవుడిని, ప్రజలను నమ్ముకుని ముందడుగు వేశాం 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలతో ఢిల్లీ మొత్తం మనవైపు చూసేలా చేశాం చంద్రబాబు తన పాలన మెరుగు పరుచుకోవాలి, ఇచ్చిన హామీలు అమలుచేయాలి ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాగానే చంద్రబాబు అందరినీ మోసం చేశారు ఎన్నికలప్పుడు ఏ మాటలు చెప్పారో అవి నెరవేర్చాలి. కానీ చంద్రబాబు ప్రజలను, వారికి ఇచ్చిన మాటను గాలికి వదిలేశాడు నీచమైన రాజకీయాలు ఎక్కువ రోజులు నిలబడవు బ్రిటిష్ పాలకులు, హిట్లర్ లాంటివాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు ప్రజల కోపానికి బంగాళాఖాతంలో కలిసిపోక తప్పదు, చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావు చంద్రబాబుతో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా, మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు మాకు కావాలి విజయన్నను సాదరంగా ఆహ్వానిస్తున్నా, మా కుటుంబ సభ్యుడిగా ఆయన ఉంటాడని గట్టిగా చెబుతున్నా -
సన్నిహితుల సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిన ఆనం
నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు ఆనం విజయకుమార్‌రెడ్డి, ఆయన కుమారుడు కార్తికేయరెడ్డి, వారి అనుచరులు బుధవారం వైఎస్ జగన్ మెహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. కస్తూరిదేవి గార్డెన్స్ లో జరిగిన సభలో ఆనం విజయకుమార్ రెడ్డి, ఆయన తనయుడు కార్తికేయరెడ్డికి పార్టీ కండువాలు వేసి వైఎస్ జగన్ వారిని సాదరంగా ఆహ్వానించారు. విజయకుమార్‌రెడ్డి ఇటీవల జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే తన అనుచరులు, సన్నిహితులు కస్తూరిదేవి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా కార్తికేయరెడ్డి మాట్లాడుతూ... వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్ సీపీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాని గోవర్థన్, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు చేరుకున్న వైఎస్ జగన్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జిల్లాలో అడుగుపెట్టినప్పటి నుంచి నాయుడుపేట మొదలు ప్రతిచోటా ఆయనకు నాయకులు ఘన స్వాగతం పలికారు. దీంతో ఆయన నెల్లూరుకు చేరుకోవడం ఆలస్యమైంది. కస్తూరిదేవి గార్డెన్స్ లో కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో సభా ప్రాంగణం నుంచి లోపలకు రావడానికి వైఎస్ జగన్ కు చాలా సమయం పట్టింది. -
వైఎస్సార్సీపీలోకి ఆనం సోదరుడు
జగన్ సమక్షంలో పార్టీలో చేరిన ఆనం విజయకుమార్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: నెల్లూరు జిల్లాలో ఆనం వర్గానికి వెన్నుదన్నుగా ఉంటూ రాజకీయాలు నడుపుతూ వచ్చిన ఆనం విజయకుమార్‌రెడ్డి (నాలుగో సోదరుడు) బుధవారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వచ్చిన ఆనం వివేకానందరెడ్డి, రామనారాయణరెడ్డి ఇటీవల టీడీపీలో చేరినా విజయ్ వారివెంట వెళ్లలేదు. అన్నలిద్దరినీ విభేదిస్తూ తన కుమారుడు కార్తికేయరెడ్డి, మరికొందరు ముఖ్య అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీలో చేరారు. విజయ్ తన కుమారుడు, అనుచరులతో ఉదయం జగన్ నివాసానికి వచ్చి ఆయనను కలుసుకుని పార్టీలో చేరాలన్న తన అభీష్టాన్ని వెల్లడించారు. జగన్ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హామీలు నెరవేర్చని పార్టీలోకి ఎవరు పోతారు?: మేకపాటి ఎన్నికలపుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని చంద్రబాబు పార్టీలోకి ఎవరు పోతారని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. విజయ్ చేరిక సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమ పార్టీ వారెవ్వరూ టీడీపీవైపు కన్నెత్తి చూడరని చెప్పారు. తాను తొలి నుంచీ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానినని, అయితే తన అన్నల చాటున రాజకీయం చేస్తూ వచ్చాను కనుక బయటకు రాలేక పోయామని విజయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలిపారు. -
నెల్లూరు టీడీపీ త్వరలో ఖాళీ
హైదరాబాద్ : భవిష్యత్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని నెల్లూరు లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని లోటస్‌పాండ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి పార్టీలో చేరారు. అనంతరం మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ... నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలోపేతమవుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అన్ని వర్గాల ప్రజల్లోనూ అసంతృప్తిగా ఉందని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని మేకపాటి ఆరోపించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ టీడీపీలో చేరరని మేకపాటి స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.... నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని తెలిపారు. జిల్లాలో పార్టీ మరింత బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ త్వరలో ఖాళీ అవుతుందని జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి, మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి జోస్యం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ప్రారంభమవుతాయన్నారు. ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి చేరికతో జిల్లా పార్టీకి కొత్త ఉత్సాహానిస్తుందన్నారు. -
ఆనం సోదరులకు ఎదురుదెబ్బ!
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి సోదరులకు ఎదురుదెబ్బ తగలనుంది. ఆనం సోదరుడు ఆనం విజయ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారు. శనివారం వైఎస్ఆర్ సీపీ జిల్లా నేతలను కలసి ఆయన ఈ మేరకు చర్చలు జరిపారు. పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కార్యాలయానికి వెళ్లి మాట్లాడారు. అనంతరం ఆనం విజయ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విధానాలు తనకు నచ్చాయని, ఆయన నేతృత్వంలో పార్టీలో పనిచేసేందుకు సిద్ధమని చెప్పారు. అనుచరులతో మాట్లాడి త్వరలో పార్టీలో చేరే నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. ఆనం సోదరులు రామనారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డి ఇటీవల టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ టీడీపీలో చేరడం పట్ల విజయ్‌కుమార్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు.