నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఒంగోలు ఎంపీ, పార్టీ జిల్లా పరిశీలకుడు వైవీ సుబ్బారెడ్డి సోమవారం ఇక్కడ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పార్టీ జిల్లా నేతలు, స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆనం విజయకుమార్‌రెడ్డిని తమ పార్టీ అభ్యర్థిగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ప్రలోభాలు, బెదిరింపుల కారణంగా పార్టీ ఫిరాయించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా తిరిగి పార్టీలోకి రావాలని ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.