నెల్లూరు టీడీపీ త్వరలో ఖాళీ | ysr congress party leaders takes on tdp | Sakshi
Sakshi News home page

నెల్లూరు టీడీపీ త్వరలో ఖాళీ

Published Wed, Feb 17 2016 10:47 AM | Last Updated on Sat, Oct 20 2018 6:13 PM

నెల్లూరు టీడీపీ త్వరలో ఖాళీ - Sakshi

నెల్లూరు టీడీపీ త్వరలో ఖాళీ

హైదరాబాద్ : భవిష్యత్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని నెల్లూరు లోక్సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని లోటస్పాండ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం విజయ్కుమార్రెడ్డి పార్టీలో చేరారు. అనంతరం మేకపాటి రాజమోహన్రెడ్డి మాట్లాడుతూ... నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా  బలోపేతమవుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అన్ని వర్గాల ప్రజల్లోనూ అసంతృప్తిగా ఉందని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని మేకపాటి ఆరోపించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ టీడీపీలో చేరరని మేకపాటి స్పష్టం చేశారు.

ఆ తర్వాత ఆనం విజయ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.... నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని తెలిపారు. జిల్లాలో పార్టీ మరింత బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ త్వరలో ఖాళీ అవుతుందని జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్రెడ్డి, మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి జోస్యం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ప్రారంభమవుతాయన్నారు. ఆనం విజయ్కుమార్రెడ్డి చేరికతో జిల్లా పార్టీకి కొత్త ఉత్సాహానిస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement