రాష్ట్రంలో ప్రతి ఇంటా సంక్షేమం
వైఎస్సార్‌తో ఎనలేని అనుబంధం
ప్రజల పక్షాన పోరాటాలు చేసి ఆయన సీఎం అయ్యారు
తండ్రిని మించిన తనయుడు జగన్
సాక్షితో మాజీ ఎంపీ మేకపాటి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అతి సామాన్య కుటుంబంలో జన్మించి, రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలతో సాగించిన మాజీ సీఎం చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ప్రజల కోసం గుర్తుంచుకోదగ్గ ఒక్క పనిచేయలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. దీన్నిబట్టి చంద్రబాబు ప్రజాజీవితానికి పనికిరారనే అంశం స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొన్నారు. మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలోని తన నివాసంలో బుధవారం ఆయన సాక్షి ప్రతినిధితో మాట్లాడారు.
దివంగత సీఎం వైఎస్సార్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. ప్రజల పక్షాన మూడు దశాబ్దాలకుపైగా పోరాటాలు చేసి ఆయన సీఎం అయిన అంశాన్ని ప్రస్తావించారు. వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో తిరుగులేని ప్రజానేతగా వైఎస్సార్ అవతరించారన్నారు. వైఎస్సార్‌తో కలిసి కాంగ్రెస్‌లో పనిచేశానని, ఆయన మరణంతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులతోపాటు కోట్లాది అభిమానుల మనోభావాల్లో అనూహ్యమైన మార్పొచి్చందని తెలిపారు.
జగన్‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ యత్నం
అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర చేయాలని భావిస్తే, కొందరి మాటలను విని పార్టీ అధిష్టానం అడ్డుకుందని చెప్పారు. ఈ క్రమంలో తాము ఆయనకు అండగా నిలిచామన్నారు. జగన్‌తో తన కుమారుడు గౌతమ్‌రెడ్డి మాట్లాడిన అనంతరం తాను ఎంపీ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరినట్లు చెప్పారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సుబ్బిరామిరెడ్డి బరిలో దిగారని, ఆయనకు మద్దతుగా అప్పటి రాష్ట్ర, కేంద్ర మంత్రులు రంగంలోకి దిగి తనను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డిన అంశాన్ని గుర్తుచేశారు. అయినా తాను 2.92 లక్షలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందానని తెలిపారు.
ప్రజల గుండెల్లో జగన్‌కు సుస్థిర స్థానం
వివిధ సంక్షేమ పథకాలు, నూతన ఒరవడితో ప్రజల హృదయాల్లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సుస్థిరస్థానం సంపాదించుకున్నారని చెప్పారు. 2014 ఎన్నికల్లోనే ఆయన్ని సీఎం చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, అయితే పచ్చమీడియా, టీడీపీ దు్రష్పచారంతో ఆ అవకాశాన్ని త్రుటిలో కోల్పోయారని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలను గెల్చుకుని అఖండ విజయాన్ని నమోదు చేసుకుందని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజాభిమానం మరింత ఎక్కువైందని, వై నాట్ 175 అనే పిలుపు అక్షరసత్యం కానుందని పేర్కొన్నారు. సిద్ధం, మేమంతా సిద్ధం సభలకు అశేష ప్రజాదరణ లభిస్తోందని, రానున్న ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించనుందనే అంశం దీని ద్వారా స్పష్టమవుతోందని చెప్పారు.
చరిత్రహీనులుగా మిగలడం ఖాయం
ప్రజాబలం లేని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ వంటి వారు సీఎంపై దాడులకు ఉసిగొల్పి చరిత్రహీనులుగా నిలిచిపోనున్నారని ధ్వజమెత్తారు. సీఎంపై ఇటీవల రాయితో దాడిచేశారని, ప్రజాశీస్సులు మెండుగా ఉన్న కారణంగా ఆయనకు పెనుప్రమాదం తప్పిందన్నారు. ఈ హత్యాయత్నం వెనుక అసలు దోషి చంద్రబాబు కాదా అని ప్రశి్నంచారు. సంక్షేమసారథి జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మకూరు నుంచి తన కుమారుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి, ఉదయగిరి నుంచి తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి తిరుగులేని ఆధిక్యంతో విజయం సాధించనున్నారని చెప్పారు. నెల్లూరు లోక్‌సభతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి సీఎంకు కానుకగా ఇవ్వాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment