
సాక్షి, నెల్లూరు: ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ లోకేష్ నవ్వులపాలవుతున్నారని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆత్మకూరులో అభివృద్ది లేదని విమర్శించే వాళ్లు అక్కడికి వెళ్లి చూస్తే తెలుస్తుందని హితవు పలికారు. లోకేష్ బుద్ధి, జ్ఞానం లేకుండా విమర్శలు చేశారు.. తమ సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తామని ఘాటుగా రాజమోహన్‌రెడ్డి బదులిచ్చారు.
నెల్లూరులో సాగు నీటి ప్రాజెక్టులు అన్నీ వైఎస్సార్, జగన్ పుణ్యమేనని చెప్పారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులు పూర్తి అవ్వాలంటే 2024లో కూడా వైఎస్ జగన్ సీఎం అవ్వాలంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఆర్ధిక బలం, కమ్మ బలం, మీడియా సపోర్ట్ ఉంటే.. జగన్‌కు మాత్రం ప్రజా బలం ఉందన్నారు. లోకేష్ బుజ్జి బాబు చేసిన విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మేకపాటి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
చదవండి: గంటకో నిర్ణయం.. పూటకో మాట.. పవన్‌పై మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్
Comments
Please login to add a commentAdd a comment