ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆనం నామినేషన్
నెల్లూరు(పొగతోట): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌రెడ్డి మంగళవారం రెండు సెట్ల నామినేషన్ల పత్రాలను దాఖలు చేశారు. 20 మంది అభ్యర్థులు ఆనం విజయకుమార్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు నాయకులు తరలివచ్చారు. వైఎస్సార్, వైఎస్.జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. తొలుత వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు.
ఎన్నికల ఆర్‌ఓ, జాయింట్ కలెక్టర్ ఏ.మహమ్మద్ ఇంతియాజ్‌కు ఉదయం 11.56 నిమిషాలకు ఆనం విజయకుమార్‌రెడ్డి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి ఆశీసులతో, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి అండదండలు, అందరి సహకారంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మోజారిటీతో విజయం సాధిస్తామన్నారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ వైఎస్సార్ ఆశయసాధనకు కృషి చేస్తానని తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
అధికారపార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులకు కనీస మర్యాద కూడా ఇవ్వడంలే దని తెలిపారు. స్థానిక సంస్థల్లో ఓటు అర్హత ఉన్న ప్రతిఒక్కరూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆనం విజయకు మార్‌రెడ్డికి ఓటు వేసి గెలిపిం చాలన్నారు. ఈ ఎన్నికలు ప్రభుత్వానికి గుణపాఠం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు, తిరుపతి ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వి.వరప్రసాధ్, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, నెల్లూరు సిటీ, ఆత్మకూరు, కావలి, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు డాక్టర్ పి.అనిల్‌కుమా ర్‌యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ పి.శిరిష, గూడూరు సమన్వయకర్త మేరిగ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
వాకాటి నామినేషన్
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా వాకాటి నారాయణరెడ్డి నామి నేషన్ వేశా రు. నాలుగు సెట్లు దాఖాలు చేశారు. జిల్లా ఇన్‌చార్జి మం త్రి శిద్దా రాఘవరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసు లురెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, మాజీ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి తదితర నాయకులు సమక్షంలో వాకాటి నామినేషన్ దాఖాలు చేశారు. ఈ సందర్భంగా వాకాటి మాట్లాడుతూ అందరి సహకారంతో విజయం సాధిస్తామని తెలిపారు.
నిబంధనలు తుంగలో తొక్కిన టీడీపీ నాయకులు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో అధికా రపార్టీ నాయకులు నిబంధనలను తుంగలో తొక్కారు. రాష్ట్ర మంత్రితోపాటు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్నికల నిబంధనలను పాటించలేదు. మంగళ వారం ఎన్నికల ఆర్‌ఓ, జాయింట్ కలెక్టర్ మహమ్మద్‌ఇంతియాజ్ చాంబర్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీఎన్నికల నామినేన్ల దాఖలు ప్రక్రియ నిర్వహిం చారు. ముందుగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి ఆయనతోపాటు నలుగురు వెళ్లారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కు మార్‌యాదవ్‌లోనికి వెళ్లబోతే అక్కడ ఉన్న సీఐ కలుగజేసుకుని నలుగురికి మాత్రమే అనుమతి ఉందని ఎమ్మెల్యేను అడ్డుకున్నారు.
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి నామినేషన్ వేసే సమయంలో మాత్రం సీఐ ఎవరినీ అడ్డుకోలేదు. ఆ పార్టీనాయకులు అందరూ లోనికి వచ్చారు. జేసీ పలుమార్లు నలుగురికి మించి ఉండొద్దు అని చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థితోపాటు నలుగురు ఉన్నారు. వాకాటి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖాలు చేశారు. ఈ నాలుగు సెట్లకు నాయకులు మారుతూ వచ్చారు. ఒకరి తరువాత ఒకరుగా ఆర్‌ఓ కార్యాలయంలోకి వచ్చి నామినేషన్ల ప్రక్రియలో పాల్గొన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసు లురెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, పాశం సునీల్‌కుమార్, మాజీ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నగర మేయర్ అబ్దుల్‌అజీజ్, మాజీ ఎమ్మెల్యే కె.విజయరామిరెడ్డి, సూళ్లూరుపేట జెడ్పీటీసీ సభ్యుడు రామ చంద్రారెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.