టీడీపీకి స్పీకర్ గా కోడెల...
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. సభ మొత్తానికి కాకుండా శివప్రసాద్ రావు తెలుగుదేశం పార్టీకి స్పీకర్ గా వ్యవహరిస్తున్నారని కోటంరెడ్డి ఆరోపించారు.
శాసనసభను తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ గా మార్చివేశారని ఆయన విమర్శించారు. సభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని స్పీకర్ పదే పదే అడ్డుకోవడం శోచనీయమని కోటం రెడ్డి అన్నారు.