ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార పక్షమైన టీడీపీకి 102 మంది, ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్‌కు 66 మంది
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార పక్షమైన టీడీపీకి 102 మంది, ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్‌కు 66 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా నిరవధికంగా సభను వాయిదా వేయడానికి ముందు సంప్రదాయం ప్రకారం స్పీకర్ ఆయా పార్టీల బలాబలాలను వెల్లడిస్తూ... టీడీపీకి 102, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 66, బీజేపీకి 4, నవోదయం పార్టీకి 1, స్వతంత్రులు, 1 ఖాళీ 1గా సభ్యులున్నట్లుగా ప్రకటించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించడాన్ని పురస్కరించుకుని వారిని అనర్హులుగా ప్రకటించాలని ప్రతిపక్షం ఇచ్చిన ఫిర్యాదులు ఇంకా స్పీకర్ పరిధిలో నిర్ణయం కోసం ఉన్న సంగతి విదితమే.