
గొల్లకందుకూరులో కోటంరెడ్డికి గోడు వెళ్లబోసుకుంటున్న వృద్ధురాలు
నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మన ఎమ్మెల్యే.. మన ఇంటికి 105 రోజుల ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజైన మంగళవారం గొల్లకందుకూరులో పర్యటించారు. ఇం టింటికీ వెళ్లి ప్రజలను పలకరించి సమస్యలను తెలుసుకున్నారు. సం బంధిత అధికారులకు ఫోన్ చేసి పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాబాట చేపట్టిన దృష్ట్యా నాలుగు నెలలపాటు కుటుంబ కార్యక్రమాలకు హాజరు కాలేనని, తన భార్య సుజిత హాజరవుతారని, ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ప్రజాబాట నిర్వహిస్తూనే శుభ కార్యక్రమాలకు హాజరుకావాలని అనుకున్నా సాధ్యం కావడం లేదన్నారు.
క్షేత్రస్థాయిలో కార్యక్రమానికి ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆయన వెంట సర్పంచ్ పొనకా ప్రతిమ, ఎంపీటీసీ సభ్యుడు ఆవుల సరస్వతి, నేతలు పొనకా శివకుమార్‌రెడ్డి, ఆవుల గోపాలయ్య, సుధాకర్‌రెడ్డి, గుంజి బాబూరావు, అశోక్, పాదర్తి రంగయ్య, అయ్యప్ప, చేవూరి సుజాతమ్మ, చెరుకూరి శ్రీనివాసులు, తుమ్మూరు శ్రీనివాసులు, దయాకర్‌రెడ్డి, మహేంద్ర ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment