'మోదీ గారు..బాబు పాపాల్లో భాగం కావొద్దు'
హైదరాబాద్: ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. వందలకోట్లు వెదజల్లినా.. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి గెలుపు ఖాయమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీ.. చంద్రబాబు పాపాల్లో భాగం కావొద్దంటూ కోరారు. ప్రధానికి సైతం మరక అంటించే ప్రయత్నం జరుగుతోందని ధ్వజమెత్తారు. తక్షణమే ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభ్యర్థించారు.