పొలిటికల్‌ డ్యూటీ చేస్తున్న ఎస్పీ | Kotam Reddy Sridhar Reddy Fires On Police Officials | Sakshi
Sakshi News home page

పొలిటికల్‌ డ్యూటీ చేస్తున్న ఎస్పీ

Published Fri, May 4 2018 1:38 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

Kotam Reddy Sridhar Reddy Fires On Police Officials - Sakshi

మాట్లాడుతున్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

నెల్లూరు(సెంట్రల్‌): ప్రజలకు సేవ చేయాల్సిన ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ అధికార పార్టీ నేతలు చెప్పినట్లు పొలిటికల్‌ డ్యూటీ చేస్తున్నారని నెల్లూరురూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విరుచుకుపడ్డారు. నెల్లూరులోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  నెల్లూరురూరల్‌ నియోజకవర్గ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ తీరుపై మండిపడ్డారు. బెట్టింగ్‌ కేసులో ఇతరులకు సహకరించినట్లు తనపై విచారణ పూర్తిచేసి కోర్టులో ఎస్పీ రామకృష్ణ చార్జిషీట్‌ దాఖలు చేశారన్నారు.

తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏ ఒక్క అధికారికి ఫోన్‌ చేసినా స్పందించే పరిస్థితి లేదన్నారు. కానీ క్రికెట్‌ బెట్టింగ్‌లో దొరికిన వారికి తాను పోలీసులకు ఫోన్‌ చేసి విడిపించానని కట్టుకథ ఎస్పీ అల్లారని, నిజంగా తాను ఏ పోలీసు అధికారికి ఫోన్‌ చేశానో స్పష్టం చేయాలన్నారు. బుకీలకు తాను సపోర్టు చేస్తే తప్పు అయినప్పుడు, పో లీసులు విడుదల చేసినప్పుడు  వారిది కూడా తప్పేన న్నారు. తాను ఏ ఎస్సై, సీఐ డీఎస్పీకి ఫోన్‌ చేసి విడిపిం చానో  ఆధారాలు చూపాలని సవాల్‌ విసిరారు. నంద్యాల ఎన్ని కల సమయంలో, రాజ్యసభ ఎన్నికలప్పుడు, తాను పాదయాత్ర చేపట్టబోయే సమయంలో ఎస్పీ కా వాలని తనపై బురదజల్లుతున్నారని ఆరోపించారు.

ఎస్పీ నిజాయితీ పరుడా?
ఎస్పీ రామకృష్ణ నిజాయితీ పరుడైతే క్రికెట్‌ బుకీలుగా ఉన్న వారు అధికార పార్టీ మంత్రులకు సన్మానాలు, విందులు ఇచ్చిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. వీరిపై చార్జీషీట్‌ వేసి ఏసీబీ, జ్యుడిషియల్‌ విచారణకు ఎందుకు లేఖ రాయడానికి ఎస్పీ భయపడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. బెట్టింగ్‌లు చేసే వారితో పోలీసు అధికారులు వారి అటెండర్‌లు, డ్రైవర్ల ఫోన్‌ నుంచి వెళ్లిన కాల్స్‌పై ఎందుకు విచారణ చేయడానికి ఎస్పీ జంకుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. పోలీస్‌ అధికారిగా కాకుండా పొలిటకల్‌ డ్యూటీ చేస్తున్నారని విమర్శించారు.

100 కేసులు పెట్టినా భయపడను
తనపై అక్రమంగా వంద కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. ఎస్పీ రామకృష్ణ చేస్తున్న చట్టవ్యతిరేక కార్యక్రమాలను అడ్డుకుంటానన్నారు. అధికార పార్టీ నాయకులు ఆడించినట్లు ఆడుతూ తనపై అక్రమ, అబద్ధాల చార్జీషీట్‌ వేసిన దానిపై న్యాయపోరాటం చేస్తానన్నారు. ఎస్పీ తాటాకు బెదిరింపులకు తాను భయపడనని స్పష్టం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement