
సాక్షి, నెల్లూరు: రాష్ట్ర శాసనసభ కమిటీల్లో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు ఆగ్ర తాంబూలం దక్కింది. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం వివిధ కమిటీలకు చైర్మన్‌లను, సభ్యులను నియమించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిని శాసనసభ హక్కుల కమిటీ చైర్మన్‌గా నియమించారు. అలాగే శాసనసభ రూల్స్ కమిటీలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని, శాసనసభ పిటిషన్స్ కమిటీ సభ్యుడిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని నియమించారు. అలాగే ప్రివిలేజ్ కమిటీలో సభ్యుడిగా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్‌ను నియమించారు. అసెంబ్లీ నిర్వహణ, విధివిధానాల అమలు, సభ్యుల హక్కుల పరిరక్షణలో కమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment