'పొలిటికల్‌ మైండ్‌ గేమ్‌ను అడ్డుకుంటా' | YSRCP MLA KotamReddy Sridhar Reddy Comments Illegal Cases | Sakshi
Sakshi News home page

'పొలిటికల్‌ మైండ్‌ గేమ్‌ను అడ్డుకుంటా'

Published Sat, Mar 10 2018 1:50 PM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

YSRCP MLA KotamReddy Sridhar Reddy Comments Illegal Cases - Sakshi

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి

సాక్షి, నెల్లూరు: తనపై మోపిన అక్రమ కేసులను ప్రజా పోరాటాలతోనే అడ్డుకుంటానని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రభుత్వం వేధిస్తోందని విమర్శించారు. అన్యాయంగా విపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు.

రాజకీయ ఒత్తిడులకు జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ తలొగ్గారని.. ఓఎస్డీ విఠలేశ్వర్‌ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విచారణ హాజరయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పొలిటికల్‌ మైండ్‌ గేమ్‌లను అడ్డుకుంటానని.. ఆధారాలు ఉంటే కేసులు నమోదు చేసుకోవాలని ఆయన అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement