illigal cases
-
వ్యవస్థీకృత నేర రాజకీయాల్లో చంద్రబాబు బరితెగింపు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్గనైజ్డ్ క్రైమ్ (వ్యవస్థీకృత నేరాలు)తో కూడిన పాలిటిక్స్ (రాజకీయాలు) సాగిస్తూ చంద్రబాబు మరింతగా బరి తెగించారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. కూటమి 100 రోజుల పాలన, మోసాలు, వైఫల్యాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు సృష్టించిన అబద్ధాన్ని ఎల్లో మీడియా మోయడం.. ఆ తర్వాత ఆ పార్టీల నాయకులు, వారిని మోస్తున్న అధికారులు ప్రజల్లో అశాంతిని రేపేలా చేయడం ఒక పన్నాగం ప్రకారం జరిగాయని ఎత్తి చూపారు. సోషల్ మీడియాపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ఎండగడుతూ శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ⇒ దొంగే ఎదుటివారిని పట్టుకుని దొంగా అన్నట్టుగా చంద్రబాబు తీరు ఉంది. నలభై ఏళ్లుగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న చంద్రబాబు ఇప్పుడు కూడా అదే చేస్తూ ఎదుటివారి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తన స్కాంలు బయటపడుతున్నాయని, తాను చేసిన అవినీతి బయటకు వస్తోందని, తన పాలనా వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతున్నారనే దురహంకారంతో ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా గొంతు విప్పుతున్నవారిని, ముఖ్యంగా చంద్రబాబు తప్పులను నిలదీస్తున్న యువతను లక్ష్యంగా చేసుకుని చట్టవిరుద్ధంగా, అన్యాయంగా, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. తన అడుగులకు మడుగులొత్తే పోలీసులను వాడుకుంటూ వారిపై భౌతికదాడులు చేయిస్తూ, హింసిస్తున్నారు. ఇది ఆర్గనైజ్డ్ క్రైం కాదా? ⇒ ఎలాగూ చంద్రబాబు చేతిలోనే దాదాపుగా అన్ని పేపర్లు ఉన్నాయి. కాస్తోకూస్తో ప్రజాసమస్యలపై గొంతు విప్పే టీవీలను కూడా వ్యవస్థీకృతంగా దెబ్బ తీశారు. కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి వాటి ప్రసారాలను ప్రజలకు చేరనీయకుండా పలుమార్లు కట్ చేశారు. ఇక చంద్రబాబుకు కొరుకుడుపడనిది ఒకే ఒక్కటి. అదే సోషల్ మీడియా. అందుకే చంద్రబాబు ఇలా బరితెగిస్తున్నారు. ఇలా ఒక చేత్తో తన మీడియాను, మరో చేత్తో వ్యవస్థలను, ఆ వ్యవస్థల్లోని తన మనుషులను వాడుకుని నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబు చేస్తున్న ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చూస్తూనే ఉన్నాం. మరి ఆర్గనైజ్డ్ క్రైమ్స్‌కు పాల్పడుతున్నది ఎవరు? ⇒ ప్రజలకు మంచిచేసి కాకుండా, మభ్యపెట్టి, మోసం చేసి, అబద్ధాలు ఆడి అధికారంలోకి రావాలని, అధికారంలో ఉంటే దాన్ని ఇలాగే నిలబెట్టుకోవాలన్నది చంద్రబాబు సిద్ధాంతం. దీనికోసం చంద్రబాబుగారు ఒక అబద్ధాన్ని సృష్టిస్తారు. దానికి రెక్కలుతొడిగి తన ఎల్లోమీడియా ద్వారా శరవేగంగా వ్యాపింపచేస్తారు. దానిపైనే వారి పార్టీనాయకులచేత మాట్లాడిస్తారు. పనిలోపనిగా దత్తపుత్రుడిని, ఇతర పార్టీల్లో తనకు అనుకూలంగా ఉన్నవారినికూడా దీనికి వాడుకుంటారు.ఆ తర్వాత డిబేట్లు చేయిస్తారు. దీనికి మరిన్ని అవాస్తవాలు జోడించి తన కుమారుడు లోకేశ్ ద్వారా సోషల్ మీడియాలో విష ప్రచారం చేయిస్తారు. వాళ్లే ఆరోపణలు చేసి, వాళ్లే మీడియా ట్రయల్ చేసి, వాళ్లే దోషులెవరో నిర్ధారించి, వాళ్లే శిక్షలు విధిస్తారు. ఒక పథకం ప్రకారం, మాఫియా ముఠా మాదిరిగా చంద్రబాబు ఈ నేరాలు చేస్తూనే ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలను దెబ్బ తీయడానికి, రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననానికి నిరంతరం ప్రయతి్నస్తూనే ఉంటారు. మరి ఇది వ్యవస్థీకృత నేరం కాదా?⇒ అయ్యా చంద్రబాబూ, మీ పార్టీ టీడీపీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో మీరే ఫేక్ న్యూస్‌పెట్టి, దాన్ని మీరే ప్రొపగండా చేసిన లేటెస్ట్ ట్వీట్‌ను రాష్ట్ర ప్రజలంతా గమనించారు. ఎప్పుడో రెండేళ్ల కిందట మా అమ్మ కారు టైర్ బరస్ట్ అయితే, అప్పటి వీడియోను ఇప్పుడు బయటకు తీసి, లేటెస్ట్గా ఇప్పుడే జరిగినట్టుగా, మీరు ట్వీట్లో పెడుతూ, నా తల్లిని నేను చంపాలని అనుకున్నానని సిగ్గుమాలిన రీతిలో వ్యక్తిత్వ హననానికి నువ్వు దిగావు.దీన్ని ఖండిస్తూ మా అమ్మ లేఖ రాస్తే దాన్నికూడా ఫేక్ లెటర్‌గా పేర్కొంటూ నువ్వు పబ్లిసైజ్ (ప్రచారం) చేయడం సిగ్గుమాలిన చర్య కాదా? మళ్లీ మా అమ్మ వీడియో మెసేజ్ కూడా ఇస్తూ మీ తీరును దుయ్యబట్టింది. ఇంతలా ఉద్దేశ పూర్వకంగా వ్యక్తిత్వ హననం చేసిన నిన్ను, నీ కొడుకును ఇదే పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదు? ఇలాంటివి శతకోటి మీ ఏబీఎన్, మీ ఈనాడు, మీ టీవీ–5, మీ అనుకూల మీడియా ఎన్ని చేసినా పోలీసులు ఏనాడైనా చర్యలు తీసుకున్నారా? నువ్వు చేస్తే ఏదైనా మంచే! కాని నువ్వు చేసిన తప్పుడు పనులను, ప్రజా వ్యతిరేక చర్యలను ఎవరైనా ప్రశి్నస్తే అది చెడు అవుతుందా? వారిపై కేసులుపెట్టి వారిని హింసించడం ధర్మమేనా? ⇒ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్గనైజ్డ్ క్రైమ్‌తోకూడిన పాలిటిక్స్‌లో చంద్రబాబు మరింతగా బరితెగించారు. మొన్నటి తిరుమల లడ్డూ వ్యవహారం వరకూ జరిగిన అనేక పరిణామాలు దీనికి ఉదాహరణ. కూటమి 100 రోజుల పాలన, మోసాలు, వైఫల్యాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు సృష్టించిన అబద్ధాన్ని ఎల్లోమీడియా మోయడం, ఆ తర్వాత ఆ పార్టీల నాయకులు, వారిని మోస్తున్న అధికారులు ప్రజల్లో అశాంతిని రేపేలా చర్యలు, కార్యక్రమాలు చేయడం ఒక పన్నాగం ప్రకారం జరిగాయి. మరి వ్యవస్థీకృత నేరాల కింద అరెస్టు చేయాల్సింది ఎవరిని? జీవిత ఖైదు వేయాల్సింది ఎవరికి? చంద్రబాబుకు కాదా? -
రైతులపై చింతమనేని దౌర్జన్యం
సాక్షి, పశ్చిమగోదావరి : న్యాయం చేయాలంటూ వచ్చిన రైతుల పట్ల దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దారుణంగా ప్రవర్తించారు. వారిని బూతులు తిడుతూ.. అక్రమ కేసుల సైతం పెట్టడానికి సిద్ధపడ్డారు. వివరాలు.. గురువారం వట్లూరు జన్మభూమి మీటింగ్‌కు చింతమనేని ప్రభాకర్ హజరయ్యారు. ఈ సందర్భంగా వట్లూరు చెరువులో భూములు కోల్పోయిన రైతులు తమకు రావాల్సిన నష్టపరిహారం ఇప్పించాలంటూ ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. దాంతో ఆగ్రహానికి గురైన చింతమనేని రైతులపై బూతు పురాణం ప్రారంభించారు. సహనం కోల్పోయిన అన్నదాతలు సమస్యను పరిష్కరించకుండా తమను తిట్టడం సరికాదంటూ వాదనకు దిగారు. దీంతో మరింత అసహనానికి గురైన చింతమనేని ఎమ్మార్వోతో చెప్పి సదరు రైతులపై ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు రైతుల మీద 353 సెక్షన్ కింద కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు కొఠారు రామచంద్ర రావు, కార్యకర్తలు ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కెళ్లి రైతులను పరామర్శించారు. -
'పొలిటికల్ మైండ్ గేమ్‌ను అడ్డుకుంటా'
సాక్షి, నెల్లూరు: తనపై మోపిన అక్రమ కేసులను ప్రజా పోరాటాలతోనే అడ్డుకుంటానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రభుత్వం వేధిస్తోందని విమర్శించారు. అన్యాయంగా విపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. రాజకీయ ఒత్తిడులకు జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ తలొగ్గారని.. ఓఎస్డీ విఠలేశ్వర్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విచారణ హాజరయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పొలిటికల్ మైండ్ గేమ్‌లను అడ్డుకుంటానని.. ఆధారాలు ఉంటే కేసులు నమోదు చేసుకోవాలని ఆయన అన్నారు. -
అక్రమ కేసులపై ఆగ్రహం
సర్కార్ తీరుపై పెల్లుబికిన నిరసనలు వైఎస్సార్ సీపీ శ్రేణుల ఆందోళనలు జగన్‌పై తప్పుడు కేసులు ఎత్తివేయాలని డిమాండు మానవత్వం లేని ప్రభుత్వమంటూ మండిపాటు టీడీపీ ఎంపీకి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సు.. మృత్యుశకటమై.. పదిమంది అమాయకులను బలి తీసుకుంటే.. మరెంతోమందిని క్షతగాత్రుల్ని చేస్తే.. ఆ బాధితుల పక్షాన విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గళమెత్తడమే చంద్రబాబు సర్కారు దృష్టిలో నేరమైంది. జగన్‌తోపాటు, పార్టీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టింది. న్యాయం చేయాలని అడిగినందుకు నిరంకుశంగా వ్యవహరించిన ప్రభుత్వ తీరును నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా ప్రజలు కదం తొక్కారు. అక్రమ కేసులు తక్షణం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డిపై అక్రమ కేసులు పెట్టిన టీడీపీ ప్రభుత్వ తీరుపై జిల్లాలో జనాగ్రహం పెల్లుబికింది. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని గొంతెత్తి అడగటమే ఆయన చేసిన నేరమా? అంటూ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీశారు. అక్రమ కేసులకు నిరసన గా పార్టీ పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు గురువారం కదం తొక్కాయి. జిల్లాలోని 64 మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల వద్ద ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. l వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆధ్వర్యాన నేతలు, కార్యకర్తలు సర్పవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో చేసి, చంద్రబాబు సర్కార్ తీరును ఎండగట్టారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం చంద్రబాబు ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని, అక్రమ కేసులు ఎత్తివేయాలని నినదించారు. రాస్తారోకోతో పిఠాపురం – కాకినాడ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పార్టీ ప్రధాన కార్యదర్శి అత్తిలి సీతారామస్వామి, ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. l కాకినాడ సిటీ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ ఆధ్వర్యాన ఆందోళన నిర్వహించారు. l కొత్తపేట పాతబస్టాండ్ సెంటర్లో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యాన నాయకులు, కార్యకర్తలు ర్యాలీ, రాస్తారోకో చేశారు. సెక్ష¯ŒS–30 అమలులో ఉందంటూ పోలీసులు జగ్గిరెడ్డి సహా పలువురు నేతలను అరెస్టు చేసి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. l రంపచోడవరం నియోజకవర్గం వై.రామవరంలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్‌లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వీఆర్ పురం, కూనవరం, చింతూరు తదితర విలీన మండలాల్లోని నేతలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. l రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి రాగా, అర్బ¯ŒS తహసీల్దార్ కార్యాలయం వద్ద పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. రాజమహేంద్రవరం కార్పొరేష¯ŒSలో పార్టీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, ట్రేడ్ యూనియ¯ŒS అధ్యక్షుడు అడపా వెంకటరమణ, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి గుర్రం గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. l రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ల ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. l సీతానగరంలో సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. l అమలాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ పీఏసీ సభ్యుడు‡ పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి తదితరుల ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాస్, బొమ్ము ఇజ్రాయిల్, రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. l పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు; రాజమహేంద్రవరం రూరల్‌లో కో–ఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, గిరజాల వీర్రాజు(బాబు)ల ఆధ్వర్యాన రూరల్ తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించి వినతిపత్రాలు అందజేశారు. డీసీఎంఎస్ డైరెక్టర్ వెలుగుబంటి అచ్యుతరామ్, రాష్ట్ర కార్యదర్శులు మింది నాగేంద్ర, నక్కా రాజబాబు తదితరులు పాల్గొన్నారు. l ముమ్మిడివరంలో కో–ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి పెయ్యల చిట్టిబాబు, పి.గన్నవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహనరావు తదితరులు ధర్నా నిర్వహించారు. రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయంలో వైద్య విభాగం అ««దl్యక్షుడు డాక్టర్ యనమదల మురళీకృష్ణ, పట్టణ కన్వీనర్ గాదంశెట్టి శ్రీధర్ తదితరులు తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. అనపర్తిలో కో–ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యాన నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చారు. జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి ఆధ్వర్యాన అర్ధనగ్న ప్రదర్శన చేశారు. పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట కో–ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు ఆధ్వర్యాన నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. l జగ్గంపేటలో కో–ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ ఆధ్వర్యాన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, ర్యాలీ, తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన నిర్వహించి, వినతిపత్రం అందజేశారు. గోకవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ శ్రేణులు నల్లబ్యాడ్జీలతో ధర్నా చేశాయి. మలికిపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి మంగెన సింహాద్రి, ఎస్సీ సెల్ కార్యదర్శి నల్లి డేవిడ్ తదితరులు ధర్నా చేశారు. కో ఆర్డినేటర్ పర్వత ప్రసాద్ ఆధ్వర్యాన ఏలేశ్వరంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మండపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ నేతలు, కార్యకర్తలు ధర్నా చేశారు. కో–ఆర్డినేటర్ వేగుళ్ళ లీలాకృష్ణ ఆధ్వర్యాన తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాయవరంలో రైతు విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్తి వెంకటరెడ్డి ధర్నా చేసి వినతిపత్రం అందజేశారు. -
టీడీపీ ఎంపీని రక్షించేందుకే జగన్‌పై కేసులు
శవ రాజకీయాలు ‘బాబు’కు కొత్తకాదు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘‘దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 10 మంది చనిపోతే తెలుగుదేశం ప్రభుత్వం శవరాజకీయాలు చేస్తోంది. మృతి చెందినవారిని పరామర్శించాలనే కనీస మానవత్వం కూడా చంద్రబాబుకు లేదు. ప్రమాదానికి కారణమైన బస్సు టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డికి చెందిన ట్రావెల్స్‌ది కావడంతో.. ఆయనను రక్షించేందుకు చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తోంది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు అడ్డుకోవడం దారుణం. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వస్తే.. ఆయనపైన, పార్టీ నాయకులపైన అక్రమ కేసులు పెట్టడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం అపహాస్యం పాలు చేసింది’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అ««దl్యక్షుడు కురసాల కన్నబాబు దుయ్యబట్టారు. అక్రమ కేసులను నిరసిస్తూ సర్పవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం నిర్వహించిన ధర్నాలో ఆయన ప్రసంగించారు. అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది లేదని, ప్రజల తరఫున పోరాటం ఆగదని స్పష్టం చేశారు. జగన్Sపైన, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల పైన కేసులు పెట్టడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటైపోయిందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వమే ఎల్లకాలమూ ఉండదన్న విషయం తెలుసుకుని అధికారులు మసలుకోవాలన్నారు. గతంలో కృష్ణా జిల్లాలో తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసినప్పుడు ఎమ్మెల్యేను కలెక్టర్ వెనకేసుకురావడం, బాధిత అధికారినే మందలించడం చూస్తే ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ఏరకంగా కొమ్ము కాస్తున్నారో అన్న విషయం అర్థమవుతుందన్నారు. డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తే ఆధారాలతో అడ్డంగా దొరికిపోతారనే ఉద్దేశ్యంతోనే కలెక్టర్ బాబు అడ్డుపడ్డారని అన్నారు. జగ¯ŒSపై పెట్టిన అక్రమ కేసులను తక్షణం ఉపసంహరించుకోకుంటే ప్రజలే సరైన బుద్ధి చెబుతారని కన్నబాబు స్పష్టం చేశారు. -
దళితులపై అక్రమ కేసులు అమానుషం
పోలీసు స్టేష¯ŒS వద్ద ఎమ్మెల్సీ బోస్ ధర్నా ద్రాక్షారామ(రామచంద్రపురం రూరల్) : అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న అధికారులు, పోలీసులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్ ధ్వజమెత్తారు. పోలీసులు అధికార పార్టీ నేతల సూచనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తు శనివారం రాత్రి ధర్నాకు దిగారు. మండలంలోని వెంకటాయపాలెం చిన్నంపేటలో జనవాసాల మధ్య విద్యుత్ సబ్ స్టేష¯ŒS నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకిస్తూ గత 72 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కొన్ని రోజులు క్రితం స్థానిక ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు విద్యుత్ సబ్ స్టేష¯ŒS నిర్మించే ఆడిటోరియం వద్దకు రావటంతో స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కక్ష సాధింపునకు దిగిన ఎమ్మెల్యే తనను ఎదిరించిన మందపల్లి మోషే అనే దళితునిపై కార్యదర్శిని విధులకు ఆటంకం కలించాడని ఆక్రమగా కేసును బనాయించారు. పోలీసులు మోషే సోదరుడు నాగేశ్వరరావును విచారణ నిమిత్తం స్టేష¯ŒSకు శనివారం తీసుకు వెళ్లారు. దీనిపై ఎమ్మెల్సీ బోస్, ఇతర వైసీపీ నేతలతో స్టేష¯ŒSకు వెళ్లి అక్రమ అరెస్టులు అపాలని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్సీ బోస్ ఆధ్వర్యంలో అక్రమ అరెస్టులు ఆపాలని నినాదాలు చేశారు. ద్రాక్షారామ పోలీసు స్టేష¯ŒS వద్ద వైసీపీ నేతలతో కలిసి ధర్నాకు దిగారు. సీఐ కె. శ్రీధర్ కుమార్ ద్రాక్షారామకు చేరుకుని ఎమ్మెల్సీ బోస్‌తో చర్చించారు. సీఐ మాట్లాడుతూ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పటంతో వైసీపీ నేతలు ఆందోళనను విరమించారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ కార్యవర్గ సభ్యుడు వాసంశెట్టి శ్యామ్, రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి టేకుమూడి సత్యనారాయణ, తదితర పార్టీ నాయకులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. -
అక్రమ కేసులకు వెనుకంజ వేయం
వేగుళ్ల లీలాకృష్ణ మండపేట : అధికారపార్టీ నేతల అక్రమాలపై ప్రజల పక్షాన ఉద్యమిస్తున్న తమను అక్రమ కేసులతో అడ్డుకోలేరని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ పేర్కొన్నారు. కడప గురించి ఏం తెలుసునని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మండపేటను కడపను చేస్తున్నారని విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ, గతంలో కడపలో ఉండే ఫ్యాక్షనిజం అప్పట్లో మండపేటలో కూడా ఉండేదన్న విషయాన్ని అధికారపార్టీ నేతలు మర్చిపోకూడదన్నారు. పట్టణానికి ఏం అభివృద్ధి చేశారని తన తండ్రి పేరు ఓ కాలనీకి పెట్టుకుంటున్నారో వేగుళ్ల చెప్పాలని లీలాకృష్ణ డిమాండ్ చేశారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పట్టణంలో 127 ఎకరాలు సేకరిస్తే ఆ కాలనీకి ఎమ్మెల్యే వేగుళ్ల తన తండ్రి పేరు పెట్టుకున్నారని లీలాకృష్ణ విమర్శించారు. నియోజకవర్గంలోని కాపులు, ఎస్సీ, బీసీలను ఎమ్మెల్యే అణగద్రొక్కుతున్నారని, రైతుబజారులో ఎస్సీలకు షాపులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. పాపారాయుడు మాట్లాడుతూ అధికారపార్టీ నేతలు బనాయించిన అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. రైతు బజారులో అక్రమాలపై ప్రశ్నించిన లీలాకృష్ణను అరెస్టు చేయించేందుకు పోలీసులను ఎక్కడెక్కడికో పంపిస్తున్నారన్నారు. త్వరలో వచ్చేది జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వమేనని, గొల్లపుంత కాలనీకి వైఎస్సార్ కాలనీగా నామకరణం చేస్తామని పాపారాయుడు పేర్కొన్నారు. సొసైటీ అధ్యక్షుడు వైట్ల రాంబాబు, ఎంపీటీసీ సభ్యులు మేడపాటి లక్షి్మప్రసాదరెడ్డి, అన్నందేవుల చంద్రరావు, తుపాకుల ప్రసన్నకుమార్, పార్టీ నాయకులు వల్లూరి రామకృష్ణ, గంగుమళ్ల రాంబాబు, మేడిశెట్టి సూర్యభాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.