అక్రమ కేసులకు వెనుకంజ వేయం | illigal cases dont care | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులకు వెనుకంజ వేయం

Published Sat, Jan 7 2017 11:11 PM | Last Updated on Fri, Sep 28 2018 7:36 PM

అక్రమ కేసులకు వెనుకంజ వేయం - Sakshi

అక్రమ కేసులకు వెనుకంజ వేయం

  • వేగుళ్ల లీలాకృష్ణ
  • మండపేట : 
    అధికారపార్టీ నేతల అక్రమాలపై ప్రజల పక్షాన ఉద్యమిస్తున్న తమను అక్రమ కేసులతో అడ్డుకోలేరని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ వేగుళ్ల లీలాకృష్ణ పేర్కొన్నారు. కడప గురించి ఏం తెలుసునని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మండపేటను కడపను చేస్తున్నారని విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ, గతంలో కడపలో ఉండే ఫ్యాక్షనిజం అప్పట్లో మండపేటలో కూడా ఉండేదన్న విషయాన్ని అధికారపార్టీ నేతలు మర్చిపోకూడదన్నారు. పట్టణానికి ఏం అభివృద్ధి చేశారని తన తండ్రి పేరు ఓ కాలనీకి పెట్టుకుంటున్నారో వేగుళ్ల చెప్పాలని లీలాకృష్ణ డిమాండ్‌ చేశారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పట్టణంలో 127 ఎకరాలు సేకరిస్తే ఆ కాలనీకి ఎమ్మెల్యే వేగుళ్ల తన తండ్రి పేరు పెట్టుకున్నారని లీలాకృష్ణ విమర్శించారు. నియోజకవర్గంలోని కాపులు, ఎస్సీ, బీసీలను ఎమ్మెల్యే అణగద్రొక్కుతున్నారని, రైతుబజారులో ఎస్సీలకు షాపులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. పాపారాయుడు మాట్లాడుతూ అధికారపార్టీ నేతలు బనాయించిన అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. రైతు బజారులో అక్రమాలపై ప్రశ్నించిన లీలాకృష్ణను అరెస్టు చేయించేందుకు పోలీసులను ఎక్కడెక్కడికో పంపిస్తున్నారన్నారు. త్వరలో వచ్చేది జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వమేనని, గొల్లపుంత కాలనీకి వైఎస్సార్‌ కాలనీగా నామకరణం చేస్తామని  పాపారాయుడు పేర్కొన్నారు. సొసైటీ అధ్యక్షుడు వైట్ల రాంబాబు, ఎంపీటీసీ సభ్యులు మేడపాటి లక్షి్మప్రసాదరెడ్డి, అన్నందేవుల చంద్రరావు, తుపాకుల ప్రసన్నకుమార్, పార్టీ నాయకులు వల్లూరి రామకృష్ణ, గంగుమళ్ల రాంబాబు, మేడిశెట్టి సూర్యభాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement