- పోలీసు స్టేష¯ŒS వద్ద ఎమ్మెల్సీ బోస్ ధర్నా
దళితులపై అక్రమ కేసులు అమానుషం
Published Sat, Jan 7 2017 11:51 PM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM
ద్రాక్షారామ(రామచంద్రపురం రూరల్) :
అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న అధికారులు, పోలీసులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్ ధ్వజమెత్తారు. పోలీసులు అధికార పార్టీ నేతల సూచనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తు శనివారం రాత్రి ధర్నాకు దిగారు. మండలంలోని వెంకటాయపాలెం చిన్నంపేటలో జనవాసాల మధ్య విద్యుత్ సబ్ స్టేష¯ŒS నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకిస్తూ గత 72 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కొన్ని రోజులు క్రితం స్థానిక ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు విద్యుత్ సబ్ స్టేష¯ŒS నిర్మించే ఆడిటోరియం వద్దకు రావటంతో స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కక్ష సాధింపునకు దిగిన ఎమ్మెల్యే తనను ఎదిరించిన మందపల్లి మోషే అనే దళితునిపై కార్యదర్శిని విధులకు ఆటంకం కలించాడని ఆక్రమగా కేసును బనాయించారు. పోలీసులు మోషే సోదరుడు నాగేశ్వరరావును విచారణ నిమిత్తం స్టేష¯ŒSకు శనివారం తీసుకు వెళ్లారు. దీనిపై ఎమ్మెల్సీ బోస్, ఇతర వైసీపీ నేతలతో స్టేష¯ŒSకు వెళ్లి అక్రమ అరెస్టులు అపాలని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్సీ బోస్ ఆధ్వర్యంలో అక్రమ అరెస్టులు ఆపాలని నినాదాలు చేశారు. ద్రాక్షారామ పోలీసు స్టేష¯ŒS వద్ద వైసీపీ నేతలతో కలిసి ధర్నాకు దిగారు. సీఐ కె. శ్రీధర్ కుమార్ ద్రాక్షారామకు చేరుకుని ఎమ్మెల్సీ బోస్‌తో చర్చించారు. సీఐ మాట్లాడుతూ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పటంతో వైసీపీ నేతలు ఆందోళనను విరమించారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ కార్యవర్గ సభ్యుడు వాసంశెట్టి శ్యామ్, రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి టేకుమూడి సత్యనారాయణ, తదితర పార్టీ నాయకులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement